ప్రశ్నించినందుకు ఆ సైనికుడిని డిస్మిస్ చేశారు

ప్రశ్నించినందుకు

పై అధికారులు తమ ఆహారాన్ని అమ్ముకుంటూ తమను ఆకలికి మాడిపోయేట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్‌బ‌హ‌దూర్ యాద‌వ్ గుర్తున్నాడా ? అతన్ని ఉద్యోగంలోంచి తొలిగించారు. బీఎస్ ఎఫ్ జవాన్లకు పెడుతున్న ఆహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిపై బీఎస్ ఎఫ్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే డిఫెన్స్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న అవినీతిని వెలికితీయాల‌న్న ఉద్దేశంతోనే వీడియోను పోస్ట్ చేసిన‌ట్లు తేజ్‌బ‌హ‌దూర్ చెప్పాడు. త‌న‌ను మాన‌సికంగా వేధిస్తున్నార‌ని ఆరోపించాడు. కానీ ఇవాళ తేజ్ బహదూర్ ను విధుల నుంచి తొలిగించినట్లు అధికారులు స్పష్టం చేశారు. సైనిక కోర్టు విచారణ నివేదిక ఆధారంగా అతన్ని తొలిగించారు. బీఎస్ఎఫ్ చట్టం ప్రకారమే తేజ్ బహదూర్ పై చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. బీఎస్ఎఫ్ విధుల నుంచి తనను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయిస్తానని జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ అన్నారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న ఆయన, తనకు అక్కడ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడితే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయని బీఎస్ఎఫ్‌ను వీడుతున్న సందర్భంగా తేజ్ బహదూర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బీఎస్ ఎఫ్ లో జరుగుతున్న అవినీతి వ్యవహారాన్ని తేజ్ బహదూర్ బహిర్గతం చేసిన తర్వాత మరికొంత మంది సైనికులు కూడా సైన్యంలో అధికారులు చేస్తున్న అవినీతి, కక్షపూరిత చర్యలు, అణిచివేత పై సోషల్ మీడియాలో గొంతు విప్పారు. ఇక వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా తీసేస్తారా అనేది చూడాలి.

Keywords : army, tej bahadur, modi,
(2024-04-20 10:21:28)



No. of visitors : 1186

Suggested Posts


కడుపునిండా అన్నం అడిగినందుకు BSF జవానుపై అధికారుల దుర్మార్గపు దాడి !

నుకన్నట్టే అవుతోంది. తమ అవినీతి బట్టబయలు చేసిన BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ పై అధికార్లు కత్తిగట్టారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కుక్కను చంపేందుకు పిచ్చికుక్క్త అనే ముద్ర వేసినట్టు అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్మార్గపు దాడి చేస్తున్నారు....

ʹనాభర్త ఏమయ్యాడొ తెలియడం లేదు... నాకొడుకును ఆర్మీలో చేర్చనుʹ

BSF జవాన్లు ఆకలితో ఎలా అలమటిస్తున్నారో, వారికి రావాల్సిన రేషన్ ను అధికారులు అమ్ముకుంటున్నారో BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన తర్వాత నుండి అతను తమకు కాంటాక్ట్ లో లేకు‍ండా పోయాడని, అతను ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదని అతని భార్య ఆందోళన చెందుతున్నారు...

సరిహద్దుల్లోజవాన్ల‌ ఆకలి కేకలు ‍- అధికారుల అవినీతి పై ఆగ్రహ జ్వాలలు

ఈ వీడియోలో నా వెనుక కనపడుతున్న దృశ్యాలు మీకు చాలా అందంగా ఉన్నాయనుకుంటా. కానీ ఇక్కడ మాజీవితాలు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. మా ఈ జీవితాల గురించి ఏ మీడియా చూయించదు. ఏ మంత్రి, ఏ ప్రభుత్వమూ వినదు. నేను మీకు చూయిస్తున్న ఈ వీడియో.. మా అధికార్లు మాపట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో... ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ...

నిన్న తేజ్‌బహదూర్‌.. నేడు జీత్‌ సింగ్ - ‍వెలుగు చూస్తున్న‌ జవాన్ల దుర్భర జీవితాలు

నిన్నBSF జవాను తేజ్‌బహదూర్‌ యాదవ్‌ తమకు పెడుతున్న ఆహారం గురించి, అధికారుల అవినీతి గురించి వీడియో ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తే. ఇప్పుడు ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అతనికి తోడుగా గొంతు విప్పాడు. జీత్‌సింగ్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్.....

మమ్ములను భానిసలకన్నా హీనంగా చూస్తున్నారు ‍- మరో సైనికుడి ఆవేదన‌

భారత సైనికులపై సైనికాధికారుల వేధింపులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో.. వాళ్ళను భానిసలకన్నా నీచంగా ఎలా చూస్తున్నారో మరో సైనికుడు గొంతు విప్పాడు. BSF జవాను తేజ్ బహదూర్ సింగ్ తమ దుర్భర జీవితాన్ని ప్రపంచానికి వెల్లడించిన తర్వాత ఒక్కొక్కరు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. మొన్న తేజ్ బహదూర్ సింగ్ నిన్న జీత్ సింగ్ ఇవ్వాళ్ళ యగ్య ప్రతాప్ సింగ్ ...

జవాన్ల ఆకలి కేకలు, అధికారుల అవినీతి బాగోతాలు ‍- వెలుగు చూస్తున్న కొత్త నిజాలు

సరిహద్దులో జవాన్ల ఆకలి కేకలు , అధికారుల అవినీతి బాగోతాన్నిBSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన తర్వాత అధికారుల అవినీతి కథలు మరిన్ని బయటపడుతున్నాయి....

పెరుగుతున్న అణిచివేత, ఒత్తిడి ‍‍- ‍ తోటి వారిని కాల్చి చంపిన జవాను

మిలటరీ, పారా మిలటరీ బలగాల్లో అధికారుల వేధింపుల పట్ల రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ గోడు ప్రపంచానికి వెళ్ళబోసుకుంటే వత్తిడి భరించలేని మరో CISF జవాను ఏకంగా కాల్పులు జరిపి నలుగురు సాటి జవాన్లనే బలిగొన్నాడు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రశ్నించినందుకు