యూనివర్సిటీలో పోలీసు జోక్యంపై పోరాడి విజయం సాధించిన ఉస్మానియా విద్యార్థులకు శెల్యూట్స్ !

యూనివర్సిటీలో

ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, యూనివర్సిటీలో పోలీసు జోక్యాన్ని నియంత్రించాలని ఉస్మానియా విద్యార్థులు చేసిన పోరాటంలో వాళ్ళు విజయంసాధించారు.

చత్తీస్గడ్ లో పోలీసులు ఆదివాసులపై జరుపుతున్న అత్యాచారాలపై నిజనిర్దారణ జరపడానికి వెళ్ళిన తెలంగాణ డెమాక్రటిక్ ఫోరం బృందాన్ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి చత్తీస్ గడ్ పోలీసులకు అప్పజెప్పారు. చత్తీస్ గడ్ పోలీసులు ఆ బృందంపై అక్రమ కేసులు బనాయించి కనీసం బెయిల్ కూడా రాకుండా ఆరునెలలపాటు జైల్లో బంధించారు.

జైల్లోని వారి అనుభవాలను తెలుసుకోవడానికి ఈ నెల 27 న‌ʹప్రజా ఉద్యమాలు ‍ప్రభుత్వ విధానాలుʹ అనే అంశంపై వివిధ విద్యార్థి సంఘాలు ఓయూ కామర్స్ కాలేజ్ సెమినార్ హాల్ లో ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి వచ్చి ఆ సదస్సును ఆటంకపర్చారు. ముఖ్యంగా ఆ బృందంలోని టీడీఎఫ్ నాయకుడు చిక్కుడు ప్రభాకర్ మాట్లాడటానికి వీలు లేదంటూ అడ్డుకున్నారు.

పోలీసుల చర్యపై ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు 28 వతేదీన వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీనిపై వీసీ స్పందించకపోవడంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రంతా కార్యాలయంలోనే విద్యార్థులు భైఠాయించారు.

ఓయూలో శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. అధికారుల అనుమతి లేకుండానే పోలీసులు వస్తున్నారని ఆరోపించిన విద్యార్థులు ఓయూలోని సీసీ కెమెరాలు పోలీసు స్టేషన్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరమేమిటన్నారు. వర్సిటీ స్థలంలో ఉన్నపోలీసు స్టేషన్ లీజును రద్దు చేయాలని.. ఆదివారం సదస్సులో వక్తలను అడ్డుకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని.. వారికి షోకాజ్‌ నోటీసులివ్వాలని డిమాండ్‌ చేశారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు.

దాదాపు 20 గంటలకు పైగా తిండి , నిద్ర మానేసి విద్యార్థులు వీసీ కార్యాలయంలోనే బైటాయించి పోలీసులకు, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిట్టచివరకు దిగి వచ్చిన వీసీ విద్యార్థుల డిమాడ్లను అంగీకరించాడు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్ జారీ చేశాడు, అందులో... యూనివర్సిటీ అధికారుల అనుమతితో విద్యార్థులు సమావేశాలు, సెమినార్లను ఏర్పాటు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు కోరితే తప్ప పోలీసులు యూనివర్సిటీలోకి రావద్దని ఆదేశాలు జారీ చాశారు. తమ పోరాటంద్వారానే హక్కులను సాధించుకోగల్గుతామని నిరూపించిన ఉస్మానియా విద్యార్థులకు ʹఅవని న్యూస్ʹ అభినందనలు తెలిజేస్తున్నది.

Keywords : Ousmania University, Students, VC, Police, Struggle
(2024-03-20 18:40:19)



No. of visitors : 1731

Suggested Posts


ఉద్య‌మాల ఉస్మానియా - అమ‌రుల త్యాగాల మార్గం - వ‌ర‌వ‌ర‌రావు

కామ్రేడ్స్‌ అసోసియేషన్‌తో ప్రారంభమై ప్రత్యామ్నాయ రాజకీయాల నూతన ప్రజాస్వామిక స్వప్నం ఆచరణగా రుజువవుతున్న వర్తమానంలో ఎందరో జ్ఞాత, అజ్ఞాత ఉస్మానియా విద్యార్థుల పోరాట భూమిక ఉన్నది. అసంఖ్యాక విద్యార్థులు నిర్వహించిన ఆ పోరాటాలలో నాకు తెలిసిన, నాకు తెలియని ఇంకెందరో విద్యార్థుల ప్రాణత్యాగాల ఫలితాలు ఉన్నాయి.

ఓయూ లేకుంటే నా జీవితం లేదు : అల్లం నారాయ‌ణ‌

నేనెప్పుడూ చెప్తుంటా.. నా జీవితంలో రెండు కోణాలున్నాయని. ఒకటి ఉద్యమం. ఇంకోటి సంతోష్‌. అతని నైజం నాకు నచ్చేది. యూనివర్సిటీ మొత్తాన్ని ఆయన ప్రభావితం చేసేవాడు. ఆయన గురించి ప్రతిరోజూ వర్సిటీ చర్చించేది. మాట్లాడుకునేది. ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీని అంతలా ప్రభావితం చేసిండంటే.. అది చిన్న విషయం కాదు. కరెంట్‌ ఇష్యూస్‌ మీద ఆయన స్పందించే తీరు ప్రత్యేకం. అదే ..

ఓయూలో విద్యార్థి చ‌ల‌నాలు - సి. కాశీం

ఓయూ కేంద్రంగా 2009 నవంబర్‌ 29న ఏర్పడిన విద్యార్థి జాక్‌కు ఆర్ట్స్‌కాలేజీ జీవం పోసింది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు వెలసిన టెంట్‌ తెలంగాణ ఉద్యమాన్ని శాసించింది. తెలంగాణ ప్రజలందరు ఓయు వైపు చూసారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 2010 జనవరిలో 5 లక్షల మంది విద్యార్థులతో ఆర్ట్స్‌ కాలేజీ ముందు స్టూడెంట్‌ జాక్‌ సభ నిర్వహించింది....

ఉస్మానియా నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ

ఆర్ట్స్‌ కాలేజీకి ముగ్గువోసినపుడు నాకు పదేండ్లుంటయ్‌. మా అయ్యతోటి గల్సి కంకర గొట్టిన. రాళ్లు మోసిన. ఆర్ట్స్‌ కాలేజీకెదురుంగ కోంటోని బిల్లింగుండె(బీ హాస్టల్‌ భవనం). ఇప్పుడున్న ఠాగూర్‌ ఆడిటోరియం అడుగున అప్పట్ల సిల్మా ఆలుండె. దాని కట్టనీకి ఇటికెల్ని మూసిల్నించి తెచ్చేది....

భావోద్వేగాల కూడ‌లి ఉస్మానియా యూనివ‌ర్సిటీ - నందిని సిధారెడ్డి

ఆ తర్వాత కొద్ది రోజులకే రమీజాబీ సంఘటన జరిగింది. అడిక్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు రమీజాబీ, ఆమె భర్త న్యాయం కోసం వచ్చిండ్రు. భర్త ముందే పోలీస్‌స్టేషన్‌లో రమీజాబీపై అత్యాచారం జరిగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. ఆ సంఘటన మీద పెద్ద నిరసన. విద్యార్థులు, విప్లవ కారులు రోడ్డు మీదికొచ్చిండ్రు. అటు పోలీసులు, ఇటు విద్యార్థులు విద్యానగర్‌లో ఒక యుద్ధంలాగా జరిగింది.

రండి "వసంత కుమారి"తో మాట కలుపుదాం....!!

"పుట్టింది ఒక చోట...తిరిగింది మరో చోట...విప్లవ ప్రభుత్వాన్ని నిర్మించిందీ ఇంకో చోట" అని ʹచే గువేరాʹగురించి తరచూ అనుకునే మాటలు ఇవి. ఈ మాటలు సరిగ్గ సరిపోతాయి ఢిల్లీ ప్రొఫెసర్ డా.జి.ఎన్. సాయిబాబాకు...

ʹఓయూ విద్యార్థి వొగ్గె భరత్ ను తెలంగాణ, NIA పోలీసులు కిడ్నాప్ చేశారుʹ

15 జూలై సోమవారం రోజున తన హాస్టల్ రూమ్ లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత‌ భరత్ మిత్రుడిని కలిసి వస్తా అని ఓయూ హాస్టల్ నుండి బయటకు వెళ్ళాడు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో హిమయత్ నగర్ కేఫ్ లో టీ తాగుతుండగా కరీంనగర్ పోలీసులము అని చెప్పి భరత్ ను బలవంతంగా వ్యాన్లో పడేసి కిడ్నాప్ చేసారు. ఆరోజు రాత్రి హైదరాబాద్ లోనే ఒక గుర్తు తెలియని ఆఫీసులో తీవ్రంగా కొడుతూ త

Open Letter To President of India - OU Students

However the university has become a subject of negligence in the hands of the successive governments including the present Telangana government. The students while struggling for separate statehood have raised many issues that have been impeding the progress of the university in fulfilling its responsibility towards the people of the country...

కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఓయూ విద్యార్థులు

రాష్ట్రంలో ప్రైవేట్‌ వర్సిటీల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో విద్యార్థులు మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహ నం చేశారు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


యూనివర్సిటీలో