రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !


రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !

రిజర్వు

నల్లధన నిర్మూలనకు ఏకైక మార్గం.... ఉగ్రవాద అంతానికి ఏకైక మార్గం.... దేశం అభివృద్ది పథాన పరుగులుపెట్టడానికి ఏకైక మార్గం... అన్నింటికీ పెద్దనోట్లరద్దే మార్గమంటూ గతేడాది నవంబర్‌ 8న ఉరుములేని పిడుగు తీర్గ 1000, 500 రూపాయల నోట్లను రద్దుచేసింది నరేంధ్రమోడీ ప్రభుత్వం. ఇక దేశంలో నల్లడబ్బు అన్నదే లేకుండా పోతుందని ఉగ్రవాదులు తోక ముడిచి పాకిస్తాన్ కు మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి ఎవ్వరింటికి వాళ్ళు పోతరని భక్తజనం తెగప్రచారం చేసి‍ంది. దాదాపు పది నెలలు గడిచింది. వాళ్ళు చెప్పినట్టు ఏమైనా జరిగిందా ? మావోయిస్టులు కొత్త ప్రాంతాలకు విస్తరించారు.... మొన్ననే దండకారణ్యంలో 80 వేల మంది జనంతో రెండు రోజులపాటు భారీ బహిరంగ సభ జరిపారు. పాలకులు మావోయిస్టులను ప్రజలనుండి వేరు చేయలేరని, ఈ దేశ విముక్తి కోసం వాళ్ళు చేస్తున్న పోరాటానికి అడ్డంకులు సృష్టించగలరేమోకానీ నాశనం చేయలేరని అర్దం చేసుకోవడానికి ఈ చిన్న ఉదహరణలు చాలు కదా ! నోట్లు రద్దు చేయగానే నాశన‌మవడానికి మావోయిస్టుల ఉద్యమం పాలకుల నోట్లలో లేదని, ప్రజల గుండెల్లో ఉందనే విషయం 50 ఏండ్ల నక్సలబరీ ఎప్పుడో నిరూపించింది. ఇక మోడీ చెబుతున్న కాశ్మీర్ లో మిలిటెన్సీ తగ్గిందా ? నోట్ల రద్దు తర్వాతనే నెలల తరబడి పారామిలటరీ బలగాలకు యువతీ యువకులకు మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. పోలీసుల పెల్లెట్లకు వందలాది మంది గాయాలపాలయ్యారు. ఇక మిలిటెంట్ గ్రూప్ లలో జాయిన్ అవుతున్నవారి సంఖ్య నోట్ల రద్దు తర్వాత పెరిగింది కానీ తగ్గలేదు. అధికారిక లెక్కలప్రకారమే 2014 లో 53 మంది యువకులు మిలెటెంట్లలో చేరితే 2015 లో 66, 2016 లో 88 మంది చేరారు. ఇక ఈ సంవత్సరం జూలై వరకే 70 మంది యువకులు మిలిటెంట్ గ్రూపుల్లో చేరారంటే ప్రభుత్వ చెబుతున్న నోట్ల రద్దు ఫలితాలు అర్దమవుతున్నాయి కదా ! ఇక పెద్ద ఎత్తున ఊదరగొట్టిన బ్లాక్ మనీ పోతుందనే మాట ఎంత బోగస్ అనేది ఇవ్వాళ్ళ రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన లెక్కలు తేల్చేశాయి. గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్‌ అయినట్టు ఆర్బీఐ వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన నుంచి ఇప్పటి వరకు రూ.15.28 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు సెంట్రల్‌ బ్యాంకు వద్దకు వచ్చినట్టు పేర్కొంది. నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న 632.6 కోట్ల వెయ్యి రూపాయిల నోట్లలో, ఇంకా 8.9 కోట్ల వెయ్యి రూపాయిల నోట్లు తమ వద్దకు రాలేదని వెల్లడించింది. అంటే కేవలం 1.3 శాతం వెయ్యి రూపాయిల నోట్ల మాత్రమే వెనక్కి రాలేదని తెలిపింది. తిరిగొచ్చిన పెద్ద నోట్లలో 7 లక్షల 62వేల నకిలీ నోట్లని చెప్పింది.
మోడీ ప్రభుత్వం చెప్పిన విషయాలన్నీ అబద్దాలని తేలిపోయింది.ఇక‌ దేశం ఎక్కడికో వెళ్ళిపోతుందని ప్రచార‍ం చేసిన ʹదేశభక్తులుʹ వాదనల‌ సరుకు వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ అబద్దాల ప్రభుత్వాన్ని ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది ప్రజలే !

Keywords : demonetization, narendra modi, RBI, maoists, kashmir
(2017-11-18 09:45:10)No. of visitors : 330

Suggested Posts


ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !

అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది....

ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో.....

నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?

భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా....

బాలికా విద్య పై గుజ‌రాత్‌ గొప్పలన్నీ ట్రాష్

బాలిక‌ల సంక్షేమం, బాలిక‌ల విద్యపై గుజ‌రాత్ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న‌ది. వాస్త‌వంగా వారి విద్య విష‌యంలో ఆ రాష్ట్రం అట్ట‌డుగున నిలిచింది.బాలిక‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం అంటూ *క‌న్యా కెల‌వ‌నీ* ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని....

కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయం

ప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ....

Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?

Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు
more..


రిజర్వు