ʹబంగారు తెలంగాణʹ సాకారానికి ఈ ఫ్రెండ్లీ పోలీసింగే మార్గం !
ఇది మనందరం పోరాడి సాధించుకున్న తెలంగాణేనా ? ప్రజా స్వామ్యం కోసం, చిత్ర హింసలు లేని తెలంగాణ కోసం, దోపిడి లేని తెలంగాణ కోసం ప్రాణాలిచ్చిన వేయిమంది అమరుల త్యాగాలు విలువలేకుండా పోయినయా ? తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రా పోలీసులు కూడా ప్రవర్తించనంత క్రూరంగా ఈ బంగారు తెలంగాణల పోలీసులు ప్రవర్తిస్తున్నరు. నిన్న గాక మొన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ళలో 8 మంది యువకులను అరెస్టు చేసి పురుషాంగాలకు కరంట్ షాక్ ఇచ్చి , కట్టెలు విరిగిపోయేటట్టు కొట్టి జైలుకు పంపిన బంగారు తెలంగాణ పోలీసులు ఇవ్వాళ్ళ కామారెడ్డి జిల్లాలో మరో దారుణానికి ఒడిగట్టారు.

కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం కోమలంచ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మొబైల్ దొంగతనం చేసిండనీ..ఎస్సై అంతిమరెడ్డి రాజును పట్టుక పోయి ఆయనదైన శైలిలో విచారిచిండట. ఆయ్న హింసలు తట్టుకోలేని రాజు ఫోన్ ను అమ్మిన పైసలు తన అమ్మకు ఇచ్చిన్నని చెప్పిండట. అప్పుడు అర్దరాత్రి 1 గంటయ్యింది. ఆ టైంల ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ కోసం ఎంత కష్టపడుతున్నడో గుర్తొచ్చింది. తాను కూడా బంగారు తెలంగాణ కోసం కష్టపడటంలో బాగంగా రాత్రి 1 గంటకు పోలీసోళ్ళనేసుకొని రాజు ఇంటిమీదికి పోయిండు. రాజు ఇచ్చిన పైసలు ఎక్కడ పెట్టినవ్ అని అడుగుతూనే రాజు తల్లి బాలమణి మీదపడి కొట్టడం మొదలుపెట్టారు. నాకు తెల్వదు సార్ అని ఆ తల్లి మొరవెట్టుకున్నా వినని ఎస్సైఅంతిరెడ్డి, ఇతర పోలీసులు ఆమెను కట్టెలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఆమె అరిచిన అరుపులు చుట్టూ ప్రతిద్వనిస్తున్నా వదల లేదు. శరీరమంతా కమిలి పోయి ఆమె కదలలేని పరిస్తితికి వచ్చే వరకు అతి దారుణంగా మానవత్వం సిగ్గుపడే విధంగాగా కొట్టారు.
ప్రజలు ఈ మాత్రం కష్టాలు భరించక పోతే త్యాగాలు చేయకపోతే వాళ్ళ ʹబంగారు తెలంగాణʹ రావడం కష్టమని పాలకుల అభిప్రాయం కాబోలు !
Keywords : kamareddy, police, telanagana, women, arrest
(2023-09-26 04:07:34)
No. of visitors : 2004
Suggested Posts
| గూడ అంజన్నకు జోహార్లు !ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద... |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ.... |
|
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన... |
| జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు. |
| సమైక్య సభలో తెలంగాణను నినదించిన శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిందిసమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి.... |
| కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసంకామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు.... |
| ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను.... |
| ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండాఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా... |
| మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటనఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్ ముట్టడి, పెరేడ్ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించారు. |
| కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు
ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు. |
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..