ఓయూ లేకుంటే నా జీవితం లేదు : అల్లం నారాయ‌ణ‌

ఓయూ


రాడికల్‌ జెండాను ఎత్తి పట్టిన నాటి విద్యార్థి నాయకుడు.. జగిత్యాల జైత్రయాత్రను గానం చేసిన కవి.. ప్రాణహిత ప్రవాహమైన పాత్రికేయుడు... ఆయనే ఉస్మానియా పూర్వ విద్యార్థి, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ. విద్యార్థి దశలోనే విప్లవ పాఠాలు నేర్చి, విద్యార్థి నాయకుడిగా ఉస్మానియాలో పోరాటాన్ని ఎత్తిపట్టాడు. తెలంగాణ పోరాటంలో నేను సైతం అంటూ కలంతో అక్షర అగ్గిరవ్వల్ని కురిపించాడు. ఉస్మానియా యూనివర్సిటీ తో తన బంధాన్ని పంచుకున్నఅల్లం నారాయణ తో క్రాంతి ఇంటర్వ్యూ ...

క్రాంతి: బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ సాగింది ?

అల్లం నారాయణ: ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి ముందే నేను విప్లవ రాజకీయాల్లో ఉన్నాను. కరీంనగర్‌ జిల్లా గాజుల పల్లి మా స్వగ్రామం. రైతు కుటుంబంలో పుట్టిన. నాన్న రైతుకూలీ కావడంతో చదువు గురించి తెలియదు. దీంతో ఆయన మమ్మల్ని చదువుల పట్ల ప్రోత్సహించే దిశలో శ్రద్ద పెట్టలేదు. మా పెద్దన్న అల్లం రాజయ్యకు సాహితీ మిత్రులతో బాగా పరిచయం. ఆయన వల్ల ఇంట్లోకి వచ్చే పుస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. మంథనిలో ఒక లైబ్రరీ ఉండేది. అక్కడికి ఐదవ తరగతి నుంచే వెళ్లడం అలవాటైంది. అది నాకు బాగా కలిసొచ్చింది కూడా. అక్కడ చాలా పుస్తకాలు చదివాను. అల్లం రాజయ్య తెచ్చిన సుబ్బారావు పాణిగ్రాహి పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసింది. కవులు, గాయకులను ఎందుకు చంపేస్తున్నారన్న ప్రశ్న అప్పట్లో ప్రభుత్వానికి చెమటలు పోయించింది. తర్వాత ఆరవ తరగతి నుంచి ఇంటర్‌ వరకు మంథనిలో చదివిన. టెన్త్‌ అయిపోయాక ఆ సమయంలో ఆ ప్రాంతాల్లో పూర్తిగా విప్లవాత్మక వాతావరణం ఏర్పడింది. చందుపట్ల క్రిష్ణారెడ్డి, మల్లా రాజిరెడ్డిల పరిచయం వల్లనే నాకు రాజకీయాలు పరిచయమయ్యాయి. కరీంనగర్‌లో ఓసారి జనవరి 26న క్రిష్ణారెడ్డి, రాజిరెడ్డి లాంటోళ్లు కరపత్రాలు రాసి, ముద్రించి, పంచారు. అవి అప్పట్లో సంచలనం స ష్టించాయి. క్రిష్ణారెడ్డి మా పెద్దన్న అల్లం రాజయ్య క్లాస్‌ మేట్స్‌. క్రిష్ణారెడ్డి వయసులో పెద్దవాడైనప్పటికీ మాతో చనువుగా ఉండేవాడు. ఇంటర్‌కి వచ్చాక విప్లవ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కొల్లూరు చిరంజీవి మా ప్రాంతానికి ఆర్గనైజర్‌గా పనిచేసేవాడు. మల్లా రాజిరెడ్డి, క్రిష్ణారెడ్డి, మందాటి భాస్కర్‌రెడ్డి లాంటి వాళ్ల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేవాళ్లం.

క్రాంతి: ఉస్మానియాకు రాకముందు విద్యార్థి ఉద్యమాలతో ఎలా సంబంధం ఉండేది?

అల్లం నారాయణ: 74లో హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ ఎస్‌ యూ మొదటి మహాసభకు జమ్మికుంట, మంథని, పెద్దపల్లి ప్రాంతాల నుంచి ఒక రైలు నిండా విద్యార్థులం వచ్చాం. అనంతరం మా కాలేజీ వార్షికోత్సవంలో మాట్లాడేందుకు అంపశయ్య నవీన్‌ని పిలిచాం. ఆ సందర్భంగా.. రైట్‌ వింగ్‌ వాళ్లు గొడవ చేశారు. క్రిష్ణారెడ్డిపై దాడి జరిగింది. దీంతో మేమూ తిరిగి దాడిచేశాం. దాడి వెంటనే మాకు తెలీకుండానే అజ్ఞాతంలోకి వెళ్లాం. ఇంటర్మీడియెట్‌ తరువాత పార్టీ పిలుపు వచ్చింది. అలా మల్లారాజిరెడ్డి, పోరెడ్డి వెంకట్‌రెడ్డి, సాహు, నేను, క్రిష్ణారెడ్డి మంథని కమిటీలో పనిచేసేవాళ్లం. కొద్దికాలానికి మేమంతా అరెస్టయ్యాం.

రెండున్నరేళ్ల జైలు జీవితం... బయటికి వచ్చాక పార్టీ ఆదేశాల మేరకు... మంచిర్యాలలో 1977లో బీఎస్‌సీ చేశాను. అప్పటికే మామీద మంథని, ఖమ్మం కేసులు ఉండేవి. మళ్లీ అరెస్టు చేశారు. 6 నెలల పాటు ఎమర్జెన్సీలో లాకప్‌లో ఉన్నాం. జైలు జీవితం తరువాత... 30 మంది పూర్తికాలం కార్యకర్తలతో ఐవీ మాస్టర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. శాస్త్రుల పల్లిలో జరిగిన ఈ సమావేశం తరువాతే రోడ్‌ టు రెవల్యూషన్‌ డాక్యుమెంట్‌ వచ్చింది. ఎన్నికల బహిష్కరణ నినాదాలతో... ప్రజాసంఘాల ఏర్పాటు, గో టూ విలేజ్‌ మొదలైంది.

క్రాంతి: ఓయూలో ఎంతకాలం చదువుకున్నారు? ఆనాటి ఓయూ పరిస్థితుల గురించి చెప్పండి.

అల్లం నారాయణ: 1977-82 వరకు కొవ్వూరు, తాడిచెర్ల ప్రాంతాల్లో సెంట్రల్‌ ఆర్గనైజర్‌గా పనిచేశా. ఈ క్రమంలో కొత్తపల్లి ప్రాంతంలో నామీద దాడి జరిగింది. పార్టీ పిలుపు మేరకు 1982 చివర్లో అక్కడి నుంచి వచ్చేశా. కొవ్వూరు నుంచి వచ్చేశాక చాలా ఆలోచించా. ఏం చేయాలా...? అని. ఏం తోచలేదు. క ష్ణారెడ్డిగారితో కలిసి పనిచేసేటప్పుడు ఆయన నిత్యం నాకో మాట చెప్పేవాడు. ఎమ్మే చెయ్యి.. ఎమ్మే చెయ్యి.. అని ఆయన మాటను గౌరవించి ఓయూ ఎంట్రెన్స్‌ రాశా. పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ రెండింటిలో సీటొచ్చింది. సోషియాలజీలో చేరా. ఎప్పటికైనా ఓయూలో చేరాలన్న నా చిరకాల కోరిక అది.

అప్పటికే ʹఉదయంʹ పేరుతో కవిత్వం రాయడం మొదలుపెట్టా. కొంతమంది మిత్రులతో కలిసి పార్టీకి ఫుల్‌టైమ్‌ పనిచేస్తూనే మరోపక్క కవిత్వం రాశా. ఓయూలో చేరినప్పటి నుంచి నాలో వస్తున్న మార్పును గమనించా. నేను మునుపటిలా లేను సబ్జెక్ట్‌ విషయంలో, ఆలో చనల విషయంలో చాలా మార్పు వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు నేను వెలితిగా ఫీలయ్యే అంశాలు ఓయూలో చేరాక నాకు దూరమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, ఉద్యమాల్లో పాల్గొనే విద్యార్థులకు, సాహితీ విద్యార్థులకు ఓయూ ఒక ఉపకేంద్రంగా ఉండేది. ఆర్ట్స్‌, సైన్స్‌ కాలేజీలు బలమైన విద్యార్థులను, విద్యార్థి నాయకులను, ఉద్యమాలను నిర్మించాయి. శంకర్‌, దామోదర్‌, స్వర్ణ, మల్లారెడ్డి, ప్రహ్లాద్‌ లాంటి వారి స్నేహం, ఓయూ వాతావరణం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. అప్పుడు ఓయూలో మేం చూసిన చైతన్యం మళ్లీ కనిపించలేదు. సామాజిక చలన కేంద్రంగా ఓయూ పనిచేయడం నేను కళ్లారా చూశా. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, వామపక్ష విద్యార్థులకు ఓయూ రక్షణ కవచంలా ఉండేది. ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఎస్‌.ఎఫ్‌.ఐ లాంటి విద్యార్థి సంఘాల ఆధిపత్యం ఓయూలో బాగా ఉండేది. ఎన్నో ర కాల చర్చలకు ఓయూ వేదికైంది. అన్నీ సందర్భాల్లో, సమయాల్లో, పరిస్థితుల్లో ఓయూ ఒక సంచలనాత్మక చైతన్య వేదికలా ఉండేది.

క్రాంతి: ఓయూ విద్యార్థి ఉద్యమంలో మీ పాత్ర?

అల్లం నారాయణ: నేను రాజకీయాలవైపు రావడం నా విద్యార్థి దశలోనే జరిగింది. విప్లవ రాజకీయాల్లో ఉండడం వల్ల నేను రాజకీయాల పట్ల పరిపూర్ణమైన పరిపక్వత సాధించగలిగాను. అందులో నేను ఓయూలో గడిపిన, నేర్చుకున్న విషయాలు నాకు అనేక అంశాల పట్ల క్లారిటీ ఇచ్చాయి. 1985 కాలంలో ఉన్న రాజకీయాలను అధ్యయనం చేసే అవకాశం నాకు ఓయూ వల్లనే లభించింది. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆర్గనైజర్‌గా నేను మిస్‌ అయిన అంశాలు తిరిగి నేర్చుకోవడానికి ఓయూ నాకు చాలా సహాయపడింది. వామపక్ష ఉద్యమం మీద స్పష్టమైన అవగాహన నాకు ఇచ్చింది ఓయూనే. రకరకాల సిద్ధాంతాల మీద అవగాహన కల్పించింది. ఇక్కడ ఉండే సాహిత్య వాతావరణం అలాంటిది. అంజన్న సాహిత్యం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఓయూలో ఉన్నప్పుడే విరసం సభ్యత్వం తీసుకున్నా. ఓసారి అలిశెట్టి చిత్రాల ప్రదర్శన పెట్టారు. అది నన్ను బాగా ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటి. నేను, దేవేందర్‌ రెడ్డి, వెంకట్‌రెడ్డి లాంటి వాళ్లం కలిసి హైదరాబాద్‌లో మొట్టమొదటి సారి ఆర్‌ఎస్‌యూ మహాసభ నిర్వహించినం. ఈ సభకు మంథని, పెద్దపల్లి లాంటి ప్రాంతాల నుంచి భారీగా విద్యార్థులను కదిలించాం. ఒక రైలు నిండా విద్యార్థులు సభకు వచ్చారు. నా బాల్యం చాలా సామాన్యంగా గడిచింది. ఆర్‌ఎస్‌యూ ఏర్పడ్డ నాటి నుంచి పూర్తిగా ఆర్‌ఎస్‌యూకి అనుబంధంగానే పనిచేశా. సరోజినీ దేవి హాల్‌లో ఓసారి మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నాం. మీటింగ్‌ ప్రారంభంలోనే పోలీసులు దాడి చేసి అందరినీ చెల్లాచెదురు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో పార్టీని కలవడం, అందరినీ సమీకరించి ఆర్‌ఎస్‌యూ విస్తరణకు తోడ్పడడంతో రాజకీయ జీవితానికి తెర లేచింది.

క్రాంతి: సైద్ధాంతిక, రాజకీయ పరిపక్వత సాధించడానికి మీకు ఓయూ ఎలా ఉపయోగపడింది?

అల్లం నారాయణ: నేనెప్పుడూ చెప్తుంటా.. నా జీవితంలో రెండు కోణాలున్నాయని. ఒకటి ఉద్యమం. ఇంకోటి సంతోష్‌. అతని నైజం నాకు నచ్చేది. యూనివర్సిటీ మొత్తాన్ని ఆయన ప్రభావితం చేసేవాడు. ఆయన గురించి ప్రతిరోజూ వర్సిటీ చర్చించేది. మాట్లాడుకునేది. ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీని అంతలా ప్రభావితం చేసిండంటే.. అది చిన్న విషయం కాదు. కరెంట్‌ ఇష్యూస్‌ మీద ఆయన స్పందించే తీరు ప్రత్యేకం. అదే అందరినీ ఆయన వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ఈ మధ్య ఓయూలో, అక్కడి వాతావరణంలో, చైతన్యంలో చాలా మార్పొచ్చింది. అప్పుడు పూర్తిగా లెఫ్ట్‌ వాతావరణం ఉండేది. ఒక అర్థవంతమైన చర్చ నడిచేది.

సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలు, ఆలోచనలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితిలో చాలా తేడా వచ్చింది. అంతా కలగూరగంపలా తయారైంది. సబ్జెక్ట్‌, కరెంట్‌ ఇష్యూస్‌, మీద నిత్యం చర్చ జరిగేది. ఇలాంటి అంశాలు నాలాంటి వాళ్లను చాలా మార్చాయి. నన్ను ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకుపోయిందంటే.. వందకు వంద శాతం ఉస్మానియా విశ్వవిద్యాలయమే. అందుకు నేను యూనివర్సిటీకి జీవితాంతం రుణపడి ఉంటా. ఓయూలో నేను రెండున్నరేళ్లు చదువుకున్నా. విద్యార్థిగా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, స్వతంత్ర భావాలు గల యువకుడిగా, నిరంతరం అధ్యయనం చేసే అధ్యయన శీలిగా ప్రతీ విషయంలో ఓయూ నాకు చాలా నేర్పింది. ఓయూ లేకుంటే నా జీవితం లేదు.

క్రాంతి: ఓయూలో మీరు చదువుకునే రోజుల్లో సాహిత్య వాతావరణం గురించి చెప్పండి?

అల్లం నారాయణ: ఓయూలో విద్యార్థి, సామాజిక ఉద్యమాలతో పాటు, సాహిత్య ప్రక్రియకూ ప్రాధాన్యత ఉంది. అప్పట్లోనే యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌ అని ఓ సంఘం పనిచేసేది. నందిని సిద్ధారెడ్డి, కెఎన్‌ చారి, విజయారావు, లాంటి వాళ్లంతా అందులో ఉండేవారు. ʹʹఈ తరం యుద్ధ కవితʹʹ పేరుతో సంకలనం విడుదల చేశాం. మంచి స్పందన వచ్చింది.

క్రాంతి: జర్నలిజం వ త్తిలోకి ఎలా వచ్చారు?

అల్లం నారాయణ: నిరంతర అధ్యయనమే నేను జర్నలిస్టుగా మారేందుకు తోడ్పడింది. క్రియాశీలక రాజకీయాల్లోంచి బయటకొచ్చేశాక నాకు కనిపించిన మార్గం జర్నలిజమే. నేనేంది.. ఎటూ కాకుండ పోతున్న. అనే అచేతన స్థితిలోంచి మళ్లీ చైతన్య దిశలోకి మారే అవకాశమొచ్చింది. సరిగ్గా అప్పుడే ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుంది. నిజానికి ఆ కాలంలో నక్సల్బరీ ఉద్యమం, వామపక్ష రాజకీయాల నుంచి వచ్చినవాళ్లు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోలేదు. దీనికి కారణం తెలంగాణను అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు. తెలంగాణ గురించి, దాని ఏర్పాటు గురించి అంతలా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కారణం అయి ఉండవచ్చు. అయితే.. 96లో వచ్చిన ఉద్యమం నాలాంటి ఎందరిలోనో మార్పు తెచ్చింది. ఉద్యమం వైపు తిప్పుకున్నది. మలి చైతన్యం పుట్టి నేను మళ్లీ ప్రజల్లోకి వెళ్లగలిగాను. ప్రజాక్షేత్రంలో తెలంగాణ ఆవశ్యకత గురించి అవగాహన తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాను.

క్రాంతి: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఓయూ పాత్ర గురించి మీరెలా విశ్లేషిస్తారు?

అల్లం నారాయణ: రకరకాల కారణాల వల్ల విడిపోయిన తెలంగాణ విద్యార్థి లోకాన్ని మలిదశ ఉద్యమం మళ్లీ కలిపింది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఏర్పాటు చేసిన ఓ మీటింగుకి మేం కూడా వెళ్లాం. అక్కడ జర్నలిస్టుల ఫోరంతో సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడే తొలి విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేశాం. వారం రోజుల పాటు నేను, ఘంటా చక్రపాణి లాంటి వాళ్లం అక్కడే ఉండి రకరకాల ప్రోగ్రామ్స్‌ కండక్ట్‌ చేశాం. ఓయూ లేకుంటే తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఇంత బలం ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది ఓయూనే. తెలంగాణ కోసం అన్నీ వర్గాల విద్యార్థులను ఏకం చేసింది. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేసింది. ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు, విద్యార్థులు అనే తేడా లేకుండా తెలంగాణ అనే అంశాన్ని చర్చించుకునేందుకు ఓయూ ఒక వేదికయింది. ప్రేరణ ఇచ్చింది. అమెరికా, గల్ఫ దేశాలు, ఆస్ట్రేలియా, స్వీడన్‌ లాంటి దేశాల్లో ఉన్న తెలంగాణ వారసులు నాకు ఉత్తరాలు రాసేవారు. వారికి వివరంగా, ఓపికగా తిరుగు లేఖ రాసేవాణ్ణి. నన్ను తెలంగాణ ఉద్యమంలో నిలిచేలా.. ఇంతటి స్థాయికి ఎదిగేలా చేసింది.. అక్షరాలా ఉస్మానియా యూనివర్సిటీయే. అందుకే.. నేనెప్పుడూ చెప్తుంటా.. ఓ యూకు నేను రుణపడి ఉంటా అని.

(న‌డుస్తున్న తెలంగాణ ఏప్రిల్ 2017 సంచిక‌లో ప్ర‌చురితం)

Keywords : OU, Allam narayana
(2024-04-24 19:50:52)



No. of visitors : 2537

Suggested Posts


ఉద్య‌మాల ఉస్మానియా - అమ‌రుల త్యాగాల మార్గం - వ‌ర‌వ‌ర‌రావు

కామ్రేడ్స్‌ అసోసియేషన్‌తో ప్రారంభమై ప్రత్యామ్నాయ రాజకీయాల నూతన ప్రజాస్వామిక స్వప్నం ఆచరణగా రుజువవుతున్న వర్తమానంలో ఎందరో జ్ఞాత, అజ్ఞాత ఉస్మానియా విద్యార్థుల పోరాట భూమిక ఉన్నది. అసంఖ్యాక విద్యార్థులు నిర్వహించిన ఆ పోరాటాలలో నాకు తెలిసిన, నాకు తెలియని ఇంకెందరో విద్యార్థుల ప్రాణత్యాగాల ఫలితాలు ఉన్నాయి.

ఓయూలో విద్యార్థి చ‌ల‌నాలు - సి. కాశీం

ఓయూ కేంద్రంగా 2009 నవంబర్‌ 29న ఏర్పడిన విద్యార్థి జాక్‌కు ఆర్ట్స్‌కాలేజీ జీవం పోసింది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు వెలసిన టెంట్‌ తెలంగాణ ఉద్యమాన్ని శాసించింది. తెలంగాణ ప్రజలందరు ఓయు వైపు చూసారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 2010 జనవరిలో 5 లక్షల మంది విద్యార్థులతో ఆర్ట్స్‌ కాలేజీ ముందు స్టూడెంట్‌ జాక్‌ సభ నిర్వహించింది....

ఉస్మానియా నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ

ఆర్ట్స్‌ కాలేజీకి ముగ్గువోసినపుడు నాకు పదేండ్లుంటయ్‌. మా అయ్యతోటి గల్సి కంకర గొట్టిన. రాళ్లు మోసిన. ఆర్ట్స్‌ కాలేజీకెదురుంగ కోంటోని బిల్లింగుండె(బీ హాస్టల్‌ భవనం). ఇప్పుడున్న ఠాగూర్‌ ఆడిటోరియం అడుగున అప్పట్ల సిల్మా ఆలుండె. దాని కట్టనీకి ఇటికెల్ని మూసిల్నించి తెచ్చేది....

భావోద్వేగాల కూడ‌లి ఉస్మానియా యూనివ‌ర్సిటీ - నందిని సిధారెడ్డి

ఆ తర్వాత కొద్ది రోజులకే రమీజాబీ సంఘటన జరిగింది. అడిక్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు రమీజాబీ, ఆమె భర్త న్యాయం కోసం వచ్చిండ్రు. భర్త ముందే పోలీస్‌స్టేషన్‌లో రమీజాబీపై అత్యాచారం జరిగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. ఆ సంఘటన మీద పెద్ద నిరసన. విద్యార్థులు, విప్లవ కారులు రోడ్డు మీదికొచ్చిండ్రు. అటు పోలీసులు, ఇటు విద్యార్థులు విద్యానగర్‌లో ఒక యుద్ధంలాగా జరిగింది.

యూనివర్సిటీలో పోలీసు జోక్యంపై పోరాడి విజయం సాధించిన ఉస్మానియా విద్యార్థులకు శెల్యూట్స్ !

దాదాపు 20 గంటలకు పైగా తిండి , నిద్ర మానేసి విద్యార్థులు వీసీ కార్యాలయంలోనే బైటాయించి పోలీసులకు, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిట్టచివరకు దిగి వచ్చిన వీసీ విద్యార్థుల డిమాడ్లను అంగీకరించాడు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్ జారీ చేశాడు, అందులో... యూనివర్సిటీ అధికారుల అనుమతితో విద్యార్థులు

రండి "వసంత కుమారి"తో మాట కలుపుదాం....!!

"పుట్టింది ఒక చోట...తిరిగింది మరో చోట...విప్లవ ప్రభుత్వాన్ని నిర్మించిందీ ఇంకో చోట" అని ʹచే గువేరాʹగురించి తరచూ అనుకునే మాటలు ఇవి. ఈ మాటలు సరిగ్గ సరిపోతాయి ఢిల్లీ ప్రొఫెసర్ డా.జి.ఎన్. సాయిబాబాకు...

ʹఓయూ విద్యార్థి వొగ్గె భరత్ ను తెలంగాణ, NIA పోలీసులు కిడ్నాప్ చేశారుʹ

15 జూలై సోమవారం రోజున తన హాస్టల్ రూమ్ లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత‌ భరత్ మిత్రుడిని కలిసి వస్తా అని ఓయూ హాస్టల్ నుండి బయటకు వెళ్ళాడు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో హిమయత్ నగర్ కేఫ్ లో టీ తాగుతుండగా కరీంనగర్ పోలీసులము అని చెప్పి భరత్ ను బలవంతంగా వ్యాన్లో పడేసి కిడ్నాప్ చేసారు. ఆరోజు రాత్రి హైదరాబాద్ లోనే ఒక గుర్తు తెలియని ఆఫీసులో తీవ్రంగా కొడుతూ త

Open Letter To President of India - OU Students

However the university has become a subject of negligence in the hands of the successive governments including the present Telangana government. The students while struggling for separate statehood have raised many issues that have been impeding the progress of the university in fulfilling its responsibility towards the people of the country...

కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఓయూ విద్యార్థులు

రాష్ట్రంలో ప్రైవేట్‌ వర్సిటీల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో విద్యార్థులు మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహ నం చేశారు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఓయూ