రైలు ప్రమాదం – కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, మీడియా ʹవిద్రోహʹ ప్రచారాలు


రైలు ప్రమాదం – కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, మీడియా ʹవిద్రోహʹ ప్రచారాలు

రైలు

(విజయనగరం జిల్లా కూనేరు వద్ద జరిగిన రైలు ప్రమాదం పై అధికారులు, కొన్ని మీడియా సంస్థలు చేసిన ʹవిద్రోహʹ ప్రచారంపై విప్లవ రచయిత వరవరరావు రాసిన వ్యాసం 25 జనవరిన సాక్షి పత్రికలో వచ్చింది. ఇది ఆ వ్యాసం పూర్తి పాఠం.)

ఛత్తీస్ గడ్ లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు వెళ్లే హీరాఖంండ్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ దగ్గర జనవరి 21 శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మందికి పైగా మరణించారు. యాభై మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటికే పదిహేను మంది స్త్రీలు, ఒక శిశువు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో తెలుగు నేల మీద జరిగిన అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదం ఇది. రైలు పట్టాలు విరగడం వల్ల, అవి కూడా క్రాస్గా కాకుండా షార్చ్గా విరగడం వల్ల ఈ రైలు ప్రమాదం జరిగింది. ఏ ప్రమాదం జరిగినా, ఏ అసహజ మరణం జరిగినా పలు కోణాల నుంచి ఊహాగానాలు, అనుమానాలు, దర్యాప్తులు కూడా జరగవచ్చు. కాని బాధ్యులను కాపాడడానికి ʹవిద్రోహ చర్యʹ అని వెంటనే ప్రకటించడం ప్రభుత్వం తన బాధ్యత తప్పించుకోవడానికి ఒక తక్షణ సమీప మార్గం అవుతుంది.

రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా ఇది ʹవిద్రోహ చర్యʹ చర్య అనడానికి ఆధారాలు ఉన్నాయని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. ఇదే ట్రాక్ మీదుగా రెండు గంటల ముందే ఒక మాల్గాడీ వెళ్లిందని, ʹఇది నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతం గనుక, గణతంత్రం దినం ముందు జరిగింది గనుకʹ ఆయన అనుమానం అటువైపు కూడా వెళ్లింది. ʹఇప్పుడు ఈ రైలు ప్రమాదంలో ఇటువంటి విద్రోహ చర్య ఏమైనా ఉన్నదాʹ అని విచారించడానికి జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్ఐఎ)ని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖకు సంబంధించిన వాళ్లు ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికకు చెప్పారు.
ఒకవైపు ఒడిశా డిజిపి కె.బి. సింగ్ హీరాఖండ్ రైలు ప్రమాదంలో మావోయిస్టుల హస్తం లేదని, మావోయిస్టుల ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, మావోయిస్టుల కదలికపై నిఘా వేసిన సీనియర్ అధికారితో మాట్లాడి తాను ఈ విషయాన్ని ధృవీకరించుకున్నట్లు చెప్పినాక (సాక్షి జనవరి 23, 2017 పేజి 5) కూడా కొన్ని పత్రికలు ఈ మీడియా ట్రయల్ నిర్వహించడం గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఉంది.
ఒక దినపత్రిక పతాక శీర్షిక్రయే ʹవిద్రోహమా, నిర్లక్ష్యమా?, మళ్లీ రెండో పేజీలో వివరాలు ఇచ్చిన చోట ʹవిద్రోహ చర్యా సాంకేతిక లోపమా? అని మళ్లీ తాటికాయంత అక్షరాలతో శీర్షిక. ʹనక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో విద్రహ చర్యను తోసిపుచ్చలేమని ఢిల్లీ రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు బాణాసంచా తరహా పేలుడు శబ్దాన్ని హీరాఖండ్ రైలు డ్రైవర్ విన్నాడు. పట్టా విరిగి ఉండడంతో ప్రమాదం సంభవించింది", ʹఏది ఏమైనా రైల్వే భద్రతా కమిషనర్ విచారణలో అసలు కారణం వెల్లడవుతుందిʹ అని అంటూనే, ఆ విచారణ నిష్పక్షపాతంగా జరగకుండా ఉండడానికి ఆ దినపత్రిక గతం నుంచి చాలా మసాలా అందించింది.
సహజంగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రమాదానికి విద్రోహ చర్య కావొచ్చునన్న సందేహాలు వ్యక్తం అయిన నేపథ్యంలో సిఐడి విచారణకు ఆదేశించింది. కనుక ఆ దినపత్రిక తన ఫైళ్లు తిరగేసి, ఆ విచారణ ఎట్లా సాగాలో సమాచారం ఇచ్చింది. రైల్వే స్టేషన్ ఎఒబిలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో ఉంది. సుమారు పదేళ్ల కిందట మావోయిస్టులు ఈ రైల్వే స్టేషన్ను పేల్చేశారు. అక్కడ సామగ్రిని తగలబెట్టారు. అంతకు ముందు కూడా రైల్వే సంకేతాల వ్యవస్థను ధ్వంసం చేయడం, రైల్వే పరికరాల అపహరణ, పలువురిని మట్టూబెట్టిన ఘటనలు, అనేకం ఈ మార్గంలో చోటు చేసుకున్నాయి. ఒడిశా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ రైల్వేస్టేషన్ ఉండడంతోఇక్కడ‌ మావోయిస్టులు ఉనికి చాటుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్లు తాజాగా జరిగిన దుర్ఘటన కూడా అదే ప్రాంతంలో జరగడం, పట్టా విరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని రాసింది (ఈనాడు, 23 జనవరి, 2017 పేజి 2) ఎలక్షానిక్ మీడియాలో ఎక్కువగా చెప్తున్నట్లు ఇటీవలి బెజ్జంగి ఎన్కౌంటర్కు ప్రతీకారం కావచ్చు అనే మాట ఒక్కటి ఈ పత్రిక రాయలేదు.

రైలు ప్రమాదంలో కుట్ర దాగి ఉన్నట్లు అనుమానిస్తుండడంతో ఆంధ్రప్రదేస్ డిజిపి సాంబశివరావు విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్కు ఫోన్ చేసి ఘటనా స్థలానికి పోలీసు బలగాలు పంపాలని ఆదేశించినట్టు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఎస్పిలతోనూ మాట్లాడినట్లు మరొక పత్రిక రాసింది.
ఈ విధంగా ఊహించడమూ, అనుమానించడమూ, అవి మీడియోలో వ్యక్తం కావడమూ ఏకపక్షం అని కాదు గాని, అటువంటి సందర్భాలలో వివిధ కోణాలలో ఉన్న ఊహాగానాలు, అనుమానాలు కూడా అంతే నిష్పక్షపాతంగా రాయాల్సి ఉంటుంది. ఆ పని ఒక సాక్షి పత్రిక చేసింది. ʹఇది విద్రోహ చర్యగా చిత్రీకరణ? చేస్తున్నారనే శీర్షికతో ఇట్లా రాసింది:
ʹహీరాఖండ్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో బాధ్యులైన సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులను బయట పడేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు విద్రోహ చర్య కారణమై ఉంటుందన్న ప్రచారం లేవదీయడం, విరిగిన పట్టాను ఎవరో కోసారన్న వాదనను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మావోయిస్టుల కదలికలు ఉన్న ఏరియా కావడంతో ఆ నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ఈ ఘటనకు కారకులను తేలికగా బయట పడేయవచ్చుననే వ్యూహంగా చెప్తున్నారు. మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ముందు ప్రజలను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరిస్తారని, రైళ్లను పట్టాలు తప్పించి, ప్రయాణీకులను పొట్టన పెట్టుకునే దుశ్చర్యకు పాల్పడరని గత అనుభవాలను వివరిస్తున్నారు. ఈ హీరాఖండ్ రైలు ప్రమాదాన్ని కూడా ఏదోలా విద్రోహ చర్యగా నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది.ʹ
ఒకవేళ ఇది కేవలం ప్రమాదమే అయినా, ఇందులో రైల్వే అధికారులు మాత్రమే కాకుండా, ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందనేది ముఖ్యంగా గుర్తించాల్సిన అంశం. దాదాపుగా దేశంలో అత్యధికమైన రైలు మార్గాలన్నీ బ్రిటిష్ కాలంలో వేసినటువంటివే.

ఈ రైలు పట్టాలపై ఈ డెబ్బై ఏండ్ల కాలంలో ఎంతో ఒత్తిడి పెరిగింది. ఒకప్పుడు ఒకటీ రెండూ రైళ్లు నడిచే మార్గాల మీద ఇప్పడు పదుల, వందల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఆ స్థాయిలో రైలు పట్టాలను సాంకేతికంగా, శాస్త్రీయంగా పరిరక్షించడం, మెరుగు చేయడం, మరిన్ని లైన్ల వేయడం జరిగిందా? జరగనపుడు ఆ బాధ్యత ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది కాదా అనేది ఇంత ఘోర ప్రమాదాల సందర్భంగానైనా సమీక్షించుకోవాలి. ఒకప్పుడు గ్యాంగ్మెన్ల వ్యవస్థ, రైల్వే ట్రాక్లను పరిశీలించే వ్యవస్థ ఉన్నంతలో పటిష్టంగా ఉండేది. తగినంత రైల్వే సిబ్బంది ఉండేది. ఇప్పుడు ఆధునిక, సాంకేతిక యంత్ర చాలనాలు వచ్చి మానుష శక్తిని (మ్యాన్ పవర్) తగ్గిస్తున్నారు. చిన్నచిన్న ఊర్లలో గేట్లు లేకపోవడం, ఉన్నా గేటుమెన్ లేకపోవడం వల్ల జరుగుతున్నప్రమాదాలు కూడా చూస్తూనే ఉన్నాం.

కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, వాటికి అనుకూలమైన దినపత్రికలు స్పందించిన వేగంతోనే నేను స్పందించడానికి కూడా కారణం చెప్పాలి. ఇంచుమించు ఈ రైలు ప్రమాదంలో మరణించినంత మంది బెజ్జంగి ఎన్కౌంటర్లో కూడా మరణించడం వల్ల కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు ఆత్మరక్షణలో పడి మావోయిస్టు పార్టీపై విపరీతమైన దుప్రచారం చేస్తున్నవి.

ఇవ్వాటికి ఇవాళ అంటే జనవరి 23న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో టిడిఎఫ్ నిజనిర్ధారణ బృందం అరెస్టుకు నిరసనగా ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటే, మస్టీలోని పోలీసులతో పోస్టర్లు, కరపత్రాలతో ఒక కౌంటర్ ప్రచారం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్కౌంటర్ జరిగిన నాటి నుంచి అమరుల బంధుమిత్రుల సంఘం, ఎపిసిఎల్సి, విరసం మొదలైన అన్ని ప్రజాసంఘాలపై పోస్టర్ల, కరపత్రాల దుప్రచారానికి పూనుకున్నది. ఇంక చైతన్య మహిళా సంఘం నాయకత్వాన్ని కార్యకర్తలను, విరసం కార్యదర్శి వరలక్ష్మితో కలిపి మావోయిస్టులుగా చిత్రిస్తూ విస్తృతంగా పోస్టర్లు వేసింది. ఈ పోస్టర్లోని ఫొటోల్లో ఉన్న సిఎంఎస్ కార్యకర్తలను ఎస్సి, ఎస్టి సంక్షేమ హాస్టల్లోకి రానివ్వవద్దని, ప్రజలకు దూరంగా ఉంచాలని, అరుణతార, మహిళా మార్గం చదవవద్దని, వీళ్లు చదువుతున్న పనిచేస్తున్న కాలేజీల ముందు పోస్టర్లు వేసింది. ముఖ్యంగా ఈ సంఘాలలోని మహిళలపై, ఎపిసిఎల్సి చంద్రశేఖర్ పై చెప్పనలవి కాని దుప్రచారానికి పూనుకున్నది.

ప్రజాసంఘాల విషయంలోనే ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే, దీనికి ఆజ్యం పోసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీలోని ఎపి భవన్లో ఈ ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టులు ఇరవైసార్లు రెక్కీ చేశారని హెచ్చరించింది. చంద్రబాబా నాయుడు ఎపిభవన్లో ఉన్నప్పుడు, ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించినప్పడు కూడా రెక్కీ చేసినట్లుగా అప్రమత్తం చేసింది. దానికి తగినట్లుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబునాయుడుకు ఉన్న జెడ్ క్యాటగిరి హై సెక్యూరిటీని ఐదు రెట్ల పెంచింది.

అలిపిరి చర్య దృష్ట్యా ఇది ఎవరికీ పెద్ద ఆశ్చర్యం కలిగించకపోవచ్చు గాని, ఢిల్లీలో గాని, అమరావతిలో గాని, లేదా ఎఒబి మినహాయించి ఆంధ్ర ప్రాంతంలో గాని మావోయిస్టు పార్టీకి ఉండే అవకాశం ఉన్న బలం దృష్టిలో ఈ ప్రచారానికి రెండే కారణాలు. ఒకటి, బెజ్జంగి ఎన్కౌంటర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. అది ఆశించినట్లుగా ఈ ఎన్కౌంటర్ ఎఒబి ప్రాంతంలో ప్రజల నైతిక శక్తిని దెబ్బతీయలేకపోయింది. మావోయిస్టు పార్టీ నైతిక శక్తిని మాత్రమే కాదు, నిర్మాణాన్ని దెబ్బతీయలేకపోయింది. ఎంత దుష్ట పథకం వేసినా నాయకత్వాన్ని తుడిచిపెట్టలేకపోయింది. ఏరియా డివిజన్ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు ఎంతో విలువైన దయ, వెంకటరమణ వంటి నాయకత్వాన్ని కోల్పోయినప్పటికీ ఆదివాసాలు బెంబేలు పడిపోలేదు. పార్టీ ధైర్యం కోల్పోలేదు. అంతమాత్రమే కాదు, ఆదివాసుల నుంచి రిక్రూట్ మెంట్లు ఆగకుండా, విప్లవ భూసంస్కరణలు, స్వావలంబన కార్యక్రమాలు మళ్లీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఇది మింగుడు పడకుండా ఉన్నది.

రెండవ కారణం, నిర్బంధాన్ని రాజ్యహింసను పెంచడం, కేంద్ర, రాష్ట్ర దళారీ ప్రభుత్వాలు ఎంచుకున్న విధ్వంసకపూర్వకమైన అభివృద్ది నమూనాకు చాలా అవసరమైన చర్య వాళ్లకి ఇంకొక మార్గం లేదు.. ప్రపంచ బ్యాంక్ అభివృద్ది నమూనాగా చెలామణి అవుతున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణను చేపట్టిన లాటిన్ అమెరికా దేశాలు ఎటువంటి రాజ్యహింసను అమలు చేశాయో మనం చూశాం. ఇప్పడు ట్రంప్ అమెరికాలో చూడబోతున్నాం. ప్రపంచమంతా చూస్తూనే ఉన్నాం.

1991లో ప్రారంభమై, ఛత్తీస్ఘడ్లో సాల్వాజుడుంతో, సుప్రీంకోర్టు అది రాజ్యాంగ విరుద్ధం అన్నపుడు 2009 నుంచి తూర్పు మధ్య భారతాల్లో ఆపరేషన్ గ్రీన్హంట్ పేరుతో అమలు చేస్తున్న ప్రజలపై యుద్దాన్ని మన దేశంలో చూస్తున్నాం. ఈ రాజ్యహింసకు మోడీ ప్రభుత్వం వచ్చినాక మిషన్ 2016 అని పేరు పెట్టుకున్నారు. అయినా ప్రకటించినట్లుగా 2016 డిసెంబర్ నాటికి ఆదివాసుల విస్థాపన, నిర్వాసితత్వం, మావోయిస్టుల నిర్మూలన సాధించలేకపోవడంతో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ 2017 పేరుతో కొత్త పథకాలను రచిస్తూ ఉంది. అది మంద్రస్థాయి యుద్ధంలో భాగంగా ప్రచారాస్తాన్ని పదును పెట్టుకోవడం. కేంద్ర హోంశాఖ సలహాదారు అజిత్ దోవల్ డాక్ట్రిన్ గా చెప్పబడుతున్న ఈ విధానాన్ని చెన్నైలోని ʹక్యూʹ బ్రాంచ్ కేంద్రంగా మరొక సలహాదారు విజయ్ కుమార్ అమలు చేస్తున్నాడు అనడానికి తాజా ఉదాహరణ కేరళ నీలాంబూర్ ఎన్కౌంటర్, ఆ తరువాత ప్రభుత్వాల దుప్రచారం.

టిడిఎఫ్ నిజనిర్ధారణ బృందం అరెస్టు సందర్భంగా దీనినే బస్తర్ ఐజి కలూరి వైట్ కాలర్ మావోయిస్టుల అణచివేత విధానంగా చెప్పకున్నాడు. అంటే, ప్రజాస్వామిక శక్తుల ప్రచారానికి విరుద్ధంగా ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ప్రచారానికి ఎత్తుకోవడం అన్నమాట. ఇల్లెక్కి అరవడం అన్నమాట. గాజు ఇంట్లో ఉండి ప్రజలపై రాళ్లు విసరడం అన్నమాట.

రైలు ప్రమాదం వంటి ఒక మానవీయ విషాదం సందర్భంగా కూడా ఇటువంటి ʹవిద్రోహʹ ప్రచారానికి పూనుకోవడం ఈ రాజ్యానికి, దానికి అండగా నిలిచిన మీడియాలోని ఒక సెక్షన్ కే చెల్లింది. ప్రజాస్వామ్యమా బహుపరాక్!
- వరవరరావు 23 జనవరి, 2017

Keywords : chattisgadh, heerakhand, rail accident, maoists, police, chandrababu
(2019-03-13 20:21:36)No. of visitors : 971

Suggested Posts


దేశంలో జడ్జ్ లు జస్టిస్ ను వదిలేశారు - హరగోపాల్

దేశంలో జడ్జీలు జస్టిస్ ను వదిలేశారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్థిని కాపాడవల్సిన న్యాయమూర్తులు తమ స్వం విశ్వాసాల ఆధారంగా తీర్పులివ్వడం అన్యాయమని ఆయన అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా....

ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు

1981 ఏప్రిల్ 20న ఇంద్ర వెల్లిలో ఏం జరిగింది? ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 81 ఏప్రిల్ 20న తలపెట్టింది. జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావుకు సభ జరుపుకోవడానికి పోలీసులు మొదట అనుమతిచ్చారు....

సాయిబాబా కేసుః జడ్జిమెంట్ లా లేదు,పోలీసాఫీసర్ రాసిన చార్జ్ షీట్ లా ఉంది- వరవరరావు

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా బెయిల్ రద్దు చేస్తూ నాగ్ పూర్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పై విప్లవ రచయిత వరవరరావు మండి పడ్డారు. అది జడ్జిమెంట్ లాగా లేదని ఓ పోలీసు ఆఫీసర్ రాసిన చార్జ్ షీట్ లాగా

వెన్నెముకలేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? - వరవర రావు

మనకు వెన్నెముకలేని దేశం కావాలా? సార్వభౌమత్వం లేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? ప్రొ. కంచె ఐలయ్య మీద హిందుత్వ వాదులు కేసు పెట్టినపుడు స్పందించిన రచయితలందరూ పాతబస్తీలో పేద ముస్లిం యువకుల కోసం, కశ్మీరులో ఎన్‌కౌంటరవుతున్న యువకుల కోసం స్పందిస్తారని....

ఇది కోర్టు తీర్పుకాదు,రాజ్యం వేసిన శిక్ష - వరవరరావు

ఎంత అసంబద్ధమైన, ఎంత అన్యాయమైన వ్యవస్థలో జీవిస్తున్నామో ఇవ్వాళ్టి నా ఒక్క అనుభవాన్ని వివరిస్తాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎకడమిక్ స్టాఫ్ కాలేజీలో మాడరన్ లిటరేచర్ గురించి ప్రసంగించడానికి వెళ్తున్నాను.....

Boycott (World) Social Forum, a Safety Valve for Imperialism !- RDF

Revolutionary Democratic Front calls upon the people and genuine democrats to boycott the (world) Social Forum, being held in Canada in August 2016 and all the related forums and preparatory meetings etc. being conducted in different parts of the country including Hyderabad....

కవితామయ జీవితం - శిల్ప ప్రయోగ విప్లవం

విప్లవ కవులకు, విప్లవ కవిత్వానికి ఈ ఒరవడి అందివ్వడంలో వివి పాత్ర గణనీయం. ఇంకోలా చెప్పాలంటే ఆయన అభేద సంబంధంలో ఉండే విప్లవోద్యమం పాత్ర ఇక్కడే ఉన్నది. వివి కవిత్వ వస్తు విస్తృతి, శిల్ప ప్రయోగాలు వగైరా ఏది చర్చించాలన్నా పైన చెప్పిన వాటిపట్ల ఎరుక ఉండాలి. కవి నుంచి కవిత్వాన్ని వేరు చేసి విశ్లేషించలేమని అన్నది ఈ దృష్టితోనే.

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


రైలు