బ్లాక్ మెయిల్ రాజకీయాలు : రైతులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధీక్ష‌


బ్లాక్ మెయిల్ రాజకీయాలు : రైతులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధీక్ష‌

బ్లాక్

మధ్యప్రదేశ్ లో రైతుల న్యాయమైన డిమాండ్ లను పట్టించుకోకుండా... ఆందోళనలు చేస్తున్న రైతులను పట్టించుకోకుండా... ఆరెస్సెస్ అనుబంద సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా రైతుల్లో చీలికకు ప్రయత్నించి... రైతులను మభ్యపెట్టడం సాధ్యం కాకపోవడంతో వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టన పెట్టుకొని... అయినా రైతుల ఆందోళనలు ఆగకపోవడంతో ఇప్పుడు బ్లాక్మెయిల్ కు సిద్దపడ్డారు.

రైతులకు వ్యతిరేకంగా ఏకంగా ముఖ్యమంత్రే నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించారు.మంద్‌సౌర్‌ లో రైతుల ఆందోళనలు ఆగకపోవడంతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకు ( రైతులు లొంగిపోయే వరకు) తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. తమ డిమాండ్ల గురించి తనతో చర్చించాలని ప్రజలను ఆహ్వానించారు. ʹప్రతి ఒక్కరు వచ్చి వారి సమస్యల గురించి నాతో చర్చించాలని కోరుతున్నాను. నేను నిరాహారదీక్ష చేపడతాను. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానʹని చౌహాన్‌ చెప్పారు.

మంద్‌సౌర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా సీఎం చౌహాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు.
అయితే ముఖ్యమంత్రి నిర్ణయం తమను బ్లాక్ మెయిల్ చేయడమేనని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ నేతలు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకపోగా తమకు వ్యతిరేకంగా ధీక్షలు చేయడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా ప్రతీఘాతక ఉద్యమాలు చేయడం పాలకులకు కొత్తేమీ కాదు. వాటిని ఓడించడం ప్రజలకూ కొత్తకాదు. రీసెంట్ ఉదహరణ ధర్నా చౌక్ గుర్తుంది కదా !

Keywords : madhya pradesh, Shivraj Singh Chouhan Fast, farmers, Mandsaur
(2017-12-14 04:55:53)No. of visitors : 401

Suggested Posts


0 results

Search Engine

Maoists demand release of Padmavati to uphold ʹfreedom of expressionʹ
పద్మావతి సినిమాకు మావోయిస్టు పార్టీ మద్దతు
పురుషస్వామ్యం...కూతురుపై దుర్మార్గంగా దాడి చేసి గుండు గీసిన తండ్రి !
బీజేపీవి సిగ్గులేని రాజకీయాలు - హిందుత్వ , జాతీయత ఒక్కటేనన్న మాటల‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం!
ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరిద్దాం - విప్లవ రచయితల సంఘం
గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు
అధికారవ్యామోహం, అవకాశవాదమే తెలంగాణ పునరేకీకరణా - సతీష్
పెరిగిపోతున్న ఫాసిస్టు సాంస్కృతిక ఉన్మాదం - అరణ్య
Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod
దేశద్రోహుల గొప్పతనాన్ని పొగిడే దేశʹభక్తులʹ సినిమా - అరుణాంక్ లత‌
పీఎల్జీఏ వారోత్సవాలు.... పదిహేడేండ్ల నెత్తుటి జ్ఝాపకం..
ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల
ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్
After JNU,HCU & DU, ABVP Loses Gujarat Central University Polls
మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
more..


బ్లాక్