మీడియా దుర్నార్గం: జేఎన్యూ విద్యార్థి ఐసిస్ సింపతైజర్ అని మొదటిపేజీలో.. అది ఫేక్ న్యూస్ అని లోపలి పేజీల్లో..


మీడియా దుర్నార్గం: జేఎన్యూ విద్యార్థి ఐసిస్ సింపతైజర్ అని మొదటిపేజీలో.. అది ఫేక్ న్యూస్ అని లోపలి పేజీల్లో..

మీడియా

సంఘ్ పరివారం దాడులు చేస్తుంది. బాధితులపై దేశ‌ద్రోహులంటు ముద్రలు వేస్తుంది. మీడియా పరివారం డప్పులు కొట్టుకుంటూ ఆ అబద్దాలను ప్రచారం చేస్తుంది. సంఘ్ కనుసన్నలో జరిగే ఈ నాటకాన్ని రక్తి కట్టించేందుకు అబద్దపు సాక్ష్యాలను సృష్టిస్తుంది. మార్ఫింగ్ ఫోటోలను తయారు చేస్తుంది. మీడియా హౌస్ లలో గ్రాఫిక్ వీడియోల తయారీ జరిగిపోతుంది. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కన్హయ కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్య లపై కుట్ర ఇలాగే జరిగింది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు అటు ఏబీవీపీ ఇటు సంఘ్ మీడియా పడరాని పాట్లు పడింది. ఇప్పుడు నజీబ్ వంతు.

జేఎన్యూ విద్యార్థి అయిన నజీబ్ అహ్మద్ గత ఏడాది అక్టోబర్ 15 న మాయమయ్యాడు. అంతకు ముందురోజు అతనిపై ఏబీవీపీ చెందిన ఓ గుంపు దాడి చేసి కొట్టింది. క్యాంపస్ లో కనపడితే చంపుతామని బెధిరించింది. ఆ మరుసటి రోజు నుండి నజీబ్ కనపడటం లేదు. అతని తల్లి, సహచర విద్యార్థులు ఆరోజు నుండి పోలీసుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. అతన్ని కనుక్కోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నజిబ్ కోసం జేఎన్యూ విద్యార్థులే కాక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కూడా అనేక ఆందోళనలు నిర్వహించారు. అనేక ర్యాలీలూ , సభలు నిర్వహించారు. అన్ని ఆందోళనల్లో గుండెలనిండా దుంఖంతో నజీబ్ తల్లి కూడా పాల్గొంది. నజీబ్ మాయమయ్యి 5 నెలలు దాటి పోయింది. అతనేమయ్యాడనేది పోలీసులు కనుక్కోలేకపోయారు. నజీబ్ మాయం వెనక సంఘ్ పరివార్ కుట్ర ఉందనే వాదనలకు రోజు రోజుకు బలంపెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తన పరివార‌ మీడియా ద్వారా సంఘ్ పరివారం మరో నీచమైన కుట్రకు తెరలేపింది. నజీబ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. జీ టీవీ , టైమ్స్ ఆఫ్ ఇండియా మరికొన్ని మీడియా సంస్థలు నజీబ్ గురించి అబద్దపు కథనాలు ప్రచురించి బురదచల్లే ప్రయత్నం చేశాయి. లేని పోలీసు రిపోర్ట్ ను ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాయి. జర్నలిజం విలువలను తుంగలో తొక్కి నజీబ్ ఐసిస్ సింపతైజర్ అని, పోలీసులు అతని లాప్ టాప్ ను పరిశీలించినప్పుడు అతను యూట్యూబ్ లీ ఐసిస్ గురించి చాలా ఎక్కువగా బ్రౌజ్ చేశాడన్నది తెలిసిందని, అతను ఐసిస్ లో చేరాలనుకున్నాడని కాబట్టి అతను ఐసిస్ లో చేరడానికే వెళ్ళి ఉంటాడని ప్రచారం చేశాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ వార్తను తన మొదటి పేజీలో పెద్ద న్యూస్ ఆర్టికల్ రాసింది.

ఇక సోషల్ మీడియాలో భక్త జనం ఈ వార్తను పెద్దఎత్తున ప్రచారంలో పెట్టి నజీబ్ పై జేఎన్యూ విద్యార్థులపై దుమ్మెత్తిపోశారు. చివరకు ఇదంతా బోగస్ అని పోలీసులకు అలాంటి రిపోర్ట్ ఏదీ లేదని, ఇదంతా మీడియా సృష్టి అని తేలింది. నజీబ్ అహ్మద్ కు ఐసిస్ తో సంబంధం లేదని ఢిల్లీ పోలీస్ ఛీఫ్ స్పోక్స్ పర్సన్ దీపేంద్ర పాఠక్ ప్రకటించడంతో మీడియా పరివారం గతుక్కుమంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పోలీసుల ప్రకటనను తన ఐదవ పేజీలో చిన ముక్క వేసి చేతులు దులుపుకుంది.

సోషల్ మీడియాలోని భక్త జనం కొందరు తమ పాత పోస్టులను డిలీట్ చేశారు. కాని మరి కొందరు ఉన్మాదులు మాత్రం ఇప్పటికీ నజీబ్ ఐసి లో చేరాడని అతను దేశద్రోహి అని, అతని కోసం ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల‍ంతా దేశద్రోహులేనని దుమ్మెత్తి పోస్తున్నారు. దానికి టైమ్స్ ఆఫ్ ఇండియా పాత వార్తనే సోర్స్ గా చూయిస్తున్నారు. ఆ పత్రిక ఎవ్వరికీ కనపడకుండా లోపలి పేజీల్లో అచ్చువేసిన పోలీసుల స్టేట్ మెంట్ ను మాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. నిజాన్ని అబ్ద్దం చేయడం, అబద్దాని నిజం చేయడం పెట్టుబడి దారీ పరివార మీడియాకు తెలిసినంతగా మరెవరికి తెలుస్తుంది.

Keywords : JNU, delhi, najeeb, police, abvp, rss, times of india, zee tv, sangh parivar
(2018-07-20 18:21:57)No. of visitors : 686

Suggested Posts


మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....

పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు.

జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం..

Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA

The CBI today submitted a status report on its probe into the mysterious disappearance of Najeeb Ahmed in the Delhi High Court, and is believed to have said that the auto-rickshaw driver who the Delhi Police claimed to have dropped the JNU student at Jamia Millia Islamia has retracted his statement....

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


మీడియా