ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావుఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

"మొదటి వార్త.. "

ఆంధ్ర ప్రభ స్వామి సార్ సూచన మేరకు స్టేషన్ ఘన్ పూర్ వార్తలు రాయడం ఆరంభించిన నాకు ఆదిలోనే హంసపాదు లా ఓ బెదిరింపు వచ్చింది. అప్పటికి ఇంకా నా డేట్ లైన్ ఆరంభమవకముందే రెండు చిన్న వార్తలొచ్చాయి. మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు. నీ కెవరు చెప్పారు?వార్త ఎలా రాసావని బెదిరించినంత పని చేసారు. అప్పటికి నాకు ఏదైనా ప్రకటనను విభేదించదలుచుకుంటే వివరణ ఇచ్చినా, రిజాయిండర్ ఇచ్చినా సరిపోతుందని చెప్పాలని తెలియదు. స్వామి సార్ కు ఈ విషయం చెబితే నన్ను వార్తలు రాయొద్దంటాడని భయం. అందుకే చెప్పలేదు.
ఈ క్రమం లో నే ఆంధ్ర ప్రభ డాక్ ఎడిషన్ మొదటి పేజీ లో "బీ డి వో ఇష్టా రాజ్యం " అనే హెడ్ లైన్ తో నేను రాసిన వార్త బాక్స్ ఐటెం వచ్చింది. ఆ ఐటెం నాదే అని తెలిసేందుకు అప్పటికి నా డేట్ లైన్ తో వార్తలు మొదలు కాలేదు. కానీ ఘన్ పూర్ సమితి వార్త కాబట్టి అది నా వార్తే అని నేను చెప్పుకునేందుకు అవకాశం ఉండేది. మా బాపు టీచర్. మా వూళ్ళోనే పనిచేసేవాడు.సమితిలో క్రమశిక్షణ గల విద్యను ప్రోత్సహిస్తాడనే పేరుండడం వల్ల మా సమితి అధికారులతో మంచి పరిచయాలుండేది. ఘన్ పూర్ సమితి లో బీడీ వో గా పనిచేసిన వేణుగోపాల్ రావు సార్ బాపుకు మంచి శ్రేయోభిలాషి. ఆయన మీదనే మొదటి పేజీ వార్త వచ్చింది. ఆయన తన పైన వచ్చిన వార్త ను చాలా స్పోర్టీవ్ గా తీసుకున్నాడు. మీవాడు నా పై వార్త రాసాడు చూసావా దామోదర్ అని బాపు తో అన్నాడు.
ఈ రెండు సందర్భాలు ఎందుకు చెప్పానంటే అప్పుడు వార్తలు , అందులోని అంశాలను పాఠకులు చాలా సీరియస్ గా తీసుకునే వాళ్లు. అనుభవ రాహిత్యం వల్ల నాకు రిజాయిండర్ రాయాలనే విషయం తెలియక భయపడిపోయాను గానీ తర్వాత రోజుల్లో వార్త లకు వివరణలు రాయాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం జంకకుండా వార్తలు రాసేవాడిని.
డేట్ లైన్ అవసరమనే విషయం తెలియక ముందే స్వామి సార్ అనారోగ్యం పాలయి మృతి చెందారు. ఆయన గైడెన్స్ నిజం గా చాలా గొప్పగా వుండేది. ఆయన బ్రతికున్నప్పుడు వార్తా రచనలో మెళుకువల కోసం దివ్వెల హనుమంత రావు గారు ఎక్కాల పుస్తకం అంత వుండే పుస్తకం లో వాడగూడని, వాడదగిన పదాల ను గురించి ప్రచురించిన మెళకువలను చదువుకున్నాం. స్వామి సార్ చనిపోయిన తర్వాత అప్పటికే రాష్ట్రం లో మాండలిక వ్యవస్థ రావడం తో ఆంధ్ర ప్రభ పత్రిక శాసన సభా నియోజక వర్గాల స్థాయిలో స్ట్రింగర్ లను నియమించడానికి శ్రీకారం చుట్టింది. అప్పటికే వివిధ డేట్ లైన్ ల కోసం అనధికారికం గా వార్తలు రాస్తున్న నేను, ఆదిరాజు నరసింహారావు ,పీ వీ మదన్ మోహన్ , మేము ముగ్గురమూ ఇంటర్వ్యూ కోసం పోచమ్మ మైదాన్ లో ఆంధ్ర ప్రభ ఆఫీసుకు వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూలో ఘన్ పూర్ డేట్ లైన్ కోసం తర్వాత కాలం లో విరసం లో, ఆ తర్వాత విశాఖ లో పీపుల్స్ వార్ లో పనిచేసిన జనార్ధన్ కూడా పోటీ పడ్డాడు. అయితే ఆయనది వేరే నియోజక వర్గం కావడం, అంతకు ముందే మేము వార్తలు రాసి ఉండడం మూలం గా నేనే సెలక్ట్ అయ్యాను. ఘన్ పూర్ మండలం లో నేను స్ట్రింగర్ గా చేరే నాటికే ఈనాడు లో నరేందర్, ఉదయం లో రఘునాథ్ చేస్తుండే వారు. ఆ రోజుల్లో వార్తా రచనను మెరుగు పర్చుకోవాలనే తపన ఉండేది.
దివ్వెల హనుమంత రావు గారి భాష మెళకువల పుస్తకం లోని కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పటి ఎలక్ట్రానిక్ మీడియా యుగం లో ఒక క్రియా పదానికి, ఇంకో క్రియ తోడవుతున్న క్రమం లో దివ్వెల గారి భాష ఉపయోగించే తీరు చెప్పాలనిపించింది. వార్త లో బడులకు తావుండదని దివ్వెల పుస్తకం చెప్పేది.ఇప్పుడుమాత్రం ప్రతీ వార్తలో బడులు, బహుళ క్రియా పదాలు ఉపయోగిస్తున్నారు. దీనికి భిన్నమయిన వార్తా రచనకు మాకు ఓరియంటేషన్ లభించిందనే చెప్పుకోవాలి.
-పీవీ కొండల్ రావు

Keywords : journalism, warangal, political, police, colector, telangana, kcr, ktr
(2017-11-21 09:47:27)No. of visitors : 341

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 2..."కామన్ పేజీలు.. లైన్ అకౌంట్లు.."

ఆంధ్ర ప్రభ లో పని చేసిన ప్రతీ అకేషనల్, రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ కూడా తమ బై లైన్ చూసుకోవాలని పరితపిస్తారు. ఆంధ్ర ప్రభ దినపత్రికకు ఆ రోజుల్లో ఉన్న పేరు అది. ఎమర్జెన్సీ కా లం లో పత్రికా స్వేచ్ఛను నియంత్రించ యత్నించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్లాంక్ ఎడిటొరియల్ ఇచ్చారని ఆ పత్రిక పట్ల అపరిమితమైన గౌరవం.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

   ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 5...స్లగ్గులు.. వార్తలు - -పీవీ కొండల్ రావు

మొదటి సారి ఓ ఆజ్ఞాత నక్సలైట్ నాయకుడు, అధినేత కొండపల్లి సీతారామయ్య తో "కొండపల్లి తో కొన్ని గంటలు" పేరిట ఇంటర్వ్యూలు ఇలా చేయొచ్చు అని నిరూపించిన పత్రిక అది. ఆ ఇంటర్వ్యూ అప్పటి పరిస్థితుల్లో , ఇప్పుడు కూడా సీరియస్ గా జర్నలిజాన్ని ఎంచుకొని తమకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉండాలని భావించే పాత్రికేయులకు దిక్సూచి.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు
more..