ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 5...స్లగ్గులు.. వార్తలు - -పీవీ కొండల్ రావు


   ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 5...స్లగ్గులు.. వార్తలు - -పీవీ కొండల్ రావుఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

స్లగ్గులు.. వార్తలు

అనుభవాలు,జ్ఞాపకాలు రాసుకోవడం అంటే ఆ వృత్తి,ఉద్యోగాలనుంచి బయటకు వెళ్లడం అని తమ్ముడి అభిప్రాయం. రిటైరయిన వాళ్ళు పనిలేనప్పుడు ఉబుసుపోక కోసం తమ జ్ఞాపకాలను పదిలపరుచుకుంటుంటారని అందువల్ల అనుభవాలను రాసుకుంటే ఇంక రిటైరయినట్టేనని వాడి వాదన. జర్నలిజం లో అనుభవాలు అనుభూతులుగా చెప్పుకోవడం ఇవ్వాల్టి పరిస్థితిలో అవసరమనిదీని వల్ల కొత్త తరాలు మిస్సవుతున్న వార్తా రచనా పాటవాల్ని, సేకరణలో ఇంతకుముందు అనుసరించిన విధానాలను తెలుసుకోవచ్చని నా ఫీలింగ్.
వార్తలు రాయడం నేర్చుకున్న మొదటి రోజునుంచే స్లగ్గు కు అనుగుణం గా వార్త రాయడం నాకు ఒక అలవాటు. ఆంధ్ర ప్రభలో నాకు బైలైన్లు రాలేదు గానీ ఉదయం దిన పత్రికలో ఎడిట్ పేజీలో రెండు బై లైన్ల వ్యాసాలు నావి ప్రచురితమయ్యాయి. దేశాయిపేట లో పదుల సంఖ్యలో తోళ్ళ ఫ్యాక్టరీ లున్నాయి. అక్కడి కార్మికులు చాలా మంది ఆ ఫ్యాక్టరీల పై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. ప్రభాకర్ అనే మిత్రుడు తోళ్ల కంపెనీలో పని చేస్తూ అక్కడి స్థితిగతులను గురించి చెబుతుండేవాడు. కొన్ని సార్లు ఆ కంపెనీలో కట్టింగ్ మిషన్ లో వేళ్లు తెగిపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని, ఇలా పదుల సంఖ్యలో వేళ్లు తెగిపడ్డ కార్మికులు అక్కడ కనిపిస్తారని వాళ్ళకు వేళ్లు తెగిన అనంతరం పనులు దొరకడం కూడా కష్టమని ఆ మిత్రుడు చెప్పాడు. ఆ కంపెనీ కార్మికుల కథనం స్టేషన్ ఘన్ పూర్ డేట్ లైన్ పై రాయడం కష్టం కాబట్టి ఒక సారి ఉదయం దిన పత్రిక కు ఎడిట్ పేజీ కి పంపి చూద్దామని "జీతాలు పెంచని తోళ్ల కార్ఖానా" పేరిట నేనొక చిన్న వ్యాసం రాసాను. ఆ వ్యాసం నా పేరిట రాస్తే ఆంధ్ర ప్రభలో తెలుస్తుందని హన్మ(కొండ)బాబు పేరుతో పంపాను.అది ప్రచురిత మయింది. హన్మ (కొండ)బాబు నా మొదటి బై లైన్. ఉదయం దిన పత్రిక తెలుగు పత్రికా రంగం లో ఒక సంచలనం. రన్నింగ్ కామెంట్రీ లో ఆ పత్రిక లో వచ్చిన "ఉదయం లో చూడగానె హృదయ ముగ్ధ ముద్రణం.. వదిలిందోయ్ సంవత్సర కాలపు నా నిద్రణం" అని దేవీ ప్రియ రాసిన లైన్ లు తెలుగు పత్రికలలో వచ్చిన వినూత్న ఒరవడులకు సంకేతాలు. వార్తలు, రన్నింగ్ కామెంట్రీలు..నిజంగానే అప్పట్లో ప్రజల సమస్యలు ప్రస్తుతించడానికి ఉపయుక్తం గా ఉండేది. ఆ పత్రికలో సామాజిక అవగాహన కలిగిన పాత్రికేయులు, సమాజ దిశా నిర్దేశానికి ఉపయుక్తమయిన సూచనలు చేసే వాళ్లు.నా రెండవ, మూడవ బై లైన్ లు కూడా ఉదయం లో నే వచ్చాయి.ఒకటి నాకు అత్యంత ప్రీతి పాత్రమయిన క్రీడగా కొనసాగిన క్రికెట్ ప్రపంచ కప్పు గురించి నేను రాసిన వ్యాసం అయితే, ఇంకొకటి సైన్స్ అభివృద్ధి దశలోనూ కొనసాగుతున్న "సిగాలూగే" బలహీనత గురించి. సిగాలూగే బలహీనత కూడా హన్మ (కొండ) బాబు పేరుతోనే వచ్చింది.
స్లగ్గులు ,వార్తల గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఈ రెండూ గుర్తొచ్చాయి. ఈ రెండు చిన్న వ్యాసాలు, లేదా రైట్ అప్ లు అప్పుడు ఉదయం దిన పత్రిక లో మెయిన్ డెస్క్ లో పని చేస్తున్న కృష్ణుడి ప్రోత్సాహం వల్ల వచ్చాయని తర్వాత నాకు తెలిసింది.
జగన్ జర్నలిస్టుగా జాయిన్ అయిన తర్వాత ఎప్పటిలాగే హన్మకొండ లో విజయా ఫోటో స్టూడియో కు వెళ్లినప్పుడు మిత్రుడు స్టూడియో సదానందం నాకు ఒక చిన్న స్లిప్ ఇచ్చారు. సమయం స్టాఫర్ గా నేను కొట్టించుకున్న విజిటింగ్ కార్డు అది. ఆ కార్డ్ వెనుక వైపు కాసర్ల వసంత్ అనే తనకు వార్తలు రాయడం ఇష్టమని, పత్రికల్లో చేరాలనే కోరిక వున్నదని రాసిన ఆ మిత్రుడు కలుస్తానని రాసాడు. సమయం పత్రిక అప్పటికి ఇంక రాకపోవచ్చనే ప్రచారం జరుగుతుండడం తో నేను మళ్ళీ ప్రభ వైపు రావాలని అనుకుంటున్న దశ. రుద్రాభట్ల కిషన్ సార్ ను నేనింకా చూడలేదు. ఘన్ పూర్ లో వార్తలు కంటిన్యూ చేస్తానని చెప్పేందుకు ఆదిరాజు తోడుగా సార్ ను కలిసాను. అప్పటికే పీజీ పూర్తవడంతో తనకు వరంగల్ టౌన్ వార్తలు రాసేందుకు ఒక హాండ్ కావాలని కిషన్ సార్ చెప్పారు.నేను సరే అన్నాను.ఈ లోగానే ఆంధ్ర జ్యోతి పత్రికలో కాజీపేట డేట్ లైన్ తో వార్తలు ఓ మూడు రోజులు రాసాను. ఆంధ్ర ప్రభలో వరంగల్ టౌన్ డేట్ లైన్ తో కూడా ఒక రెండు మూడు వార్తలు రాసాను. కానీ అప్పటికే నన్ను ఇంగ్లీష్ సైడ్ పంపాలని ఫిక్స్ అయిన కిషన్ సార్ వరంగల్ నగరంలో అప్పటికి ప్రముఖం గా పేరు సాధించుకున్న కేకే గా పిలుచుకునే కత్తెరశాల కుమారస్వామిని ఆంధ్ర ప్రభ లో చేర్చుకోవాలనుకున్నారు.
స్లగ్గుల నుంచి వేరే వైపుకు వచ్చాం గానీ , స్లగ్గులు వార్తల గురించి కూడా మరోసారి దృష్టి పెడదాం. ఉదయం పత్రిక, కొన్ని సార్లు ఈనాడు ఈ రెండూ కూడా స్లగ్గుల ద్వారా వార్త ఎసెన్సును పాఠకుడికి అందించే ప్రయత్నం చేసేది. అప్పటికి తెలంగాణ పాత్రికేయుల ప్రతిభ అంతగా ప్రాచుర్యం లోకి రాక పోయినా ముఖ్యమంత్రి గా ఎదిగి మృతి చెందిన అంజయ్య చనిపోయిన తర్వాత తెలంగాణ పాత్రికేయుడు వర్దెల్లి మురళి పెట్టారని చెప్పుకునే స్లగ్గు "గరీబోళ్ళ బిడ్డా నిను మరువదు ఈ గడ్డ" నాకు స్ఫూర్తిగా నిలిచింది. ఇలాంటిదే ఇంకో స్లగ్గు. "నల్లగొండకు రైలొచ్చింది",అని. ఇది కూడా ఆయనే పెట్టారనుకుంటా. నేను కూడా వార్త కన్నా ముందు స్లగ్గు ఆలోచించుకుని ఆ స్లగ్గు చుట్టూ వార్తను అల్లుకునేలా చేసేందుకు ఈ భావనే ఉపకరించిందని చెప్పుకోవాలి. ఘన్ పూర్ స్ట్రింగర్ గా ఉన్నప్పటి నుంచీ నేను ఇలాగే చేసేవాడిని.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్టింగు పెట్టి లైకులెన్ని వచ్చాయో నిమిషానికొకసారి మన ప్రొఫైల్ లోకి ఎలాగయితే వెళ్తున్నామో అప్పుడు ఉదయమే పేపర్ రాగానే నా వార్తలేవి ప్రచురిత మయ్యాయని చూసుకునేందుకు పత్రిక మొత్తం తిరిగేసేది. మేం పని చేసిన పత్రికకు టాబ్లాయిడ్ లేక పోవడం ఇందుకు ప్రధాన కారణం. కారణం ఏమయినా అది నిజంగానే కొత్త వార్తల కోణాలు ఆలోచించుకోవడానికి కూడా ఉపయోగపడేది. జిల్లా టాబ్లాయిడ్లు, అనంతరం ప్రాంతాల పేజీలు వస్తున్న ఇప్పటి పరిస్థితుల్లో కూడా విలేఖరి, ముఖ్యం గా గ్రామీణ ప్రాంత స్ట్రింగర్ తాను రాసిన వార్తను ముందుగా చదువుకుంటుంటాడు, దానికి ఎవరూ అతీతులు కారని నా భావన. టాబ్లాయిడ్లు పారితోషికాలు ఇచ్చే పత్రికల్లో పని చేసే స్ట్రింగర్లకు ఉపయోగకరం గా ఉంటాయి గానీ పాత్రికేయులు కూడా తమ పఠనా సామర్థ్యాన్ని విస్తరించకుండా సంకుచితమయ్యేందుకు ఇవే కారణాలయ్యాయి.
కేకే వార్తా రచనా శైలిని గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఉదయం దినపత్రికలో వరంగల్ లో హనుమకొండ డేట్ లైన్ పై ఆయన పనిచేస్తుండే వాడు. ఉదయం పత్రిక ముందే మనమనుకున్నట్టు తెలుగు పత్రికా రంగం లో ఓ సంచలనం. మొదటి సారి ఓ ఆజ్ఞాత నక్సలైట్ నాయకుడు, అధినేత కొండపల్లి సీతారామయ్య తో "కొండపల్లి తో కొన్ని గంటలు" పేరిట ఇంటర్వ్యూలు ఇలా చేయొచ్చు అని నిరూపించిన పత్రిక అది. ఆ ఇంటర్వ్యూ అప్పటి పరిస్థితుల్లో , ఇప్పుడు కూడా సీరియస్ గా జర్నలిజాన్ని ఎంచుకొని తమకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉండాలని భావించే పాత్రికేయులకు దిక్సూచి.
కేకే హనుమకొండ డేట్ లైన్ పై అంతే సంచలనాత్మక మైన వార్త రాసిన మొదటి వరంగల్ పాత్రికేయుడు. వరంగల్ సెంట్రల్ జైల్ పై ఆయన కథనం అప్పట్లో ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలనేలా చేసేది. ఆ మాటకొస్తే టాబ్లాయిడ్లు వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పై ప్రజలను కార్మికులను ఉద్యుక్తుల్ని చేయడం లో కీలక పాత్రను పోషించిన వరంగల్ నగర పాత్రికేయులు కోల వెంకన్న, విజయ్, బుదారపు శ్రీనివాస్, అజయ్ వీళ్లందరి వార్తా రచనా శైలి అప్పట్లో వరంగల్ పత్రికా రంగం తెలంగాణ లో ఓ వెలుగు వెలిగేందుకు కారణమయింది. వీళ్లంతా ఉద్యమాల నేపధ్యాన్ని అవలోకనం చేసుకున్న వాళ్లే. విద్యార్థి దశలో ఏదో ఒక ఉద్యమం తో మమేకమయిన వాళ్లే. ఇంకా చెప్పాలంటే కష్టాలతో సహజీవనం చేసిన వాళ్ళే. విజయ్ అనారోగ్యం తో మృతిచెందాడు. వెంకన్న, శ్రీనివాస్ లు పత్రికా రంగం లో, అజయ్ బోధనా రంగం లో వున్నారిప్పుడు.
కేకే వాక్య నిర్మాణ శైలి చాలా బాగుంటుంది. ఆయన ఆ శైలి ని పెంపొందించుకోవడానికి వరంగల్ నగరం చుట్టూ అప్పుడున్న ఉద్యమ వాతావరణం ఒక ప్రధాన కారణం. ఆయనది వరంగల్ నగరానికి కూత వేటు దూరం లో ఉన్న దూపగుంట గ్రామం. జైలు వార్త రాష్ట్ర వ్యాప్తం గా చర్చనీయాంశం గా నిలిచిన వార్త.
అందువల్ల నాకన్నా వరంగల్ డేట్ లైన్ కు కేకే సరయిన వ్యక్తి అవుతాడని కిషన్ సార్ భావించడం లో తప్పులేదని ఇప్పుడనిపిస్తున్నది. కానీ ఇంగ్లీష్ లో నన్ను చేరుస్తానని కేకే ను చేర్చుకోవడం ఒక మిష అని అప్పుడు నేననుకునే వాడిని.

-పీవీ కొండల్ రావు

Keywords : journalism, warangal, kondapalli sitharamayya, pv kondal
(2018-10-14 22:45:31)No. of visitors : 553

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 2..."కామన్ పేజీలు.. లైన్ అకౌంట్లు.."

ఆంధ్ర ప్రభ లో పని చేసిన ప్రతీ అకేషనల్, రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ కూడా తమ బై లైన్ చూసుకోవాలని పరితపిస్తారు. ఆంధ్ర ప్రభ దినపత్రికకు ఆ రోజుల్లో ఉన్న పేరు అది. ఎమర్జెన్సీ కా లం లో పత్రికా స్వేచ్ఛను నియంత్రించ యత్నించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్లాంక్ ఎడిటొరియల్ ఇచ్చారని ఆ పత్రిక పట్ల అపరిమితమైన గౌరవం.....

Search Engine

అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులు
గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల‌ మృతదేహం కోసం పోరాటం
హిందుత్వ హింసను, రాజ్య హింసను సమర్థిస్తారా - ‍ స్వామి అగ్నివేశ్, సందీప్ పాండే
అక్రమాల యుద్ధ విమానాల రెక్కల చప్పుడు - ఎన్. వేణుగోపాల్
CBI carried out ʹbiasedʹ investigation, says JNU student Najeeb Ahmedʹs mother; claims probeʹs purpose was to shield assaulters
CPI Maoist Announces ʹOperation Ghamasanʹ To Counter Governmentʹs ʹOperation Samadhanʹ
నజీబ్ లేడా.. సీబీఐకి కూడా దొరకలేదు
దండకారణ్యంలో నుల్కతోంగ్ నిజాలు
ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభ‌
ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి
70వేల మంది రైతులపై పోలీసుల అరాచకం.. బాష్పవాయు గోళాలు.. వాటర్ క్యానన్‌ల ప్రయోగం.. వందలాది మందికి గాయాలు
భీమా-కోరేగావ్ కేసు : నవ్‌లఖా నిర్బంధాన్ని కొట్టేసిన హైకోర్టు
ʹʹహక్కుల కార్యకర్తల అరెస్టుల‌ను ఖండించిన మావోయిస్టు పార్టీ - దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపుʹʹ
హిట్లర్ నిజంగానే తిరిగొచ్చాడు!!
The Maoist party condemned the arrests of rights activists and called for a national agitation to fight against the arrests
Bima Koregaon Case : Delhi High Court frees activist Gautam Navlakha from house arrest
Maharashtra Government withdraws rioting cases against Sambhji Bhide, BJP and Shiv Sena workers
ఖైర్లాంజి నెత్తుటి గాయం
దళితుల్ని, ఆదివాసీలనే చంపుతారా?
Indiaʹs government is arresting lawyers and activists amid accusations of plotting to overthrow Modi
Charges against activist VV Rao echo cases heʹs faced for 45 years – but never been found guilty of
ఏబీవీపీ తిక్క కుదిర్చిన కాలేజీ ప్రొఫెసర్.. కాళ్లు మొక్కి మరీ బుద్ది చెప్పాడు
వివాహేతర సంబంధాలు – IPC సెక్షన్ 497 - అసలు నిజాలు
ఆనాడు జైల్లో కలిసిన కేసీఆర్‌కు లేఖ ఇచ్చిన వీవీ.. ఈనాటికీ పరిస్థితులేం మారలేదు..!
పాఠాలు నేర్చుకోని దళిత ఉద్యమ నాయకులు..!
more..