కారంచేడు నుండి గరగపర్రు దాక‌ - భరద్వాజ


కారంచేడు నుండి గరగపర్రు దాక‌ - భరద్వాజ

కారంచేడు

(అప్పటి కారంచేడు ఉధ్యమంలో పాల్గొన్న ʹభరద్వాజ రంగావజ్జలʹ తన ఫేస్బుక్ టైమ్ లైన్ పై పెట్టిన పోస్ట్...)

అప్పుడే ముప్పై రెండేళ్లు గడచిపోయాయా? నాకు మాత్రం ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చపచ్చగానే ఉన్నాయి. 1985 … అవి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఏలుతున్న రోజులు. ఎన్టీఆర్ నిర్బంధ పాలనకు అంకురార్పణ రాజమండ్రిలో జరిగింది.
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్రంలో పోలీసులకు ఫ్రీ హ్యాండిచ్చారు. తెలంగాణలో 1983 సంవత్సరంలోనే మూడు దొంగ ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు ఆనాటి పీపుల్స్ వార్ కార్యకర్తలను హత్య చేశారు. ఈ సంఖ్య 1985 నాటికి ముప్పై ఐదుకు చేరింది. ఈ క్రమంలోనే 1985 సంవత్సరం మే నెలలో రాజమండ్రిలో జరగాల్సిన రైతుకూలీ సంఘం మహాసభలను విచ్చిన్నం చేశారు.
సభల నిర్వహణ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచీ రాజమండ్రి చేరిన రాడికల్ విద్యార్ధి యువజనులను అక్రమంగా అరెస్టు చేసి వారి మీద బూటకపు కేసులు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపేశారు. అలా నేను తొలిసారి రాజమండ్రి సెంట్రల్ జైలు దర్శించుకున్నాను.
దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు మూడు నెల్లు రాజమండ్రి సెంట్రల్ జైలు 2 b బ్కాకులో ఉన్నాను. అప్పుడు అరెస్ట్ అయిన వారిలో మాతో పాటు అప్పటి పౌరహక్కుల సంఘం నాయకులు లా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి కాలేజీ లెక్చరర్ భాస్కరరావు, రాజానగరం నివాసి డాక్టర్ కాటానారాయణరావు, న్యాయవాదులు బోస్ , కోరన్న తదితరులు ఉన్నారు.
ఓ నెల రోజుల తర్వాత వీరికి మాత్రం బెయిలు వచ్చింది . మాకు మరో రెండు నెల్లు పట్టింది. మా బెయిలు హైకోర్టు నుంచీ తీసుకురావాల్సి వచ్చింది. మేం జైల్లో ఉండగానే కారంచేడు దురాగతం జరిగింది.
కారంచేడు దళిత వాడ మీద కమ్మవారు పథకం ప్రకారం దాడి చేసి అందర్నీ భయభ్రాంతుల్ని చేసి చిన్నా భిన్నం చేశారు. దాడికి గురైన వారు పారిపోయి వచ్చి చీరాల కారంచేడు గేటు దగ్గర్లో ఉన్న చర్చిలో తలదాచుకున్నారు.
కారంచేడు దాడికి ఒక్కసారి ప్రపంచం ఉలిక్కి పడింది. కారంచేడు మాదిగ గూడానికీ ఓ ప్రత్యేకత ఉంది. చుట్టుపక్కల దళితుల మధ్య ఏ సమస్య వచ్చినా కారంచేడు గూడెం పెద్దలే పరిష్కరించేవారు. రాజకీయంగానూ ఇతరత్రా కూడా చైతన్యవంతమైన దళిత యువత ఉన్న గ్రామం కారంచేడు.
అలాగే కారంచేడు నుంచీ బయట ప్రాంతాలకు పోయి కాంట్రాక్టులూ గట్రా చేసి నాలుగు రాళ్లు గడించి వచ్చిన కమ్మ కుర్రాళ్లు … దళిత చైతన్యాన్ని జీర్ణించుకోలేక వారు పన్నిన దుర్మార్గానికి ఆనందంతో … పెద్ద కమ్మల సపోర్టు ఉండడంతో దాడి జరిగిపోయింది.
ఎనిమిది మంది మాదిగల ప్రాణాలు తీశారు.
సినిమా హాలు గొడవలు ఇవన్నీ జస్ట్ సాకులే …
కారంచేడు ఘటన ఓ చారిత్రక అవసరాన్ని దళిత శ్రేణుల ముందుంచింది. ఒక నిర్మాణం అవసరాన్ని అజండా మీదకు తెచ్చింది కారంచేడు. రాజకీయ రంగంలోనే కాదు … అన్ని రంగాల్లోనూ … దళిత చైతన్యాన్ని విస్తృతపరచడంతో పాటు సమీక్షించి అగ్రకుల భావజాలాన్ని ప్రతిఘటించాలనే చేతనను రేపింది.
ఆత్మగౌరవ నినాదాలకూ పోరాటాలకూ కారంచేడే ప్రాతిపదిక. కారంచేడు తర్వాత జరిగిన చుండూరులో దళిత చైతన్యం ఒక అడుగు ముందుకు వేసింది. ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఎదురుదాడికి దిగేందుకు ఏదో ఒక మేరకు కదిలారు. అందుకే దళిత చేతనకు సంబంధించి చుండూరొక దిక్సూచి అన్నారు బాలగోపాల్ .
కారంచేడు రుధిర క్షేత్రం దగ్గర నిలబడ్డప్పుడు వర్షంలోనే గొడుగులు కూడా లేకుండా …
జోహార్ కారంచేడు మృత వీరులకు …
కొనసాగిస్తాం కారంచేడు మృత వీరుల ఆశయాలనూ అని నినాదాలు చేస్తున్న దళిత శ్రేణులను చూస్తుంటే ఒక్కసారి అలా గతంలోకి వెళ్లిపోయాను.
రాజమండ్రి రైతుకూలి సంఘం సభల సందర్భంగా అరెస్టు అయి బయటకు వచ్చిన తర్వాత మచిలీపట్నం లో పనిచేయమంది పార్టీ. నేను బందరులో కాలు పెట్టిన వారానికో పది రోజులకో …. విజయవాడ గాంధీ మున్సిపల్ హైస్కూలులో కారంచేడు సభ జరిగింది. ఆ సభకు బందరు నుంచీ కొందరు తెల్సిన మిత్రులు వెళ్లారు.
అప్పుడు టీవీలు లేవు. పొద్దున్నే పేపర్లో బెజవాడ కారంచేడు సభ మీద పోలీసుదాడి వార్త. నేను గబగబా సభకు వెళ్లిన వారిళ్లకి వెళ్లాను. కాళ్లు చేతులు కొట్టుకుపోయి ఒకరు … చేతులూ కాళ్లూ విరిగి ఇంకొకరు ఇలా తగిలారు. ఏమయ్యింది అని అడిగితే … రాత్రి సభ మీద పోద పోలీసుల దాడి గురించి వివరించారు. అదో రకం జలియన్వాలాబాగ్ .
కత్తిపద్మారావుని పి.డి యాక్ట్ కింద అరస్టు చేశారు. రాజమండ్రి జైలుకు పంపేశారు. నేను వెంటనే రాజుపేటలోనూ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న సంక్షేమ హాస్టళ్లకు వెళ్లి కుర్రాళ్లని మొబలైజ్ చేసి సైకిల్ ర్యాలీ చేసి కృష్ణా జిల్లా కలెక్టరుకు కత్తి పద్మారావును తక్షణం విడుదల చేయాలి అనే డిమాండుతో ఒక మెమోరాండం ఇచ్చి వచ్చాం.
పద్మారావు అప్పటి వరకు హేతువాద నాయకుడుగానే ప్రపంచానికి పరిచయం. కారంచేడు ఘటన జరగగానే ఎక్కడెక్కడి దళిత విద్యార్ధులు విద్యాధికులు అందరూ అక్కడకి వచ్చేశారు. చర్చిలో ఉన్న బాధితులను కలసి భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు చేయాల్సిన కార్యాచరణ మీద చర్చలు సాగేవి.
ప్రభుత్వం కూడా శిబిరాన్ని ఎత్తించేయాలనే ప్రయత్నం ప్రారంభించింది. పీపుల్స్ వార్ రాజకీయాలతో ఉన్న ఉషా ఎస్ డానీ శిబిరంలో కత్తి పద్మారావుతో పాటు బాధ్యతలు పంచుకున్నారు. నెమ్మదిగా ప్రతిఘటనా డిమాండు పెరుగుతూన్న క్రమంలో … కత్తి పద్మారావు అరెస్టు జరిగింది. అరస్టు కన్నా ముందే చర్చి వారు బాధితులను ఖాళీ చేయాల్సిందిగా కోరారు.
సరిగ్గా అప్పుడొచ్చిన ఆలోచన విజయనగర్ కాలనీ. రెండు వేలో మూడు వేలో పెట్టి ప్రస్తుతం ఉన్న రుధిర క్షేత్రానికి సమీపంలో ఇసుక పర్ర కొని బాధితులందరినీ అక్కడకి తరలించారు.
కారంచేడు ఉద్యమం మీద పీపుల్స్ వార్ వేసిన ముద్ర చాలా బలమైనది. దీని వెనుక కామ్రేడ్ సూర్యం, అప్పటికి పీపుల్స్ వార్ రీజినల్ కమిటీ బాధ్యతలు చూస్తున్న నెమలూరి భాస్కరరావులు చేసిన కృషి చాలానే ఉంది. కుటుంబాన్ని, చేస్తున్న ఉద్యోగాన్నీ పక్కన పెట్టి శిబిరంలో వార్ ప్రతినిధిగా వ్యవహరించిన డానీ కృషి ఉంది.
వీరందరూ కలసి వేసిన ప్రభావమే ఆ తర్వాత అదే గ్రామం నుంచీ ఇద్దరు యువకులు వార్ అగ్ర నాయకత్వ స్థానాల్లోకి వెళ్లి ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి తగిన స్ఫూర్తిని అందించింది. ఆ ఇద్దరు ప్రజా వీరులు శేష ప్రసాద్ , అనిల్ కుమార్ ల సమాదులు కూడా రుధిర క్షేత్రంలోనే ఏర్పాటు చేశారు.
ఆ రెండు సమాధులకూ డానీతో దండలు వేయించడం సముచితమైన నిర్ణయం అనిపించింది. నిజానికి ఆ మాట అప్పటి కారంచేడు శిబిరంలో బలంగా నిలబడ్డ ఆశీర్వాదం గట్టిగానే వ్యక్తీకరించారు.
మళ్లీ ఒక్కసారి గతంలోకి వెడదాం….
కారంచేడు ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని పార్టీ అనుకుంది. కామ్రేడ్ ఏసు నేతృత్వంలో దగ్గుబాటి చెంచురామయ్యను ఖతం చేసింది పార్టీ.
చుండూరులో బాధితులే ప్రతిదాడికి దిగారు. అది అవసరమైన చైతన్యం. కారంచేడులో బాధితుల తరపున పార్టీ దళం రంగంలోకి దిగింది.
సరిగ్గా ముప్పై రెండేళ్ల తర్వాత అప్పుడు కారంచేడు శిబిరంలో పార్టీ ప్రతినిధిగా నిలబడ్డ డానీతో కలసి నేను కారంచేడు మృత వీరులకు నివాళులు అర్పించాం. పద్మారావుగారు కూడా వచ్చి ఉంటే బాగుండేది.
కారంచేడు ఘటన జరిగిన సందర్భంలో కీలక పాత్ర పోషించిన వారిలో బొజ్జా తారకం కూడా ఉన్నారు. ఆయనకీ, పద్మారావుకీ, డానీకీ అందరికీ అప్పటికి ఉన్న ఆలోచనలు వేరు . కారంచేడు శిబిరంలోకి వచ్చాక వచ్చిన జ్ఞానం వేరు. అక్కడికి వెళ్లే నాటికి ఎవరికీ ఏం చేయాలనే అంశం మీద స్పష్టత లేదు. కానీ రణ రంగంలోనే పాఠాలు నేర్చుకున్నారు. అలా వీరందరికీ కారంచేడు అక్షరాలు దిద్దించింది. కొత్త కళ్లజోళ్లను ఇచ్చింది.
అలా కారంచేడు ఓ విశ్వవిద్యాలయం.
సరిగ్గా కారంచేడు ఘటన జరిగి ముప్పై రెండేళ్లు పూర్తయిన సందర్భంలోనే … గరగపర్రులో యాకోబును హత్యచేసి కులాహంకారం కొత్త సవాళ్లను విసిరింది.
కారంచేడు చూపిన దారిలో … చుండూరు సూచించిన దిక్కులో గరగపర్రు దళితులు ఆచరణాత్మకంగా కదలాల్సిన అవసరం ఉంది. ప్రతిదాడి జరగాల్సిన అవసరం ఉంది. ఇది రెచ్చగొట్టడం కాదు … నాల్గు పడగల హైందవ నాగరాజు నుంచీ సమాజాన్ని కాపాడుకోవాలసిన అవసరాన్ని చెప్దామనే ….
రుధిర క్షేత్రం …. చాలా కదిలించింది. కుదిపింది. నిలదీసింది. ప్రశ్నించింది.
రాజమండ్రి లో రైతుకూలీ మహాసభల్ని అడ్డుకున్న తీరులోనే … ఇప్పుడు గరగపర్రులో దళిత చైతన్యాన్ని అడ్డుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తోంది అదే పసుపు ప్రభుత్వం. తనే సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. ప్రభుత్వమే అగ్రకులాహంకారంతో ప్రవర్తించడం తెలుగుదేశం పాలనలో కాస్త అధికంగా చూస్తాం.
అలా కథ ఎక్కడ మొదలయ్యిందో అక్కడికే వచ్చింది …
- భరద్వాజ రంగావజ్జల

Keywords : karamchedu, andhrapradesh, dalit, uppercast, attacks
(2022-01-18 22:55:33)No. of visitors : 2512

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


కారంచేడు