ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"



ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

"అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

దూరదర్శన్ మాత్రమే ఉన్నరోజుల్లో ఓ సారి జర్నలిస్టుల గురించి , హైదరాబాద్ కేంద్రం నుంచి ఒక చర్చ ప్రసారమయింది. ఆ చర్చలో ఓ సబ్ ఎడిటర్, ఓ రిపోర్టర్, ఓ ఫ్రీ లాన్సర్ పాల్గొంటూ తమ తమ విభాగాలే పత్రికలకు ఆయువు పట్టు అనే తరహాలో వాదిస్తారు. ఆ చర్చ చాలా మంది సీనియర్లకు గుర్తుండొచ్చు. "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్నట్టు, ఎవరి విభాగాన్ని వాళ్లు మెచ్చుకుంటుంటారు.నా వరకు ʹగ్రామీణ విలేకరులేʹపత్రికలకు కళ్ళూ.. చెవులనే వాదన ను నేను బలంగా నమ్ముతాను.గ్రామీణ విలేకరులు పత్రికల్లో, మీడియా లో పనిచేస్తున్న సందర్భాల్లో వాళ్ళు సేకరించి ప్రెజెంట్ చేసే వార్తల్లో నిజాయితీ,నిక్కచ్చితనం ఖచ్చితంగా కనిపిస్తాయి. వృత్తి పట్ల నిబద్ధత కూడా కనిపిస్తుంటుంది. వార్తల్లో వ్యాఖ్యలకు అవకాశం లేకుండా వాస్తవాలనే ప్రస్తుతించాలనే అమాయకత్వం వాళ్లలో కానవస్తుంది.
ఉద్యమ జిల్లాలలో ఈ నిక్కచ్చితనం కారణంగా పత్రికల విశ్వసనీయత పెరిగిన సందర్భాలు అనేకం. ఈ విశ్వసనీయత పరమావధిగా పనిచేసిన పత్రికలలో కరీం నగర్ లోని జీవగడ్డ ఒకటి. వరంగల్ నుంచి వెలువడిన ఎమ్మెస్ ఆచార్య గారి వరంగల్ వాణి కూడా ఆ ఒరవడి నుంచి వెలువడిన పత్రికే.
"వార్త" లో చేరడానికి ముందు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వున్నప్పుడే జరిగిన మూడు ఘటనలు ఇలా అనుకుంటున్నప్పుడే గుర్తుకొచ్చాయి.అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్య దర్శి పులి అంజయ్య అలియాస్ సాగర్, భాగ్యక్క లు స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతం లోని ధర్మసాగర్ మండలం మద్దెల గూడెం లో జరిగినట్లు చెబుతున్న ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అప్పుడు ఉదయం దినపత్రికలో దాసరి కృష్ణా రెడ్డి సార్, ప్రభ లో జయపాల్ రెడ్డి సార్ ఉన్నారు. ఎన్ కౌంటర్ విషయం మాకు ఉదయమే తెలిసింది. శవాలు మద్దెలగూడెం శివారుల్లో వున్నాయని ఎస్ బీ వాళ్లు చెప్పారు. దీంతో ఘటనా స్థలానికి కృష్ణారెడ్డి సార్, జయపాల్ రెడ్డి సార్ బయలుదేరుతూ నాకు కూడా సమాచారం పంపారు. నేను మల్కాపూర్ మీదుగా మద్దెలగూడెం చేరాను. సార్ వాళ్లు కూడా వచ్చారు. అయితే ఘటనా స్థలం అని ప్రకటించిన చోట కనీసం ఘటన తాలూకు ఆనవాళ్లు కూడా కానరాలేదు.
ఆ రోజులలో వార్త తో బాటే ఎన్ కౌంటర్ పై అనుమానాలను కూడా ఫాలో అప్ రూపంలో నిర్భయంగా రాసే వాళ్లం. ఘటనా స్థలం తీరు తెన్నులు, జిల్లా కేంద్రానికి ఘటనా స్థలం ఉన్న దూరం వివరిస్తూనే మృతి చెందిన నాయకులు ముఖ్యులయితే అక్కడికి ఎందుకొచ్చి ఉంటారని కూడా మా వార్తలో విశ్లేషించే ప్రయత్నాలు చేసే వాళ్లం.
మద్దెల గూడెం ఘటనలో కూడా మృతుల శవాలు ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ లో ఉంచారని తెలిసింది. దాంతో రవీందర్ సార్ ను ఫోటో ల కోసం అక్కడికి పంపించారు. సార్ ఫోటో లు తీసుకుని రోల్ డెవలప్ చేయించారు. అప్పుడు ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఫోటో లే . డెవలప్ అయిన రోల్ పంపితే ప్రచురించే వాళ్లు. ఎన్ కౌంటర్ లో మృతుల ప్రాముఖ్యత దృష్ట్యా ఆ డెవలప్ అయిన రోల్ ను ఓ కార్ లో హైదరాబాద్ ఆఫీసుకు పంపాలని స్టాఫర్లు ఇద్దరూ అనుకున్నారు. ఫోటో లు తీసుకొని నేను సమ్మి రెడ్డి బయలుదేరాం. రాత్రి ఆలస్యమవుతే డాక్ ఎడిషన్ కు వార్త పోవడం కష్టమని అందుకోసం తొందరగా వెళ్లాము మేము. లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ లోని ఆంధ్ర ప్రభ లో రెండు స్నాప్ లు ఉన్న రోల్, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లోని ఉదయం లో ఇంకో రెండు స్నాపుల రోల్ ఇవ్వాలి. ఆంధ్ర ప్రభలో మేము అక్కడ పని చేసే స్ట్రింగర్లు గా పరిచయం కాబట్టి టైం ఆఫీసులో రోల్ తీసుకుని మాకు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులిచ్చి పంపారు. అక్కడి నుంచి ఉదయం వరకూ వెళ్లి ఆ కవర్ ఇచ్చాము. బ్రహ్మానంద రెడ్డి సార్ అని న్యూస్ ఎడిటర్ కు కవర్ ఇచ్చినప్పుడు మీరెవరని ప్రశ్నిస్తే కృష్ణారెడ్డి సార్ ప్రెస్ లో పనిచేసే ఎంప్లాయీస్ మని చెప్పినట్లు గుర్తు. ఆ ఎన్ కౌంటర్ జరిగిన రోజు ఆంధ్ర జ్యోతి స్టాఫర్ బ్రహ్మానందం సార్ లీవ్ లో ఉండడం తో నరేందర్ ఇన్ చార్జి గా ఉన్నడు. ఘటన లో మృతుల ప్రాధాన్యత తెలియక పోవడం వల్ల ఆ రోజు కనీసం ఫోటో లు కూడా పంపలేదు. తెల్లవారిన తర్వాత గానీ వాళ్ళు ఫోటో ఎందుకు మిస్సయ్యారని అడిగినప్పుడు సాగర్, భాగ్యక్క లు పీపుల్స్ వార్ లో ముఖ్యులని వాళ్లకు తెలియలేదు.
పత్రికా రంగం లో చేరిన తర్వాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఇంకా చేరక ముందు రైతు కూలీ సంఘం సభలు జరిగిన నేపధ్యం లో వరంగల్ తో బాటు పలు ప్రాంతాల్లో సభలు జరిగాయి. అంతకు ముందు జరిగిన నిర్బంధాన్ని నిరసిస్తూ, గ్రామాల్లో జరుగుతున్న భూపోరాటాలను ఎత్తిపడుతూ ఈ సభలు జరిగాయి. ఆ సభల ఉపన్యాసాల ట్రాన్స్క్రిప్షన్ ఒకటి నేనూ , నెక్ సీను చేసాము. బాల గోపాల్ సార్ జనగామ సభలో " రైతాంగం ఉద్యమాలు జేస్తున్నరు.. ధర్నాలు జేస్తున్నరు.. పోరాటాలు జేస్తున్నరు.. వాళ్లు ఉద్యమాల జేసి ధర్నాలు జేసి పోరాటాలు జేస్తుంటే.." అంటు అనర్ఘళం గా ఉపన్యసించిన తీరును క్యాసెట్ నుంచి పేపర్ పై పెట్టడానికి రెండు రోజులు శ్రమ పడ్డట్టు గుర్తు. ఇవి అనుభవాల్లో భాగాలు. విద్యార్థి ఉద్యమాలు, ఘటనల పరంపర, ఇక్కడి ఉద్యమ వాతావరణం పట్ల కాలక్రమేణా వచ్చిన అవగాహన దృష్ట్యా వివిధ దినపత్రికల్లో జిల్లా స్పెషల్ ల పేరిట ప్రచురితమైన పుస్తకాల్లో ఆ వార్త ల కోసం నాకు అవకాశమిచ్చే వారు. ఉదయం దిన పత్రిక ఈ స్పెషల్ సీరీస్ ను ప్రవేశ పెట్టింది. ఆ పత్రిక వరంగల్ జిల్లా స్పెషల్ లో ఆ వ్యాసాలు నేనే రాసాను.
ఘటనలను రిపోర్ట్ చేస్తూ వస్తున్న దశ లో ఆయా ఘటనల ఫాలో అప్ స్టోరీలను అందించడం లో అనుభవం సాధించగలిగాము. నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న జైపాల్ రెడ్డి సార్, ఆంధ్ర భూమి అయూబ్ ఖాన్ సార్ తో కలిసి మా ఇంటికి వచ్చి ఘటనా స్థలానికి రమ్మంటూ బయలుదేరదీసాడు. నాకు మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష. ఎలా వెళ్ళాలని సంశయిస్తున్నా సార్ వత్తిడికి వెళ్ళక తప్ప లేదు. మీదికొండ కు మేం వెళ్తున్న సమయానికే జిల్లా ఎస్ పీ దామోదర్ గౌతం సావంగ్, ఇతర పోలీస్ అధికారులు కూడా ఘటనా స్థలానికి టూ వీలర్ల పై వచ్చారు. ఓ ఎన్ కౌంటర్ స్థలానికి పోలీసులు టూ వీలర్ ల పై రావడం ఇదే మొదటిసారి అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్ కౌంటర్ ఘటనా స్థలాన్ని చూసిన సమయానికి అక్కడ ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. అప్పుడు ఆ ప్రాంతం లో పని చేసిన కడారి రాములు తో బాటు, జిల్లా నాయకులు ఆ ఘటనా స్థలం నుంచి తప్పుకున్నారు. అందువల్ల పోలీసులు ఆ గుట్టల చుట్టూ గాలింపులు కొనసాగించారు. ఘటనా స్థలం నుంచి ఇంటికి వచ్చిన నేను పరీక్ష అయిన తర్వాత వార్త రాస్తానని చెప్పి ఇంటికి వచ్చాను. మా స్టేజీ దగ్గర చేతికి గాయం తో ఓ యువకుడు నా తో బాటు బస్ ఎక్కి హనుమకొండ లో దిగాడు. మా వార్తలు ఘటన చుట్టూ కేంద్రీకృతమవుతూ రాసాం. వార్తలు ప్రచురితమయ్యాయి. ఈనాడు లో అనుకుంటా ఈ ఘటన తర్వాత తప్పించుకున్న దళ సభ్యుల గురించి వార్త వచ్చింది. మచ్చుపహాడ్ గ్రామం లో చేతికి గాయమయిన ఒక యువకుడు అనుమానాస్పద స్థితి లో తచ్చాడుతూ కనిపించాడని, ఓ బ్రెడ్ ముక్క చేతి లో ఉన్న ఆ యువకుడు పోలీసు బలగాలు అక్కడికి చేరుకునే లోపే తప్పించ్గుకున్నాడని ఆ వార్త. అలా తప్పించుకున్న ఆ యువకుడు మా స్టేజీ పై బస్ ఎక్కాడు. ఆ వార్త మేం మిస్ అయ్యాం గదా అనిపించింది. అలా తప్పించుకున్న యువకుడు వరంగల్ నగర కార్యదర్శిగా వ్యవహరించిన రమణమూర్తి అని తర్వాత ఆయన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నాడు తెలిసింది.
ఈ ఘటన లు గుర్తు కోసం మాత్రమే రాసినవి. జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వార్తా సేకరణ సందర్భాల్లో మరిచిపోని సందర్భాలివి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుంచి వార్త లో చేరిన నాటికి నాకు కనీస కంప్యూటర్ అవగాహన కూడా లేదు. తెలుగు పత్రికా రంగం లో కంప్యూటర్ పేజినేషన్ ప్రధానం గా ఆరంభమవుతున్న పత్రిక "వార్త". ఆ పత్రిక లో డెస్క్ వైపు జాయినవడం వల్ల పేజినేషన్ నేర్చుకోవాలని ఒక నిబంధన ఉన్నా, కాలక్రమేణా నేర్చుకునే వెసలుబాటు ఇచ్చారు. పత్రిక వెలువరించే తేదీ ప్రకటించక ముందే ఎన్ టీ రామారావు మృతిచెందారు. ఆ పత్రిక డమ్మీ ల రూపం లో వచ్చిన నాలుగు పేజీ ల పుల్ ఔట్ ల దశ లోనే పత్రిక స్టాండర్డ్ అర్థమయింది.మొదటి రోజు పుల్ ఔట్ లో హెడ్ లైన్ " అన్న గుండె ఆగింది... పేద వాడి అన్నం గిన్నె తొణికింది" .. తెలుగు పత్రిక ల సృజనాత్మక స్లగ్ ల ప్రక్రియ కు తార్కాణం గా నిలిచింది. ఆ రోజు స్లగ్ లు , "వార్త " లో ప్రింటింగ్, పేజినేషన్ చూసిన తర్వాత, ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుంచి బయటికి వచ్చి తప్పేమీ చేయలేదనిపించింది. పత్రిక పూర్తి స్థాయిలో వెలువడేందుకు, మేము కంప్యూటర్ నేర్చుకోగలిగేంత సమయం ఉంటుందని ముందు అనుకున్నాం గానీ, వార్త అనూహ్యం గా మార్కెట్ లోకి వచ్చింది. ఆ పత్రిక లో నేను పని చేసిన నలబై రోజుల స్వల్ప వ్యవధిలోనే ప్రభ అన్ని కాకున్నా అనేక జ్ఞాపకాలు మిగిలాయి.
-పీవీ కొండల్ రావు

Keywords : journalism, warangal, peoples war, encounter, police
(2024-04-11 18:40:28)



No. of visitors : 1785

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..