భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు: విజయాలు-సవాళ్లు- హైదరాబాద్ లో అఖిల భారత సదస్సు

భారత

భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు: విజయాలు-సవాళ్లు

అఖిల భారత సదస్సు
9, 10 సెప్టెంబర్‌ 2017
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాదు

విప్లవం వసంతంలా మొదలైంది. సాయుధ పోరాటం మేఘ గర్జన వలె ఆరంభమైంది. యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ తరం తలుచుకుంటే ఆశ్చర్యమే. ఎంత కవితాత్మకంగా ప్రజల చరిత్రలోకి వసంతం వలె నక్సల్బరీ ప్రవేశించింది? భారత విప్లవాకాశంలో వసంత మేఘగర్జనగా నక్సల్బరీని ఆనాటి చైనా కమ్యూనిస్టుపార్టీ వర్ణించింది. దేశంలో ఎక్కడో మారుమూల కొసకారు కొండల్లో ఆదివాసులు తిరగబడితే, ఆయుధమెత్తితే వసంతం పూసినట్లు జనమంతా అనుకున్నారు. తీవ్ర సాయుధంగానేగాక, నేలపై మట్టి పొరల నుంచి కరకు ఆచరణగానేకాక, అత్యంత కాల్పనిక శక్తి వలె నక్సల్బరీ నడిచి వచ్చింది. అందుకే ఆ వసంతం అడవులకే కాదు, మనుషుల ఊహలకు, ఉద్రేకాలకు, మేధో, సృజనాత్మకతలకు కూడా. విప్లవం ఒక గొప్ప భావన, ఒక గొప్ప నమ్మకం. శిరస్సు తెగిపడుతున్నా కనులలో వాడిపోని స్వప్నం. అందుకే నక్సల్బరీతో ఇక అన్నీ కొత్త ఆలోచనలే. కొత్త నిర్ణయాలే. కొత్త వైఖరులే. చరిత్ర ఎలా నిర్మాణం కావాలో ప్రజలు చూపిన కొత్త దారులే. భవిష్యత్తును కలగనే కవి అన్నట్లు అక్షరాలా దారి పొడవునా గుండె నెత్తురులే. ప్రజలు తీసుకున్న రాజకీయ నిర్ణయంతో వసంతంలా ఆరంభమైన విప్లవం వేలాది మంది నెత్తుటి మడుగుల్లోంచి భౌతికశక్తిగా వెల్లివిరిసింది. ఇప్పుడు దండకారణ్యమంతా, దేశంలోని ఆదివాసీ ప్రాంతాలంతా ఆ వసంత పరిమళాలే.

కవిని ఎంత ఉత్తేజపరిచే, దు:ఖపరిచే వాస్తవమిది! భవిష్యత్‌ శిఖరాలపైన ప్రజలు తమ శిరస్సునే ఎర్రని జెండాగా ఎగరేస్తానే ఆశ్వాసన కదా ఇది. లోలోపలి నుంచి ఎగసి వచ్చే చారిత్రక ప్రకటన కదా ఇది. యాభై ఏళ్లు.. ఈ కాలమే చరిత్రలో ఎన్ని పరీక్షలను ఎదుర్కొన్నది? లోపలా, బైటా సంక్షోభాలే. కన్నీటి వరదలే. నక్సల్బరీ తట్టుకొని లేచి నిలబడింది. ప్రతిసారీ అంతా అయిపోయిందనీ, ఇక ఏమీ ఉండదని, విప్లవాచరణే చాదస్తమనీ, కొడిగట్టిన వెలుగుల మరకలనీ అన్నారు. ఇలాంటి అంచనాలను, వ్యాఖ్యలను చారిత్రక శక్తిగా నక్సల్బరీ తల్లకిందుల చేసింది. తన యాభై ఏళ్ల ప్రయాణంలో నిగ్గుదేల్చింది. దీర్ఘకాలంగా బహుముఖ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నది. నిజానికి తను కూడగట్టుకుంటున్న బలంతో పొల్చితే తలపడుతున్న శతృవు అత్యంత శక్తిసంపన్నం. అయినా సరే గెలిచే పక్షం ఇప్పటికి నక్సల్బరీయే అని రుజువైంది. అది దాని ఆచరణబలం, ప్రజాబలం, ఈ రెంటికీ దారి చూపే సిద్ధాంత బలం.

దేశంలోని అన్ని పార్లమెంటరీ పార్టీలు, ఓట్ల గోదాలో గెలవాలని ఉబలాటపడుతున్న శక్తులు, సాంఘిక విముక్తికి బ్యాలెట్‌ సమీకరణాల తయారీలో తలమునకలైన వ్యక్తులు.. ఒకరేమిటి..అందరూ రాజకీయంగా ఒక పక్షం. నక్సల్బరీ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా మరో పక్షం. అతి సున్నితమైన మానవ సంబంధాల దగ్గరి నుంచి వ్యవస్థలు నడవడానికి కావాల్సిన భౌతిక నియమాల దాకా అన్నిటికీ ఒక్క మావోయిస్టు దృక్పథంలోనే ప్రత్యామ్నాయ ఆలోచనలు ఉన్నాయి. వీలైన చోటల్లా ఇప్పటికే ఆచరణ రూపాలూ ఉన్నాయి.

యాభై ఏళ్లలో నక్సల్బరీ సాధించింది ఏమిటి? అనే నిష్కర్ష చేసేవాళ్లున్నారు. ఇది తప్పక చేయవలసిన పని. నిజంగానే రాగద్వేషాలకు అతీతంగా ప్రజా దృక్పథంతో ఆ పని చేయాలి. ఒక చిన్న తిరుగుబాటుగా మొదలైన నక్సల్బరీ ఇవాళ అన్ని రంగాలకు తానే ప్రత్యామ్నాయమైంది. ఇదీ నక్సల్బరీ విజయం.

అందవల్ల ఇది తప్పక వేడుక చేసుకోవాల్సిన తరుణం. అంత మాత్రమేనా? నక్సల్బరీ ప్రభావాలూ, విజయాలే కాదు. దానికి సవాళ్లు కూడా ఉన్నాయి. తాను మార్చాలనుకుంటున్న వ్యవస్థలు ఎంత జటిలమైనవో, బలమైనవో, వందల వేల సాంఘిక సాంస్కృక మూలాలపై నిర్మాణమైనవో నక్సల్బరీకి తెలుసు. అంటే నక్సల్బరీకి తన శతృవు గురించి బాగా తెలుసు. ఇవాళ తెలుసుకోనివి రేపైనా తెలుసుకోక తప్పదనే ఎరుక ఉన్నది. ఆ రాజకీయ సుగుణం నక్సల్బరీ సొంతం.

ఆ సంగతి విప్లవ రచయితల సంఘానికీ తెలుసు. నక్సల్బరీ ఆనుపానులు, వికాస సంక్షోభాలు, సవాళ్లు, వాద ప్రతివాదాల సారాంశాలు విరసంకు తెలుసు. ఆ అవగాహనతోనే సాహిత్య, మేధో రంగాల్లో విప్లవోద్యమ విస్తృతిని చిత్రిస్తున్నది. అట్టడుగు ప్రజల సాంఘిక సాంస్కృతిక జీవితాన్ని చిత్రిస్తున్నది. వాళ్ల విముక్తి పోరాటాలతోపాటు నడుస్తున్నది. వర్గ దోపిడీ, కుల పీడన, పితృస్వామ్య అణచివేత, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం, తెగలు, జాతుల విముక్తి ఆకాంక్షలను అక్షరబద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో నక్సల్బరీ ఈ నేలమీద ఒక విప్లవశక్తిగా ఎదుగుతున్నదో ఈ యాభై ఏళ్లుగా వ్యాఖ్యానిస్తున్నది. సూత్రీకరిస్తున్నది. దాని ప్రేరణతో తన సృజన శక్తిని విస్తరింపజేసుకుంటున్నది. నక్సల్బరీని కళాత్మకంగా పునర్నిర్మించే పని శాయశక్తులా చేస్తున్నది. నిజానికి స్వతహాగా నక్సల్బరీనే కళాత్మకమైనది. నక్సల్బరీ పక్షాన నిలబడటమే ఒక గొప్ప కళానుభవం. అందుకే విప్లవ రచనల్లో ఆ ఉద్వేగమూ, అత్యంత సునిశితమైన అంతర్‌దృష్టీ. ఈ యాభై ఏళ్ల చారిత్రక సందర్భంలో ఆ రెంటినీ నక్సల్బరీ పట్ల విరసం ఎలా ప్రదర్శించకుండా ఉంటుంది? అందులో భాగమే ఈ సదస్సు. నక్సల్బరీ ప్రభావాలు, విజయాలు వివరించుకోడానికి, సవాళ్లను సాహసికంగా చర్చించడానికి ఏర్పాటు చేస్తున్నాం.

కార్యక్రమం

9 సెప్టెంబర్‌ ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ

10.30కి మొదటి సెషన్‌ ప్రారంభం

అధ్యక్షత: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌

భారత సమాజంపై నక్సల్బరీ ప్రభావాలు: విజయాలు-సవాళ్లు

కీ నోట్‌ పేపర్‌ - వరలక్ష్మి, విరసం కార్యదర్శి

నక్సల్బరీ- భారత పీడిత ప్రజల విముక్తి మార్గం: సలీం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విప్లవోద్యమ చరిత్ర - గుణపాఠాలు: రాఘవులు

ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమ ప్రభావాలు-విజయాలు-సవాళ్లు: జి. కళ్యాణరావు

1.30కి భోజన విరామం

2.30కి రెండో సెషన్‌ ప్రారంభం

అధ్యక్షత: ఉజ్వల్‌

హర్యాణా సమాజంపై నక్సల్బరీ ప్రభావం: అజయ్‌

పంజాబ్‌లో విప్లవోద్యమం-వ్యవసాయక విప్లవ అనుభవాలు: సుఖ్విందర్‌

తెలంగాణలో నక్సల్బరీ విజయాలు: జి. ఐలన్న

మహారాష్ట్రలో వర్గపోరాటాలు: సుధీర్‌ ధావ్‌లే

ఉత్తరప్రదేశ్‌లో విప్లవోద్యమ అనుభవాలు: సీమా అజాద్‌

యాభై ఏళ్ల నక్సల్బరీ-ప్రత్యామ్నాయ అభివృద్ధి పంథా: పూర్ణేందు శేఖర్‌ ముఖర్జీ

6.00 గంటలకు మూడో సెషన్‌

అధ్యక్షత: రత్నమాల

కేరళలో విప్లవోద్యమం: రావుణ్ని

బీహార్‌ జార్ఖండ్‌లో నక్సల్బరీ ప్రభావాలు, విజయాలు, సవాళ్లు-నతాష్‌

ఉత్పత్తి సంబంధాల చర్చ - భారత అర్ధ వలస, అర్ధ భూస్వామ్యం: ఎన్‌ వేణుగోపాల్‌

ప్రజా సంఘాలు-ప్రజాపంథా: ఎన్‌. రవి

నక్సల్బరీ నుంచి లాల్‌ఘడ్‌ దాకా: ప్రొ. అమిత్‌ భట్టాచార్య

పౌరహక్కులు-న్యాయ వ్యవస్థ: ప్రొ. శేషయ్య

10 సెప్టెంబర్‌ ఉదయం 10 గంటలకు మొదటి సెషన్‌ ప్రారంభం

అధ్యక్షత: ఎం.ఎ. బాసిత్‌

ఒకే ప్రత్యామ్నాయం నక్సల్బరీ: మడ్కం విజయ్‌

పంజాబ్‌లో నక్సల్బరీ విప్లవోద్యమం: బారూ సత్వర్గ్‌

స్త్రీ విముక్తి-వర్గపోరాటాలు- నక్సల్బరీ పంథా: బి. అనూరాధ

తెలంగాణలో ఆదివాసులు, దళితులపై విప్లవోద్యమ ప్రభావం:ఎన్‌. రజిత

దళిత పోరాటాలు-నక్సల్బరీ: ఆనంద్‌ తెల్తుంబ్లే

1.30కి భోజన విరామం

2.30కి రెండో సెషన్‌ ప్రారంభం

అధ్యక్షత: నల్లూరి రుక్మిణి

సామాజిక ఉద్యమాలపై నక్సల్బరీ ప్రభావం: వెర్నన్‌ గొన్‌సాల్వెస్‌

భారత రాజ్య వ్యవస్థ స్వభావం-దాని పని విధానంలో మార్పులు: ప్రొ హరగోపాల్‌

బెంగాలీ కళా సాహిత్యాలపై నక్సల్బరీ: కంచన్‌కుమార్‌

తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం: అల్లం రాజయ్య

ఒడియా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం: లెనిన్‌

సాయంత్రం 5.30కి బహిరంగ సభ

అధ్యక్షత: వరలక్ష్మి

వక్తలు: వీరాసాధి(నాగపూర్‌), వరవరరావు

వివిధ రాష్ట్రాల కళా సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు ఉంటాయి.

పంజాబ్‌: సుఖ్విందర్‌, బారూ సత్వర్గ్‌

హర్యాణ: అజయ్‌

ఉత్తరప్రదేశ్‌ : సీమా అజాద్‌

మహారాష్ట్ర : సుధీర్‌ ధావ్‌లే

పశ్చిమ బెంగాల్‌: పూర్ణేందు ముఖర్జీ

కేరళ : ఎం ఎన్‌ రావుణ్ణి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ, దండకారణ్యం, ఏవోబీ, బీహార్‌, జార్ఖండ్‌ తదితర ప్రాంతాల్లో విప్లవోద్యమ అనుభవాలు, విజయాలు, సవాళ్ల గురించిన పత్రాలు..

...

తెలుగు సాహిత్య కళారంగాలపై నక్సల్బరీ ప్రభావం: అల్లం రాజయ్య

బెంగాలీ సాహిత్య కళారంగాలపై నక్సల్బరీ ప్రభావం: కంచన్‌కుమార్‌

సాంఘిక ఉద్యమాలపై నక్సల్బరీ ప్రభావం: వెర్నన్‌, ఆనంద్‌ తేల్తుంబ్లే

స్త్రీ విముక్తి-వర్గపోరాటాలు- నక్సల్బరీ పంథా: బి. అనూరాధ

వ్యవసాయ రంగంలో మార్పులు- భారత అర్ధ వలస అర్ధ భూస్వామ్యం: ఎన్‌ వేణుగోపాల్‌

ప్రజా సంఘాలు-ప్రజాపంథా: ఎన్‌ రవి

పౌరహక్కులు-భారత న్యాయ వ్యవస్థ: ప్రొ. శేషయ్య

భారత రాజ్య వ్యవస్థ స్వభావం-దాని పని విధానంలో మార్పులు: ప్రొ హరగోపాల్‌

ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలు-దండకారణ్యం: డా. ముదునూరి భారతి

తెలంగాణలో విప్లవోద్యమం: ప్రభావాలు-విజయాలు-సవాళ్లు: సి. కాసీం

ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమం: ప్రభావాలు-విజయాలు-సవాళ్లు : జి. కళ్యాణరావు

నక్సల్బరీ నుంచి లాల్‌ఘడ్‌ దాకా..: ప్రొ. అమిత్‌ భట్టాచార్య

ఒడియా సాహిత్య కళా రంగాలపై నక్సల్బరీ: లెనిన్‌

ఇంకా మరి కొందరు నక్సల్బరీ ప్రభావం, విజయాలు, సవాళ్ల గురించిన పత్రాలు ఇస్తారు.

10వ తేదీ సాయంకాలం బహిరంగ సభ ఉంటుంది.

ఈ రెండు రోజులు పుస్తకావిష్కరణలు, చేతనా నాట్యమంచ్‌, మహారాష్ట్ర సాంస్కృతిక బృందం, ప్రజా కళామండలి, విరసం సాంస్కృతిక బృందం, డప్పు రమేష్‌ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు, ఉంటాయి. అందరినీ ఇదే ఆహ్వానం.

- విప్లవ రచయితల సంఘం

Keywords : 50 years naxalbari, virasam, hyderabad, maoists
(2024-04-03 19:18:03)



No. of visitors : 1919

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భారత