ఉనా దాడికి ఏడాది : ర్యాలీ అనుమతి రద్దు వందలాదిమంది అరెస్టు

ఉనా

ఉనా దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు ( జూలై 12న) నిరసన ర్యాలీ నిర్వహించేందుకు మెహసానా జిల్లా అధికారులు ఇచ్చిన అనుమతిని హటాత్తుగా రద్దుచేసి వందలాదిమందిని అరెస్టు చేశారు. దళిత ఉద్యమ నాయకుడు జిగేశ్‌ మెవానీ గత నెలలోనే జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే చివరి క్షణంలో నిరసన ర్యాలీకి అనుమతిని రద్దుచేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ ʹమేం అనుకున్న ప్రణాళిక ప్రకారం మెహసానా పట్టణం నుంచి ధనారే వరకూ మా ఆజాదీ కూచ్‌ʹ (ఫ్రీడం మార్చ్‌) కొనసాగుతుందిʹ అని మెవానీ ప్రకటించారు. ʹశాంతి భద్రతలపై పోలీసులు తాజా నివేదిక అందచేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జులై 12న ర్యాలీ నిర్వహించేందుకు జూన్‌ 27న ఇచ్చిన అను మతిని రద్దుచేస్తున్నాంʹ అని ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన రాతపూర్వక ఆదేశాల్లో పేర్కొన్నారు. గుజరా త్‌లోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యం త్రాంగం ఈ నిర్ణయం తీసుకుందని మెవానీ ఆరోపిం చారు. అ సెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో బీజేపీ వ్యతిరేక వాతావరణాన్ని వస్తుందన్న అనుమానంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
మరో వైపు ప్రభుత్వం ర్యాలీ అనుమతిని రద్దుచేసి కార్యకర్తలను అడ్డుకున్నప్పటికీ వేలాదిమంది దళితులు, మైనార్టీలు, పాటీదారులు, మహిళలు, ప్రజాసంఘాలు అన్ని వైపులనుండి మెహసానా కు చేరుకున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలు, సభలు నిర్వహించారు. వేలాదిగా మోహరించిన పోలీసులు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయకుమార్, రేశ్మాపటేల్ తో సహా వందలాదిమందిని అరెస్టు చేశారు.

Keywords : una, Azadi Kooch, Dalit protestors, lynchings,detained, Gujarat, modi
(2024-03-25 21:52:40)



No. of visitors : 619

Suggested Posts


ఉనా దాడికి ఏడాది... ఈ మనువాద రాజ్యంలో దళితులకు న్యాయంజరిగేనా ?

కోర్టును ఏర్పాటుచేయలేదు. సమీప జునాగఢ్‌లో వున్న అట్రాసిటీ కోర్టుకు కూడా కేసును బదిలీచేయలేదు. 12 మంది నిందితులకు బెయిల్‌ వచ్చింది. మిగిలిన వారికి కూడా త్వరలో బెయిల్‌ రానుంది. అయితే బాధితులు మాత్రం ఇప్పటికీ మానని గాయాలతో హింసలు అనుభవిస్తున్నారు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఉనా