ʹప్రేమను పంచే తండ్రిని ఇవ్వలేను.. కాని సోదరుడిని ఇవ్వగలనుʹ


ʹప్రేమను పంచే తండ్రిని ఇవ్వలేను.. కాని సోదరుడిని ఇవ్వగలనుʹ

కాశాయ కసాయి మూకల ముప్పేట దాదిని ఎదుర్కొంటున్న లేడీ శ్రీరాం కాలేజ్ విద్యార్థిని , కార్గిల్ యుద్దంలో అమరుడైన జవాను కూతురు గుర్‌మెహర్‌కౌర్ కు ప్రజలు, ప్రజాస్వామికవాదులనుండి మద్దతు పెరుగుతోంది.
ఆమెకు ఆర్మీ సీనియర్‌ అధికారులు బాసటగా నిలిచారు. ఆమె చేసిన వ్యాఖ్యల్లో దేశ వ్యతిరేకమై నవేమీ లేవని అన్నారు. కార్గిల్‌ యుద్ధ అమరవీరుడి కుమార్తె గుర్మెహర్‌ కౌర్‌ తన తండ్రి మృతికి యుద్ధం కారణ మని, ఏబీపీవీకి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నాటి నుంచి దేశద్రోహం ఆరోపణలు, లైంగికదాడి బెదిరింపు లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమంలో ఆమెపట్ల వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అభ్యంతరకరమైనదని పంజాబ్‌లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ʹఈ మొత్తం చర్చ అవసరం లేనిది. అన్ని కోణాల నుంచి దీనిని చూడాలి. దేశానికి వ్యతిరే కంగా ఆమె ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె అభిప్రా యాలను మనం గౌరవించాలిʹ అని బ్రిగడైర్‌ టిఎస్‌ తేజై చెప్పారు. ʹతండ్రి బలిదానాన్ని ఉపయోగించుకొని ఖ్యాతిగ డించాలని ఆమె అనుకోలేదు. తన అభిప్రాయాలను మాత్ర మే ఆమె మన ముందుంచిందిʹ అని కల్నల్‌ కెఎస్‌ గ్రేవల్‌ అభిప్రాయపడ్డారు. ʹఆమె పోరాటం భావ వ్యక్తీకరణను అడ్డుకోవడంపైనే. సామాజిక మాధ్యమంలో ఆమెపై వస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమైనవిʹ అని కల్నల్‌ తేజ్‌పాల్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

గుర్మెహర్‌ తాత కన్‌వాల్‌జీత్‌ సింగ్‌ రాజకీయనేతలపై మండి పడ్డారు. తన మనవరాలు గుర్మెహర్‌పై ఏ విధమైన ప్రకటను చేయొద్దని కోరారు. ఇప్పటికే సృష్టించిన డ్రామా చాలునని, ఇక దానిని ఏమాత్రం పెద్దది చేయొద్దని అన్నారు. ʹʹగుర్మెహర్‌ చిన్న పిల్ల, కార్గిల్‌ యుద్ధంలో తండ్రిని కోల్పోయింది. ఆమెలో మీకు మీ కూతరు కనిపించడం లేదా?ʹʹ అని కన్‌వాల్‌జీత్‌ రాజకీయ నాయకులను ప్రశ్నించారు. గుర్మెహర్‌ తల్లి రజ్వీందర్‌ కౌర్‌ మాట్లాడుతూ తన కుమార్తెను వివాదంలోకి లాగొద్దన్నారు. తన కుమార్తెకు ఫేస్‌బుక్‌లో అసభ్యకర సందేశాలు పంపిన ఏబీవీపీపై ధిక్కార స్వరం వినిపించారు. గుర్మెహర్‌ తన అభిప్రాయాన్ని చెప్పిందని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆమె అంకుల్‌ దేవిందర్‌దీప్‌ సింగ్‌ తెలిపారు.

తాజాగా ఓ పాక్ యువకుడు గుర్మెహర్ కు మద్దతుగా యుద్దానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. గుర్‌మెహర్‌ లాగే తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ విష‌యాన్ని ప్లకార్డుల ద్వారా చెబుతూ.. కార్గిల్‌ యుద్ధంలో ఆ విద్యార్థిని తన తండ్రిని పోగొట్టుకున్నందుకు తామంతా చింతిస్తున్నామ‌ని పేర్కొన్నాడు. ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు చావు త‌మ‌ ఇంటికి (స్వాత్‌ ప్రాంతం) సమీపంలోనే ఉందని అన్నాడు. కానీ అదృష్టవశాత్తు తాను త‌న‌ కుటుంబాన్ని పోగొట్టుకోలేదని చెప్పాడు. కానీ అలాంటి సమయంలో ఆ విద్యార్థిని లాంటి వాళ్లని వేలల్లో చూశానని అన్నాడు. త‌న‌కు ఎలాంటి వీసా నిబంధనలు లేకుండా భారత్‌కి రావాలని ఉందని చెప్పాడు. భార‌త్, పాకిస్థాన్ ల‌ మధ్య ఉండే నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడదామ‌ని పిలుపునిచ్చాడు. సరిహద్దు ప్రాంతాల్లో నీలా బాధపడుతున్నవారిని కాపాడటానికి శాంతికోసం పోరాడదామ‌ని అన్నాడు. ఆ విద్యార్థినికి ప్రేమను పంచే తండ్రిని ఇవ్వలేను కానీ శత్రు దేశం నుంచి ఓ మంచి సోదరుడిని ఇవ్వగలనని ఫయాజ్‌ అన్నాడు.

Keywords : abvp, rss, hindutva, delhi, jnu, kanhayya,
(2019-03-19 15:44:43)No. of visitors : 1118

Suggested Posts


ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రి

ʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని.....

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

ఈ దేశం మతోన్మాదులదేనా ? మనుషులకు బతికే హక్కులేదా?

గుర్‌మెహర్ పై కాశాయ కసాయి మూకలు నీచమైన దాడి చేస్తున్నాయి రేప్ చేస్తామంటూ బెధిరించారు..అయినా సరే తన నిరసనను కొనసాగిస్తానని ప్రకటించిన‌ గుర్‌మెహర్ కౌర్ చివరకు కేంధ్రమంత్రులు కూడా ఏబీవీకి మద్దతుగా ఆ అమ్మాయిపై దాడికి దిగడంతో .తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు...

ఆ చిన్నారి గాయాల వల్లే మరణించింది - కేంధ్రానికి షాకిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్

ఢిల్లీలో షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి తీవ్ర గాయాలవల్లనే చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టం చేసింది. చిన్నారి మరణం ఇళ్ల కూల్చివేత కంటే ముందే జరిగిందని పార్లమెంటులో.....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
more..


ʹప్రేమను