ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్


ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్

ఎన్కౌంటర్లు,

అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి ఉత్తర ఒడ్డున మార్చి 30వ తేదీన ʹడెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ʹకు చెందిన ఇద్దరు తిరుగుబాటుదారులు డేవిడ్‌ ఇస్లారీ, లూకాస్‌ నర్జరీలను ఓ సంయుక్త భద్రతాదళం మట్టుబెట్టింది. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, సశస్త్ర సీమాబల్, అస్సాం పోలీసులకు చెందిన సంయుక్త దళం ఎంతో కష్టపడి ఈ ఇద్దరు తిరుగుబాటుదారులను మట్టుబెట్టినట్లు ఫొటోల సాక్షిగా మీడియాను, ప్రభుత్వ విభాగాలను నమ్మించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీపీ) రజనీష్‌ రాయ్‌ అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని తేల్చారు.

బ్రహ్మపుత్ర నది సాక్షిగా భూటాన్, బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్న అస్సాం అటవీ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని రజనీష్‌ రాయ్‌ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఎన్‌కౌంటర్లను మూడు రకాలుగా విశ్లేషించారు. తిరుగుబాటుదారులు లేదా మిలిటెంట్లు, భద్రతా బలగాలు పరస్పరం ఎదురైనప్పుడు కాల్పులు జరుపుకోవడం అసలైన ఎన్‌కౌంటర్‌ అని, లొంగిపోయిన మిలిటెంట్లను పట్టుకెళ్లి చంపేయడం రెండో రకమని, నేరస్థులను, చిల్లర దొంగలను, ఈ నేరం చేయని అమాయకులను పట్టుకెళ్లి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం మూడో రకం అని ఆయన వివరించారు.

దేశంలో ఎక్కువ సార్లు, ముఖ్యంగా అస్సాంలో రెండోరకం, మూడో రకం ఎన్‌కౌంటర్లే జరుగుతుంటాయని రాయ్‌ తన నివేదికలో పేర్కొన్నారు. రెండోరకాన్ని నకిలీ అని, మూడోరకాన్ని బూటకపు ఎన్‌కౌంటర్లు అని అనవచ్చని చెప్పారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఎక్కువైనప్పుడు ఈ రెండు రకాల ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్లకు భద్రతా బలగాలు నకిలీ నెంబర్‌ ప్లేట్లు గల వాహనాలను, ముఖ్యంగా మారుతీ వ్యాన్లను ఉపయోగిస్తాయని చెప్పారు. బాధితులను ఓ వాహనం నుంచి మరో వాహనంలోకి తరలించేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే స్లైడింగ్‌ తలుపులు ఉండే మారుతీ వ్యాన్లను ఉపయోగిస్తాయని అన్నారు.

ఈ నకిలీ, బూటకపు ఎన్‌కౌంటర్ల కోసం ఆయుధాలు సరఫరా చేసే ముఠాలు కూడా అస్సాంలో ఎక్కువగానే ఉన్నాయని, వారికి డబ్బులిస్తే వారు ఆయుధాలు సరఫరా చేస్తారని చెప్పారు. నిజమైన ఎన్‌కౌంటర్‌ అని నమ్మించడం కోసం అడ్డదిడ్డంగా పడేసిన మృతదేహాల భంగిమను బట్టి ఆయుధాలను అమర్చుతారని అన్నారు. అన్నింటికన్నా బాధాకరమైన ది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, మిలిటెంట్ల హెడ్‌కౌంటే కావాల్సి వచ్చినప్పుడు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు భూటాన్‌ నుంచో, బంగ్లాదేశ్‌ నుంచో పొరపాటున సరిహద్దులు దాటి వచ్చిన అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి గల్లంతయిన ఫిర్యాదులు వస్తాయా లేదా అన్న తేల్చుకోవడం కోసమే ఈ నిర్బంధమని ఆయన చెప్పారు. వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్‌కౌంటర్‌ త్వరగా పూర్తవుతుందని అన్నారు.
ఈ ఎన్‌కౌంటర్లకు సంబంధించి సైనిక, పారా మిలటరీ దళాలకు, స్థానిక పోలీసులకు మధ్య మంచి సహకారం ఉంటుందని, ఎన్‌కౌంటర్‌ క్రెడిట్‌ రెండు విభాగాలకు దక్కడమే కాకుండా ఆర్థికపరమైన, సర్వీసు పరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయని రాయ్‌ తెలిపారు. ప్రశంసాపత్రాలు, మెడళ్లతో పాటు ఇంక్రిమెంట్లు, రిస్క్‌ అలవెన్సులు లభిస్తాయని చెప్పారు. ఎక్కువ ఎన్‌కౌంటర్లు చేసిన వారిని ఎన్‌కౌంటర్లు అవసరమైన చోటుకు పంపించడం కూడా ఓ ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతోపాటు స్వీయ ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండటంతో నకిలీ, బూటకపు ఎన్‌కౌంటర్ల వైపు భద్రతా బలగాలు మొగ్గు చూపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌కౌంటర్లే కాకుండా మీడియా సమక్షంలో పోలీసుల ముందు ఆయుధాలను అప్పగించి మిలిటెంట్లు లేదా తిరుగుబాటుదారులు లొంగిపోయినట్లు చూపించడంలో కూడా చాలావరకు బూటకమేనని రాయ్‌ తెలిపారు. సాధారణంగా చిల్లర దొంగలను, అమాయకులను డబ్బులు ఎరవేసి ఈ బూటకపు లొంగుబాటును సృష్టిస్తారని చెప్పారు. లొంగిపోయిన వారు ఓ మూడు నెలలపాటు జైల్లో ఉండాల్సి వస్తోందని, అప్పుడు వారి కుటుంబాలను పోషించాల్సిన బాధ్యతను భద్రతా దళాలే తీసుకుంటాయని అన్నారు. వారు లొంగుబాటు సందర్భంగా అప్పగించే ఆయుధాలు కూడా అక్రమ ఆయుధాల సరఫరాల ముఠాలు అందించేవేనంటూ రాయ్‌ బాంబు పేల్చారు.

(గమనిక: ఎన్‌కంటర్లపై అస్సాం ప్రధాన కార్యదర్శి పైపర్‌సైనా, సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సుదీప్‌ లక్టాకియాలకు రజనీష్‌ రాయ్‌ అందజేసిన నివేదికలోని అంశాలివి)

Keywords : assam,fake encounters, IGP Rajanish roy, assam encounters
(2019-07-15 11:51:26)No. of visitors : 1232

Suggested Posts


0 results

Search Engine

ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ
TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం
తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
more..


ఎన్కౌంటర్లు,