పాలకుల క్రూరత్వం: గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులపై కాల్పులు,ఐదుగురు మృతి !


పాలకుల క్రూరత్వం: గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులపై కాల్పులు,ఐదుగురు మృతి !

తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, రుణాలు మాఫీ చేయాలని రోడ్డెక్కిన రైతులపై మధ్యప్రదేశ్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు. అయితే పోలీసులు కాల్పులు జరపలేదని నిరసనకారులే కాల్పులు జరిపారని అందువల్లే రైతులు మరణించారనే బరితెగింపు వాదనకు దిగారు పోలీసు అధికారులు. పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని హోం మంత్రి కూడా పోలీసుల వాదనలకు వంత పాడారు.

పంటలకు గిట్టుబాటు ధరలు లేక , చేసిన రుణాలు కట్టుకోలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ʹరాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్ʹ అనే సంస్థ ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు మాందసోర్లో గత ఆరు రోజులుగా రైతులు ఆందోళన దీక్షలు చేపట్టారు. మంగళవారంనాడు వేలాది రైతులు, మహిళలు రోడ్లమీదకు వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ʹʹఈ ప్రదర్శన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వ కూడదని కంకణం కట్టుకున్న ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఆ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఈ నిరసన ప్రదర్శనపై ముందుగా లాఠీ చార్జ్ నిర్వహించిన పోలీసులు హఠాత్తుగా కాల్పులకు తెగించారుʹ అని రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్ అధ్యక్షుడు శివకుమార్ శర్మ‌ ఆరోపించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు రైతులు అక్కడికక్కడే మరణించారు వందలాది మంది రైతులు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో వైపు ముందుగా రైతుల ఆందోళనలకు మద్దతునిచ్చిన‌ ఆరెస్సెస్ అనుబంద ʹభారతీయ కిసాన్ సంఘ్ʹ ప్రభుత్వం ఆదేశాలకు అణుగుణంగా రైతులలో చీలిక తేవడానికి ప్రయత్నించిందని, మధ్యలోనే ఆందోళనలు విరమించినట్టు ప్రకటించి తమకు ద్రోహం చేసిందని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. దాంతో ఇప్పటి వరకు బీకేఎస్ తో ఉన్న రైతులు కూడా రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్ నాయకత్వంలో ఆందోళనలు కొనసాగించారు. దీంతో రైతుల ఆందోళనలను అణిచివేయడానికి ప్రభుత్వానికి ఆరెస్సెస్ కూడా అండగా నిలిచి ఈ కాల్పులకు ప్రోత్సహించిందని రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్ ఆరోపి‍ంచింది

ఇదిలా ఉండగా రైతులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు. పోలీసుల దుర్మార్గానికి నిరసనగా రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

మరో వైపు సోషల్ మీడియా ద్వారా ఈ వార్తలు ప్రచారంలోకి రాకుండా ప్రభుత్వం మాందసోర్‌, రత్లాం, ఉజ్జెయిన్‌ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసింది. అయితే హోంమంత్రి మాత్రం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయలేదని చెప్పారు.

Keywords : farmers, madhya pradesh, dead, remunerative prices, loan waiver, police, firing
(2020-01-16 06:25:08)No. of visitors : 1124

Suggested Posts


బంద్ సక్సెస్... కలెక్టర్ ను తరిమికొట్టిన రైతులు... పోలీసు వాహనాలు దగ్దం

మధ్యప్రదేశ్ లో పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతుల మృతిని నిరసిస్తూ ఇవ్వాళ్ళ చేపట్టిన మాందా సౌర్ జిల్లా బంద్ విజయవంతమైంది. బంద్ జరగకుండా వేలాది పోలీసు బలగాలు మోహరించినప్పటికీ ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ఎంపీలో రైతులపై కొనసాగుతున్నఅణిచివేత... మేధాపాట్కర్, అగ్నివేశ్, యోగేంద్ర యాదవ్ అరెస్టు

మ‌ధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులపై యుద్దంప్రకటించింది. తమ సమస్యల పరిష్కారంకోసం ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపి ఐదుగురు రైతులను బలితీసుకున్న ప్రభుత్వం కసి ఇంకా తీరలేదు. మాందసౌర్ ప్రాంతంలో రైతులపై...

Search Engine

నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
more..


పాలకుల