ఎమ్మెల్యే కుమారుడి దుర్మార్గం...ఇద్దరు దళిత బాలలను చంపేసి పాతి పెట్టాడు


ఎమ్మెల్యే కుమారుడి దుర్మార్గం...ఇద్దరు దళిత బాలలను చంపేసి పాతి పెట్టాడు

ఎమ్మెల్యే

అసలే ఎమ్మెల్యే కొడుకు, అందులోనూ అధికార‌ పార్టీ .... డబ్బు, అధికారం తెచ్చిన మధంతో దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఇసుకలో పాతిపెట్టాడు. ఆ దుర్మార్గుడి ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా దళితుల పోరాటాన్ని అణచడానికి ఆ బీజేపీ నేత ఇద్దరు దళిత పిల్లలను హత్య చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా ఘంఘారా నదిలో నుంచి కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమరవాణా జరుగుతున్నదని, ఇది చేస్తున్నది స్థానిక(పయాగ్‌పూర్‌) బీజేపీ ఎమ్మెల్యే సుభాష్‌ త్రిపాఠినే అనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడైన మనోజ్‌ శుక్లా పేరు మీద మైనింగ్‌ లైసెన్స్‌ తీసుకుని, అనుమతించినదానికంటే పదింతలు ఎక్కువ ఇసుకను రవాణా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పంటపొలాలు బీడుపడ్డాయి. స్థానిక రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో భౌరీ అనే గ్రామానికి చెందిన‌ ఛేత్రామ్‌(చనిపోయిన బాలుర తండ్రి), ఇంకొందరు గ్రామస్తులు ఇసుక మాఫియాపై ప్రత్యక్ష పోరుకు దిగారు. పలుమార్లు లారీలను ఆపేసే ప్రయత్నం చేశారు. దాంతో ఇసుక మాఫియాకు నాయకుడైన‌ ఎమ్మెల్యే కొడుకు నిషాంక్‌ త్రిపాఠికి కోపమొచ్చింది. తమను గతంలో కూడా ఆయన చాలా సార్లు బెధిరించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

బుధవారంనుండి ఛేత్రామ్ కుమారులిద్దరు కరణ్, నిస్సార్ కనిపించకుండా పోయారు. రోజంతా వెతికినా పిల్లలు కనిపించకపోవడంతో తండ్రి చేత్రామ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గురువారం నాటికి గాలింపు చర్యను ముమ్మరం చేయగా.. గ్రామాన్ని ఆనుకునే ప్రవహించే ఘంఘారా నది వద్ద నిసార్‌ మృతదేహం కనిపించింది. దానికి కొద్ది దూరంలోనే కరణ్‌ను ఇసుకలో పాతిపెట్టినట్లు గుర్తించారు. శవాలు దొరికిన ప్రాంతంలోనే ఇసుక మాఫియా ర్యాంప్‌ ఉంది. దీంతో ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే కొడుకు పనే అయిఉంటుందని గ్రామస్తులు ఆగ్రహించారు. అక్కడి ప్రొక్లెయినర్లు, లారీలను తగులబెట్టారు.

మరో వైపు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు నిషాంక్‌ త్రిపాఠి, అతని అనుచరుడు ఇసుక కాంట్రాక్టర్ మనోజ్‌ శుక్లా లపై హత్య కేసు నమోదు చేశారు. ఐతే ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్టు చేయలేదు

Keywords : UP, bjp, mla, dalit, bjp mla subhash tripathi, uttar pradesh, bahraich, bhauri,
(2020-01-17 20:42:01)No. of visitors : 1344

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

నా కొడుకు ఏ తప్పూ చేయలేదు.. పేదల కోసం, తెలంగాణ కోసం కొట్లాడిండు : కాశీం తల్లి వీరమ్మ‌
నిరసన తెలుపుతున్న మహిళల ఆహారం, దుప్పట్లు ఎత్తుకొని పారిపోయిన పోలీసులు
Condemning arbitrary arrest of Prof. C. Kaseem
జ్యుడీషియల్ రిమాండుకు ప్రొఫెసర్ కాసీం.. చీఫ్ జస్టీస్ ఇంట్లో ముగిసిన విచారణ
తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!
ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
more..


ఎమ్మెల్యే