ఓ యోధుడి కథ - శుక్రవారం విడుదల


ఓ యోధుడి కథ - శుక్రవారం విడుదల

అతని పేరు గౌరి హరి దాస్, ఒడిశా లోని జాడ్ పీపల్ గ్రామం. ఆయనకు 14 ఏళ్ళ వయసు ఉన్నపుడు తన తండ్రి తో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. తనే స్వయంగా తన తోటి వారితో కలిసి వానరసేన అని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై పోరాడారు. స్వాతంత్ర్యం కోసం రహస్యంగా సాహిత్యం ప్రచురించి పంపిణీ చేసేవారు. బ్రిటిష్ ఆజ్ఝలను ధిక్కరించి 1945, జనవరి 26 న భారత జెండా ఎగిరేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. రెండు నెలల తర్వాత దాస్ జైలు నుండి విడుదలై మళ్ళి స్వాతంత్ర్య పోరాటంలోకి ఉరికాడు. అదంతా చరిత్ర. అది అసలు కథ కూడా కాదు. గౌరి హరి దాస్ స్వాతంత్ర్య సమరయోధుడి గుర్తింపు కోసం చేసిన సుధీర్ఘ పోరాటమే అసలు కథ. ఆయన పెన్షన్ కోసం పోరాడలేదు. గుర్తింపు కోసం పోరాడారు. ఆయన తనను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించాలని 32 ఏళ్ళ పోరాటం చేశారు. 321 ఆఫీసుల చుట్టూ తిరిగారు. ప్రభుత్వ కార్యాలయాలకు 1043 లేఖలు రాశారు. 1976 లో ప్రారంభమైన ఆయన పోరాటం చివరకు 2008 లోముగిసింది. ఆయనకు ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుడిగా సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా ఆయనేమీ పెన్షన్ కోసం అప్లై చేసుకోలేదు. ఎందుకంటే ఆయన పోరాటం పెన్షన్ కోసం కాదు గుర్తింపు కోసం. ఈ 32 ఏళ్ళ సుధీర్ఘ పోరాటంలో దాస్ అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదలకుండా పోరాడి గెలిచాడు. స్వాతంత్ర్య పోరాటం కన్నా ఇదే చాల కష్టమైనదని దాస్ అభిప్రాయం . అయితే గౌరి హరి దాస్ పోరాటం పై ప్రస్తుతం ఓ సినిమా వస్తోంది. ప్రముఖ బాలీఉడ్ డైరెక్టర్, థియేటర్ ఆర్టిస్ట్ అనంత్ మహదేవన్ తీసిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. సినిమా పేరు ʹగౌర్ హరి దస్తాన్-ది ఫ్రీడమ్ ఫైల్ʹ ఇందులో హరిదాస్ గా వినయ్ పాఠక్, ఆయన భార్య లక్ష్మిగా కొంకణా సేన్ నటించారు.

Keywords : Gour Hari Dastaan, Freedom fighter, Mubai, Anantha Mahadevan
(2018-07-19 08:03:56)



No. of visitors : 1418

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


ఓ