include 'men';
?>
అమ్మాయిలు,అబ్బాయిలు స్నేహం చేయకూడదట !
మనుషుల మధ్య ఎలాంటి సంభంధాలు ఉండాలో... ఎవరు స్నేహం చేయాలో, ఎవరితో చేయాలో... స్త్రీలు ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో... ఈ దేశ ప్రజలు ఎలా ఆలోచించాలో సంఘ్ పరివారం నిర్ణయిస్తుంది. ఈ దేశం పాఠించాలి. లేదంటే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు మాట్లాడుతాయి. ఇప్పుడు యోగీ ఆదిత్యానాథ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక పరివారం మోరల్ పోలీసింగ్ పీక్ లెవల్ కు చేరింది.
ఉత్తరప్రదేశ్ లో అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిలను నిలువరించే పేరుతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఏర్పాటైన యాంటీ రోమియో స్క్వాడ్ ఏం చేస్తుందో తెలియజేసే కథనమిది.
ఓ జాతీయ మీడియా ప్రతినిధులు యాంటీ రోమియో పోలీస్ జీపులో రోజంతా ప్రయాణించారు. పోలీసులతో కలిసి తిరుగుతూ, వారు విధులు నిర్వహించే తీరును గమనించారు. యువతులను, అమ్మాయిలను ఏడిపించే రోమియోల ఆట కట్టించడమే వీరి లక్ష్యం. ʹఎవరి ముఖంపైనా రోమియో అని రాసి వుండదు. కానీ మేము ఎవరి కళ్లనైనా చూసి అతను రోమియో అవునా? కాదా? అన్న విషయాన్ని పసిగట్టగలంʹ అని ఓ పురుష కానిస్టేబుల్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇద్దరు మహిళా, ఇద్దరు పురుష కానిస్టేబుల్ లతో కూడిన వాహనం తొలుత, ఓ మహిళా కళాశాల వద్దకు వెళ్లింది. అక్కడ గేటుకు సమీపంలో ఉన్న ఓ యువకుడు వీరి ఫస్ట్ టార్గెట్. అతని వద్దకు వెళ్లి, ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించగా, తన స్నేహితురాలి కోసం ఎదురుచూస్తున్నట్టు అతను చెప్పాడు. ʹఓ అబ్బాయి, అమ్మాయి ఎన్నడూ స్నేహితులు కాదు. మీరు నిజంగా స్నేహితులు అయితే, అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అమ్మాయితో మాట్లాడు. ఇక్కడి వీధుల్లో వాతావరణం పాడు చేస్తే ఊరుకోబోముʹ అని హెచ్చరించి పంపారు.
ఈలోగా, కానిస్టేబుల్ చేతిలోని వైర్ లెస్ లో ఓ కోచింగ్ సెంటర్ కేంద్రం వద్ద వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడికి ఎస్పీ నేతృత్వంలో వెళుతున్న టీమ్ కు సహాయంగా వెళ్లాలన్న మెసేజ్ వచ్చింది. దీంతో వీరి వాహనం ఆ దిశగా సాగింది. అక్కడి పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఓ యువకుడిని హెచ్చరించిన పోలీసులు ఇంటికి పంపేశారు. ఆ పక్కనే ఓ పుస్తకాల షాపు ముందున్న యువతిని ప్రశ్నించారు. ʹఇక్కడేం చేస్తున్నావు? ఏమైనా సమస్య ఉందా?ʹ అని అడుగగా, పోలీసులను చూసిన ఆ యువతి బిక్కచిక్కి, ʹఅటువంటిది ఏమీ లేదు, నా కుమారుడికి స్కూల్ బుక్స్ కొనేందుకు వచ్చానుʹ అంటూ తన కొడుకును గట్టిగా పట్టుకుంది.
ఆపై అదే ప్రాంతంలో ఉన్న మహిళా కాలేజ్ వద్దకు వీరు వెళ్లారు. కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. కొందరు యువకులు కాలేజ్ బయట నిలబడి వుంటే, వారి ఫోటోలు తీసి, హెచ్చరించి పంపారు. ఈలోగా అసలు ʹరోమియోʹ అన్న పదం ఎలా వచ్చిందన్న చర్చ వీరి మధ్య వచ్చింది. అతను బ్రిటీష్ వ్యక్తని కాసేపు, కాదు, గ్రీక్ వ్యక్తని కాసేపు చర్చ సాగింది. రోమియో, జూలియట్ లు గొప్ప ప్రేమికులే అయినా, ఆ సంస్కృతి ఇంగ్లండ్ లోనో, గ్రీస్ లోనో అయితే సరిపోతుందికానీ, ఇండియాకు కాదని తేల్చారు.
Keywords : yogi adityanath, modi, uttarapradesh, sangh parivar, rss, police
(2024-03-16 10:17:22)
No. of visitors : 1132
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..