ʹరుణమాఫీ చేసే వరకు నా అంత్యక్రియలు జరపొద్దుʹ

ʹరుణమాఫీ

(సామాజిక విశ్లేషకులు షేక్ కరీముల్లా రాసిన ఈ వ్యాసం జూలై 2017 వీక్షణం సంచికలో ప్రచుర్ంచబడినది)

ʹధనాజీ చంద్రకాంత్ జాదవ్ అను నేను రైతును...

ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నా...

సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడకు వచ్చేవరకు...

రుణమాఫీ చేసే వరకు...

దయచేసి నా అంత్యక్రియలు జరపొద్దుʹ.

రుణవిముక్తి కోసం తల్లడిల్లుతున్న అన్నదాతల్లో సహనం చచ్చిపోయింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామంటూ ఓట్లు దండుకున్న బిజెపి ప్రభుత్వాలు రైతులను పచ్చిగా దగా చేశాయి. ఈ నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక మహారాష్ట్ర రైతన్నలు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు. దీంతో ఓ రైతు తన బలిదానంతో సర్కారులో చలనం తీసుకు రావాలను కున్నాడు. తన పొలంలోనే ఉరివేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాదం మహారాష్ట్ర రైతులను కలచివేసింది. ప్రభుత్వాన్ని కుదిపేసిన వైనం ఇది. సంఘటన స్థలిలో పడున్న ఓ సూసైడ్ నోట్లో రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేవరకు తన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవద్దని రైతు చంద్రకాంత్ జాదవ్ కోరినాడు. ఇలాంటి కడు విషాదాలు దేశంలో రైతుల ఇంటా ఎన్నో జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో రైతుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్న స్థితిలో కేంద్రంలో మోడీ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మొదట తమిళనాడులో రాజుకున్న నిప్పురవ్వ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో దావానలంలా వ్యాపించింది. రాజస్థాన్ రగులుతుంది. పంజాబ్ రాజుకుంది. యుపిలో యోగికి అల్టీమేటం ఇచ్చారు. మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. మంద్సౌర్లో ఆందోళనలు చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపి ఐదుగురు రైతులను చంపేశారు. అనేక మంది రైతులు తీవ్ర గాయాల పాలయ్యారు. అయినా ఆందోళనలు ఆగలేదు. సరికొత్త ప్రాంతాలకు విస్తరించాయి. అనేక చోట్ల కర్ఫ్యు ధిక్కరించి రాస్తారోకోలు నిర్వహించారు. రైతుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలేమి కాదు. పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధర, రుణమాఫీ చేయాలంటున్నారు. ఇందులో మొదటి డిమాండ్ సార్వత్రిక ఎన్నికలలో (2014) బిజెపి ఇచ్చిన హామీయే. రెండోది యుపి ఎన్నికలలో బిజెపి అక్కడ రైతులకిచ్చిన వాగ్ధానం. ఇంత జరుగుతున్నా మోడీ నోరు తెరవలేరు. ʹరోం నగరం తగలబడుతుంటే రాజు ఫిడేలు వాయించుకున్నాడంటాʹ అన్న చందంగా ఉంది ఈయన వైఖరి.

పాలకులెవరైనా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు. ఆత్మహత్యలతో దేశ రైతాంగం కుంగి, కుమిలి కడుపు మండి సహనం కోల్పోతే మాత్రం లాఠీ ఛార్జీలు, కర్ఫ్యులు, కాల్పులు, కేసులు, అదనపు బలగాలు దిగుతున్నాయి. ఈ బలగాలు, మిలటరీలు ఎందుకున్నాయి? దేశ రక్షణ పేరుతో న్యాయం కోసం పోరాడే ఈ దేశ పౌరులను శాంతి భద్రతల పేరుతో చంపడానికా? రైతాంగ ఆత్మహత్యలు అరికడతామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీలిచ్చి కేంద్రంలోను, రాష్ట్రాల లోను అందలమెక్కిన బిజెపి ప్రభుత్వాలు అధికార మదంతో అన్నదాతల పైనే తుపాకీ ఎక్కుపెట్టడం హేయాతి హేయమైన చర్య. ఒకవైపు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ మరోవైపు రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చిపడేసిన పాలకుల కిరాతకాన్ని ఎంత ఖండించినా తక్కువే. మధ్యప్రదేశ్లో రైతులు చేసిన నేరమేంటి? తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని అడిగారు. బిజెపి ఎన్నికల హామీని నిలబెట్టు కోవాలని మాత్రమే అడిగారు. అదేదో నేరం, ఘోరం అన్నట్లుగా రైతులను కాల్చి చంపడం దుర్మార్గం. ఇలా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి రైతుల పోరాటాలను అణచివేయాలని చూడడం పాలకుల అవివేకం.

దేశంలో రైతాంగ పోరాటాలు చరిత్రకు కొత్తకాదు. బ్రిటిష్ వలస పాలన దోపిడీ విధానాలే ఆనాడు రైతు ఉద్యమాలకు ఊపిరి పోశాయి. 1859-60 మధ్య కాలంలో తలెత్తిన నీలి మందు ఉద్యమం, 1875 - 76లో మహారాష్ట్రలో ʹదక్కన్ తిరుగుబాటుʹ పేరుతో జరిగిన రైతు ఉద్యమం, 1890 - 1900ల మధ్య పంజాబ్లో రైతాంగ తిరుగుబాటు, 1917-18లో బీహార్ రైతుల నీలి మందు తోటల యజమానులకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మకమైన చంపారన్ తిరుగుబాటు. 1920-23లో సాగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పోరాటాల్లో హింస చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో భయం పుట్టి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. 1928-29లో బర్డోలి రైతుల ఉద్యమం కొంత విజయాన్ని సాధించడంతో, పోరాడితే సాధించగలమన్న విశ్వాసాన్ని బర్డోలి రైతులు భారత రైతాంగానికి కలిగించారు. కాంగ్రెస్ మంత్రివర్గ వైఫల్యాల ఫలితంగా బీహార్, యుపిలలో తలెత్తిన ఉద్యమం రుణభారం, శిస్తుల భారం నుంచి విముక్తి పొందడానికి బెంగాల్లో తలెత్తిన ఉద్యమం, కోయల తిరుగుబాటు, మయూర్ భంజ్లోని భిల్లుల తిరుగుబాటులు రైతుల వీరోచిత పోరాటాలకు నిదర్శనం.

1937-46 ప్రాంతాలలో ఫ్యూడల్ భూస్వామ్య దాష్టికానికి వ్యతిరేకంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రైతు విప్లవాలకు దారి తీశాయి. అయితే అప్పటి రైతు ఉద్యమాలను సరైన దిశలో ఉపయోగించుకునేటంతగా అప్పటి రాజకీయ సంస్థలు ఎదగలేదు. ఉన్న జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వారి జేబు సంస్థగా పనిచేస్తుండడంతో ఈ రైతు ఉద్యమాలు తేలి పోయాయి. ముఖ్యంగా 1942లో భారత రైతులు కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమ పిలుపునకు వీరోచితంగా ప్రతిస్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వారు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. బెంగాల్లోని మిడ్నపూర్లో రైతుల తిరుగుబాటు కారణంగా కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు. భారతదేశంలోని రైతు ఉద్యమాలకు చైనాలోని మావో లాగా సరైన నాయకత్వం గనుక లభించి ఉంటే భారతదేశ చరిత్ర మరోలా ఉండేది. ఇప్పుడు రైతులకు కావాల్సింది సరైన దశ దిశ నిర్దేశించే మంచి నాయకత్వం లభిస్తే ఈ దేశం దోపిడీ దారుల నుండి విముక్తి కాగలదు.

నేడు దేశంలో అనేక చోట్ల రైతులు ఆందోళన బాట పడుతున్నారు. అన్నదాతల నిరసనాగ్రహం విస్తరిస్తుంది. బాధ్యత మరచిన పాలకులు అమాయక రైతులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. తుపాకులు ఎక్కుపెట్టి తూటాలు కురిపిస్తున్నారు. రైతు జీవన భద్రత గాలిలో దీపమైంది. ఈ పరిస్థితిలో దేశానికి వెన్నెముక అన్నదాత స్థితి రోజు రోజుకు దిగజారుతుంది. సకాలంలో నిర్ధిష్ట చర్యలతో ఆదుకోలేకపోతే మొత్తం దేశానికే విపత్తు వాటిల్లనుంది. ప్రకృతి ప్రతికూలతలు, నకిలీ విత్తనాలు, వర్షాభావ పరిస్థితి, రుణ భారాలు ఇలాంటి వాటికి తట్టుకొని కొద్దో గొప్పో మిగులు దిగుబడి సాధిస్తే గిట్టుబాటు ధరలు లభించక దళారీ మార్కెట్ మాయాజాలంలో సమిధై పోతున్న రైతన్నలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.

ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, ʹజై జవాన్, జై కిసాన్ʹ అని మాట్లాడిన మోడీ మాటలు రైతుల ఓట్ల కోసమేనని తేలిపోయింది. మార్కెట్ శక్తుల మాయాజాలం నుంచి రైతుకు రక్షణ కల్పించి, గిట్టుబాటు ధర కల్పించడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మధ్యప్రదేశ్ విషయమే తీసుకుంటే అక్కడ నిరుడు ఫిబ్రవరి నుంచి మొన్నటి ఫిబ్రవరి వరకు (ఏడాది) 1982 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో గత 15 ఏళ్లలో ఇలా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య దాదాపు 20,000. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండినా మార్కెట్కు వచ్చే సరికి గిట్టుబాటు ధరలు లేవు. ఆ రాష్ట్రంలో మాల్యానిమద్ ప్రాంతం, ఇప్పుడు పోలీసు కాల్పులు జరిగిన మంద్సౌర్ జిల్లాతో సహా 15 జిల్లాలలో వరుసగా రెండు సంవత్సరాలుగా ఉల్లి దిగుబడులు బాగున్నాయి. మార్కెట్కి తీసుకొచ్చాక ఉల్లి ధర అమాంతంగా పడిపోయింది. కిలో ఉల్లి రూపాయి ధరకి పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఉల్లిని రోడ్లపై పారబోయాల్సి వచ్చింది. టమాట, ఆలుగడ్డల రైతుల స్థితి సైతం ఇదే. పొరుగునున్న మహారాష్ట్ర రైతులది ఇంచు మించు ఇవే పరిస్థితులు. ఇక్కడ ఈ ఏడాది కంది పంట బాగా పండింది. దాని ధర క్వింటాకు రు. 12,000 నుంచి ఒక్కసారిగా రు. 3,000 లకు పడిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాలలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తే ఎలాంటి పరాబవం ఎదురైందో అందరూ చూశారు.

మొజాంబిక్తో ఒప్పందం కారణంగా లక్షల టన్నుల పెసరపప్పు దిగుమతి అయ్యింది. మన పెసర రైతుల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కనీస గిట్టుబాటు ధరలు లేక అటు పంట దిగుబడిని నిల్వ ఉంచుకోలేక వృధాగా పారబోయవలసిన పరిస్థితిలోకి రైతు నెట్టబడడం ఈ వ్యవస్థ విషాదం. దారుణ సంక్షోభానికి సంకేతం. దేశానికే ధాన్యాగారం, ఐదు జీవ నదులు ప్రవహించే ప్రాంతం పంజాబ్లో కూడా ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే మన పాలకుల వ్యవసాయ విధానంలోని డొల్లతనం ఇట్లే తెలిసిపోతుంది. ఇక తమిళనాడు రైతులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజులు వివిధ వినూత్న రూపాలలో ఆందోళనలు చేసినా బిజెపి ప్రభుత్వానికి చెవికెక్కలేదు. దున్నపోతు మీద వర్షం పడిన చందాన వ్యవహరించింది. తమిళనాడులో గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడింది. ఈ కరువు రక్కసి భారిన పడి ఇప్పటివరకు 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కరువు పరిస్థితి నుంచి తమిళ రైతులను ఆదుకోవాలని, దానికి 40 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని తమిళ రైతులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. రైతుల గోడు ఏమాత్రం పట్టని సంపన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. ఇంత జరుగుతున్నా ఇంత వరకు రైతులకు పైసా కూడా సాయం చేయలేదు. పైగా సుప్రీంకోర్టులో దీనిపై కేంద్రం తన వాదన వినిపిస్తూ తమిళనాడులో రైతులెవరూ ఆత్మహత్య చేసుకోలేదని చెప్పిందంటే ఎంత అమానుషం.

రైతును ఉద్దరించడానికే తెచ్చానని ఘనంగా డప్పుకొట్టుకొని చెప్పుకొన్న ప్రధాన మంత్రి ʹఫసల్ భీమాʹ పథకం రైతులకు ఏమాత్రం అక్కరకు రాలేదు. కానీ కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు దండీగా కాసుల పంట పండించింది. ఫసల్ భీమా పథకం కింద 2016 - 17లో ప్రైవేట్ భీమా కంపెనీలు ప్రీమియం రూపంలో రైతుల నుంచి 21,500 కోట్లు దండుకున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో రైతులు పరిహారం కింద 4,270 కోట్లు క్లైమ్ చేయగా 714 కోట్లు మాత్రమే ఇచ్చాయి. దీనిని బట్టి ఫసల్ భీమా పథకం ఎవరికి ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన విజయ మాల్యా లాంటి కార్పొరేట్ పెద్ద మనుషుల రుణాలను ఇట్టే మాఫీ చేసింది కేంద్రం. అలాగే 2015లో భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సందర్భంలో పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే పేరుతో బడా బాబులకు భారీ ప్యాకేజీలతో ఆర్థిక సహాయాన్ని అందించిన బిజెపి ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవడం లేదంటే రాజ్యం ఎవరి ప్రయోజనాలకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

1991 నుండి నూతన ఆర్థిక విధానాల పేరిట దేశం ప్రపంచ బ్యాంకు కబంధ హస్తాలలో చిక్కుకున్న ఫలితమిది. ప్రపంచ వాణిజ్య సంస్థలో మన వ్యవసాయ రంగ నడ్డి విరిచే ఒప్పందాల ఫలితమిది. మన వ్యవసాయ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించిన ఫలితమిది. కాబట్టి తక్షణం దేశం ఈ ఊబిలో నుంచి బయటపడే విధంగా రైతాంగ ఉద్యమాలు కొనసాగాలి.

అన్నం పెట్టే 70 శాతం మంది ఆధారపడుతున్న మన వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి. మానవ నాగరికతకు తొలి నిర్మాతలైన రైతులను కాపాడుకోవాలి. భారత వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాలి. మధ్య దళారుల పాత్ర లేకుండా చేయాలి. విదేశాల నుండి వచ్చే దిగుమతుల్ని నివారించాలి. అందుకు దిగుమతి సుంకాన్ని భారీగా పెంచాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారతదేశం వైదొలగాలి. అప్పుడు మాత్రమే భారత రైతులను, వ్యవసాయ కూలీలను, మన వ్యవసాయరంగాన్ని రక్షించుకోగలం. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు పి.ఎ. చౌదరి, జయతి ఘోష్, ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ల సిఫార్సు లను అమలు చేయాలి. ఈ వ్యవసాయ సంక్షోభం ఒక్క రైతుల సమస్యే కాదు, ప్రజలందరి సమస్య. ఈ సంక్షోభం నుండి బయట పడే వరకు అన్నదాతలకు ప్రజలందరు అండగా నిలవాలి. రైతును రాజు చేయాలి.
- షేక్ కరీముల్లా
(రచయిత సామాజిక విశ్లేషకులు)

Keywords : maharashtra, farmer, Dhanaji Chandrakant Jadhav, suicide
(2024-04-13 00:22:10)



No. of visitors : 1744

Suggested Posts


ʹMaoistsʹ network was spreading rapidly in urban areasʹ

ʹThere are around 55 Maoist frontal organizations working in the urban area of Maharashtra. The government has already declared them frontal organizations. The Maoists have employed a double-pronged strategy of fighting guerrilla....

ʹConstruction of Shivaji Memorial will destroy livelihood of 1.5 lakh fishermenʹ

he livelihood of 1.5 lakh fishermen residing across five settlements in south Mumbai will be affected due to the construction of Chhatrapati Shivaji Maharaj Memorial statue in the Arabian Sea....

ʹTHE SHOW WILL GO ONʹ

A week after the Supreme Court (SC) granted bail to three members of Punebased cultural group Kabir Kala Manch (KKM), they were released from prison on Monday. Two of them, natives of Pune city, returned home and shared their future plans with...

Maharashtra farmers say wonʹt allow ministers to unfurl national flag on 15 August

Members of the steering committee comprising representatives of various farmer groups today said guardian ministers wonʹt be allowed to unfurl the national flag at district headquarters on August 15 if the government fails to announce an unconditional loan-waiver. .....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹరుణమాఫీ