ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావుఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

" వార్తా రచన... పఠనాసక్తి"

వాక్య నిర్మాణం, భాష, శైలి, లీడ్ ఇవన్నీ పాఠకుడికి పఠనాసక్తి కలిగే రీతిలో ఉన్నప్పుడు వార్తల పట్ల ఆసక్తి కలుగుతుంది. వార్తలంటే సమాచారమే గదా, వాటికీ ఈ అంశాలకు ఏం సంబంధం అని అనుకోవద్దని నా భావన. వరంగల్, కరీం నగర్, నల్లగొండ ల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఈ అరుదైన శైలి కలిగి ఉంటారనేది వాస్తవం. దీనికి ఇక్కడ ప్రధానం గా నెలకొని ఉన్న ఉద్యమ పరిస్థితులు కారణమనేది నిర్వివాదాంశం.
గ్రామీణ విలేకరులంటే ఆల్ రౌండర్ లాంటి వాళ్లు. స్పెషలైజేషన్ లతో పని లేకుండా ఎలాంటి వార్త అయినా అలవోకగా రాయగలిగే నేర్పూ, పట్టుదల గ్రామీణ విలేకరికి ఉంటాయి. ఆ ప్రెజెంటేషన్ లో తొట్రుబాటుగూడా కానరాదు. ట్రెయిన్ అయిన జర్నలిస్టుకు, గ్రామీణ విలేకరికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, కాన్వెంట్ విద్యార్థి ల మధ్య ఉండే వ్యత్యాసం లా కానవస్తుంది. ప్రభుత్వ బడి విద్యార్థిలో ఎలాంటి బెరుకూ లేని స్వేఛ్చాయుత భావన వుంటుంది. అందువల్ల జెనరల్ అవేర్ నెస్ విషయం లో ముందుంటాడు. గ్రామీణ విలేకరిదీ అదే స్వేచ్ఛ.
ఉద్యమ ప్రాంతాలు,ఉద్యమ జిల్లాల్లో కేవలం మందుపాతరలు, ప్రజాకోర్టులు, ఎన్ కౌంటర్ ల వార్తలను మాత్రమే ఘటనా క్రమాన్ని అనుసరించి రాయడం చేస్తే విలేకరి ఓ "క్రానిక్లీర్ " గా విధి నిర్వహించిన వాడిలామిగిలి పోయే వాడు. కానీ ఉత్తర తెలంగాణ, ఆ మాటకొస్తే రాష్ట్రం మొత్తం గ్రామీణ విలేకరులు అత్యంత ధైర్య సాహసాలతో మిలిటెంట్ల ఇళ్ల పై జరిగిన దాడులను, పోలీసులు, ప్రభుత్వాల దమన కాండను వార్తల్లోకి ఎక్కించిన తీరు విలేకరులు సమాజ పునర్నిర్మాణ భాగస్వాములనుకునేందుకు తార్కాణం గా నిలిచింది.
రణదేవ్ విడుదల అనంతర పరిణామాల్లో కిషన్ సార్ వరంగల్ నుంచి విజయవాడ డెస్కుకు బదిలీ అయ్యారు. సార్ వెళ్లిన తర్వాత వరంగల్ స్టాఫర్ గా రేపాక జయపాల్ రెడ్డి సార్ వచ్చారు. జయపాల్ రెడ్డి సార్ అంతకు ముందు నిజమాబాద్ లో పనిచేసేవారు. ఆయన బై లైన్ లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేవి. అందువల్ల కిషన్ సార్ వలె యువకుడిలా వుంటాడని మేం ఊహించుకున్నాం. స్వతహాగా స్నేహశీలి అయిన జయపాల్ రెడ్డి సార్ ఆఫీసుకు వచ్చే సమయానికి నేను, కేకే, శివ కుమార్, రవీందర్ సార్, వసంత్ ఆఫీసులో వున్నాం.సార్ వస్తూనే తన సహజ శైలి లో జైపాల్ అంటూ షేక్ హాండిచ్చాడు. ఆ రోజు సార్ తో కలిసి టాప్ ఇన్ కేఫ్ లో చాయ తాగిన మాకు సార్ స్నేహపూరిత వ్యక్తి అని తెలిసి పోయింది.
జయపాల్ రెడ్డి సార్ జిల్లా కొచ్చిన సమాయానికి ఉద్యమ జిల్లాల్లో నిర్బంధం, ప్రతీకార ఘటనలతో యుద్ధ వాతావరణమే ఉన్నదని చెప్పుకోవాలి. ఎన్ కౌంటర్లు, మందు పాతర ఘటనలు గ్రామాల పై విరుచుకు పడుతూ పోలీసులు చేసిన అకృత్యాలు అన్నీ వార్తల రూపం లో రాసే వాళ్లం. వాస్తవం చెప్పుకోవాలంటే జైపాల్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత వార్తా రచన పై మరింత స్వేచ్ఛ లభించిందని చెప్పుకోవాలి.
ఇదే దశ లో కిషన్ సార్ వరంగల్ వాణి పత్రిక ను తీసుకున్నారు. లెటర్ ప్రెస్ లో నిర్వహించే ఆ పత్రిక కు తెలంగాణ మాండలికం లో "బుడ్రఖాన్ బాతాఖానీ" అనే కాలమ్ రాసే అవకాశమిచ్చాడు సార్. బాతాల పోశెట్టి పేరుతో వారానికోసారి ఆ కాలమ్ నేను రాసే వాడిని. వరంగల్ వాణి పత్రిక ను సాయం కాల దిన పత్రిక గా అప్పటికి మార్చారు. ఆ పత్రిక మిగతా దిన పత్రికా రిపోర్టర్లకు ఒక రెడీ రెకానర్ గా మారిందనడం లో అతిశయోక్తి లేదు. ఆంధ్ర ప్రభ దిన పత్రిక లో కూడా ఈ దశ లో వార్తలు రాయగలిగే అవకాశం నాకు లభించేది.
యూనియన్ లో కూడా ఈ కాల వ్యవధి లో నేను ఓ పర్యాయం సంయుక్త కార్యదర్శిగా , కోశాధికారి గా వ్యవహరించాను. జిల్లాలోని అన్ని ప్రాంతాల విలేకరి మిత్రులతో ఈ సందర్భం గా పరిచయాలు, అనుబంధాలు పెరిగాయి.
సాగర్ లో ఎన్నికల తెర కసరత్తు
ఆంధ్ర ప్రభ దినపత్రిక 1994 అసెంబ్లీ ఎన్నికల సందర్భం లో "ఎన్నికల తెర" అనే ఒక పుల్ ఔట్ ను ప్రచురించేది. నా జర్నలిజం జీవితం లో స్వేఛ్చ గా ఆబ్జెక్టివ్ గా వార్తలు రాయగలిగే అవకాశం లభించిన సందర్భమది. ఈ ఎన్నికల తెర పుల్ ఔట్ రాక ముందు నాగార్జున సాగర్ లో ఓ సన్నాహక సమావేశం జరిగింది. ఆ సన్నాహక సమావేశానికి ఆంధ్ర ప్రభ నుంచి వాసుదేవ దీక్షితులు, దేవులపల్లి అమర్ లు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుంచి సుందరం సార్, హార్ నూర్ సార్ వచ్చారు. నాగార్జున సాగర్ లో జరిగిన ఈ మీటింగులో కరీం నగర్ నుంచి అంకం రవి, పిట్టల రవీందర్, వరంగల్ నుంచి నేను, జైపాల్ రెడ్డి సార్, నల్లగొండ నుంచి పీ వీ రమణా రావు సార్, నిజమాబాద్ నుంచి ప్రకాశ్ శాస్త్రి, ఆదిలాబాద్ నుంచి వీరభద్ర రావు హాజరయ్యాము.(ఇంకా ఎవరినయినా మరిచిపోవచ్చు.గుర్తు చేస్తే సవరించవచ్చు). ఆ మీటింగ్ ఎన్నికల తెర పేజీని ఒక మరిచిపోలేని పుల్ ఔట్ గా తీర్చి దిద్దడానికి కర్టేన్ రేజర్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు.
ఈ మీటింగ్ సందర్భంగా ఓ గమ్మత్తైన ఘటన జరిగింది. జయపాల్ రెడ్డి సార్, నేను వరంగల్ నుంచి వెళ్ళాం. నల్లగొండ నుంచి నాగార్జున సాగర్ చేరుకున్నాం. మద్యాహ్న భోజనాల తర్వాత మీటింగ్ ఆరంభమయింది. ఎన్నికల కోసం తాము పెట్ట బోయే శిర్షికలను గురించి ఎడిటర్లు, అమర్ వివరించారు. టీ తాగిన తర్వాత ఆ రోజుకు మీటింగ్ ముగించారు. హార్ నూర్ సార్ నేను ముందే డిన్నర్ చేయాలని భోజనానికి ఉపక్రమించాం. హోస్ట్ కావడం వల్ల రమణా రావు సార్ మాకు వడ్దించే దగ్గరకు వచ్చారు. మెనూ లో నాన్ వెజ్ ఉన్నది. అయితే రమణా రావు సార్ వాళ్లిద్దరూ నాన్ వెజ్ తినరని వంట వాళ్లకు చెప్పారు. సుందరం సార్ లాగే హార్ నూర్ సార్ కూడా కఠిన హృదయుడు అనుకుని నేను కాం గా డిన్నర్ కానించేసా. మీటింగ్ ముగిసింది. ఎక్కడి వాళ్లు అక్కడికి బయలుదేరాం. హైదరాబాద్ నుంచి వచ్చిన సీనియర్ లు నేరుగా వెళ్లి పోయారు. జయపాల్ రెడ్డి సార్ నల్లగొండ కు చెందిన వాడు కావడం వల్ల నాగార్జున కాలేజి సమీపం లో ఒక రెస్టారెంట్ వద్ద లంచ్ కు ఉపక్రమించాము. అక్కడ మళ్ళీ రమణా రావు సార్ హోస్ట్. భోజనాలు ముందే చేయగలిగే వారికి ఆర్డర్ ఇవ్వడం మొదలయింది. నా కోసం వెజిటబుల్ బిర్యాని అని సార్ ఆర్డర్ ఇస్తున్నాడు.అంతకు ముందు రోజే నా జిహ్వ చాపల్యాన్ని చంపుకున్న నేను ఇంక ఊరుకోలేదు. సార్ నేను నాన్ వెజ్ తింటాను. మీరు ఇబ్బంది పడుతారని రాత్రి తినలేదు కానీ ఇప్పుడు నేను ఇబ్బంది పడదల్చుకోలేదు అని చికెన్ బిర్యాని తెప్పించుకుని తిన్నాను. ఆ ఘటన ఇప్పుడూ మరిచిపోలేను.
ఎన్నికల తెర పేజీ తెలుగు పత్రికల్లో ఎలక్షన్ కవరేజీ అంశం లో ఓ వినూత్న అధ్యాయానికి తెర తీసిన పుల్ ఔట్. ఆ పుల్ ఔట్ నిర్వహణ లో దేవులపల్లి అమర్ కనబరిచిన శ్రద్ధ, స్ఫూర్తి తెలుగు లో ఎన్నికల వార్త లను ఎన్ని కోణాల్లో రాయవచ్చో తరచి చెప్పింది. ఎన్నికల తెర వార్తల కవరేజీ సందర్భం లో జైపాల్ సార్ తో మొట్టమొదటి సారి వరంగల్ లోని మారుమూల పల్లెలను సైతం తిరగగలిగాం. అప్పుడు నిజం గా రిపోర్టర్ గా లెగ్ వర్క్ చేశాననే తృప్తి కలిగింది. ఆంధ్ర ప్రభ లో పనిచేసిన జర్నలిస్టులే కాకుండా ప్రతీ పాఠకుడూ ఎన్నికల విశ్లేషణ కోసం ఎన్నికల తెర పుల్ ఔట్ నిర్వహించిన అనిర్వచనీయమైన పాత్ర ను మర్చిపోలేరు.
ఆర్కే ఇంటర్వ్యూ
ఆ ఎన్నికల సందర్భం లోనే అనేక ఘటన లు జరిగాయి. ఆ ఎన్నికలే సగటు విలేకరులుగా ఉన్న మమ్మల్ని వార్తా రచనా రంగం లో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు ఉపకరించాయి. ఈ సందర్భం లోనే ఎన్నికల కోసం పీపుల్స్ వార్ వరంగల్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. ఆ ఇంటర్వ్యూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధ కాండ ను తీవ్రం గా విమర్శించింది. ఆ ఇంటర్వ్యూ కు మేం వెళ్లిన తీరు ఇక్కడ అనుభవం గా చెప్పుకోవాల్సిన అంశం. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత జిల్లా కేంద్రానికి ఇంటర్వ్యూ సమాచారం తో ఓ ఉత్తరం వచ్చింది. ఆ సమాచారానికి అనుగుణం గా జైపాల్ రెడ్డి సార్ బండి పై నేనూ సార్ బయలుదేరాం. కిషన్ సార్ వేరే బండి పై వచ్చాడు. ఇక్కడ జయపాల్ రెడ్డి సార్ టెన్షన్ ఫ్రీ మెంటాలిటీ గురించి చెప్పుకోవాలి. ఇంటర్వ్యూ కోసం బయలుదేరిన స్కూటర్ లో కనీసం పెట్రోల్ లేదు. మేము ఊరుగొండ దాటగానే మా బండి ఆగిపోయింది. మరో వైపు కిషన్ సార్ రివ్వున దూసుకెళ్లి మల్లం పల్లి హోటల్ ల దగ్గర ఆగాడు. చీకటి పడుతుంటే అప్పుడున్న నిర్బంధ పరిస్థితుల వల్ల నాకు ఆందోళన కలుగుతున్నది. చీకట్లో ఆ రహదారి పై కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లడం లేదు. భయం భయం గా వున్నది. పెట్రొలింగ్ వాహనాలు వస్తే ఏం సమాధానం చెప్పాలా అని నేను లోలోపల అందోళన చెందుతున్న. మరో పక్క ఇంటర్వ్యూ సమయానికి చేరుకోలేక పోతే అవకాశాన్ని మిస్ అవుతామనే ఫీలింగ్. కొంతదూరం లో ఒక స్ప్రే పంప్ వీపు పై వేసుకొని ఒక వ్యక్తి వస్తున్నడు. మమ్మల్ని చూసి ఆయన చటుక్కున ఆగాడు. దగ్గరలోనే తన సైకిల్ ఉందని గూడెప్పాడు క్రాస్ వద్ద పెట్రోల్ పంప్ లో పెట్రోల్ తెస్తానని చెప్పి ఆయన మాకు చెప్పి పక్కనే వున్న తన షెడ్డులో కూర్చో బెట్టాడు. ఆయన పెట్రోల్ తెచ్చి మమ్మల్ని బయలుదేర దీసిన తర్వాత తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజుల్లో ఆ సమయం లో పత్రికా వాళ్లు అన్నలను వార్తల కోసం కలిసే అవకాశం ఉందని తమకు తెలుసని అందుకే తాను సైకిల్ పై పెట్రోల్ తెచ్చానని ఇప్పటికీ నాకు మిత్రుడిగా ఉన్న చౌళ్లపల్లి గ్రామస్తుడు చెప్పడం అప్పటి ఉద్యమ అనుకూల భావనను తరచి చెప్పింది.
ఇవాళ్ల ఆశించిన రీతిలో రాయలేక పోతున్నాననే భావన కలుగుతున్నది. ఆర్కే ఇంటర్వ్యూ తర్వాత వరంగల్, కరీం నగర్ జిల్లాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఒక దాని వెంట ఒకటి వరుస మందు పాతర ఘటనలు జరిగాయి. వాటికి తోడు ఎన్ కౌంటర్ల పరంపర. ఊరుగొండ వద్ద ఒక మందు పాతర ఘటన అయితే మేం ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన వారం వ్యవధిలోనే జరిగింది.
లెంకలగడ్డ ఎపిసోడ్
అదే సందర్భం లో కరీం నగర్ జిల్లా లెంకల గడ్డ వద్ద కూడా మందుపాతర ఘటన జరిగింది. ఆ వార్త కవరేజీ కోసం నేను , మిత్రుడు ఎడ్ల అశోక్ రెడ్డి(ప్రస్తుతం వరంగల్ జిల్లా బీ జే పీ అధ్యక్షుడు) రాత్రి ఆఫీస్ లోనే పడుకున్నాం. మందు పాతర ఘటనలు గానీ , ఎన్ కౌంటర్లు గానీ జరిగినప్పుడు మేం ఒక షెడ్యూల్ పెట్టుకునే వాళ్లం. ఘటన ల ఫోటో లు రవీందర్ సార్ తీస్తాడు. ఘటన ఐటెం, ఫాలో అప్ నేను పంపుతాను. అటు తెలుగు లో ..ఇటు ఇంగ్లీష్ లో కూడా.. ఇతర వార్తలు వసంత్, రవీందర్ సార్ రాస్తారు. పోలీస్ వర్షన్ జైపాల్ రెడ్డి సార్ తీసుకొస్తారు. ఇలా మా రొటీన్ నడిచేది. లెంకల గడ్డ ఘటన కూడా అలాగే కవర్ చేయాలని ప్లాన్ చేసాం. కానీ ఫోటో లు తీసుకొవడం లోనే ఇబ్బందులయ్యాయి.
లెంకలగడ్డ మందు పాతర ఘటన ఎందుకు సంభవించిందో ఇక్కడ చెప్పాలనిపించింది. నిర్బంధం అమలు పర్చడానికి ప్రభుత్వం మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు. వరంగల్ జిల్లా కేంద్రం లోని ఎం జీ ఎం ఆసుపత్రి కి ఘటనా స్థలం కొంత చేరగలిగే దూరం లో ఉండడం తో వరంగల్ కే శవాలను, క్షతగాత్రుల్ని తరలించారు. అందువల్ల వరంగల్ విలేకరులకు ఆ కవరేజీ పని.
ఆ ఎన్నికల కవరేజీ యే మాకు అత్యంత క్రూషియల్ కవరేజీ సందర్భం గా నిలిచింది. కొన్ని అనుభవాలు వివరించడం కూడా సాధ్యం కాదు. అయితే ప్రజలకు వీలయినంత చేరువ లో ఉండె రీతిలో అప్పుడు ప్రయత్నాలు ఉండేది. ఆ దిశగానే పాత్రికేయుల ఆచరణ వుండేది.
-పీవీ కొండల్ రావు

Keywords : warangal, journalism, naxals, Punjab commandos
(2018-12-10 04:41:50)No. of visitors : 845

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

   ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 5...స్లగ్గులు.. వార్తలు - -పీవీ కొండల్ రావు

మొదటి సారి ఓ ఆజ్ఞాత నక్సలైట్ నాయకుడు, అధినేత కొండపల్లి సీతారామయ్య తో "కొండపల్లి తో కొన్ని గంటలు" పేరిట ఇంటర్వ్యూలు ఇలా చేయొచ్చు అని నిరూపించిన పత్రిక అది. ఆ ఇంటర్వ్యూ అప్పటి పరిస్థితుల్లో , ఇప్పుడు కూడా సీరియస్ గా జర్నలిజాన్ని ఎంచుకొని తమకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉండాలని భావించే పాత్రికేయులకు దిక్సూచి.....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 2..."కామన్ పేజీలు.. లైన్ అకౌంట్లు.."

ఆంధ్ర ప్రభ లో పని చేసిన ప్రతీ అకేషనల్, రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ కూడా తమ బై లైన్ చూసుకోవాలని పరితపిస్తారు. ఆంధ్ర ప్రభ దినపత్రికకు ఆ రోజుల్లో ఉన్న పేరు అది. ఎమర్జెన్సీ కా లం లో పత్రికా స్వేచ్ఛను నియంత్రించ యత్నించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్లాంక్ ఎడిటొరియల్ ఇచ్చారని ఆ పత్రిక పట్ల అపరిమితమైన గౌరవం.....

Search Engine

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..