ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు



ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

లీ డ్స్.. సూపర్ లీడ్స్

నా అనుభవాలను అనుభూతుల రూపం లో రాయాలనుకున్ననాటినుంచీ రోజూ ఎలా ఆరంభించాలా అనిఆలోచించాల్సి వస్తున్నది. సాధారణం గా ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడో, ఓ సభలో ప్రధాన ఉపన్యాసాన్ని కవర్ చేయాల్సి వచ్చినప్పుడో లీడ్ ఏం రాయాలో ఆలోచించుకుంటుంటాం. ప్రధాన పత్రికల సీనియర్ రిపోర్టర్ లు ఈ విషయాల్లో అందె వేసిన చేయి గా వుంటారు గానీ జిల్లాలలో, గ్రామీణ ప్రాంతాలలో పని చేసే పాత్రికేయులు కొన్ని సార్లు ఈ విషయాన్ని సామూహికంగా చర్చించుకుంటారు. వరంగల్ లో పోటీ సంస్కృతి కొనసాగినప్పటికీ లీడ్స్, సూపర్ లీడ్స్ విషయం లో కొత్త తరాలకు దిశా నిర్దేశకులుగా నిలిచిన పాత్రికేయుల్లో రుద్రాభట్ల కిషన్ సార్, పిట్టల రవీందర్, జకీర్ సార్ లను ఉదహరించవచ్చు. వీళ్ల తర్వాత వచ్చిన పాత్రికేయులు గానీ , గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి జిల్లా స్థాయికి ఎదిగిన రిపోర్టర్లు గానీ అలాంటి ప్రాధాన్యతను కలిగి లేరని నేననడం లేదు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో నా ఉద్యోగం ఎగుడు దిగుడుగానే కొనసాగింది. అయినా జిల్లా కార్యాలయం లో ప్రోత్సాహం తో నెట్టుకొచ్చాను. వార్తల కవరేజీ లో కొంత మెరుగైన దశ కు చేరుకోగలిగాను. జిల్లాలో భూ ఆక్రమణల పర్వం కొనసాగుతున్న దశలో పలు ప్రాంతాల్లో ప్రజా కోర్టులు నిర్వహించిన ఘటనలను వార్తల రూపం లో అందించేది.అలాంటి కవరేజీ వరంగల్ తో బాటు అప్పుడు ఉద్యమ న్యూక్లియస్ లు గా కొనసాగిన ఉత్తర తెలంగాణ పల్లెలన్నింటా కనిపించేది. ఆ కవరేజీ కూడా పోటా పోటీ గా ఉండేది. అనుభవాలన్నీ నక్సలైట్ ఉద్యమం గురించి,ఘటనల పరంపర గురించే రాస్తే ఉద్యమాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్లకు నచ్చక పోవచ్చు గానీ, అప్పటి పరిస్థితి అది. రోమ్ లో ఉన్నప్పుడు అందరూ రోమన్లు గా మారాల్సిందే.. అన్నట్టుండేది.
ప్రజా కోర్టులనగానే ప్రధానం గా గుర్తుకొచ్చే ఘటన వరంగల్ జిల్లా లోని చేర్యాల ప్రాంతం లో జరిగింది.ఊరు పేరు నాకు గుర్తులేదు గానీ అక్కడి ఓ గ్రామం లో ప్రజా కోర్టు సందర్భంగా నక్సలైట్ దళం తమ సమాచారాన్ని పోలీసులకు చేరుస్తున్నారనే కారణం గా ఒకరిని చితక బాదారు.ఆ వార్త కవరేజీ కోసం వెళ్ళిన విలేకరుల సమక్షం లో నే ఘటన సంభవించింది. వార్తల కవరేజీ ప్రధానం గా,విధి నిర్వహణకు వెళ్లిన పాత్రికేయులు వార్త రాసారు. ఆ వార్త ప్రచురితమయింది. కొంత కాలానికి నిర్బంధం తీవ్రతరమయినప్పుడు ఆ కేసునుతిరగదోడారు. ఘటనకు బాధ్యులుగాభావించే దళం పై కేసు నమోదు చేసి గ్రామం లోని మిలిటెంట్ల పై కేసు పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ ప్రజా కోర్టు వార్త రాసిన విలేకరులను సాక్షులుగా చేరుస్తూ కేసు నమోదు చేసారు. ఈ ఘటన సహజం గా నే పాత్రికేయుల వెన్నులో వణుకు పుట్టించింది. ప్రజా కోర్టు వార్తను కవర్ చేసిన మంచాల శ్రీనివాస్ రావు తో బాటు స్థానిక విలేకరులను సాక్షులుగా పెడుతూ పోలీస్ అధికారి సలీముద్దీన్ కేసు నమోదు చేశారు.ఈ పరిణామం పాత్రికేయుల సంఘటిత శక్తి ఎలా ఉంటుందో తరచి చెప్పింది. అప్పటి జర్నలిస్టు యూనియన్ నాయకత్వం మంచాల పై నమోదయిన పిర్యాదు పై తీవ్రంగా స్పందించింది. యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అమర్ లతో బాటు జిల్లా నాయకత్వం కూడా చేర్యాల విలేకరులకు అండగా నిలిచి సలీముద్దీన్ బదిలీ కోసం నిరసనలు జరిపారు. మంచాల ఈ ఘటనానంతరం వరంగల్ కు వచ్చారు.
కబడ్డీ ఆట లో మన జట్టు గెలవాలనుకున్నప్పుడు పల్లెల్లో అయితే మంచి మంచి ఆటగాళ్ళను మన టీం లోకి కోరుకుంటుంటాం. ఇది పల్లెలే ప్రధానం గా గల చోట ఒక రివాజు గా నిలుస్తూ వచ్చేది. రుద్రాభట్ల కిషన్ వరంగల్ కు రాగానే తన జట్టు బలోపేతం కావడానికి అనువైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. ముందుగా ఇతర దిన పత్రికల్లో పనిచేసే తురుపు ముక్కలను ఏరుకొని తన జట్టులోకి చేర్చుకునే వాడు. తర్వాత ఆ ఎంచుకున్న విలేకరులకు తగు అవకాశాలు కల్పించే వాడు. కురవి ప్రాంతం లో ఆంధ్ర భూమి విలేకరి గా అప్పుడు దొంతు రమేశ్ పని చేసేవాడు. కిషన్ సార్ వచ్చాక ఆయనను మహబూబాబాద్ ఆంధ్ర ప్రభ విలేకరిగా తీసుకొచ్చారు. రమేశ్ అప్పటి తన స్థాయిలో వార్తా రచనలో తగు ప్రతిభను చూపే వాడు. నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తుండడం వల్ల నాకు ఆయా ప్రాంతాల పాత్రికేయుల తో పోటీ గానీ,ఘర్షణ గానీ ఉండేది కాదు గానీ, రాజు గారి లాంటి సీనియర్లు తమ వార్తల కన్నా మహబూబాబాద్, ఏటూరునాగారం వార్తలు ప్రచురితమవడాన్ని జీర్ణించుకోలేక పోయినప్పుడు పంచాయితి తప్షా చేసే పని మాత్రం నేను తీసుకునేది.
వరంగల్ లోని గ్రామీణ ప్రాంతాలనుంచి పత్రికా రంగానికి పలు తురుపు ముక్కలు అందాయి. అలాంటి తురుపు ముక్క లలో ఒకరు ఎడమ సమ్మి రెడ్డి.ఏటూరునాగారం, తాడ్వాయి డేట్ లైన్ లతో ఈనాడు వార్తలు రాసిన సమ్మి రెడ్డి ఐ టి డీ ఏ పై సీరియల్ వార్తలు రాసాడు. పత్రికా రంగం లో రాణించడానికి వార్తలు రాయాలనే జిజ్ఞాస ,భాష పై పట్టు పెంచుకోవాలనే కోరిక ఉంటే ఏదయినా సాధ్యమే అని నిరూపించిన అతి కొద్ది మంది జర్నలిస్టులలో సమ్మి రెడ్డి ఒకరు. మంచాల శ్రీనివాస్ వరంగల్ వచ్చే సరికే వార్తల్లో పోటీ తీవ్రస్థాయికి చేరుకున్నది. అప్పుడు ఉదయం దిన పత్రిక స్టాఫర్ గా వ్యవహరించిన మిట్టపల్లి శ్రీనివాస్ సార్ కూడా ఈ పోటీద్వారా పాఠకులలో వార్తా పఠనా సామర్థ్యాన్ని పెంచేందుకు కృషిచేసారని చెప్పక తప్పదు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్నప్పటికీ , నా తెలుగు వార్తా వ్యాసాంగం కొనసాగింది. జిల్లాల్లో ఉంటే లభించే అరుదైన అవకాశమది. జిల్లా కేంద్రాల్లోని టెలి ప్రింటర్ సదుపాయమున్న కార్యాలయాలకు అనుబంధం గా పని చేసే పాత్రికేయులకు ఈ అవకాశం తప్పక దొరుకుతుంది. అప్పట్లో కేవలం లాండ్ ఫోన్లు మాత్రమే వుండేవి. అది కూడా ఎస్ టీ డీ సదుపాయం అంతటా లభించేది కాదు. బస్సుల్లో మాత్రమే కవర్లు పంపుతూ వార్తలు చేరవేసే పరిజ్ఞానం ఉండేది. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉన్న రిపోర్టర్లకు టెలిగ్రాం బేరింగ్ కార్డులుండేది. ఆ సదుపాయం ఆధారంగా ఎమెర్జెన్సీ వార్తలు పంపేది. ఫోన్లలో వార్తలు చెప్పాల్సిన సందర్భాలు వస్తే ఆఫీసులో ఉన్న రిపోర్టర్లు రాసుకొని మళ్లీ టెలిప్రింటర్ ద్వారా పంపే వాళ్లం. ఆంధ్ర ప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెండూ ఒకే యాజమాన్యపు పత్రికలు కావడం వల్ల మండలాలు,నియోజక వర్గాలనుంచి వచ్చే ఫోన్ వార్తలు నేను కూడా తీసుకునే వాడిని. ఆ వార్త లను రాయడం వల్ల నా తెలుగు వార్తా ప్రెజెంటేషన్ నేను కోల్పోలేదని అనుకుంటున్నాను.
వార్తలు, లీడ్ లు,సూపర్ లీడ్ లు వీటన్నిటిలో తర్ఫీదు పొందడానికి జిల్లాలలో పత్రికా కార్యాలయాలు ఒరియెంటేషన్ సెంటర్ లు గా నిలుస్తాయి. మావిషయం లో ఇది నిజం. ముఖ్యం గా పీ ఎన్ స్వామి సార్, వీ ఎల్ సార్, ఆ తర్వాత రుద్రాభట్ల కిషన్ సార్ వీళ్ల ముగ్గురి నేతృత్వం లో పని చేసినప్పుడు ఆ అవకాశం లభించింది. కిషన్ సార్ వీళ్లలోకి యువకుడు కావడం వల్ల వేవ్ లెంత్ కలిసి వచ్చింది. కిషన్ సార్ శైలి గురించి పదే పదే వివరించడానికి కారణం ఆయన ఎంచుకునే వినూత్న వొరవడులు. అంతకు ముందు డెస్కు అనుభవం కూడా సార్ కు ఉండడం ఒక యాడెడ్ అడ్వాంటేజ్ .జిల్లాల్లో ప్రత్యేక టాబ్లాయిడ్ లు లేనప్పుడు ఒక పత్రిక ను టాబ్లాయిడ్ స్థాయిలో పాఠకునికి చేరువలో తీసుకు వెళ్లేందుకు ఆయన పట్టుదలతో వ్యవహరించిన తీరు మరిచిపోలేనిది. అప్పట్లో ఆంధ్ర ప్రభ లో వారానికోసారి "చౌరాస్తా ముచ్చట్లు" అనే ఆఫ్ బీట్ వార్తల సమాహారం వచ్చేది. ఈ చౌరాస్తా ముచ్చట్లు కిషన్ సార్ రూపొందించిన ఒక కాలమ్ . ఆ కాలమ్ లో వచ్చే బిట్లను ఆసక్తి గా చదువుతూ సెటైర్ లు ఎలా రాయవచ్చో నేర్చుకోగలిగాం.
వార్తలు, రచనా శైలి లో మెరుగుదలను గురించి చెప్పుకుంటున్న క్రమం లోనే ఇక్కడి పాత్రికేయులు ప్రజా సమస్యలలో మమేకమైన తీరును గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటాది. ఉద్యమాల ఖిల్లా అని పేరొందిన వరంగల్ తో బాటు కరీం నగర్, ఆదిలాబాద్ లో ఈ సందర్భం లోనే మూడు పరిశ్రమలు మూత పడే విపత్కర పరిస్థితి నెలకొన్నది. సర్ సిల్క్ మిల్స్, అంతర్గాం పరిశ్రమ, ఆజం జాహీ మిల్లు ఈ మూడూ కూడా కార్మికులను ఇబ్బందుల్లో నెడుతూ మూసివేత వైపు పయనిస్తున్న రోజులవి. కార్మికుల సమస్యలను , అక్కడి పరిస్థితులను రాయడం వరకే పాత్రికేయులు సాధారణం గా చేయగలిగే పని. అయితే వరంగల్ నగరం లోని ఆజం జాహీ మిల్లు పరిరక్షణ ఉద్యమం లో పాత్రికేయులు దిశా నిర్దేశనం చేసిన తీరు నిజం గా అనిర్వచనీయమైంది. మిల్లు ఉద్యమం కొత్త రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి అప్పుడు ఆ ఉద్యమ దిశా నిర్దేశకులుగా పని చేసిన పాత్రికేయ మిత్రులు ఈనాడు కోల వెంకన్న, ఆంధ్ర జ్యోతి విజయ్, అజయ్, గుండెబోయిన శ్రీనివాస్, ఈనాడు లోనే పని చేసిన బుదారపు శ్రీనివాస్, వీళ్లందరికీ నాయకుడిగా వెనుక నుండి పని చేసిన కే కే ఎంతగానో ఉపయోగ పడ్డారు. ఆజంజాహీ ఉద్యమం ఉధృతం చేయడానికి పాత్రికేయులు కృషి చేసినా నాయకుల, ప్రభుత్వాల చిత్తశుద్ధి లేమి వలన ఆ మిల్లు శాశ్వతం గా మూత పడింది.
విశాఖపట్నం లో చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాల రాజు కిడ్నాప్ ఘటన వరంగల్ వార్తలు మొదటి పేజీల్లో ప్రముఖం గా చోటుచేసుకునేందుకు అవకాశాన్నిచ్చిన ఒక సందర్భం. ఆ సందర్భం లో ఆంధ్ర ప్రభ మిగతా పత్రిక లకు అందనంత దూరం లో నిలిచిందని చెప్పవచ్చు. ఎం ఎల్ ఏ ను కిడ్నాప్ చేశారు. నక్సలైట్లు తమ డిమాండ్లు ప్రకటించారు. ఆ డిమాండుల్లో భాగం గా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న తమ నాయకుడు క్రాంతి రణదేవ్ విడుదలను కోరారు. ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల నుంచి, నక్సలైట్ల కోణం లో ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. ఆ భిన్న కోణాలను వార్తల రూపం లో పెట్టడం అప్పటి మా విధి. ఆ విధిని నిర్వహించడం లో ఆంధ్ర ప్రభ కిషన్ సార్ టీం సఫలీకృతమయింది. డాక్ ఎడిషన్ లో ఈ సందర్భం లో ఒక నాలుగు అయిదు రోజులు అన్నీ వరంగల్ వార్తలే వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్ర ప్రభ లో వార్తలు వచ్చిన స్థాయిలోనే నేనూ వార్తలు పంపాల్సి వచ్చేది. హైదరాబాద్ లో అనువాదం చేసుకునే అవకాశమున్నా, ఈ కిడ్నాప్ ఘటన సందర్భం లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కూడా వార్తలు ప్రముఖం గానే వచ్చాయి. ఆ వార్తల సందర్భం లోనే సుందరం సార్ నన్ను గట్టిగా మందలించిన ఘటన జరిగింది. కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన వార్తల కోణాల్ని తీసుకుని వార్త రాసాను. మద్యాహ్నం వేరే వార్తల కోసం కలెక్టరేట్ కు బయలుదేరిన కిషన్ సార్ స్కూటర్ స్కిడ్ అవడం తో దెబ్బలు తాకి ఇంట్లోనే వుండాల్సి వచ్చింది. సార్ రాడనే విషయం తెలియడం తో ఆ రోజు నేను తొందరగా ఇంటికి వెళ్ళి పోయాను. ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య చర్చల ప్రగతి ఎప్పటికప్పుడు ఇంటినుంచే తెలుసుకున్న కిషన్ సార్ ఆ రోజు పొద్దు పోయిన తర్వాత వరంగల్ జైలు నుంచి రణదేవ్ ను విశాఖ జైలుకు తరలిస్తున్న వార్తను డాక్ ఎడిషన్ వరకే సింగిల్ కాలం లో అందించగలిగారు. ఇంటికెళ్లిన నేను తెల్లవారి పేపర్ లో ఈ వార్తను చూసాను. అయితే నేను ఆ వార్తను మిస్సయ్యాను గదా అని కనీసం ఫీల్ కాలేదు. నొప్పులు తగ్గడం తో తెల్లవారే మళ్ళీ యధావిధిగా తన డ్యూటీ కి వచ్చిన కిషన్ సార్ కూడా నన్నేమీ అనలేదు గానీ, సుందరం సార్ ఈ సారి ఘాటుగానే మందలించారు.
వార్తలు రాయడం నేర్చుకుంటున్న క్రమం లో గ్రామాల్లో పత్రికా రంగం పై ఆసక్తి చూపుతున్న కొత్త తరాల పరిచయాలు పెరుగుతుండేవి. ఉద్యమ కాలం లో గ్రామాల్లో ఘటనల కవరేజీ కి వెళ్లినప్పుడు పరిచయమైన మిత్రులు కొందరు కూడా కొత్త గా పత్రికా రంగాన్ని ఎంచుకున్నారు. అలా ఎంచుకోవడానికి, వాళ్లు పత్రికా రంగం లో కొనసాగడానికి అప్పుడున్న ప్రోత్సాహంఎంతగానో ఉపకరించింది. చాలా మంది మిత్రులను పత్రికా రంగానికి నేను పరిచయం చేసేందుకు అప్పటి ప్రోత్సాహకర వాతావరణం ఎంతగానో తోడ్పడింది.అలా ఫీల్డ్ లోకి వచ్చిన మిత్రుల్లో తాటీకాయల కాశీనాధం కొడుకు మామిడాల వెంకటేశ్వర్లు ఒకరు. అప్పటికే రఘునాధపల్లి ఈనాడు స్ట్రింగర్ గా పనిచేసిన వెంకటేశ్వర్లు నేను ఘన్ పూర్ డేట్ లైన్ నుంచి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి మారాక ఘన్ పూర్ ప్రభ విలేకరి అయ్యాడు. లేఖా రచయితలుగా ఉన్న కంజర్ల నర సిం హ రాములు, జలీల్ ఆజాద్ పేరుతో లేఖలు రాసిన జలీల్ కూడా అలా పాత్రికేయులయిన వాళ్లే.
కొన్నిసార్లు ముగింపు అర్థాంతరంగా చేస్తున్నామనిపిస్తుంది. ఇంకో కోణాన్ని ఇంటర్ వీవ్ చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఎలా ముగించాలో కూడా అర్థం కాదు. ఇప్పుడదే పరిస్థితి. కొత్త స్లగ్ నా చేతిలో ఉంది గానీ ఇప్పటి ముగింపు అసం పూర్తి గా ఉన్నదేమో అనిపిస్తున్నది. అయినా మళ్లీ కొనసాగడానికి ఇక్కడ ముగించక తప్పదు.
- పీవీ కొండల్ రావు

Keywords : journalism, warangal, naxals, police, mla bal raj
(2024-04-24 19:16:43)



No. of visitors : 1760

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..