జీనాహైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో...గౌరీ లంకేష్ స్పూర్తిని కొనసాగిస్తాం...

జీనాహైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో.... తుపాకులు తూటాలు అక్షరాన్ని ఆపలేవు..... మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదాం....గౌరీ లంకేష్ స్పూర్తిని కొనసాగిస్తాం... గౌరీ లంకేష్ హంతకులను అరెస్టు చేయాలి... గొంతెత్తి నినదిస్తున్న భార్త దేశం. నరేంధ్రమోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో పెరిగిపోతున్న మత అసహనం పాలకుల మద్దతుతో హత్యలకు పాల్పడుతోంది. తమ మతోన్మాదాన్ని వ్యతిరేకించేవారిని హత్యలు చేస్తోంది. నిన్న బెంగళూరులో జరిగిన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యతో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల్లోనే కాక అన్ని వర్గాల ప్రజల్లో ఆవేశంపెల్లుబికింది. ఢిల్లీ నుండి కన్యాకుమారి దాకా మతోన్మాద హత్యారాజకీయాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులో నిన్న మొదలైన ప్రదర్శనలు ఇవ్వాళ్ళ కూడా కొనసాగాయి. ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోయంబత్తూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్‌ ,గుజరాత్‌, చండీగడ్, హైదరాబాద్ తో సహా అనేక చోట్ల ప్రదర్శకులు గౌరీ లంకేష్ హత్యను ఖండించారు. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించారు. ఐయామ్‌ ఆల్సో గౌరి ప్లకార్డులతో , గౌరీ అమర్‌ రహే నినాదాలతో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. జ‌ర్న‌లిస్టుల గొంతును నొక్కితే స‌హించేది లేద‌ని, తామంతా గౌరి లంకేష్‌ల‌మేన‌ని ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టులు నినాదాలు చేశారు. జ‌ర్న‌లిస్టును దారుణంగా హ‌త్య చేయ‌డ‌మంటే, అది మీడియా స్వేచ్ఛ మీదే దాడి అన్నారు. ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌ను సిరీయ‌స్‌గా తీసుకుని, వెంట‌నే దోషుల‌ను శిక్షించాల‌ని, గౌరీ లంకేష్ హత్య పై న్యాయ విచార‌ణ చేప‌ట్టాల‌ని జ‌ర్న‌లిస్టులు డిమాండ్ చేశారు. మరో వైపు సోషల్ మీడియాలో గౌరీ లంకేష్ హత్యపై నెటిజనులు తీవ్రంగా స్పంధిస్తున్నారు. దేశాన్ని మతోన్మాదుల పాలు కాకుండా రక్షించుకోవాలని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా గౌరీ లంకేష్ అంత్య క్రియలు ప్రభుత్వ లాంచనాలతో ఇవ్వాళ్ళ బెంగళూరులో జరిగాయి

Keywords : gauri lankesh, hyderabad, bengaluru, delhi, murder, rss
(2024-04-22 21:45:38)



No. of visitors : 2619

Suggested Posts


గౌరీ ‍లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేద్దాం-మావోయిస్టు పార్టీ కేంధ్ర కమిటీ పిలుపు

సీనియర్ జర్నలిస్టు, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన గౌరీ లంకేష్ ను మావోయిస్టులు హత్య చేశారని కుట్రపూరితంగా జరుగుతున్న ప్రచారాన్ని సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్ ప్రజల పక్షాన హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు విప్పడాన్ని సహించలేని సంఘ్ పరివార్ శక్తులే ఆమెను హత్య చేశాయని....

ʹఅబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌...ʹ- గౌరీ లంకేశ్‌ చివరి సంపాదకీయం

ఈ వారం సంచికలో భారత్‌లోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌ దారిలో వెళ్తున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కాల్చి చంపిన మతోన్మాదులు !

గౌరీ లంకేష్ ʹలంకేష్ పత్రికʹకు ఎడిటర్. ఆమె పత్రిక ద్వారా రాజకీయ నాయకుల అనేక అక్రమాలను బహిర్గతపర్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాశారు. గౌరీ లంకేష్ మతోన్మాదానికి వ్యతిరేకంగా రచనలు చేయడమే కాక అనేక ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో ఓ బీజేపీ నేత అక్రమాలపై ఈమె పత్రికలో వ్యాసాలు రాశారు.....

నేను కూడ గౌరీ.. మేము కూడా గౌరీ... గౌరీ నీకు లాల్ సలామ్‍.. నినధించిన బెంగళూరు

సీనియర్‌ జర్నలిస్టు, హిందుత్వ వ్యతిరేక పోరాట కార్యకర్త‌ గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు నిరసనగా మంగళవారం చేపట్టిన ర్యాలీతో బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి. నేను కూడ గౌరీ, మేము కూడ గౌరీ అనే నినాదాలతో బెంగళూరు దద్దరిల్లింది. గౌరి హత్య విరోధి వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన ....

బీజేపీవి సిగ్గులేని రాజకీయాలు - హిందుత్వ , జాతీయత ఒక్కటేనన్న మాటల‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం!

నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా?

Maoists condemn Gauri Lankesh murder, ask people to hit streets for ʹdetermined fightʹ

The Communist Party of India (Maoist) has rejected the ʹpropaganda by Hindu fascist forcesʹ that Kannada journalist Gauri Lankesh was killed by Maoists. It said that the ʹSangh Parivarʹ killed Lankesh to muzzle the voice of pro-people forces. In a release issued by Abhay, spokesman for Central Committee of CPI (Maoist)....

మనువాద శవపేటికకు దిగ్గొట్టిన నాలుగు మేకులు - ఎన్. నారాయణ రావు

2013 ఆగస్టు 20 నుండి నరేంద్ర దభోల్కర్‌ హత్యతో మొదలై, 2015లో గోవింద్‌ పన్సారే, ప్రొఫెసర్‌ కల్బుర్గి, 2017 సెప్టెంబరు గౌరీ లంకేశ్‌ (జర్నలిస్టు) హత్యతో హిందూ మనువాద ఫాసిస్టుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాలుగు హత్యలు.... హంతకుడు ఒక్కరే... అవే తుపాకీ గుళ్లు. ఈ దేశంలో మేధావులు తుపాకీ గుండ్లకు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ....

హిందుత్వ శక్తులనుండి ప్రాణహాని ఉన్నగిరీష్ కర్నాడ్ సహా 25 మందికి ప్రభుత్వ భద్రత‌

హిందుత్వ శక్తుల నుంచి హాని కలిగే అవకాశం ఉన్న గిరీష్ కర్నాడ్‌, బార్గుర్‌ రమాచంద్రప్ప, కేఎస్‌ భగవాన్‌, యోగేష్‌ మాస్టర్, బెనర్జీ జయప్రకాష్‌, చెన్నవీర కన్నావి, నటరాజ్‌ హులియార్‌, చంద్రశేఖర్‌ తదితరులకు పోలసుల రక్షణ కల్పిం‍చారు. ప్రత్యేక లింగాయత్‌ కమ్యూనిటీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ఐఏఎస్‌ ఎస్‌ఎమ్‌ జమ్దార్‌కు ప్రత్యేక రక్షణ కల్పించాలని....

గ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసి... హైదరాబాద్ లో భారీ ర్యాలీ

బెంగుళూరు లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో ʹగ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసిʹ పేరుతో భారీ ర్యాలీ జరిగింది. టాంక్ బండ్ పైనున్న ముఖ్దుం మొయినుద్దీన్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వందలాదిమంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు....

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !

అసలు మహిళలకు రాత్రి పూట పనేంటని ఎదురు ప్రశ్న వేశాడు కర్నాటక హోంమంత్రి రామలింగా రెడ్డి. కర్నాటక మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేశాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ మహిళ ఆఫీసుకు వెళుతున్న....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జీనాహైతో