ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు



ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

ఉద్యమం లాగే వార్తల్లో పోటీ

తెల్లారితే ఏం వార్త వస్తుందో ఎదురుచూసేలా చేసే రిపోర్టింగ్ ఆ రోజుల్లో వరంగల్ లో ఉండేది. అలా ఎదురుచూపులు కలిగేలా చేయడం లో రుద్రాభట్ల కిషన్ సార్ వార్తా రచన ఆరితేరింది. వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన కిషన్ సార్ తన టీం లో కే కే ను కూడా చేర్చుకోవడం తో ఆంధ్ర ప్రభ ఆ రోజుల్లో అలాంటి వార్తల ప్రచురణ లో అగ్రగామి గా ఉండేది.
భూ ఆక్రమణల పర్వం ఊపందుకున్న క్రమం లోనే ఆరంభమయిన నిర్బంధం వరంగల్ జిల్లాలో అన్ని పల్లెలకూ పాకింది. అప్పుడే అనుకుంటా కిషన్ సార్ వంగర లో పీ వీ భూముల వార్తను కూడా రాసాడు. నిర్బంధం తీవ్రతరమౌతున్న దశలో వరంగల్ లో ఆంధ్ర ప్రభ లో కిషన్ సార్, కే కే, ఆంధ్ర భూమి లో విఠల్ సార్, బుద్ధా మురళి సార్ (చెరి కొంత కాలం), ఆంధ్ర జ్యోతి లో బ్రహ్మానందం సార్, హిందూ లో శాస్త్రి సార్, ఉదయం లో కృష్ణా రెడ్డి సార్, శ్రీనివాస్ సార్ (చెరి కొంత కాలం) పని చేసారు. ఈనాడు లో నళినీకాంత్.
నిర్బంధం వార్తలు, భూ ఆక్రమణల వార్తలు ఉన్న దశలోనాకు ఇంకా డేట్ లైన్ ఫైనలైజ్ కాక పోవడం వల్ల ఆయా వార్త లను సమగ్రం గా చదువుతూ వార్తా రచన మెళకువలను నేర్చుకోగలిగే అవకాశం నాకు కలిగింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో నేను రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ గా వచ్చేందుకు సుమారు రెండు నెలల వ్యవధి పట్టింది. ఈ దశలో హనుమకొండ ఆఫీస్ కు వెళుతున్న సందర్భం లో ఫుజూల్ గా తిరగడమెందుకని బాపు మందలించిన జ్ఞాపకం. అయితే వార్తల కోసం పత్రికల్లో పని చేయడం కోసం నేను ఎంచుకున్న వృత్తిని బాపు ఎప్పుడూ వద్దనే వాడు కాదు. బాపుకు, మా కుటుంబానికి అత్యంత ఆప్త మిత్రుల్లో మల్కాపురం రాజేశ్వర్ రెడ్డి ఒకరు. హనుమకొండ నుంచి మల్కాపూర్ కు, అక్కడి నుంచి హనుమకొండ కు వెళ్ళే ప్రతీసారి ఇంటికివచ్చి కనీసం చాయ అయినా తాగి వెళ్ళే వాడు ఆయన. ఓ రోజు తన మిత్రులతో ఆయన మా ఇంటికి వచ్చాడు. బాపుతో మాట్లాడుతున్న వాళ్లకు నేను టీ తెచ్చి ఇస్తున్నప్పుడు రాజేశ్వర్ రెడ్డి వెంట వచ్చిన మిత్రుడు మీ వాడు ఏం చేస్తున్నాడని అడిగాడు. బాపు మా వాడు జర్నలిస్టు అని చెబితే "దామన్న జర్నలిస్టు అనేది పనేనానే" అని ఎద్దేవా చేసాడాయన.
రెండు నెలల వ్యవధి అయింది. నా దరఖాస్తు మదురై వెళ్ళి వచ్చింది. ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఓ పక్క కే కే వార్తలు నిరంతరాయం గా వస్తున్నాయి. నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో జాయినవడం కల్ల అనుకుంటున్న దశ లో ఓ అద్భుతం జరిగింది.ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో నా మొదటి బై లైన్ వార్త "వరంగల్ ఇన్ నీడ్ ఆఫ్ రాపిడ్ ఇండస్ట్రియలైజేషన్" స్లగ్ తో ప్రచురితమయింది. నా ఆనందానికి అవధులు లేవు. నేను ఇంగ్లీష్ రిపోర్టర్ ను అయ్యాను. ఆ రోజు నుంచీ రోజూ ఇంగ్లీష్ వార్తలు పంపడం నా ఉద్యోగం గా మారిందనే సంతోషం.
తెలుగులో వార్తల పోటీ చాలా తీవ్రం గా కొనసాగుతున్నది. కిషన్ సార్ కొన్ని వార్త లను సీరియల్ లు గా కూడా రాస్తున్నడు. ఒక అనుభవజ్ఞుడయిన రిపోర్టర్ తో పోల్చుకోవడం తప్పే గానీ నేను వార్తలు పంపడానికి సార్ షెడ్యూల్ కారణం గా ఇబ్బందులెదురయ్యేది. దీంతో రెసిడెంట్ ఎడిటర్ సుందరం సార్ నుంచి రోజూ తిట్లు పడాల్సి వచ్చేది.
అప్పట్లో అన్ని ఆఫీసుల్లో టెలిప్రింటర్ లు ఉండేది. ఆ టెలిప్రింటర్ లో అవతలి వాళ్ళు లైన్ లోకి రావడం ఆలస్యం అయితే , లైన్ సరిగా పనిచేయక పోతే ఓ రెండు లైన్ ల పోయెం లాంటిది కొట్టేవాళ్ళు. ఆంధ్ర ప్రభ లో మిత్రుడు శివకుమార్ తో నేను రోజూ ముందుగానే ఆఫీస్ కు వచ్చేది కాబట్టి ఆ పోయెం నాకు తెలిసింది."నౌ ఈజ్ ద టైం ఫర్ ఆల్ గుడ్ మెన్ టు కం టూ ద ఎయిడ్ ఆఫ్ నేషన్ ... నౌ ఈజ్ ద టైం ఫర్ ఆల్ గుడ్ మెన్ టూ కం టూ ద ఎయిడ్ ఆఫ్ పార్టీ" అని ఆ లైన్ ల సారాంశం. సుందరం సార్ భయం తో రోజూ ఆఫీస్ లో నేను ఆ లైన్ లను మననం చేసుకుంటుండే వాడిని. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో మొదటి బై లైన్ వచ్చిన తర్వాత రోజూ బై లైన్ వార్తలే రాయాలనే తపన ఉండేది. ఆ స్థాయి వార్త అయినా కాకున్నా టెలి ప్రింటర్ లో పేరు పెట్టి పంపే వాళ్ళం. ఈ చర్య సుందరం సార్ నుంచి తిట్లకు కారణమయ్యేది. సార్ తిట్లు, ఆఫీస్ లో రవీందర్ సార్, వసంత్, రాజు గారు, శివకుమార్ ల ఓదార్పు ఇవి మామూలయిన సందర్భమది.
కిషన్ సార్ వార్తలు కొత్త రిపోర్టర్లు వార్తా రచనను ఎలా చేయవచ్చో తెలుసుకునేందుకు ఉపకరించేవి. ఇదే దశలో వరంగల్ నగరానికి కూత వేటు దూరం లో ఉన్న భట్టు పల్లి లో ఓ స్థూపావిష్కరణ సభకు అప్పటి జిల్లా కార్యదర్శి గుండెబోయిన అంజయ్య అలియాస్ బాలన్న నుంచి పిలుపొచ్చింది. ఆ ఇంటర్వ్యూ కం సభకు అందరితో బాటు నేనూ వెళ్ళాను. అక్కడి కార్యక్రమ రిపోర్టింగులో సహజంగానే కిషన్ సార్ పై చేయిగా నిలిచాడు.
కిషన్ సార్ వార్తల్లో కంఠాత్మకూర్ దేశాయి గడీ వార్త ప్రముఖమయింది. ఆ ఊళ్లో చాలా మంది గ్రామస్తులపై మిలిటెంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడినుంచి యువకులంతా సరెండర్ అవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వార్తను ప్రముఖం గా ప్రచురింప జేయడం లో ఆంధ్ర ప్రభ ముందున్నది. నిర్బంధం తీవ్రమౌతున్న దశలో ఘన్ పూర్ ప్రాంతం లోని విశ్వనాధగూడెం వద్ద నక్సలైట్లు ఓ మందు పాతర పేల్చారు. ఇందులో బీ ఎస్ ఎఫ్ జవాన్లు 16 మంది మృతిచెందారు. మద్యాహ్నం జరిగిన ఈ ఘటనలో పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు నలుగురిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన మిట్ట మద్యాహ్నం జరిగింది. ఇలాంటి వార్తలు గానీ, ఎక్స్ క్లూజివ్ వార్తలు గానీ రాస్తున్న సందర్భాల్లో కిషన్ సార్ ముందే డెస్క్ ను, ఎడిటర్ ను అలర్ట్ చేసే వాడు. వాస్తవానికి జిల్లాల్లో పనిచేసే రిపోర్టర్ లు అలా రోజూ షెడ్యూళ్లు పంపడం ఒక పద్ధతి. కానీ రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ నయిన నేను అలా మెసేజి లు పంపడం చేయక పోవడం వల్ల రోజూ తిట్లు తప్పక పోయేది. జిల్లా కేంద్రం లో పని చేయాల్సిన నేను ఊరి నుంచి వస్తున్నాననేది నా పై ఉన్న ప్రధాన విమర్శ. వీటి ని అప్పుడున్న పరిస్థితుల్లో రెక్టిఫై చేసుకోవడం నాకు సాధ్యం కాలేదు. విశ్వనాధగూడెం మందు పాతర వార్త రోజు ఫాలో అప్ స్టొరీలు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో రాసే స్థాయి అప్పటికి నాకు ఇంకా రాలేదు.
ఇక్కడే ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో సీనియర్ గా ఉంటూ సంఘటనలు జరిగినప్పుడు వరంగల్ కు వచ్చే రాజారాం సంక్లా గురించి చెప్పుకోవాలి. మందుపాతర ఘటన ల వార్త ల స్పెషలిస్ట్ అని నేను సంక్లా గారిని అనుకునే వాడిని. ఆయన వాడిన పదాలు " డెర్రింగ్ డు","లంపూన్స్ ఆఫ్ ఫ్లెష్ స్ట్రూన్ " లాంటి పదాలు వాడాలని కుతూహల పడే వాడిని.
సుందరం సార్ మందలింపులు, ఆఫీస్ లో మిత్రుల ఓదార్పులు మామూలయిపోయాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో సౌత్ ఇండియా మొత్తం కవర్ అయ్యే డెవలప్ మెంట్ న్యూస్ పేజీ పదిహేను రోజులకోసారి వచ్చేది. ఎడిట్ పేజీ ఎదురు గా వచ్చే పేజీ లో ఆ వార్తలు ప్రచురితమయ్యేది.ఆ పేజీ కి వార్త రాయాలనేది నా కోరిక. దాన్ని డెస్క్ కు డైరెక్ట్ గా పంపాను. సహజం గానే నేను నా వూరి సామూహిక వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వార్తను ఆ పేజీ కోసం పంపాను. నేను మా వూరు చిన్న పెండ్యాల వార్తలే రాస్తానని విమర్శ. హైదరబాద్ లో ఇప్పుడు ప్రధాన ఇంగ్లీష్ పత్రికల్లో బాధ్యతాయుతమయిన పోస్టుల్లో ఉన్న సీనియర్లు కూడా ఈ విమర్శ చేస్తారు. ఆ వార్త నేను డెస్కుకు పంపాను. మూడు వారాలు అయినా ఆ స్టోరీ రాలేదు. దాంతో న్యూస్ ఎడిటర్ కు కాకుండా రెసిడెంట్ ఎడిటర్ కే మెసేజి పెట్టాం. ఈ మెసేజి నా పై సుందరం సార్ విరుచుకు పడడానికి కారణమయింది. ఆ రోజు ఆఫీస్ లో వెక్కి వెక్కి ఏడ్చాను. రవీందర్ సార్, వసంత్, రాజు గారు ఎప్పటిలాగే నన్ను ఓదార్చారు. నేను వార్తను ఎలా పంపానని సుందరం సార్ అడిగినప్పుడు పార్సెల్ లో పంపానని చెప్పాను. ఎడ్ల బండ్ల పై పంపక పోయావా అని విరుచుకు పడ్డాడు సార్. ఈ ఘటన నన్ను బాధించింది.
కిషన్ సార్ ఉన్నప్పుడు వార్తలు పుంఖానుపుంఖాలుగా రాసే వాడు. టెలిప్రింటర్ లో టేకుల మీద టేకులు అనర్ఘళంగా సాగుతుండేది ఆయన వార్త.ఉదయం స్పెషల్ స్టోరీలు కొట్టి ఇంటికి వెళ్లి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ రెగ్యులర్ వార్తలు కొట్టే వాడు. సార్ వెళ్ళింతర్వాత కే కే స్టోరీలు. నాకు అవకాశం దొరికేది కాదు. అసలే బై లైన్ లు రావాలనే కోరిక.కిషన్ సార్ కు తెలియకుండా వార్తలు పంపడం కష్టమయ్యేది.దీంతో కొన్నిసార్లు లూప్ లైన్ లో పేరు కొట్టి పంపే వాళ్లం. అయితే డెస్క్ లో సార్ కు తెలియకుండా వార్త వచ్చేది కాదు. నాతో పాటు గోదావరిఖని రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ గా వచ్చిన పిట్టల రవీందర్ బై లైన్ లు ఎక్కువ రావడం కూడా నా బై లైన్ దాహానికి కారణం.
మా వూరి వార్త డెవలప్మెంట్ పేజీ లో ప్రచురితమయింది. టాప్ టు బాటం సింగిల్ కాలం బై లైన్ స్టోరీ అది. నిజంగానే నాకు సంతోషం కలిగింది. కానీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో నాది దిన దిన గండమే. కారణం రిపోర్టర్ నై ఉండి నేను తిరగక పోవడం. " రిపోర్టర్ తిరగక, సబ్ ఎడిటర్ తిరిగి చెడి పోతారని ఓ సామెత గదా!..
-పీవీ కొండల్ రావు

Keywords : warangal, journalism, peopleswar, andhraprabha, indianexpress, reporter
(2024-04-21 09:16:25)



No. of visitors : 1530

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..