ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 11...స్పేస్ ఫిల్లర్స్ కోసం తండ్లాట..-పీవీ కొండల్ రావు

ʹమునివేళ్ల

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

స్పేస్ ఫిల్లర్స్ కోసం తండ్లాట...

"యాపిల్ మాకింతోష్" కంప్యూటర్లు..... "క్వార్క్ ఎక్స్ ప్రెస్" పేజి మేకర్లు.. "లతదవం" .. కీబోర్డ్... ʹవార్తʹ ఆరంభం లో హడావిడి .. రోజూ ఆఫీసులో అదే సందడి.. మా సందడికి తగినట్లే వరంగల్ ఎడిషన్ లో మాతో పనిచేసేందుకు డెస్కులో అరకొర స్టాఫ్. వరంగల్ కు సంబంధించి అవగాహన ఉన్న ధీకొండ నర్సింగ రావ్, కరీం నగర్ నుంచి అప్పుడే ఫీల్డ్ లోకి వచ్చిన విద్యాధర్ చక్రవర్తి, ఘంటా చంద్ర శేఖర్, వరంగల్ కోసమే అపాయింటయిన శ్రీనివాస్(ఇప్పుడు సమాచార శాఖ లో అధికారి) కరీం నగర్ కోసం మరో సబ్ ఎడిటర్ గా సృజన్, ఖమ్మం కోసం విఠల్ రావు సార్, జనగామ డెస్క్ లో శంకర్ రావు, వీళ్లకు తోడు నేను, ఎడిషన్ ఇన్ ఛార్జి గా ఖాలిక్ సార్ వార్త మొదటి విడత స్టాఫ్ గా చేరాం.
జిల్లాల డమ్మీల ప్రక్రియ ఆరంభమవక ముందే ఏకంగా డిస్ట్రిబ్యూటర్లకు పేపర్ చేర్చే సాధారణ ప్రక్రియ మొదలయింది. అడ్వర్టైజ్ మెంట్ల విభాగం లో సరబు శ్రీనివాస్, రవీంద్రనాధ్, మహేందర్, అమరేంద్ర, వార్తల కంపోజింగ్ కోసం కొండ రాజు, ఇంకో రాజు ,మొదట్లో ఇది మా టీమ్. ట్రెయినింగ్ బ్యాచ్ నుంచి వచ్చిన రిపోర్టర్లలో దొంతు రమేశ్, కావటి వెంకట్ ఇద్దరూ వార్తల కంపోజింగ్ చేయగలిగే సామర్థ్యం వున్నవాళ్లు. సీనియర్లలో బ్యూరో ఛీఫ్ జకీర్ సార్ తో బాటు మిట్టపల్లి శ్రీనివాస్, కే కే లిద్దరూ కంపోజింగ్ పట్ల అవగాహన లేని రిపోర్టర్లు గా వుండే వాళ్లు. ʹఉదయం ʹ దినపత్రిక బంద్ అయిన తర్వాత ఈ పత్రిక వస్తుండడం తో ఆ పత్రిక లో స్ట్రింగర్లుగా పని చేసిన మిత్రులంతా వార్తలో చేరారు.టెక్నికల్ విభాగం లో కూడా అంతా వరంగల్ వాళ్ళే. శ్రీనివాస్, మనోజ్ వీళ్ళతో బాటు జీవన్ అంతా ఒక కుటుంబం లా అనిపించేది నాకు.
వరంగల్ ఎడిషన్ నుంచే ఆదిలాబాద్, ఖమ్మం, కరీం నగర్, వరంగల్ జిల్లాలకు పత్రిక పంపిణీ జరిగేది. అందువల్ల ఆయా జిల్లాల స్పెషల్ లు ఇక్కడి నుంచే తయారు కావల్సి వచ్చేది. వరంగల్ , ఖమ్మం జిల్లాల రిపోర్టింగ్ వ్యవస్థ అక్కడి భౌగోళిక , రాజకీయ పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి వున్నది కావడం వల్ల అక్కడి నుంచి వచ్చే వార్తలను పేజీ లో పెట్టుకునే సందర్భం లో ఇబ్బంది ఉండేది కాదు. కరీం నగర్ జిల్లా లో మాగంటి భాస్కర్ అని అంతవరకూ సుప్రభాతం పత్రిక లో పనిచేసిన రిపోర్టర్ వార్త లో చేరాడు. అందువల్ల అక్కడి టీం కొంత వీక్ గానే వుండేది. ట్రెయినింగ్ సందర్భం లో ప్రతీ జిల్లా స్పెషల్ కు ఎనిమిది పేజీ ల టాబ్లాయిడ్ లు వేయాల్సిన అవసరం లేనందు వల్ల సబ్ ఎడిటర్లు కూడా తమ కు అంత భారం పడ దేమో అనుకునే వాళ్లు. అందువల్ల మా దినచర్య మద్యాహ్నం రెండింటికి ఆరంభమవుతే పదిన్నర, పదకొండు రాత్రికల్లా ముగుస్తుందేమో అని ఆరంభం లో మేం అంచనా వేశాం. ఆ మేరకు డెస్కుల్లో పనిచేసే మిత్రులు డ్యూటీలు వేసుకునే వాళ్లం. అయితే మొదటి రోజు నుంచే ఈ టైం టేబుల్ కు అనుగుణం గా పనిచేయలేని వత్తిడి మమ్మల్ని వెంటాడేది. మేం పనిచేస్తున్న జిల్లాల అప్పటి రాజకీయ, భౌగోళిక పరిస్థితుల పట్ల నాకు అవగాహన వుండడం నా పై వత్తిడి కొంచెం ఎక్కువగానే పడడానికి కారణమైంది.
వార్త వరంగల్ ఎడిషన్ లో వరంగల్ స్పెషల్ మాత్రమే సమగ్రం గా ఎనిమిది పేజీ ల వార్తలు మేము అందించగలిగే వాళ్లం. దీనికి, ఇక్కడి స్పెషల్ రావడానికి పెట్టిన డెడ్ లైన్ చివరిది కావడం ఒక కారణం. మద్యాహ్నంరెండింటికి మేం ఆఫీస్ కు వచ్చేది. అప్పటికే విఠల్ రావు సార్ యంత్రం లా తన పని చేసుకు పోయేవాడు. ఖమ్మం జిల్లా స్పెషల్ కోసం సినిమాలు, మార్కెట్ రేట్లతో రెండో పేజీ లో వార్తలు నింపే వాడు. మరో వైపు కరీం నగర్ స్పెషల్ కోసం అలాట్ అయిన సృజన్, విద్యాధర్ లు మాత్రం నెమ్మదిగా తమ పని చేసుకు పోయే వాళ్లు. ఇంకో పక్క ధీకొండ నర్సింగ రావు ఆదిలాబాద్ కోసం తన పని తాను చేసుకు పోయే వాడు. జనగామ నుంచి శంకర్ రావు ఠంచన్ గా పేజీ పంపే వాడు. మహబూబాబాద్ కు కేటాయించిన సబ్ ఎడిటర్ జాయిన్ కాలేదు. దాంతో ఆ పని కూడా మా పైనే పడేది. వరంగల్ స్పెషల్ కోసం శ్రీనివాస్ మద్యాహ్నం నుంచే టైపింగ్ చేసే వాడు. రెండింటికి మొదలయ్యే రొటీన్ అర్ధరాత్రి దాకా కొనసాగేది. ఆఫీస్ కు చేరుతూనే ఆ రోజు బాక్స్ కు వచ్చిన వార్తలన్నిటినీ ముందుకేసుకొని కంపోజ్ చేయడం కోసం వేసే వాళ్లం. ప్రూఫ్ రీడింగులు లేవు. ఎడిటింగ్ కూడా లేదు. చాలా సార్లు భాషా దోషాలు. ఎన్నోసార్లు ఐటెం డుప్లికేషన్ లు, మరెన్నో సార్లు పేజీలకు పేజీలే వేరే జిల్లాలకు వాడుకోవడాలు .. ఇలా సాగేది మా దినచర్య.
వార్త లో చేరిన తర్వాత చాలా సార్లు వార్తా రచన మరిచిపోతామా అనే భయం వేసేది. ప్రధాన జిల్లాల ప్రధాన రిపోర్టింగ్ నెట్ వర్క్ తో ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు గానీ డెస్క్ లో పని పరిస్థితులు అంతగా ఆశా జనకం గా ఉండేది కాదు. దీనికి పత్రిక యాజమాన్యం ఎంచుకున్న రిక్రూట్ మెంట్ విధానం ప్రధాన కారణం. మొదట్లో రీజనల్ సెంటర్ లకు కూడా డెస్కులు పెట్టారు. కానీ అక్కడ పేజినేషన్ చేయడం అంతగా ఉపయోగ కరం కాదని భావించి మళ్లీ వరంగల్ ఎడిషన్ సెంటర్ కు ఆ డెస్కులు తీసుకొచ్చారు.
ʹవార్తʹలో వార్తల తీరు చాలా సార్లు విలేకరి తమ వార్తను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలో తెలిపేది. వరంగల్ లాంటి జిల్లాను కళలకు కాణాచి అంటారు గదా. వార్త లో కరీం నగర్ మిత్రుడు "కల్లోల కణాచి కరీం నగర్ " అని మాకు వార్త రాసి పంపారు. అప్పటికి కల్లోలిత ప్రాంతాలుగా కొన్ని జిల్లాలని ప్రకటించిన సందర్భం కాబట్టి ఆ రిపోర్టర్ ఉద్దేశ్యం అది కావచ్చు గానీ మా వత్తిడి తీవ్రం గా ఉన్న సమయం లో ఇలా వచ్చిన అనేక వార్తలను మేం తీసుకున్నాం. కల్లోల కణాచిని వాడుకోలేదనుకోండి..అది వేరే విషయం.
మా ఎడిషన్ ఇన్ ఛార్జి ఖాలిక్ కు వత్తిడి అంటే భయం. మేమేమో మొత్తం నలభై పేజీలు టాబ్లాయిడ్ కు అందించాలి. ట్రెయినీలు , రిపోర్టర్లు, కంపోజర్లు అంతా కలిసి వార్తలు అందించగలిగే సామర్ధ్యం ఆరంభం లో మాకు లేదు. అందువల్ల రెండు గంటలకు ఆఫీసుకు వస్తూనే " ఇరుగు పొరుగు పెట్టుకుందాం సార్" అంటూ డెస్క్ క్యాబిన్ లోకి వచ్చే వాడాయన. నిజానికి కరీం నగర్ జిల్లా స్పెషల్ ఫెయిల్ అవడానికి మేమే ప్రధాన కారకులం అనుకోవచ్చు.
మా ఎడిషన్ లోని అన్ని జిల్లాల నుంచి ఆరంభం లో మేము ఆశించిన స్థాయిలో వార్తలు వచ్చేవి కావు. అంతవరకూ ఉన్నదానికి భిన్నంగా పేజినేషన్ విధానం కంప్యూటర్లలో చేసే ప్రక్రియ మొదలవడం తో సబ్ ఎడిటర్లకు సులభం గా పని జరుగుతుందని ముందుగా మేం అనుకున్నాం. కానీ క్వార్క్ ఎక్స్ ప్రెస్ లో టాబ్లాయిడ్ పేజినేషన్ చేపడుతున్నప్పుడు దాదాపు ప్రతీ పేజీ లో కూడా గ్యాప్ లు మిగిలేవి. సింగిల్ కాలం వార్తలు స్పేస్ ఫిల్లర్లుగా అప్పటికప్పుడు రాయాల్సిన అవసరం వచ్చేది. దీంతో దాదాపు రోజూ ఆయా జిల్లాల ప్రాధాన్యతకు తగిన రీతిలో స్పేస్ ఫిల్లర్ లు పెట్టే పని నాకు మిగిలేది. ఆరంభం లో జకీర్ సార్, దొంతు రమేశ్, కావటి వెంకట్ లు డెస్కు పనుల్లో కూడా సహకరించే వాళ్లు. పని వత్తిడి నేపధ్యం లో ఎడిషన్ ఇన్ ఛార్జి ఖాలిక్ దాదాపుగా ప్రెషర్ టైం లోనే బయటకు వెళ్లి పోయే వాడు. దీంతో ఆ భారం పూర్తిగా నా పైనే పడేది.
వార్త లో డిజైనర్లంతా నాతో చాలా బాగా ఉండే వాళ్లు. చివరి పేజీ వరకు ఉండి టాబ్లాయిడ్ ప్రింట్ అయినా తర్వాత పేపర్ జీపులోనే ఇంటికి వచ్చే అలవాటు అప్పుడు ఉండేది. మద్యాహ్నం రెండింటికి ఆఫీసుకు వచ్చి మళ్ళీ తెల్లవారి నాలుగ్గంటల వరకూ వార్త ఆఫీసులోనే ఉండేవాణ్ని.
వార్త దిన పత్రిక క్వార్క్ ఎక్స్ ప్రెస్ పేజినేషన్ తో బాటు గ్రామీణ ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో నెట్ వర్క్ ల పేరిట ముగ్గురు ముగ్గురు రిపోర్టర్లను వార్తా సేకరణకు వినియోగించుకున్నది. పేపర్ ప్లానింగ్ ప్రకారం వాళ్లంతా వార్తలు పంపితే, దానికి అనువైన డెస్క్ యంత్రాంగం ఉంటే పత్రిక ప్రారంభ దశ నుంచే ఈనాడు పత్రిక ను బీట్ చేయగలిగేది. అయితే డెస్క్ లో మాకు సరిపడా హాండ్ లు లేక రిపోర్టర్లే తెల్లవార్లూ పేజీ లు పెట్టాలైన వత్తిడి వుండేది. ఒక వారం రోజుల వ్యవధిలోనే అప్పుడున్న డెస్క్ కు తోడుగా ముగ్గురు సీనియర్ లను మాకు చేర్చారు.
వార్త లో మాకు మధ్య రాత్రి ఎం జీ ఎం ముందు బండ్లపై దొరికే చాయలు, అప్పుడు చెప్పుకునే ముచ్చట్లే ఆట విడుపుగా ఉండేది. ఈ దశ లో మాకు చాలా సార్లు బ్రేకింగ్ వార్తలు లభించేవి. ఆత్మకూర్ మండలం లోని ఉల్లి గడ్డ దామెర లో ఓ ప్రజా కోర్ట్ సందర్భం గా బాంబ్ పేలి గ్రామస్తుడు మృతి చెందిన ఘటన వార్త లో బ్రేకింగ్ రూపం లో వచ్చింది. ఆ వార్త , దానికి ఫాలో అప్ గా రాసిన "ఉలిక్కి పడ్డ ఉల్లిగడ్డ దామెర " వార్త రెండూ కూడా ఇతర పత్రికల మీద స్కోరింగ్ గా నిలిచాయి. అయితే ఇయర్ ప్యానల్ లో శవం ఫోటో పెట్టిన దామెర ఘటన వార్త కు మేం అలా పెట్టి ఉండాల్సింది కాదని తర్వాత తెలిసింది.
వార్త లో స్పేస్ ఫిల్లర్ల వార్తలు కొన్ని సార్లు వివాదాస్పదమయ్యాయి. పత్రిక అనేక విప్లవాత్మక ప్రయోగాలకు కేంద్ర బిందువుగా నిలిచింది గానీ ఆ క్రమం లో సాంప్రదాయ వార్తా రచనా శైలికి భిన్నమైన రీతిలో ప్రెజెంటేషన్ వుండేది.
-పీవీ కొండల్ రావు

Keywords : Journalist, warangal, news paper
(2024-04-11 18:40:59)



No. of visitors : 1180

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹమునివేళ్ల