ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 14... ఘటనలు.. వార్తలు - పీవీ కొండల్ రావు

ʹమునివేళ్ల

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

ఘటనలు.. వార్తలు

ఊరుగొండ,ఉల్లిగడ్డ దామెర, మొగిలిచెర్ల.... ఇవి తెలంగాణ పల్లెలు. ఒక్కో ఊరు ,ఒక్కో సందర్భం లో ,ఒక్కో ఘటన వల్ల పత్రికల్లో పతాక శీర్షిక అయింది. ఈ గ్రామాల వార్తలు ప్రజల కోణం లో పరిచయమయ్యాయి. ఊరుగొండ లో అప్పటి మునిసిపల్ పరిపాలన శాఖా మంత్రి మాదాటి నరసిం హ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరను పేల్చారు నక్సలైట్లు. ఆ వార్త రాసేనాటికి నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వున్నాను.ఉల్లిగడ్డ దామెర లో బాంబు పేలుడులో ఆ గ్రామస్తుడు మృతి చెందాడు. మొగిలిచెర్ల లో ప్రజల డాక్టర్ ఆమెడ నారాయణ హత్యకు గురయ్యాడు. ఆ గ్రామ ప్రజలు ఈ ఘటన కు నిరసనగా పోలీసుల పై తిరగ బడ్డారు. ఆ ఘటన సంబంధిత వార్త "మర్ల బడ్డ మొగిలిచెర్ల".
ఈ వార్తలన్నీ ప్రముఖం గా ప్రచురితమవుతున్న క్రమం లో ఉద్యమ ప్రాంతాల పై అప్ కంట్రీ పేపర్ల దృష్టి పడింది. దాంతో ఆ పత్రికల రిపోర్టర్ల కు స్థానిక పాత్రికేయుల గైడెన్స్ అవసరమయ్యేది. చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ పత్రిక రిపోర్టర్ గా నాకు ఆ అవకాశం లభించేది. ఇదే దశలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన జర్నలిజం విభాగం బృందం వరంగల్ లో ఘటనలు జరిగిన ప్రదేశాల్లో ఓ పరిశోధక డాక్యుమెంటరీ తీయడానికి ఇక్కడికి వచ్చారు. దేబాశిష్ గోస్వామి బృందం "కిల్లింగ్ ఫీల్డ్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్" పేరిట తీసిన ఈ డాక్యుమెంటరీ కోసం ముందుగా విశ్వనాథగూడెం గ్రామానికి మందు పాతర సంబంధిత విషయ సేకరణ కోసం వచ్చింది. వాళ్ళతో ఆ సంఘటన స్థలానికి వెళ్ళి, ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న పశువుల కాపర్ల కుటుంబాలతో ఇంటరాక్షన్ చేసినప్పుడు నేను కూడా వెళ్లాను. బాధితుల వెర్షన్ ఈ డాక్యుమెంటరీ లో తీసారు.
వార్త లో నేను పని వత్తిడి తో ఇబ్బంది పడుతున్న దశ లో హైదరాబాద్ నుంచి ఒక ఇంగ్లీష్ పత్రిక తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అప్పటివరకూ ఎకనమిక్ టైమ్స్ పత్రికను తన ప్రెస్ లో ప్రింట్ చేసిన కేటీ మాహీ నేతృత్వంలో ఈ పత్రిక తేబోతున్నారని వేణు ద్వారా నాకు తెలిసింది. జర్నలిజం లో నా బాగోగులపై ఎప్పుడూ కన్సర్న్ చూపే వేణు ఏ పీ టైమ్స్ లో అవకాశాల పై అప్పటికే ఆ పత్రిక లో జాయినయిన పీ ఎస్ జయరాం సార్ తో తెలుసుకున్నాడు. వరంగల్ వార్తాప్రాధాన్యత గల పట్టణం గా పేరున్న దృష్ట్యా నాకు అవకాశం ఇచ్చేందుకు జయరాం సార్ ఒప్పుకున్నాడు. అలా చేరిన ఆ పత్రికలో పని చేసిన రోజులు జర్నలిజం లో నాకు మరిచిపోలేని అనుభూతులను మిగిల్చాయి. జయరాం సార్ తో బాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పని చేసిన దివాకర్ సార్, హార్నూర్ సార్, రాజారాం సంక్లా వీళ్ళంతా ఏ పీ టైమ్స్ లో చేరారు. వీళ్లకు తోడు ఆ పత్రికను దక్కన్ క్రానికల్ పత్రికకు ధీటైన పత్రిక గా తీర్చి దిద్దేందుకు అనువైన యంత్రాంగాన్ని సన్నద్ధం చేసారు. జిల్లాల్లో నాతో బాటు విజయవాడ లో డానీ గారు, విశాఖపట్నం లో రాంచందర్ రావు గారు చేరాము.
వార్త నుంచి ఆంధ్ర ప్రదేశ్ టైమ్స్ పత్రిక లో చేరిన దశలో ములుగు శాసనసభ్యుడిగా ఉన్న చందూలాల్ వరంగల్ నుంచి లోక్ సభ కు ఎన్నికవడం తో ఖాళీ అయిన శాసన సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వరంగల్ కు వచ్చారు. ఆయన సభ ములుగు ,ఏటూరు నాగారంలలో జరగాల్సిన రోజు హనుమకొండకు రాజశేఖర్ రెడ్డి చేరుకునే సరికే ములుగు మండలం జాకారం వద్ద మందుపాతర ఘటన సంభవించింది. ఆ ఘటన లో ఒక డీ ఎస్ పీ స్థాయి అధికారి తో బాటు ఎనిమిది మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు. ఘటన జరగడం తోనే కాంగ్రెస్ నాయకుడి పర్యటన దారి మరల్చారు.అప్పటికే ఆగ్రహోదగ్రులైన పోలీసులు ,వారి ఊరేగింపులో సివిల్ దుస్తుల్లో పాల్గొన్న ఇతరులు హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో పలు దుకాణాల పై దాడులు చేశారు.అప్పటికి ఇంకా ఎలెక్ట్రానిక్ మీడియా రంగ ప్రవేశం కాలేదు గానీ, ప్రింట్ మీడియా లో ఉన్న దాదాపు అన్ని పత్రికలూ, దాడి సంబంధిత వార్తను ప్రముఖం గా ప్రచురించాయి. ఆ రోజు ఆ వార్తను వాస్తవిక దృక్కోణం లో అన్నివివరాలతో సహా ప్రచురించడంలో ఇక్కడ పని చేసిన అన్ని తెలుగు దిన పత్రికల బ్యూరో లతో బాటు, హైదరాబాద్ నుంచి వార్త కవరేజికి వచ్చిన అన్ని ఇంగ్లీష్ పత్రికల్ల ప్రతినిధులు కూడా ఉన్నారు. హిందూ దినపత్రిక పక్షాన ఇక్కడ పని చేసిన శాస్త్రి గారితో బాటు, ప్రస్తుతం తెలంగాణ టుడే పత్రిక ఎడిటర్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సార్ ఆ ఘటన, తదనంతర పరిణామాల వార్తను కళ్లకు కట్టినట్టు రాసారు. అప్పుడు ఆంధ్ర ప్రభ స్టాఫర్ గా జైపాల్ రెడ్డి సార్ ఉన్నారు. ఇతర దిన పత్రికల్లో వార్త పక్షాన శ్రీనివాస్ సార్,కేకే, జ్యోతి పక్షానరఘునాధ్ ,ఈనాడు పక్షాన శ్రీరాం సార్ పనిచేసినట్లు జ్ఞాపకం.
వరంగల్ జర్నలిస్టులకు ఒక వింత అనుభవం కలిగించిన ఘటన జాకారం మందుపాతర ఘటన. ఈ ఘటన రోజు కూడావార్త వైపు సీనియర్ లు దృష్టి సారించడం తో నేను ఫోటో లు మా కార్యాలయానికి చేర్చే పనిలో నిమగ్నమయ్యాను. అశోక్ నగర్ లోని మా కార్యాలయం నుంచి ఫోన్ లో వరంగల్ లో జరిగిన దాడి సంబంధిత ఘటన వార్తను బ్యూరో సహకారం తో రాసాను. ఆ రోజు పత్రికల్లో ప్రచురితమైన వార్త సంచలనాలకు మారుపేరయింది. నగరం లో పోలీసుల విచ్చలవిడి వీరంగాన్ని అన్ని పత్రికలూ ప్రచురించగా ఆ వార్తను ఆధారం గా చేసుకుని పౌరహక్కుల, మానవ హక్కుల సంఘాలు హక్కుల ఉల్లంఘన పిటిషన్ వేసాయి. ఈ పిటిషన్ ను పరిశీలించిన మానవ హక్కుల కమిషన్ జిల్లా మానవ హక్కుల కోర్టును ఈ ఘటన పై దర్యాప్తు చేయాలంటూ ఆదేశించింది. ఈ ఘటనానంతరం వరంగల్ లో పౌరహక్కుల ఉద్యమం లో పని చేస్తున్న ప్రొఫెసర్ బుర్రా రాములు , అంబటి శ్రీనివాస్ లకు సెక్యూరిటీ కల్పించారు.
మానవ హక్కుల కోర్ట్ కు కేసును పరిశీలనకు పంపిన క్రమం లో జిల్లా స్థాయి లో మానవ హక్కుల కోర్టులుంటాయనే విషయం తెలిసింది. ఇక్కడి రిపోర్టర్లను కూడా విచారణలో భాగస్వాములను చేయాలని విచారణాధికారికి రాష్ట్ర మానవ హక్కుల కోర్ట్ సూచన చేసింది. ఈ వార్త రాసిన సందర్భం లో వరంగల్ లో పని చేసిన పాత్రికేయులుగా ఇక్కడ పనిచేసిన జర్నలిస్టులంతా ఆ అనుభవం పాత్రికేయ కోణం లో ఒక వినూత్న ఒరవడికి సంకేతంగా భావించారు.
వరంగల్ జిల్లా అప్పుడు పలు సంఘటనలకు కేంద్ర బిందువుగా నిలిచేది. అందువల్ల ఇక్కడి జర్నలిస్టు యూనియన్ కూడా స్ఫూర్తిదాయక సంఘటన గా పని చేయాల్సి వచ్చేది. ములుగు అటవీ ప్రాంతం చుట్టూ ఉద్యమాలు విస్తరించి, అన్ని రహస్య కార్యకలాపాలకు కేంద్రం గా ఆ ప్రాంతం ఉండేది.దాంతో ఆ ప్రాంత రిపోర్టర్లు అప్రమత్తం గా పని చేయాల్సి వచ్చేది. అలా పనిచేస్తున్న దశలో ఓ ఘటన సంభవించింది. అప్పుడు నేను జిల్లా యూనిట్ కార్యదర్శిగా , రఘునాధ్ అధ్యక్షుడుగా మా యూనిట్ పని చేసేది. ఈనాడు స్టాఫర్ గా శ్రీరాం సార్ ఉండే వాడు. ఆ పత్రిక గోవిందరావుపేట విలేకరి వెంకట కృష్ణ కు ప్రజాప్రతిఘటన నక్సలైట్లు డెత్ వారంట్ జారీ చేసారు. ఆయన ను తాము హతమారుస్తామని ఆ పార్టీ కార్యదర్శి ప్రసాదన్న ఆ ప్రాంత విలేకరులకు లేఖ పంపారు. దాంతో జడిసిన వెంకటకృష్ణ హనుమకొండ లోని వాళ్ల కార్యాలయానికి వచ్చాడు.
ఉద్యమ జిల్లాలలో అప్పుడు జర్నలిస్టుల సంఘాల నాయకత్వాలు, జర్నలిస్టులు సమస్యల పరిష్కారాంశం లో, సమస్యలను ఎదుర్కునే విషయం లో సంఘటిత శక్తిని ప్రదర్శిస్తుండేవాళ్లు. వెంకట కృష్ణ విషయం తెలియగానే ఆ నక్సలైట్ గ్రూపుకు లేఖ రాయడం ద్వారా చర్చ లకు అవకాశం కల్పించమని కోరాలని యూనియన్ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని ఆ నక్సలైట్ గ్రూపుకు ఎలా తెలియజేయాలా అని భావిస్తున్న దశ లో ఆ గ్రూపు పట్ల సానుభూతిగా ఉండే ప్రజాసంఘాల వాళ్ల సహకారం తీసుకోవాలని నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం మేరకు మేము లేఖను పంపాము. మా లేఖకు ప్రతి గా ఆ గ్రూప్ నుంచి చర్చ లకు పిలుపు వచ్చింది. చర్చ లకు జిల్లా యూనియన్ బాధ్యులుగా రఘునాధ్ , వార్త శ్రీనివాస్ సార్,నేను, జైపాల్ రెడ్డి సార్, ఈనాడు బాధ్యుడిగా శ్రీరాం సార్ వెళ్లాము. దట్టమైన అడవిలో జరిగిన చర్చల్లో వెంకట కృష్ణ గోవిందరావుపేటను వదిలి హనుమకొండ లో బతికితే తమకు అభ్యంతరం లేదని ప్రసాదన్న హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వెంకట కృష్ణ హనుమకొండకు వచ్చాడు.
ఇలాంటి ఘటనలు ఉద్యమ జిల్లాల్లో యూనియన్ పని తీరుకు సవాళ్లుగా నిలుస్తాయి. వరంగల్ లోనే ఇంకో ఘటన సంభవించింది. నలగొండ జిల్లాలో ఓ ఘటన కు సంబంధించి తమకు శత్రువుగా వ్యవహరించారని చాడా శ్రీధర్ రెడ్డీ అనే పాత్రికేయుడిని అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు హత్య చేసారు. అలాంటి ఆరోపణే వరంగల్ లో పరకాల ప్రాంత మిత్రుడు మధూకర్ పై ఇక్కడి పీపుల్స్ వార్ అప్పటి కార్యదర్డి రామకృష్ణ చేసారు. ఆయన పై తాము చర్య తీసుకోవాల్సి వస్తుందని నక్సలైట్లు తమ ఆరోపణ సంబంధిత లేఖ లో పేర్కొన్నారు.అప్పుడు కూడా యూనియన్ రంగం లోకి దిగి సభ్యుడి ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా హామీ పొందగలిగింది.
వార్తలు, ఘటనలను గురించి రాసుకుంటున్న తరుణం లో ఒక దాని వెంట ఒకటిగా జ్ఞాపకాలు తెరలు తెరలుగా వస్తున్నాయి. కొన్ని ఘటనలు, వార్తలు గుర్తుకొచ్చినప్పుడు కళ్ళు చెమర్చుతున్నాయి.నిజంగా ఆ అనుభవాలు మానవ సంబంధాల విస్తరణలో ఎంతగానో ఉపకరించాయని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నప్పుడు అనిపిస్తున్నది.
- పీవీ కొండల్ రావు

Keywords : journalism, warangal, peoples war, naxals, pv kondal rao
(2024-04-18 23:36:55)



No. of visitors : 992

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹమునివేళ్ల