ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావుఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

"కిరికిరి"..."వార్నింగ్"..

వార్త లో నాది నలభై రోజుల ఉద్యోగమే. అయితే వార్త మిగిల్చిన జ్ఞాపకాలు అనేకం. డెస్కుల్లో పీక్ హవర్స్ లో సబ్ ఎడిటర్లు,కంపోజర్లు, డిజైనర్లు ఎదుర్కునే వత్తిడి , సాంకేతిక పరిజ్ఞానానికి ధీటుగా పాత్రికేయులు మారుతున్నప్పుడుండే పురిటినొప్పులు, ఆ క్రమం లో పత్రికల్లో దొర్లే తప్పులు, ముద్రా రాక్షసాలు వీటన్నిటినీ వార్త ఆరంభ దశలో దగ్గరినుంచి చూసిన అనుభవం నాది. వార్త పత్రిక లో లే అవుట్ దశనుంచీ విప్లవాత్మకమైన మార్పులు కనిపించాయి. పత్రికలో బిజినెస్ పేజీ లు ఆరంభం లో ఓ ఎకనమిక్ టైమ్స్ పత్రిక, ఓ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక లా భిన్నమైన రంగున్న న్యూస్ ప్రింట్ లో వచ్చేది. పాఠకులను ఇట్టే ఆకట్టుకునే హెడ్డింగులు, రంగుల ఫోటో లు కూడా అద్భుతం గా ముద్రించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రింటింగ్ వ్యవస్థ.
ఇదంతా మెయిన్ పేజీ ల పై ఆ పత్రిక యాజమాన్యం, ఎడిటోరియల్ నెట్ వర్క్ చూపిన శ్రద్ధ కారణం గా వాస్తవిక రూపం దాల్చింది.
సబ్ ఎడిటర్లు అవసరానికి సరిపడా లేక పోవడం వల్ల పేజీల తయారీ డెడ్లైన్ ల లోపు పూర్తవడం లేదని యాజమాన్యం వారం రోజుల్లోనే గ్రహించింది. అందరిలాగే మాకూ ముగ్గురు సబ్ ఎడిటర్లు వచ్చారు. గోపాల్ రావు, మునిరత్నం రెడ్డి, శేషగిరి రావు గారు ముగ్గురూ మా టీం లో వచ్చి చేరే సరికి డెస్క్ వ్యవస్థ బలోపేతమైంది. పేజినేషన్ లో కంప్యూటర్ల వినియోగం నెమ్మదిగా అలవాటయిపోతున్న దశ అది. అయితే నా వరకు వార్త లో పని చేసిన రోజుల్లో వేరే జీవితమే లేని దుస్థితి నెలకొన్నది. మద్యాహ్నం రెండింటికి ఆఫీసుకు రావడం , బాక్సుకు వచ్చిన వార్తల ను కంపోజ్ చేయించుకోవడం,పేజినేషన్ కోసం కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్కడయినా ఖాళీలు ఉంటే పూరించడానికి స్పేస్ ఫిల్లర్ వార్తలు చెప్పడం.. అవసరమైన జిల్లాలకు ఇరుగు-పొరుగు పేజీలు ఇవ్వడం... హడావిడి పడుతూ వత్తిడిలో వెళ్ళి పోయే ఖాలిక్ ఫెయిల్యూర్ కాకుండా జాగ్రత్త పడడం .. ఒక్కొక్క జిల్లా స్పెషల్ లు పూర్తయి ప్లేట్లు వచ్చి ప్రింటయ్యే వరకు ప్రింటింగ్ మిషన్ ఏరియా లో తచ్చాడుతూ ముచ్చట్లు పెట్తుకోవడం... ఇది రొటీన్ గా మారిన సందర్భమది. ఈ పనులు జరుగుతున్న తరుణం లోనే మద్యలో శంకర్ హోటల్ లో చపాతీతో రాత్రి తిండి అయిపోయిందనిపించే వాళ్ళం. పేపర్ మొత్తం ప్రింటయిన తర్వాత జనగామ వైపు పేపర్ తీసుకెళ్ళే జీపులో ఇంటికి బయలుదేరే వాడిని. అప్పటికి తెల్లవారి నాలుగున్నర అయిదు అవుతుండేది.ఇంటికి వస్తూనే మేము పెట్టిన హెడ్డింగులు, పేజీలు మరోసారి చూసుకొని నిద్రలోకి జారుకుంటే మళ్ళీ మధ్యాహ్నం ఒంటిగంట కల్లా లేచేది. మళ్ళీ తయారవడం.. మళ్ళీ వెళ్లడం.. ఇక ఇంతేనా జీవితం అనిపించేది.
ఉల్లిగడ్డ దామెర ఉలిక్కిపడ్డ వార్తను తనదైన శైలి లో ప్రెజెంట్ చేసిన జకీర్ వార్తా రచన విలక్షణం గా ఉంటాది. ఆంధ్ర ప్రభలో వార్తల ప్రెజెంటేషన్ ను చూసి నేర్చుకున్న మాకు జకీర్ వాక్య నిర్మాణ విధానం భిన్నంగా తోచేది. జకీర్ ఆంధ్రజ్యోతి లో కరీం నగర్ లో పనిచేసిన రోజుల్లో జగిత్యాల రైతాంగ పోరాటానికి సంబంధించి రాసిన ఒక సూపర్ లీడ్ ను నేను వార్త కు రాక మునుపు దాచిపెట్టుకున్నాను. వార్తలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. క్రిస్ప్ గా రాయడం అంటే జకీర్ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే వాక్యం సూటిగా విషయాన్ని చెబుతుంది. అందువల్ల ఆయన రాసే ప్రత్యేక వార్తలతో ʹవార్తʹవరంగల్ ప్రవేశం ఒక సంచలనాత్మక రీతిలో జరిగింది. చాలా స్లగ్ లు జకీర్ మాకు ఇచ్చే వారు. అలాగే మేం పెట్టే స్లగ్గులను సంస్కరించే వాడు. వార్తా రచనలో సహజ శైలి ఆయనది. అందువల్ల పాఠకుడు ఆయన వార్తను చదివేలా ఆయన ప్రెజెంటేషన్ ఉండేది.ఆంధ్ర ప్రభలో కిషన్ ʹచౌరాస్తా ముచ్చట్లʹ తరహాలో జకీర్ వరంగల్ తో పాటు అన్ని జిల్లాలో కోసం "కిరికిరి" అనే కాలమ్ రాసే వారు. రాజకీయాంశాలపై సూటైన వ్యాఖ్యగా ఆ కాలమ్ ఉండేది. ఆ కాలమ్ కోసం పాఠకుడు ఎదురుచూసేలా జకీర్ రాసేవాడు.
వార్త లో ప్రతీ రోజూ జెనరల్ పేజీ లు, మెయిన్ పేజీ లకు, ఎడిషన్ సెంటర్లనుంచి వార్తలు పంపే వాళ్లం. అలాంటి అవకాశాన్ని ఒక సారి నా బై లైన్ కోసం తీసుకున్నాను.ఇండియన్ ఎక్స్ ప్రెస్ వరకూ రిపోర్టర్ గా ఉన్న నాకు రిపోర్టర్ గుణాలు పోలేదు.అప్పట్లో వార్తలో బై లైన్లు పెట్టగలిగే అవకాశం వుండేది. ఇతర రిపోర్టర్ల బై లైన్లను, ప్రాంతీయ పేజీల్లో బై లైన్లను మేం పెడుతుండేవాళ్లం.అందువల్ల నాకు కూడా వార్త లో నా పేరు చూసుకోవాలనే కోరిక ఉండేది. అదే సమయం లో నాకొక అవకాశం లభించింది. హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు. అందువల్ల ఆయన ఒక ప్రత్యేక సెమినార్ లో పాల్గొని అక్కడ లెక్చర్ ఇచ్చారు. అక్కడినుంచి హుస్నాబాద్ వరకూ నేను, జగన్ , ప్రభాకర్ ముగ్గురమూ గూగి వెంట వెళ్ళాం. ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది కావడం వల్ల గూగి హుస్నాబాద్ పర్యటనను ఓ ప్రత్యేక వార్త గా రాసి నా బై లైన్ తో వరంగల్ కు ఖాళీగా వచ్చే మెయిన్ పేజీ లో వాడుకున్నాం. అలా ఓ సబ్ ఎడిటర్ గా కూడా నేను నా బై లైన్ పెట్టుకున్నాను. పని వత్తిడి ఎంత ఎక్కువగా వుండేదో వార్తలో అంత స్వేచ్చ ఉండేది. అప్పుడున్న స్వేచ్చ ఊతంగా మా అక్కయ్య పిల్లలు బావి దగ్గర బోర్ నీళ్లు తాగుతూ దిగిన ఫోటో ను జకీర్ సార్ రైటప్ తో నాలుగు జిల్లాల టాబ్లాయిడ్ మొదటి పేజీ లో వాడుకున్నాం.
పల్లెటూళ్ళో పుట్టడం వల్లనో, పట్టణాల సంస్కృతి లేకపోవడం వల్లనో నాకు ఫోటోగ్రఫీ గురించిగానీ, సినిమాల గురించిగానీ తక్కువ తెలుసు.వరంగల్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు నెలకొకసారి చూపే అవార్డ్ సినిమాలు , మాదాల రంగా రావు తీసిన ఎర్రమల్లెలు, విప్లవశంఖం తదితర సినిమాలు కాకతీయ టాకీస్ కొచ్చినప్పుడు చూసి పాటల పుస్తకాలు కొనుక్కుని చదువుకొని నేర్చుకున్న అనుభవాలు మినహా సినిమాలు బాగా చూసిన సందర్భాలు తక్కువ. అలాగే రవీందర్ సార్ ఘటనల వార్తలు, వార్తావ్యాఖ్యల కోసం ఎన్నో సార్లు ఫోటోలు తీసినా నా వార్తలకోసమయినా ఫోటోలు తీసుకో గలిగే హాబీ నాకు ఉండేది కాదు. ఇప్పటికీ ఆ ప్రతిభ నాకు రాలేదు. సినిమాల గురించి ఇక్కడ ఒక ఘటన కోసం ప్రస్తావించాల్సి వచ్చింది. జకీర్ సార్ ఉన్నప్పుడు ఉల్లిగడ్డ దామెర లాంటి ఘటనలు రాత్రుల్లో సంభవించినప్పుడు మాకు స్కోరింగ్ వార్త గా ఆ వార్తలు ఉండేవి. అందువల్ల ʹవార్త ʹ పాఠకులకు సంచలన వార్తలు అందించే పత్రిక గా రూపాంతరం చెందింది. వరంగల్ ఎడిషన్ లోని నాలుగు జిల్లాలకు జకీర్ నక్సలైట్ ఉద్యమం పై రాసే ధారావాహిక వార్తలు ఎక్స్క్లూజివ్ వార్తలు గా నిలిచేవి. మా డెస్క్ వాళ్లకు, ఖాలిక్ సార్ కు ప్రత్యేకించి కామన్ వార్తలు పెట్టుకునేందుకు ఆయన వార్తలు ఒక ప్రత్యేక సదుపాయం.
ఓ రోజు జకీర్ సార్ తొందరగా ఇంటికి వెళ్ళాడు. కొన్ని పేజీలు పెట్టుకున్న తర్వాత మేం ఎం జీ ఎం ఎదుట ఉన్న చాయ బండి వద్దకు టీ కోసం వెళ్లాం. అప్పుడు వరంగల్ నగరానికి తోడు , నగర శివారు గ్రామాలన్నింటి లోనూ అన్నల ప్రభావం తీవ్రం గా ఉండేది. ఓ వైపు ఉల్లిగడ్డ దామెర లాంటి ఘటనల పరంపర .. మరో వైపు నగరం లో అన్నలు ఎప్పుడు ఎక్కడ పోస్టర్లు వేస్తారో, ఏ ఘటనకు తలపడుతారో తెలియని వాతావరణం.ఎం జీ ఎం hospital వెనుక నుంచి మండి బజార్ వైపు ఉన్న సందులో అప్పటికే ఓ రౌడీని అన్నలు హతమార్చిన ఘటన జరిగింది. ఈ దశలో ఎం జీ ఎం ప్రహారీ గోడల తో పాటు , పోచమ్మ మైదాన్ వరకూ అనేక గోడలపై "వార్నింగ్" అనే ఎర్ర అక్షరాల పోస్టర్లు వెలిశాయి. సాధారణం గా సినిమా పోస్టర్ల పై నటుల ఫోటో లు ఉంటాయి కానీ ఈ పోస్టర్ పై ఎలాంటి ఫోటో లు లేవు. అందువల్ల ఇది సినిమా పోస్టర్ కాదేమో అనుకున్నన్నేను. అలా నేను మనసులో అనుకుంటున్నప్పుడే శ్రీనివాస్ సార్ డెస్క్ దగ్గరకు వచ్చి ఒక సింగిల్ కాలం బాక్స్ ఐటెం తాను రాస్తానని అది ఎక్స్క్లూజివ్ అని నాదగ్గరికి వచ్చి చెప్పాడు. అప్పుడు ఆఫీసులో ఉన్న పరిస్థితుల్లో సార్ తో బాటు కే కే వార్తల సేకరణ విషయం లో అప్రాధాన్య బీట్ లకు పరిమితమయి ఉన్నారు. అందువల్ల నాకు సార్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండేది. పని వత్తిడి తప్పుకునేందుకు ఖాలిక్ సార్, ఏదో పని పై వెళ్లడం తో జకీర్ సార్ ఇద్దరూ లేని టైం అది. సార్ వార్త కు అవకాశం ఇవ్వగలిగే రీతిలో టాబ్లాయిడ్ బ్యాక్ పేజీ లో సింగిల్ కాలం గ్యాప్ ఉంది. సార్ నాకు చెప్పిన వెంటనే తన సంచలన వార్త రాసి కంపోజ్ చేయించారు. చదివిన నేను "ఎవరికీ వార్నింగ్" అని స్లగ్ పెట్టడం ఒక దాని వెంట ఒకటి జరిగాయి. తెల్లవారి పేపర్లో వార్త వచ్చింది. యధావిధిగా ఇంటికెళ్ళి మళ్ళీ ఆఫిసుకు వచ్చే వరకూ నిద్ర పోయి తిరిగి ఆఫీస్ కు వచ్చిన నేను బ్యూరో లో ఆ వార్త పై చర్చ జరగడం తో అటు వైపు వెళ్ళాను. వార్నింగ్ వార్త పై చర్చ అది. అప్పుడు గానీ తెలిసింది అది సినిమా టైటిల్ అని. ఆ ఘటన తర్వాత డెస్కుల్లో ఉన్న సబ్ ఎడిటర్లు విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటే పత్రిక వార్తలకూ,అలాగే రిపోర్టర్ల విషయ విస్తరణకు ఉపకరిస్తుందనే వాస్తవం తెలిసింది. ʹవార్నింగ్ ʹ పోస్టర్ వార్త ఆఫీసులో నవ్వులు పూయించింది.
-పీవీ కొండల్ రావు

Keywords : Ngugi wa Thiongʹo, kenya, journalism, warangal, vartha
(2019-02-18 03:54:15)No. of visitors : 684

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

   ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 5...స్లగ్గులు.. వార్తలు - -పీవీ కొండల్ రావు

మొదటి సారి ఓ ఆజ్ఞాత నక్సలైట్ నాయకుడు, అధినేత కొండపల్లి సీతారామయ్య తో "కొండపల్లి తో కొన్ని గంటలు" పేరిట ఇంటర్వ్యూలు ఇలా చేయొచ్చు అని నిరూపించిన పత్రిక అది. ఆ ఇంటర్వ్యూ అప్పటి పరిస్థితుల్లో , ఇప్పుడు కూడా సీరియస్ గా జర్నలిజాన్ని ఎంచుకొని తమకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉండాలని భావించే పాత్రికేయులకు దిక్సూచి.....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 2..."కామన్ పేజీలు.. లైన్ అకౌంట్లు.."

ఆంధ్ర ప్రభ లో పని చేసిన ప్రతీ అకేషనల్, రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ కూడా తమ బై లైన్ చూసుకోవాలని పరితపిస్తారు. ఆంధ్ర ప్రభ దినపత్రికకు ఆ రోజుల్లో ఉన్న పేరు అది. ఎమర్జెన్సీ కా లం లో పత్రికా స్వేచ్ఛను నియంత్రించ యత్నించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్లాంక్ ఎడిటొరియల్ ఇచ్చారని ఆ పత్రిక పట్ల అపరిమితమైన గౌరవం.....

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..