గిరాయిపల్లి అమరుల స్పూర్తిగా నడుస్తున్న విప్లవోద్యమం ‍- హరగోపాల్

గిరాయిపల్లి

భారతంలో అసమానతలు లేని సమసమాజాన్ని నిర్మించడం రాజ్యాంగంద్వారా సాధ్యంకాలేదని , పార్లమెంటరీ విధానం వల్ల అది సాద్యంకాదని పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సమసమాజం కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించే క్రమంలోనే సూరపనేని జనార్దన్, మురళీ మోహన్, సుధాకర్, ఆనందరావులు అమరులయ్యారని ఆయన అన్నారు. గిరాయి పల్లి అమరవీరుల సంస్మరణ సభ, కామ్రేడ్ సూరపనేని జనార్ధన్ స్మృతిలో ʹజనహృదయం జనార్దన్ʹ పుస్తకావిష్క‌కరణ వరంగల్ లో జరిగింది. అమరుడు జన్ను చిన్నాలు సోదరి , అమరుల బందు మితృల సంఘం ప్రతినిది శాంత అధ్యక్షతన జరిగిన ఈ సభలో హరగోపాల్ పాటు , సీనియర్ జర్నలిస్టు వీక్షణం ఎడిటర్ వేణు గోపాల్, విప్లవరచయితల సంఘం నేత బాసిత్ , గిరాయిపల్లి అమరుల బందువులు ప్రసంగించారు.

భారత సమాజంలో అన్ని మతాలకు సమాన హక్కు కల్పించిన లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర పాక వర్గాలు చేస్తున్నాయని ఈ సందర్భంగా హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ భావజాలాన్ని దేశవ్యాప్తం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉన్న విశ్వవిద్యాయాల్లో వారి భావజాలం ఉన్న వారినే నియమించి మాట్లాడే స్వేచ్ఛలేకుండా చేస్తున్నారన్నారు. దేశంలో ఉన్న 14 కేంద్రీయ విశ్వవిద్యాయాలను విధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

హిందూ మతోన్మాద సంఘాలు ఇటీవల గోవాలో ఏర్పాటు చేసిన సదస్సులో భారత రాజ్యాంగాన్ని తిరస్కరించారన్నారు. అంటే భవిష్యత్తులో ఎలాంటి సమాజాన్ని నిర్మించుకోబోతున్నాం... ? ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండబోతోంది ... ? రానున్న సమాజం ఇంకా ఎంత హింసాత్మకంగా మారబోతోంది ... ? అనేది ప్రతీ ఒక్కరు ఆలోచించాని సూచించారు. భవిష్యత్‌లో రాష్ట్రయ స్వయం సేవక్ దళ్(RSS) భావజాలం ఎంత విస్తరించబోతుందనేది ప్రతీ ఒక్కరు సీరియస్‌గా ఆలోచించాల్సి ఉందన్నారు. ఇటీవల ఢల్లీలో ప్రొఫెసర్ల సదస్సు జరిగిందని, అక్కడికి వచ్చిన అలీగడ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు చెబుతూ తాను ఢల్లీికి భయం భయంగా చేరుకున్నానని చెప్పారన్నారు. ప్రస్తుతం సమాజంలో మనిషి ఇంత భయంగా ఎందుకు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిరదని ప్రశ్నించారు. దేశ సంపదలో 60 శాతం డబ్బు 1 శాతం మంది చేతుల్లోనే ఉందని, వారే దేశ రాజకీయాల‌ను శాసిస్తున్నారని తెలిపారు. ఏదో ఒక జంతువు పేరు చెప్పి మనుషుల్ని చింత్రహింసకు గురి చేసి చంపుతుంటే లౌకిక వాదం ఏమైందని ప్రశ్నించారు. మత కల్లోలాలు చెలిరేగి వేలాది మంది చనిపోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. దేశంలో ఇప్పుడు మతం ప్రధాన ఆంశంగా మారిందని తెలిపారు. పేదరికం, నిరుద్యోగం, అభివృద్ధిపై జరగాల్సిన చర్చ ఇప్పడు మతం, విశ్వాసంపై జరుగుతుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
.

Keywords : haragopal, warangal, surapaneni janardan, maoists
(2024-04-01 08:44:41)



No. of visitors : 1156

Suggested Posts


వరంగల్ టీఆరెస్ అభ్యర్థి పసునూరి దయాకర్

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా అనేకమంది రేసులో ఉన్నప్పటికీ చివరకు టికట్టు పసనూరి దయాకర్ కు దక్కనుంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


గిరాయిపల్లి