బుద్దుడి శిష్యుల నరమేదం.. 400 మంది ముస్లింల ఊచకోత
బుద్దుడు శాంతిని బోధిస్తే ఆయన శిష్యులు మాత్రం నరమేదం చేస్తున్నారు. మయన్మార్ లో రోహిగ్యా ముస్లింల జాతి హననం సాగిస్తున్నారు. వేలాదిమందిని అతి క్రూరంగా హింసలు పెట్టి చంపేస్తున్నారు. రోహింగ్యా ముస్లింలు నివసించే వందలాది గ్రామాలను తగలబెడుతున్నారు. బుద్దిస్టు మతోన్మాదులు, సైన్యం కలిసి రోహింగ్యా ముస్లింల పై చేస్తున్న హింస, అత్యాచారాలకు అంతు లేకు౦ండాపోయింది. ఈ వారంరోజుల్లో 400 మంది రోహింగ్యా ముస్లింలు మరణించినట్లు ఆ దేశ సైనికాధిపతి మిన్ ఆంగ్ హ్లెయింగ్ కార్యాలయం తెలిపింది. రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు నివసించే రఖైన్ రాష్ట్రంలో ఈ మారణకాండ మరింత ఎక్కువగా ఉంది.

మయన్మార్లో బౌద్ధులకు, రోహింగ్యా ముస్లింలకు మధ్య విభేదాలు కొత్తవేమీ కాదు. గత ఐదేళ్లుగా ఈ మత పరమైన సంక్షోభం అక్కడ కొనసాగుతూనే ఉంది. స్వయంగా సైన్యం, రోహింగ్యా ముస్లింల మీద దాడులకు తెగబడుతోంది. రఖైన్ రాష్ట్రంలో వందల కొద్దీ గ్రామాలు తగులబడిపోయాయి. సైనికులు రోహింగ్యా ముస్లింలు దాగి ఉన్నారనే ఆరోపణలతో గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. వందలాది గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. దీంతో వణికిపోతున్న సామాన్య రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు.

బంగ్లాదేశ్‌కు చేరేందుకు అడ్డుగా ఉన్న నాఫ్ నదిని దాటేందుకు తాత్కాలిక పడవలను ఆశ్రయించారు. అయితే, అవి మార్గం మధ్యలో మునిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఊచకోతలపై దేశ వ్యాప్తంగా పుకార్లు చెలరేగడంతో అశాంతి నెలకొంది. రఖైన్ రాష్ట్రం జాతి, మతపరంగా చీలిపోయింది. ఊచకోతలో మరణించిన వారి సంఖ్య వేలల్లో ఉంటుందని, మిలటరీ దళాలు తక్కువ మంది మరణించినట్లు లెక్కలు చూపుతున్నాయని స్వచ్చంద సంస్ధలు ఆరోపిస్తున్నాయి.

రోహింగ్యా జాతిని నాశనం చేసేందుకు సైన్యం, బౌద్ధులు యత్నిస్తున్నారని స్వచ్చంద సంస్థల ఆరోపణ. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కూడా మయన్మార్‌పై ఇదే ఆరోపణ చేశారు. బర్మాలో చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకూ 27 వేలకు పైగా రోహింగ్యా ముస్లింలు పారిపోయినట్లు ఐరాస ఓ ప్రకటనలో పేర్కొంది. మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. పౌరుల ప్రాణాలను కాపాడాలని మయన్మార్ ప్రభుత్వాన్ని అమెరికా కోరింది.
Keywords : maynmar, rohingya muslims, buddists, america, army attacks
(2023-09-26 04:07:28)
No. of visitors : 6059
Suggested Posts
0 results
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..