గోరక్షకుల హింసను ఆపండి... కేంధ్రానికి సుప్రీం ఆదేశం


గోరక్షకుల హింసను ఆపండి... కేంధ్రానికి సుప్రీం ఆదేశం

గోరక్షకుల

గోర‌క్ష‌ణ ముసుగులో అమాయ‌కుల ప్రాణాల‌ను పొట్ట‌న‌బెట్టుకుంటున్న వారిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. గోర‌క్ష‌కులు చేస్తున్న హింస‌ను అడ్డుకోవాల‌ని, అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారిని వెంట‌నే శిక్షించాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో గోర‌క్ష‌కుల హింస‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఓ సీనియ‌ర్ పోలీసు అధికారిని నియ‌మించాలని సూచించింది. వీరిపై చ‌ర్య తీసుకోవ‌డానికి ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏడు రోజుల్లోగా ఏర్పాటు చేయాల‌ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. ఈ విష‌యంలో వీలైనంత త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఎలాగైనా గోర‌క్ష‌ణ నెపంతో జ‌రుగుతున్న హింస‌ను అడ్డుకోవాల‌ని సూచించింది.
గో రక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై అరాచకాలు, హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ ఎస్‌ పూనావాలా గత ఏడాది అక్టోబర్‌ 21న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని ఆరు రాష్ట్రాలను ఆదేశించింది. గత జూలై 21న వాదనల సందర్భంగా దాడులకు దిగుతున్న గో రక్షకులను కాపాడాలని చూడొద్దని, గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇవ్వాళ్ళ విచారణ సందర్భంగా గో రక్షణ దాడులకు వ్యతిరేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలంటూ సుప్రీం కోర్టు రాష్ట్రాలకు ఏడురోజుల గడువు ఇచ్చింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించవద్దని, గోరక్షణ దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.

గో రక్షకుల ఆగడాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు చెక్‌ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని బుధవారం ఆదేశించింది. సీనియర్‌ పోలీసు అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ వారంలోగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పింది.
మాదే రాజ్యం మేం చెప్పేదే చట్టం అంటూ దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న హిందూ మతోన్మాద పాలకులు సుప్రీం మాట వింటారా ?

Keywords : cow protectors, attacks, supreme court of india, centrel government, police
(2023-09-26 04:07:27)



No. of visitors : 1894

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


గోరక్షకుల