నేటి నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా న‌క్స‌ల్బ‌రీ 50 వార్షికోత్స‌వాలు -మావోయిస్ట్ పార్టీ నాయకుడు జగన్ వ్యాసం

నేటి

కమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వంలో నక్సల్బరీ రైతాంగ విముక్తి యుద్ధం 1967 మే 23న ఆరంభమైంది. అది జోతేదార్ల పీడనకు వ్యతిరేకంగా సాగిన యుద్ధం. భూమి కోసం రాజ్యాధికారం కోసం యుద్ధం. నక్సల్బరీ, ఖరీబారీ, ఫన్సీ దేవా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 274 చదరపు మైళ్ళ ప్రాంతంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రైతాంగం భూస్వాముల భూముల్లో పంటలను బలవంతంగా తీసుకెళ్ళారు. ఈ కాలంలో 60కి పైగా సంఘటనలు జరిగాయి. రైతులంతా సంఘటితమై రైతు కమిటీగా ఏర్పడ్డారు. భూస్వాముల భూములను ఆక్రమించారు. జోతేదార్ల వద్దనున్న రికార్డులను తగులబెట్టారు. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల్లో ఒక కొత్త చైతన్యం వెల్లివిరిసింది. మే 23, 25 నాటికి పోరాటం యుద్ధ స్థాయికి చేరుకుంది. ఆనాటి సిపిఎం నాయకుడు, హోంమంత్రి జ్యోతి బసు ఆదేశాలతో పెద్ద ఎత్తున దాడికి దిగిన ప్రభుత్వ సాయుధ బలగాలకు, రైతాంగానికి జరిగిన ఘర్షణ మొదటిది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్ని కదిలించింది. చైనాలోని పెకింగ్‌ రేడియో నక్సల్బరీ తిరుగుబాటును వసంతకాల మేఘ గర్జనగా అభివర్ణించింది. చిన్న నిప్పురవ్వ దావానలమైనట్టే బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా సిలిగురి సబ్‌ డివిజన్‌ నక్సల్బరీ ప్రాంతంలో చారుమజుందార్‌ నాయకత్వంలో మార్క్సిజం–లెనినిజం–మావో ఆలోచనా విధానంతో చైతన్యయుతమై సంతాల్‌ రైతాంగం నిర్వహించిన సాయుధ వ్యవసాయ విప్లవ పోరాటం భారత దేశ విప్లవ పంథాను నిర్దేశించింది.

చైనా, సోవియట్‌ రష్యా పార్టీల మధ్య తలెత్తిన గ్రేట్‌ డిబేట్‌ (గొప్ప చర్చ), సాంస్కృతిక విప్లవ ప్రేరణతో చారు మజుందార్‌ 1965–67 మధ్య కాలంలో ఎనిమిది డాక్యుమెంట్లను కేడర్లలో పంపిణీ చేశారు. దాంతో పార్టీలో అంతర్గత సైద్ధాంతిక పోరాటం ప్రారంభమైంది. ఆయన నాయకత్వంలో వచ్చిన నక్సల్బరీ తిరుగుబాటును పాలకవర్గాలు మూడు నెలల్లోనే అణిచివేశాయి. అయితే అది దేశవ్యప్తంగా పేద రైతాంగంలో చైతన్యాన్ని రగిల్చింది. శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్‌), ముషాహరి (బీహార్‌), లఖింపూర్‌ ఖేరి, తెరై (ఉత్తరప్రదేశ్‌), దేబ్రా, గోపివల్లబ్‌పూర్‌, బీర్భూమ్‌, సోనార్‌ పూర్‌, కామ్క్స (బెంగాల్‌), పంజాబ్‌, కేరళ, తమిళనాడు, ఒడిశా, కశ్మీర్‌, అస్సామ్‌, త్రిపుర రాష్ట్రాలకు వ్యాపించింది. భూస్వాములకు మద్దతుగా వచ్చిన పోలీసు పారా మిలిటరీ బలగాలకు, భారత సైన్యాలకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధమై గెరిల్లా యుద్ధంతో పాలకవర్గాలను గడగడలాడించింది.

మార్క్సిజం–లెనినిజం–మావో ఆలోచనా విధానంతో సాయుధ వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో ప్రజాసైన్యాన్ని నిర్మించడం; సాయుధ పోరాటం ద్వారా ముందు గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేసి అంతిమంగా పట్టణాలను చుట్టుముట్టి దేశవ్యాప్తంగా విజయం సాధించడం అనే దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాని దేశ నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించిన ఫలితమే నక్సల్బరీ తిరుగుబాటు. అది ఊడలు దిగిన రివిజ నిజానికి గొడ్డలిపెట్టు. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో విడదీయరాని భాగం. అది మార్క్సిజం–లెనినిజం–మావో ఆలోచనా విధాన దిశా నిర్దేశంలో మావోయిస్టు విప్లవ పార్టీ నిర్మాణానికి, సరి యైన రాజకీయ పంథాకు, వ్యూహానికి, పోరాట పద్ధతులకు, నాయకత్వ శైలికి మహత్తర ఆరంభంగా నిలిచింది. ఒక మాటలో చెప్పాలంటే భారత విప్లవ చరిత్రలో అది ఒక గొప్ప మలుపు. ఒక గుణాత్మక ముందంజ.

మహత్తర నక్సల్బరీ పోరాటానికి నాయకత్వాన్ని అందించిన చారు మజుందార్‌ నేతృత్వంలో సి.పి.ఐ.(ఎం.ఎల్‌.) ఏర్పడింది. అదే సమయంలో కన్హయ చటర్జీ నాయకత్వాన అదే సిద్ధాంతాన్నీ, పంథాను, వ్యూహాన్నీ అనుసరిస్తూ ఎం.సి.సి. ఆవిర్భవించింది. ఆనాటి వ్యూహం సరైనదే అయినప్పటికీ ఎత్తుగడల లోపాల మూలంగా మితవాద, అవకాశవాద విచ్ఛిన్నకర శక్తుల కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా పాలకవర్గాలు కొనసాగించిన ప్రతిఘాతుక నిర్బంధకాండ వల్ల ఉద్యమం తీవ్ర నష్టాలు పొందింది. నిజమైన విప్లవకారులు నక్సల్బరీ నుంచి విలువైన గుణపాఠాలు తీసుకొని విప్లవ విజయానికి అవశ్యకమైన అద్భుత ఆయుధాలు పార్టీ, సైన్యం, ఐక్య సంఘటనలను పెంపొందించడం కోసం ధృఢ సంకల్పంతో, త్యాగనిరతితో కృషి చేశారు. ఫలితంగా 1980 నుంచి సిపిఐ–ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌), సిపిఐ–ఎంల్‌ (పియు), ఎంసిసి పార్టీల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో విప్లవ వెల్లువ తిరిగి మొదలైంది. 2000 నాటికి అలలు అలలుగా 16–17 రాష్ట్రాలకు విప్లవోద్యమం విస్తరించింది. గెరిల్లా యుద్ధ అభివృద్ధికి 2000 డిసెంబర్‌ 2న పార్టీ నాయకత్వాన ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పిఎల్‌జిఏ) ఏర్పడింది. 2004 సెప్టెంబర్‌ 21న రెండు ప్రధాన విప్లవ స్రవంతులు ఐక్యమై భారత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించి ఏకైక బలమైన కేంద్రంగా సిపిఐ (మావోయిస్టు) పార్టీ ఆవిర్భవించింది. 2014 మే1న సిపిఐ (ఎంఎల్‌) (నక్సల్బరీ) ఈ నూతన పార్టీలో కలిసింది. నూతన పార్టీ నేతృత్వంలో గెరిల్లా యుద్ధం ఉన్నత స్థాయికి అభివృద్ధి అయింది.

వ్యూహాత్మక ప్రాంతాల్లో గ్రామ ఏరియా, జిల్లా స్థాయి, విప్లవ ప్రజారాజ్యాధికార అంగాలు, గెరిల్లా బేస్‌లు అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో విప్లవోద్యమంపై పాలకవర్గాలు అనేక రకాల దాడులు కొనసాగిస్తూ నేడు ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో అతి పెద్ద సాయుధ దాడిని, హింసాకాండను కొనసాగిస్తున్నాయి. రాజ్యం చేస్తున్న హంతక దాడిని ప్రజలు, ప్రజాయుద్ధం వివిధ సందర్భాల్లో తిప్పికొడుతూ పురోగమిస్తూనే ఉంది.

నక్సల్బరీ విప్లవవెల్లువ గడిచిన అయిదు దశాబ్దాలలో భారత విప్లవోద్యమంలో సిపిఐ (మావోయిస్టు) నాయకత్వంలో ఎన్నో గొప్ప విజయాలు, విలువైన అనుభవాలు సాధించింది. అయితే తెలంగాణలో ఆనాడు పోరాడి సాధించుకొన్న భూములను, భూస్వాములు, గ్రామాల్లో పెత్తందార్లు కబ్జాలకు తెగబడుతున్నారు. తెలంగాణసహా దేశవ్యాప్తంగా సహజ వనరులన్నీ సామ్రాజ్యవాదులకు కారుచౌకగా అప్పగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో రోజురోజుకు సంక్షోభం పెరిగిపోతోంది. రైతాంగం ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఓపెన్‌ కాస్టులు, వివిధ రకాల గనులు, భారీ ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్లాంట్లు, టైగర్‌ ప్రాజెక్టులు మొదలైన వాటి మూలంగా నిర్వాసిత సమస్య పెరిగిపోతుంది. ఏ అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు నక్సల్బరీ విప్లవ వెల్లువకు దారి తీసాయో అవి నేడు మరింత తీవ్రమయ్యాయి. నక్సల్బరీ రాజకీయ పంథా అయిన వ్యవసాయ విప్లవాన్ని దీర్ఘకాల సాయుధ పోరాట మార్గం ద్వారా విజయవంతం చేయడమే సరైన మార్గం. సమాజంలోని పేద రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, విద్యార్థి యువజనులు, మైనారిటీలు దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో సంఘటితమై పోరాడాలి. 21వ శతాబ్దం సామ్రాజ్యవాదం నాశనమై, విప్లవాలు జయించే యుగం! నక్సల్బరీ చూపిన మార్గంలో పయనిద్దాం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం!

జగన్‌
తెలంగాణ రాష్ట్ర కమిటీ, మావోయిస్ట్ పార్టీ, అధికార ప్రతినిధి

(ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడినది)
http://www.andhrajyothy.com/artical?SID=415073

Keywords : jagan, maoists, naxalbari, 50 years, india
(2024-03-19 19:40:12)



No. of visitors : 1455

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నేటి