ఎంపీలో రైతులపై కొనసాగుతున్నఅణిచివేత... మేధాపాట్కర్, అగ్నివేశ్, యోగేంద్ర యాదవ్ అరెస్టు

ఎంపీలో

మ‌ధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులపై యుద్దంప్రకటించింది. తమ సమస్యల పరిష్కారంకోసం ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపి ఐదుగురు రైతులను బలితీసుకున్న ప్రభుత్వం కసి ఇంకా తీరలేదు. మాందసౌర్ ప్రాంతంలో రైతులపై అణిచివేత కోనసాగుతూనే ఉంది. ఒక వైపు రైతులకు వ్యతిరేకంగా ధీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి మరో వైపు రైతులు ఎదురు మాట్లాడకుండా పోలీసులను ప్రయోగిస్తున్నాడు. కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ ఇప్పటికీ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ వార్తలు అందరికీ తెలియజుండా ఇంటర్ నెట్ బంద్ కొనసాగుతోంది. చనిపోయిన రైతు కుటుంభాలను, గాయాలపాలైన వారిని పరమార్శించేందుకు వచ్చిన జాతీయ నాయకులను, ప్రజా సంఘాలవారిని అడ్డుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. మొన్న కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అడ్డుకున్న పోలీసులు ఈ రోజు సామాజిక కార్యకర్తలు మేథాపాట్కర్‌, స్వామి అగ్నివేశ్‌‌, స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ తదితరులను రైతుల దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకొని అరెస్టు చేశారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేసినందున ఇపుడిపుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, ఇపుడు వీరి పర్యటన వల్ల శాంతికి విఘాతం కలిగే ప్రమాదముందని పోలీసులు పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదని వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాహౌ-నీముచ్‌ జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. వీరితో పాటు మరో 30మందిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు

Keywords : medhapatkar, agnivesh, yogendra yadav, madhya pradesh, police
(2024-03-29 20:43:14)



No. of visitors : 1409

Suggested Posts


పాలకుల క్రూరత్వం: గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులపై కాల్పులు,ఐదుగురు మృతి !

తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, రుణాలు మాఫీ చేయాలని రోడ్డెక్కిన రైతులపై మధ్యప్రదేశ్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు. అయితే పోలీసులు కాల్పులు జరపలేదని నిరసనకారులే కాల్పులు జరిపారని అందువల్లే రైతులు మరణించారనే బరితెగింపు...

బంద్ సక్సెస్... కలెక్టర్ ను తరిమికొట్టిన రైతులు... పోలీసు వాహనాలు దగ్దం

మధ్యప్రదేశ్ లో పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతుల మృతిని నిరసిస్తూ ఇవ్వాళ్ళ చేపట్టిన మాందా సౌర్ జిల్లా బంద్ విజయవంతమైంది. బంద్ జరగకుండా వేలాది పోలీసు బలగాలు మోహరించినప్పటికీ ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఎంపీలో