బీజేపీలో బీఫ్ చిచ్చు... మేఘాలయ నేతల తిరుగుబాటు !


బీజేపీలో బీఫ్ చిచ్చు... మేఘాలయ నేతల తిరుగుబాటు !

బీజేపీలో

మోడీ అధికారంలోకి వచ్చాక ఆవు రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మతోన్మాద శక్తులు ఆవు పేరుతో మనుషులను బలి తీసుకుంటున్నాయి. దళితులపై, ముస్లింలపై అరాచక ముఠాల దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ అరాచకులకు చట్టాన్ని అండగా నిలబెట్టింది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తంఅవుతున్నాయి. చివరకు బీఫ్ విషయంలో వారి పార్టీలోనే తిరుగుబాటు మొదలయ్యింది. బీజేపీ ప్రభుత్వ బీఫ్ నిషేధ నిర్ణయాన్ని నిరసిస్తూ మేఘాలయలో ఇటీవల ఆ పార్టీ నేత బెర్నార్డ్‌ మారక్‌ పార్టీని వీడగా.. తాజాగా మరో షాకిస్తూ మరో కీలకనేత, నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్యక్షుడు బాచు మారక్ బీజేపీకి రాజీనామా చేశారు. అంత‌టితో ఆగకుండా.. ఈ నెల 10న బెర్నార్డ్ మారక్ ఇచ్చే బీఫ్ పార్టీలో పాల్గొని తన నిరసన తెలియజేయనున్నట్లు ప్రకటించారు.

దేశ వ్యాప్తంగా బీఫ్‌ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ తీవ్ర నిర్ణయాలతో ముందుకెళ్తుండగా మేఘాలయాలో మాత్రం సొంత పార్టీ నేతలే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. గోమాసం(బీఫ్) పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత ఇటీవల బెర్నార్డ్‌ మారక్‌ పార్టీని వీడగా.. తాజాగా మరో షాకిస్తూ మరో కీలకనేత బాచు మారక్ బీజేపీకి రాజీనామా చేశారు. అంటితో ఆగకుండా.. ఈ నెల 10న బెర్నార్డ్ మారక్ ఇచ్చే బీఫ్ పార్టీలో పాల్గొని తన నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు. నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్యక్ష పదవిలో బాచు మారక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ʹమా పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలను బీజేపీ పట్టించుకోవడం లేదు. మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బీఫ్ (నకమ్ బిట్చి) మా సంప్రదాయ ఆహారమనిʹ బాచు మారక్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ʹబీర్ అండ్ బీఫ్ʹ పార్టీ చేసుకోవాలని పిలుపునిస్తూ ఆయన ఫేస్ బుక్ లో ఇటీవల చేసిన పోస్టుపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పార్టీ అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది.

మరో వైపు కేరళ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లలో బీఫ్ నిషేధంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. పోలీసు నిర్భందాలను దిక్కరిస్తూ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు

Keywords : meghalaya, BJP Leader, Bachu Marak, Resigns, Over Cattle Slaughter Ban
(2018-05-20 03:47:03)



No. of visitors : 434

Suggested Posts


0 results

Search Engine

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !
వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు
బాలికలపై జవాన్ల లైంగిక వేధింపులు - కేసు నమోదు చేసిన పోలీసులు
రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత
కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం
కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !
RDF Kerala Speaking Against Operation Green Hunt and Gadricholi Massacre
Long live Ibrahim Kaypakkaya in the 45th anniversary of his assasination!
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (రెండవ భాగం) - ఎ.నర్సింహరెడ్డి
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (మొదటి భాగం) - ఎ.నర్సింహరెడ్డి
తెలంగాణపై కాగ్ నివేదిక‌
కొంచెం ఆలోచించి మాట్లాడుదాం - ఎ.సునిత‌, తేజ‌స్విని మాడ‌భూషి
వ‌న‌రుల దోపిడీ కోస‌మే గ‌డ్చిరోలి హ‌త్యాకాండ - మావోయిస్టు అధికార ప్ర‌తినిధి శ్రీనివాస్‌
మ‌తం మీద విమ‌ర్శ రాజ‌కీయాల మీద విమ‌ర్శే - మార్క్స్‌
ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా రేపు అమరుల సభ జరిపి తీరుతాం
మార్క్స్ నుంచి నేర్చుకుందాం - సి. కాశీం
గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్
పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట
Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report
దళితుడు ప్రేమించడం నేరమా? కూతురు ప్రేమించిన‌ దళిత యువకుణ్ణి కాల్చి చంపిన తండ్రి !
రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు
అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌
more..


బీజేపీలో