నేను కూడ గౌరీ.. మేము కూడా గౌరీ... గౌరీ నీకు లాల్ సలామ్.. నినధించిన బెంగళూరు
సీనియర్ జర్నలిస్టు, హిందుత్వ వ్యతిరేక పోరాట కార్యకర్త గౌరీ లంకేశ్ దారుణ హత్యకు నిరసనగా మంగళవారం చేపట్టిన ర్యాలీతో బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి. నేను కూడ గౌరీ, మేము కూడ గౌరీ అనే నినాదాలతో బెంగళూరు దద్దరిల్లింది. గౌరి హత్య విరోధి వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన సుమారు 80వేలమంది ఆందోళనకారులతో జరిగిన ర్యాలీ బహిరంగసభ మతోన్మాదులకు ఓ హెచ్చరికగా నిల్చింది. బెంగళూరులోని సిటీ రైల్వే స్టేషన్ నుండి సెంట్రల్ కాలేజీ గ్రౌండ్ దాకా సాగిన ఈ ర్యాలీలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మీడియా ప్రతినిధులు, రచయితలు, కవులు, కళా కారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు పాల్గొన్నారు. ర్యాలీ సాగినంత సేపు పాటలతో నినాదాలతో కార్యకర్తలు గౌరీ లంకేష్ కు నివాళులు అర్పిస్తూ సాగారు.
తెలంగాణ నుండి ʹతెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ʹ TUWJ తరపున వెళ్ళిన జర్నలిస్టులు గౌరీ లంకేష్ ఫోటోలతో కూడిన టీ షర్టులతో ర్యాలీలో, సభలో పాల్గొన్నారు. అదే విధంగా తెలంగాణ నుండి, న్యూ డెమాక్రసీ, పీవోడబ్ల్యూ, చైతన్య మహిళా సంఘం, పౌరహక్కుల సంఘం, డెమాక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీనేత ఆసిష్ ఖేతన్, దళిత నేత జిగ్నేష్ మేవాని, రచయిత సాయినాధ్ సీపీఎమ్ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాంలతో పాటు వామ పక్షపార్టీలకు చెందిన నాయకులు, పలు దళిత , మహిళా సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు సహా ఆమ్ ఆద్మీ పార్టీ బెంగళూరు విభాగం ఈ నిరసన ర్యాలీలో పాల్గొంది. అలాగే ర్యాలీ అనంతరం జరిగిన సభకు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, తీస్తా సెతల్వాద్, ఆనంద్ పట్వర్ధన్, కవితా కృష్ణన్, జిగ్నేష్ మేవాని హాజరయ్యారు.
దేశంలో పెచ్చరిల్లిపోతున్న , అరాచకాలు సృష్టిస్తున్న హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు ఐక్యం అవ్వాలని సెంట్రల్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన సభలో వక్తలు పిలుపునిచ్చారు. గౌరీ లంకేష్ తన జీవిత కాలమంతా అణగారిన వర్గంపక్షమే నిల్చిందని, దళితులను, బహుజనులను, మహిళలను, ఆదివాసులను, మత మైనార్టీలను అణిచివేస్తున్న హిందుత్వకు వ్యతిరేకంగా ఆమె చివరివరకు రాజీ లేని పోరాటం చేసిందని అన్నారు. గౌరీ హత్య పై మతోన్మాదులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఈ హత్యను మావోయిస్టులపైకి నెట్టి తమ చేతులకంటిన నెత్తురును దాయాలనే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వక్తలు మండి పడ్డారు.
సభలో కళాకారులు పాడిన పాటలు సభికులను ఉత్తేజితులను చేశాయి. గౌరీ నీకు లాల్ సలామ్ అని కళాకారులు పాడిన పాటకు సభ మొత్తం కోరస్ పాడింది
Keywords : gauri lankesh, bengaluru, rss, bjp, hindutva,
(2019-02-18 17:21:21)
No. of visitors : 1206
Suggested Posts
| ʹఅబద్దాల ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎస్...ʹ- గౌరీ లంకేశ్ చివరి సంపాదకీయంఈ వారం సంచికలో భారత్‌లోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్ దారిలో వెళ్తున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను. |
| గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేద్దాం-మావోయిస్టు పార్టీ కేంధ్ర కమిటీ పిలుపు సీనియర్ జర్నలిస్టు, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన గౌరీ లంకేష్ ను మావోయిస్టులు హత్య చేశారని కుట్రపూరితంగా జరుగుతున్న ప్రచారాన్ని సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్ ప్రజల పక్షాన హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు విప్పడాన్ని సహించలేని సంఘ్ పరివార్ శక్తులే ఆమెను హత్య చేశాయని.... |
| సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కాల్చి చంపిన మతోన్మాదులు !గౌరీ లంకేష్ ʹలంకేష్ పత్రికʹకు ఎడిటర్. ఆమె పత్రిక ద్వారా రాజకీయ నాయకుల అనేక అక్రమాలను బహిర్గతపర్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాశారు. గౌరీ లంకేష్ మతోన్మాదానికి వ్యతిరేకంగా రచనలు చేయడమే కాక అనేక ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో ఓ బీజేపీ నేత అక్రమాలపై ఈమె పత్రికలో వ్యాసాలు రాశారు..... |
| హిందుత్వ శక్తులనుండి ప్రాణహాని ఉన్నగిరీష్ కర్నాడ్ సహా 25 మందికి ప్రభుత్వ భద్రతహిందుత్వ శక్తుల నుంచి హాని కలిగే అవకాశం ఉన్న గిరీష్ కర్నాడ్, బార్గుర్ రమాచంద్రప్ప, కేఎస్ భగవాన్, యోగేష్ మాస్టర్, బెనర్జీ జయప్రకాష్, చెన్నవీర కన్నావి, నటరాజ్ హులియార్, చంద్రశేఖర్ తదితరులకు పోలసుల రక్షణ కల్పించారు. ప్రత్యేక లింగాయత్ కమ్యూనిటీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ఐఏఎస్ ఎస్ఎమ్ జమ్దార్‌కు ప్రత్యేక రక్షణ కల్పించాలని.... |
| Maoists condemn Gauri Lankesh murder, ask people to hit streets for ʹdetermined fightʹThe Communist Party of India (Maoist) has rejected the ʹpropaganda by Hindu fascist forcesʹ that Kannada journalist Gauri Lankesh was killed by Maoists. It said that the ʹSangh Parivarʹ killed Lankesh to muzzle the voice of pro-people forces.
In a release issued by Abhay, spokesman for Central Committee of CPI (Maoist).... |
| జీనాహైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో...గౌరీ లంకేష్ స్పూర్తిని కొనసాగిస్తాం...ఢిల్లీ నుండి కన్యాకుమారి దాకా మతోన్మాద హత్యారాజకీయాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులో నిన్న మొదలైన ప్రదర్శనలు ఇవ్వాళ్ళ కూడా కొనసాగాయి. ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోయంబత్తూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్ ,గుజరాత్, చండీగడ్, హైదరాబాద్ తో సహా అనేక చోట్ల ప్రదర్శకులు.... |
| గ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసి... హైదరాబాద్ లో భారీ ర్యాలీబెంగుళూరు లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో ʹగ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసిʹ పేరుతో భారీ ర్యాలీ జరిగింది. టాంక్ బండ్ పైనున్న ముఖ్దుం మొయినుద్దీన్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వందలాదిమంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.... |
| బీజేపీవి సిగ్గులేని రాజకీయాలు - హిందుత్వ , జాతీయత ఒక్కటేనన్న మాటలపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం!నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? |
| మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేదట !అసలు మహిళలకు రాత్రి పూట పనేంటని ఎదురు ప్రశ్న వేశాడు కర్నాటక హోంమంత్రి రామలింగా రెడ్డి. కర్నాటక మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేశాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ మహిళ ఆఫీసుకు వెళుతున్న.... |
| మనువాద శవపేటికకు దిగ్గొట్టిన నాలుగు మేకులు - ఎన్. నారాయణ రావు2013 ఆగస్టు 20 నుండి నరేంద్ర దభోల్కర్ హత్యతో మొదలై, 2015లో గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, 2017 సెప్టెంబరు గౌరీ లంకేశ్ (జర్నలిస్టు) హత్యతో హిందూ మనువాద ఫాసిస్టుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాలుగు హత్యలు.... హంతకుడు ఒక్కరే... అవే తుపాకీ గుళ్లు. ఈ దేశంలో మేధావులు తుపాకీ గుండ్లకు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు .... |
| బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ |
| రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
|
| బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
|
| కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి || |
| కలత నిద్దురలోనూ దండకారణ్యమే |
| బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
|
| చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వాలి |
| వీవీ, గాడ్లింగ్ లపై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం |
| వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
|
| stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur |
| Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating |
| Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions |
| ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు |
| రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు |
| పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ |
| నల్గొండలో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల |
| COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde! |
| దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు |
| Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh |
| మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్ తెల్తుంబ్డే |
| Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde |
| ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు |
| మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
|
| A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet |
more..