అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

అరాచక

(వీక్షణం మాసపత్రిక సెప్టంబర్, 2017 సంచికలో ప్రచురించబడిన ఎన్, వేణుగోపాల్ సంపాదకీయం)

లోకాతీత శక్తిని నమ్మేవారికి లోకానికి సంబంధించిన చట్టాలు, పద్ధతులు, ప్రమాణాలు ఏవీ పనికిరావు. లోకాతీత శక్తికి సంబంధించిన అధ్యాత్మిక నమ్మకం వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం కావాలని, సమాజానికి సంబంధించిన విషయాలకు లౌకిక చట్టాలే ఉంటాయని అవగాహనను కల్పించడంలో విఫలమైన రాజ్యం హర్యాణాలో ప్రస్తుతం తన గాయాలను తానే నాక్కుంటున్నది. మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

పంజాబ్, హర్యాణాల్లో కేంద్ర కార్యాలయాలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన డేరా సచ్చా సౌదా అధిపతి బాబా గుర్మీత్ రామ్ రహీమ్ ఇన్సాన్ మీద పదిహేను సంవత్సరాలుగా సాగుతున్న అత్యాచారం కేసులో పాంచ్కూలా కోర్టు ఆగస్టు 25న రామ్ రహీమ్ నేరస్తుడని తేల్చగానే తమను తాము ప్రేమీలుగా పిలుచుకునే రామ్ రహీమ్ భక్తులు న్యాయస్థానం ఆవరణ నుంచి ప్రారంభించి పట్టణంలోనూ, ఇతర ప్రాంతాలలోనూ తమ ద్వేష బీభత్సాన్ని ప్రకటించారు. తమ ఆధ్యాత్మిక గురువు నేరం చేయలేదనే నమ్మకం కొంత, ఆధ్యాత్మిక గురువులకు లౌకిక చట్టాలు వర్తించవనే భావన కొంత, తమ గురువు ప్రమాదంలో ఉన్నప్పుడు ఎంతకైనా తెగించాలనే మూఢభక్తి కొంత కలగలిసి ఈ హింసాకాండ సాగింది. ఇప్పుడు రామ్ రహీమ్ దళితుల, వెనుకబడిన కులాల ఆధ్యాత్మిక గురువు అని, అగ్రవర్ణాల గుత్తసొమ్ముగా మారిపోయిన సిఖ్ మతాధిపత్యాన్ని ఎదిరించిన విప్లవకారుడని, ఆయన మీద అత్యాచారపు కేసు అబద్దపు కేసు అని, అగ్రవర్ణాల కూట సృష్టి అని అనేక వాదనలు చెలరేగుతున్నాయి.

ఈ వాదనలను పరిశీలించడానికి ముందు రామ్ రహీమ్ నేపథ్యాన్ని, అనుయాయి వర్గపు సామాజిక స్థితిని, జరిగిన నేరాన్ని, దానిపై విచారణను వేరు వేరుగా పరిశీలించవలసి ఉంది. దేశవ్యాప్తంగానే మత ధోరణుల మీద అగ్రవర్ణాల గుత్తాధిపత్యాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ చిన్న చిన్న విభిన్న మత ఆధ్యాత్మిక కేంద్రాలు పుట్టుకొచ్చాయి. లేదా మత మార్పిడులు జరిగాయి. ఆ క్రమంలోనే పంజాబ్, హర్యాణా ప్రాంతాలలో ఒకప్పుడు ప్రగతిశీల మతంగా పుట్టుకొచ్చిన సిఖ్ మతం క్రమంగా ఆధిపత్య శక్తులకూ, అగ్రవర్ణాలకూ, సంపన్నులకూ ఆశ్రయంగా మారినప్పుడు దాన్ని నిరసిస్తూ ఎన్నో డేరాలు పుట్టుకొచ్చాయి. అలా 1940లలో పుట్టుకొచ్చిన డేరా సచ్చా సౌదా సహజంగానే దళితులను, వెనుకబడిన కులాలను పెద్ద ఎత్తున ఆకర్షించింది. కుల అసమానత లేని ఆధ్యాత్మిక ఏకానుభవాన్ని భక్తులందరికీ పంచింది. కాని, ఈ ప్రగతిశీల, ధిక్కార ధోరణితో పాటుగానే మతం అన్నప్పుడే ఉండే పీఠాధిపత్యం, దాని చుట్టూ ఆస్తి పోగుపడడం, స్వార్థపర శక్తులు ఆ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి సామదానభేద దండోపాయాలు అమలు చేయడం జరిగాయి. 1990లలో గుర్మీత్ రామ్ రహీమ్ అధినేతగా స్థానం స్వీకరించేటప్పటికే డేరా సచ్చా సౌదాకు కోట్లాది రూపాయల ఆస్తి, ప్రపంచవ్యాప్తంగా భక్తులు, ఆస్తులు సమకూరాయి. గాయకుడిగా, స్ఫురధ్రూపిగా, ఆకర్షణీయమైన ప్రవచనాలు సాగించే గురువుగా రామ్ రహీమ్ ఆధునిక లక్షణాలెన్నిటినో తన ప్రచారంలో భాగం చేసుకున్నాడు. సంగీత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ʹమెసెంజర్ ఆఫ్ గాడ్ʹ అని తనను తాను అభివర్ణించుకుంటూ ఇప్పటికి వరుసగా నాలుగు సినిమాలు కూడా తీశాడు. ఇలా కుప్పలుతెప్పలుగా వచ్చి పడిన డబ్బులో కొంతభాగం సమాజంలో మంచిపేరు తెచ్చుకోవడానికి వినియోగించడం బాబాలకు, దైవ దూతలకు అందరికీ ఉన్న అలవాటే. అలాగే రామ్ రహీమ్ కూడా విద్యాసంస్థలు, ఆస్పత్రులు, చౌకధరలకు సరుకులు సరఫరా చేయడం, అన్నదానాలు వంటి ధార్మిక కార్యక్రమాలు సాగించాడు. అంటే, రాజ్యం అందించవలసిన సదుపాయాలను ప్రజలకు అందించే ఒక దాతగా తన అనుయాయులైన దళిత, వెనుకబడిన కులాల పీడితుల మధ్య రామ్ రహీమ్ అభిమానాన్ని చూరగొన్నాడు. లక్షలాది మంది అభిమానుల మద్దతు ఉన్నందువల్ల ఆయన ఒక మాట చెబితే ప్రాణాలకైనా తెగించగల లక్షలాదిమంది ఉన్నందువల్ల సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు రామ్ రహీమ్ను దువ్వడానికి ప్రయత్నించాయి. దాదాపు రెండు దశాబ్దాలు కాంగ్రెస్కు దగ్గరగా ఉన్న రామ్ రహీమ్ 2014 ఎన్నికలలో స్వయంగా నరేంద్ర మోడీ ప్రశంసలతో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గాడు. ఆస్తి, మితిమీరిన అధికారం ఉన్న చోట సాధారణంగానే పెత్తందారీతనం, ఆర్థిక అరాచకత్వం, లైంగిక అరాచకత్వం కలిసి ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక, లైంగిక అరాచకత్వపు ఆరోపణలు ఎదుర్కోని దేవదూతలు ఒక్కరు కూడా లేరు. రామ్ రహీమ్ కూడా తనను తాను కృష్ణుడితో పోల్చుకునేవాడని, ప్రతిరోజూ తన ఇష్టం వచ్చిన స్త్రీతో పితాజి మాఫీ పేరుతో గడిపేవాడని కథనాలు వస్తున్నాయి. ఎంత భక్తిపారవశ్యం ఉన్నా ఇటువంటి అక్రమాన్ని అంగీకరించని ఒక యువతి 2002లో నేరుగా అప్పటి ప్రధాని వాజ్పేయికి రాసిన లేఖ ప్రస్తుత కేసుకు ఆధారం. ఆ తర్వాత సిబిఐ విచారణ, అందులో వాస్తవం నిగ్గుతేలడం, అది న్యాయస్థానం ముందుకు రావడం, చివరికి న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగాయి.

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టి, అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని చెప్తున్న పంజాబ్ - హర్యాణా ప్రాంతంలో సమాజంలో ఎంత అభివృద్ధి నిరోధక ధోరణులు ఉన్నాయో, మనుషులను భ్రమల్లో, మూఢత్వంలో ముంచడం ఎంత సులభమో, కళ్లముందర కనబడుతున్న నేరాన్ని కూడా నేరం కానట్టు ప్రవర్తించడం ఎలా సాధ్యమో ఈ ఘటనలు చూపుతున్నాయి. పీడితులు అనుయాయులుగా ఉన్నారు గనుకనో, నిందితుడే పీడిత వర్గాల నుంచి వచ్చినందు వల్లనో నేరం నేరం కాకుండా పోదు. కింది వర్గాలు చేసిన నేరాన్ని చూసీ చూడనట్టు పోవాలనడం మనుస్మృతిని తిరగేసి చెప్పడమే. అందునా ఒక స్త్రీ మీద అత్యాచారం జరిగినప్పుడు అత్యాచారం చేసినవాడి సామాజిక స్థితి సమర్థనకు కారణం కాకూడదు. మూడు వేల ఏళ్లపాటు కొందరి నేరాలు నేరాలుగా కనిపించని మనుస్మృతిని ఇవాళ తిరగేసి మరికొందరి నేరాలు నేరాలు కాదని అననక్కర లేదు. ఆ వ్యక్తి పుట్టుకును, అనుయాయుల సామాజిక స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే నేరాన్ని నేరంగా పరిగణించి లౌకిక చట్టాలు అమలు చేయవలసిందే.

Keywords : dera ram raheem, gurmeeth singh, haryana, police
(2024-03-18 14:40:56)



No. of visitors : 1116

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అరాచక