జాతీయోన్మాదంతో పేట్రేగుతున్నారు - ప్రధానికి మాజీ అధికారుల బహిరంగ లేఖ


జాతీయోన్మాదంతో పేట్రేగుతున్నారు - ప్రధానికి మాజీ అధికారుల బహిరంగ లేఖ

జాతీయోన్మాదంతో

దేశంలో జాతీయవాదం పేరిట సాగుతున్న అరాచకాలు,పెరుగుతున్న విశృంఖల ధోరణిపై మాజీ ప్రభుత్వ అధికా రులు గళం విప్పారు.జాతీయోన్మాదంతో కొందరు చెలరేగిపోతున్నారని సమాజానికి ఇది మంచిదికాదని హితవు పలికారు.తమ ఆధి పత్య ధోరణితో విభేదించే వారిని ముఖ్యంగా జర్నలిస్టులు,రచయితలు, మేథా వులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు, దాడులకు పాల్పడే అనాగరిక ధోరణి ప్రబలుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చోటుచేసు కుంటున్న పరిణామాలపై ఆవేదనతో 65 మంది మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా మత అసహనం పెరుగుతున్న వాతావరణం నెలకొన్నదని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.యూపీ ఎన్నికలకు ముందు, అనం తరం చేసిన ప్రకట నలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. సమాజంలో ఎదురవుతున్న అనుభవాల ఆధారంగా ఈ లేఖ రాసినట్టు దీనిపై సంతకం చేసిన మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌ వజహత్‌ హబిబుల్లా చెప్పారు.మాజీ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులంతా నిత్యం సంప్రదింపుల్లో ఉన్నామని,ఈ క్రమంలో జాతీయోన్మాదంతో కొందరు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కరమనే అభిప్రాయం తమ చర్చల్లో వ్యక్తమ య్యేదని,ప్రస్తుతం ఈ ధోరణి ప్రమాదకర రీతిలో పెచ్చుమీరిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. జాతీయోన్మాదంతో రగిలిపోయేవారు వారికి అనుకూలంగా లేని వారిని వ్యతి రేకులుగా భావిస్తున్నారని చెప్పారు. తమతో ఏకీభవించనివారిపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని, కులమత వైషమ్యాలు ప్రబలిపోయాయని హబిబుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ముప్పును ఎదుర్కొనే శక్తి దేశానికి ఉందని,అయితే కొందరి ఆగడాలతో
జాతీయోన్మాదంతో పేట్రేగుతున్నారు దేశం తనదైన సహనశీల ఉనికిని కోల్పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలో పెరుగుతున్న ఆధిపత్య ధోరణి,ఏకపక్ష వైఖరులతో చర్చ, అసమ్మతులకు చోటు లేకుండా పోయిందని అన్నారు.ʹఎవరైనా ప్రభుత్వంతో విభేదిస్తే వారిపై దేశ వ్యతిరేకులనే ముద్ర వేస్తున్నారు..ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించరాదని విస్పష్ట సంకేతాలు పంపుతున్నాʹరని అన్నారు.ఉన్నతాధికారులు, రాజ్యాంగ సంస్థలు ఈ పరిస్థితి చక్కదిద్దాలని మాజీ బ్యూరోక్రాట్లు కోరారు.ప్రధానికి రాసిన లేఖపై సంతకాలు చేసిన ప్రముఖుల్లో ప్రసార భారతి మాజీ సీఈఓ జవహర్‌ సిర్కార్‌, ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ, ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ జులియో రిబెరో,దేశంలో తొలి ఐఏఎస్‌ అధికారుల్లో ఒకరైన 91 ఏండ్ల హర్‌ మందర్‌ సింగ్‌ తదితరులున్నారు.
(నవతెలంగాణ పత్రిక నుండి)

Keywords : narendra modi, bureaucrats, hindutva, nationalism
(2017-12-13 11:51:11)No. of visitors : 496

Suggested Posts


ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రి

ʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని.....

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

ఆ చిన్నారి గాయాల వల్లే మరణించింది - కేంధ్రానికి షాకిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్

ఢిల్లీలో షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి తీవ్ర గాయాలవల్లనే చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టం చేసింది. చిన్నారి మరణం ఇళ్ల కూల్చివేత కంటే ముందే జరిగిందని పార్లమెంటులో.....

ఈ దేశం మతోన్మాదులదేనా ? మనుషులకు బతికే హక్కులేదా?

గుర్‌మెహర్ పై కాశాయ కసాయి మూకలు నీచమైన దాడి చేస్తున్నాయి రేప్ చేస్తామంటూ బెధిరించారు..అయినా సరే తన నిరసనను కొనసాగిస్తానని ప్రకటించిన‌ గుర్‌మెహర్ కౌర్ చివరకు కేంధ్రమంత్రులు కూడా ఏబీవీకి మద్దతుగా ఆ అమ్మాయిపై దాడికి దిగడంతో .తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు...

22 కోట్ల రూపాయలతో ATM వ్యాన్ డ్రైవర్ పరార్ !

వాహనంలో ఏటీఎం కేంద్రానికి తరలిస్తోన్న కోట్లాది రూపాయలతో డ్రైవర్ పరారయ్యాడు. గురువారం నాడు ఢిల్లీలో ఆక్సిస్ బ్యాంక్ ఏటీఎమ్ కేంధ్రానికి తరలిస్తున్ 22 కోట్ల 50 లక్షల రూపాయలను కాజేసి వాహన డ్రైవర్....

ʹప్రేమను పంచే తండ్రిని ఇవ్వలేను.. కాని సోదరుడిని ఇవ్వగలనుʹ

కాశాయ కసాయి మూకల ముప్పేట దాదిని ఎదుర్కొంటున్న లేడీ శ్రీరాం కాలేజ్ విద్యార్థిని , కార్గిల్ యుద్దంలో అమరుడైన జవాను కూతురు గుర్‌మెహర్‌కౌర్ కు ప్రజలు, ప్రజాస్వామికవాదులనుండి మద్దతు...

పోరాటాన్ని కొనసాగిద్దాం ‍- జైలు నుండి మారుతీ కార్మికుల బహిరంగ లేఖ‌ !

ప్రియమైన కార్మిక సోదరులారా! మీ అందరికీ తెలుసు మేము గత నాలుగున్నరేళ్లుగా జైలులో మగ్గిపోతున్నాము. మార్చి 10వ తేదీన మాకు తప్పకుండా న్యాయం జరుతుందని చాలా నమ్మకం ఉండేది. ఆ రోజు తర్వాత మేమందరం జైలు నుంచి బయటకు వచ్చి ...

Statement in Solidarity with Delhi University Teachers Strike-DSU

Adversely affecting the already poor teacher-student ratio, this undemocratic notification means that there would be a 50%increase in workload for a single teacher and drastic reduction in the time required for preparation and individual assessment of students through the form of tutorials or practicals.....

Search Engine

Maoists demand release of Padmavati to uphold ʹfreedom of expressionʹ
పద్మావతి సినిమాకు మావోయిస్టు పార్టీ మద్దతు
పురుషస్వామ్యం...కూతురుపై దుర్మార్గంగా దాడి చేసి గుండు గీసిన తండ్రి !
బీజేపీవి సిగ్గులేని రాజకీయాలు - హిందుత్వ , జాతీయత ఒక్కటేనన్న మాటల‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం!
ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరిద్దాం - విప్లవ రచయితల సంఘం
గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు
అధికారవ్యామోహం, అవకాశవాదమే తెలంగాణ పునరేకీకరణా - సతీష్
పెరిగిపోతున్న ఫాసిస్టు సాంస్కృతిక ఉన్మాదం - అరణ్య
Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod
దేశద్రోహుల గొప్పతనాన్ని పొగిడే దేశʹభక్తులʹ సినిమా - అరుణాంక్ లత‌
పీఎల్జీఏ వారోత్సవాలు.... పదిహేడేండ్ల నెత్తుటి జ్ఝాపకం..
ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల
ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్
After JNU,HCU & DU, ABVP Loses Gujarat Central University Polls
మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
more..


జాతీయోన్మాదంతో