రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. మావోయిస్టు పార్టీ ప్రకటన‌

రేపటి

(అమరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ ప్రకటన పూర్తి పాఠం)

అమరవీరులను స్మరించుకుందాం - నక్సల్బరీ స్పూర్తిని ఎత్తిపడదాం

జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారాన్ని జరుపుకుందాం

మన దేశంలో మహత్తర నక్సల్బరీ సాయుధ రైతాంగ తిరుగుబాటు నుండి మొదలుకొని గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ క్రమంలో మన పార్టీ సంస్థాపకులు, ఉపాధ్యాయులు, భారత విప్లవోద్యమ మహా నాయకులు, అమరులు కామ్రేడ్స్ చారుమజుందార్, కామ్రేడ్ కన్హాయ్ చటర్జీలు రూపొందించిన దీర్ఘకాల ప్రజాయుద్ధ మార్గంలో లక్ష్య సాధనకై పోరాడుతూ నులివెచ్చని నెత్తుర్లు ధార పోసి, వేనవేల మంది కామ్రేడ్స్ అరులయ్యారు. ఏప్రిల్ 17-2017న నక్సల్బరీ మొదటి తరం నాయకుడు సి.పి.ఐ. (మావోయిస్టు) పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ నారాయణ సన్యాల్ అనారోగ్యంతో అమరుడ‌య్యాడు.

భారత విప్లవ మార్గదర్శకులు మన పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్స్ చారుమజుందార్ 1972 జూలై 28న, కామ్రేడ్ కన్హాయ్ చట్టార్టీ 1982 జూలై 18న అమరులయ్యారు. ఈ ఇద్దరు నాయకులు సాయుధ పోరాటాన్ని ప్రజాయుద్దాన్ని దేశ రాజకీయ ఎజెండా మీదికి తెచ్చారు. సాయుధ పోరాటం మన దేశంలో ఎజెండా మీదికి వచ్చినప్పటినుండి దేశ రాజకీయ రంగంలో పెను మార్పులు జరిగాయి. విప్లవోద్యమ పురోగమన క్రమంలో కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో నుండి సాధారణ పీడిత ప్రజల వరకు అనేక మంది కామేడ్స్, వీరయోధులు వీరవనితలు అమరులయ్యారు. ప్రజల కొరకు ప్రాణాలర్పించిన అమరుల మహెూన్నత త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధనకు అంకితమవుదాం.

భారత విప్లవోద్యమంపై మున్నెన్నడు లేని విధంగా దోపిడీ పాలక వర్గాలు దాడిని తీవ్రతరం చేశారు. గత దశాబ్ద కాలానికి పైగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని దేశ అంతరంగిక భద్రతకు పెను ప్రమాదంగా భావిస్తూ వచ్చిన కేంద్ర రాష్ట్ర పాలక వర్గాలు గత మూడేళ్లుగా బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టుల నాయకత్వంలో సంఘ్ పరివార్ శక్తులు పెట్రేగిపోయి ʹభారత్ మాతాకీ జైʹ, ʹబారాకూని మాఫీʹ అంటూ దేశవ్యాప్తంగా దళితులపై, ఆదివాసులపై, ముస్లింలపై, క్రిస్టియన్లపై దాడులు చేస్తూ హత్యలు, అత్యాచారాలు, గృహా దహనాలు, లూటీలు చేసూ కల్లోలాలు సృష్టిస్తున్నారు. మోడీ నాయకత్వంలోని బీ.జే.పీ. సామ్రాజ్యవాదుల దళారీ పాలకుల ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకుపోతున్నది. దేశ ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, రంగాలన్నింటిలో ఫాసిజం రాజ్యమేలుతున్నది. దేశం ఎన్నటికంటే కూడా నేడు, తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది.

మోడీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు దేశంలోకి స్వేచ్చగా చొచ్చుకొని వచ్చేలా నిబంధనలను సరళతరం చేస్తూ చట్టాల్ని సవరిస్తున్నది. అందులో భాగంగా వందకు పైగా చట్ట సవరణలు చేసింది. ʹమేకిన్ ఇండియాʹ ʹడిజిటల్ ఇండియాʹ ప్రచారంతో సామ్రాజ్యవాద పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది. భారత దేశంలో గుత్త పెట్టుబడికి లాభాలు సమకూరుస్తానని సామ్రాజ్యవాదులకు మోడీ వాగ్దానం చేశాడు. అందుకు భారతదేశంలో ఉన్న అపార వనరులను, చౌక శ్రమను, మార్కెట్ ను యధేచ్చగా కొల్లగొట్టడానికి సామ్రాజ్యవాదులతో అనేక ఒప్పందాలు చేసుకున్నాడు.

రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుండి ప్రపంచీకరణ విధానాలను ʹమేకిన్ తెలంగాణʹ, ʹడిజిటల్ తెలంగాణʹ పేరుతో అమలు చేయడంలోనూ, విప్లవోద్యమాలను అణచివేయడంలోనూ గత ప్రభుత్వాల కంటే అత్యంత క్రూరంగానూ, అమానుషంగానూ వ్యవహరిస్తున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టు పాలనను కొనసాగిస్తూ సామ్రాజ్యవాదులకు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారు. ప్రగతిశీల ప్రజాస్వామిక లౌకిక శక్తులపై, హేతువాదులపై కక్షగట్టి దాడులు చేస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి బడ్జెట్లోనూ రక్షణ శాఖ, పోలీసు శాఖలకు విపరీతంగా నిధులు కేటాయిస్తున్నాయి. ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగొలు చేస్తూ సాయుధ బలగాలను మరింత క్రూరమైన అణచివేత యంత్రంగాలుగా రూపొందిస్తున్నాయి.

తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామ‌కాలు, ఎన్‌కౌంట‌ర్ లు లేని, ప్రజాస్వామిక తెలంగాణ కొరకు దశబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు కనీసం ప్రజాస్వామిక హక్కులు కూడా కరువయ్యాయి. చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చినప్పటి నుండి బంగారు తెలంగాణ పేరుతో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం,ఆయుధాలు, వాహానాలు, సెల్ఫోన్లు, సి.సి. కెమెరాలు, పోలీస్ స్టేషన్లు, కమీషనరేట్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ఏర్పాటుకు అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, పుష్కరాల నిర్వాహణకు, దేవాలయాల, పర్యాటక అభివృద్ధికి వేల కోట్ల రూపాయ‌లను ఖర్చు చేస్తూ కుట్ర పూరితంగా ప్రజలను మతం మత్తులో ముంచుతున్నారు. పత్తి, కంది, మిర్చి పంటల గిట్టుబాటు ధరలకై పోరాడుతున్నరైతులపై, రుణమాఫి కొరకు ఉద్యమిస్తున్నరైతులపై లారీ చార్టీలు చేసి అరెస్టు చేసి అన్నం బెట్టే రైతు చేతికి బేడీలు వేసి జైల్లో పెట్టారు. కనీస వేతనాల కోసం ఉద్యమిస్తున్న మున్సిపల్ కార్మికుల, ఆశా వర్కర్లపై, హరిత హారం పేరుతో భూములు స్వాదీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసీ పీడిత ప్రజలపై దాడులు చేసూ, భూములు కబ్దా చేస్తున్నారు.

ఓపెన్కాస్ట్ గనులకు, భారీ నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిర్వాసిత ప్రజలపై లాఠీ చార్జీలు చేసి, అరెస్టులు, చిత్రహింసలను అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ పాలక వర్గాల దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక హక్కులు, జాతి విముక్తి కొరకు జరుపుతున్న పోరాటాలను, ప్రజలను, విప్లవోద్యమాన్ని అణచివేయడానికి లక్షలాదిగా సాయుధ బలగాలను మోహరించి హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆపరేషన్ గ్రీన్ హంట్ 3వ దాడి, మిషన్- 2017, ఆపరేషన్ సమాధాన్లను తీవ్రతరం చేస్తున్నారు.

ఆపరేషన్ గ్రీన్హంట్ 3వ దాడిని తిప్పికొడుతూ శత్రువు మూకలతో వీరోచితంగా పోరాడుతూ ఈ సంవత్సరం అమరులైన వీర పుత్రికల, పుత్రులను స్మరించుకుందాం. నవంబర్ 24, 2016లో కేంద్ర కమిటీ సభ్యుడు ట్రైజంక్షన్ ఎస్.జెడ్.సి. కార్యదర్శి కామ్రేడ్ దేవరాజ్, ట్రైజంక్షన్ ఎస్.జెడ్.సి. సభ్యురాలు కామ్రేడ్ అజిత (కావేరి)లు నీలంబూర్ అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంట‌ర్‌ల‌లో అమరులైనారు. ఖమ్మం జిల్లా శబరీ ఏరియాలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు మైన్ పేలిన ఘటనలో కామ్రేడ్ కోటి (నంద), కామ్రేడ్ సురేష్ లు అమరులు కాగా బుర్కపాల్ ఆంబూష్లో శత్రువుతో వీరోచితంగా పోరాడుతూ చర్ల ఎల్.ఓ.ఎస్. కమాండర్ కామ్రేడ్ రవి (బొజ్ఞన్న), దర్భ డివిజన్ పి.ఎల్. కమాండర్ కామ్రేడ్ అనిల్ అమరులైనారు. నేషనల్ పార్క్ లో జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో డి.వి.సి.ఎమ్ కామ్రేడ్ జ‌గ‌త్‌దాదా(రాంమూర్తి), కామ్రేడ్ భద్రులు అమరులైనారు. దర్భ డివిజన్లో శత్రువుతో విరోచితంగా పోరాడుతూ నేలరాలిన డి.వి.సి.ఎమ్. కామ్రేడ్ పాలితో సహా మరో ఐదుగురు కామేడ్స్ అమరులైనారు.

2016 అగస్టు నుండి ఇప్పటి వరకు దండకారణ్యంలో దాదాపు 70 మంది కామేడ్స్ అమరులైనారు. ఎ.ఒ.బీ. రామగూడ వద్ద జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో ఇద్దరు ఎస్.జెడ్.సి.ఎమ్.లు కామ్రేడ్ దయా, కామ్రేడ్ గణేష్ లు, ఇద్దరు డి.వి.సి. ఎం.లతో సహా 31 మంది కామేడ్స్ అమరులైనారు. బీజే సాక్ సభ్యుడు కామ్రేడ్ ఆశీష్ ను శత్రువు ఒక కోవర్డు ద్వారా హత్య చేశాడు. శత్రు బలగాలు మాటుగాసి నిర్వహించిన దాడుల్లో 7 గురు కామేడ్స్ అమరులైయారు. 2017 మార్చిలో జార్ఖండ్ రాష్ట్రం పలాం జిల్లాలో విప్లవ ప్రతిఘాతక టీ.పీ.సీ ముఠా చేసిన దాడిలో జోనల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ అజిత్ యాదవ్ తో సహా ముగ్గురు కామేడ్స్ నేలకొరిగారు. ఈ సంవత్సర కాలంలో 200లకు పైగా అమరులు కావడం విప్లవోద్యమానికి తీవ్ర నష్టం. వీరు తమ విప్లవ జీవితంలో నెలకొల్పిన ఆశయాలను, ఆదర్శాలను ఎత్తిపడుతూ అమరులకు విప్లవ జోహార్లు అర్చిద్దాం.

అమర వీరుల సంస్మరణ వారాన్ని ఉద్యమ ప్రాంతాలలో స్పూర్తిదాయకంగా జరుపండి! స్మారక వారం సందర్భంగా ప్రజల్ని పెద్ద ఎత్తున కదిలిద్దాం! అందుబాటులో వున్న అన్ని సాధనాలను వీలైనంత విస్తృతంగా ఉపయోగించుకుంటూ పార్టీ శ్రేణులలో, పి.ఎల్.జి.ఎ. బలగాలలో, గ్రామాలలో అమర వీరుల త్యాగాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయండి. అవకాశం ఉన్న గ్రామాలలో, బస్తీలలో అమరవీరుల స్తూపాలను నిర్మించండి. పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, వాల్ రైటింగ్, పత్రికా ప్రకటనల రూపంలో అమరుల ఆదర్శాలను ఎత్తిపట్టండి. గ్రామాలలో, బస్తీలలో సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించండి! ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించడం ద్వారా ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించండి! ధైర్య సాహసాలను దృఢసంకల్పం, ఆదర్శాలను స్మరించుకుంటూ, అలవర్చుకుంటూ నూతన ప్రజాస్వామిక విప్లవ నిర్మాణానికై మార్గాన్ని అనుసరించేలా ప్రజల్ని ఉత్తేజపర్చుదాం. అమరుల బాటలో ముందుకు సాగుదాం! అమరవీరులకు మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి ఇదే.

విప్లవాభినందనలతో....

జగన్
అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర కమిటీ

Keywords : kcr, maoist, martyrs, jagan, dandakranyam
(2024-04-03 15:28:31)



No. of visitors : 2746

Suggested Posts


A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home Minister

When I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force....

జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ

మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని

జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖ

ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు.

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

విప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము.

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న అనారోగ్యంతో అమరుడయ్యాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఆడియో ప్రకటనను విడుదల చేశారు.

ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

దోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు...

మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై....

మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !

ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మున్నా స్మార‌కార్థం కుటుంబ స‌భ్యులు ప్ర‌కాశం జిల్లా ఆల‌కూర‌పాడులో నిర్మించిన స్తూపాన్ని తొల‌గించాలంటూ కొంది మందిని డ‌బ్బులు తీసుకొచ్చిన జ‌నాల‌తో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, టంగుటూరు త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చారు. మావోయిస్టులు హింస‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ద పోరాటంలో ప్రాణాలు కోల్

Govt lost mercy petition of 4 Maoist convicts on death row

Four death row convicts in Bihar have been waiting for a decision on their mercy petition for more than a decade because their plea to be spared.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రేపటి