హంతకుల‌ రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న‌ సీపీఎం

హంతకుల‌

మరో జర్నలిస్టును చంపేశారు. నిజం మాట్లాడటం, సత్యాన్ని వెలికి తీయడం భరించలేని ప్రజా ద్రోహులు మరో జర్నలిస్టును దుర్మార్గంగా హత్యచేశారు. మొన్న కర్నాటకలో సీనియర్ జర్నలిస్టు , సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య... ఇప్పుడు త్రిపురలో శంతనూ భౌమిక్ అనే జర్నలిస్టు హత్య.

త్రిపురలో ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వెళ్లిన దినారత్ అనే న్యూస్ ఛానల్ జర్నలిస్టు శంతనూ భౌమిక్ ను కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. శంతనూ భౌమిక్ పశ్చిమ త్రిపుర జిల్లాలో మందాయి ప్రాంతంలో జరుగుతున్న రాస్తారోకోను కవర్ చేస్తుండగా, వెనుక నుంచి ఢీకొట్టారని ఆ తర్వాత అక్కడినుంచి అతన్ని మాయం చేశారని, ఆపై కాసేపటికి భౌమిక్ తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన కనిపించగా, వెంటనే అగర్తలా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించామని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారని ఎస్పీ అభిజిత్ సప్తార్షి వెల్లడించారు.
స్థానిక జర్నలిస్టుల కథనం ప్రకారం మొదట దుండగులు కర్రలతో భౌమిక్ కాళ్ళపై కొట్టారు. అతను కిందపడిపోగానే తలపై కొట్టారు. ఆ తర్వాత అతన్ని దగ్గరలోని స్టేడియంలోకి ఈడ్చుకపోయారు.

ఈ హత్య‌ బీజేపీ నేతృత్వంలో పనిచేస్తున్న ఐపీఎఫ్టీ గూండాలే చేశారని సీపీఐ (ఎం) ఆరోపించింది. ఐపీఎఫ్టీ కి బీజేపీ అన్ని రకాల మద్దతు చేస్తోందని ఎన్నికల్లో డబ్బును కూడా బీజేపీనే అందిస్తోందని సీపీఎం ఆరోపిస్తోంది. బీజేపీ నేతలు స్వయంగా ఐపీఎఫ్టీ నాయకులకు డబ్బులు అందజేస్తున్నట్టు రాసిన లేఖను సీపీఎం బయటపెట్టింది.

ఇదిలా ఉండగా శంతనూ భౌమిక్ హత్యకు నిరసనగా అగర్తలలో జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించారు. భౌమిక్ హంతకులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ ఇంటిముందు ధర్నా చేశారు.
మరో వైపు ఈ హత్యకు సంబంధించి పోలీసులు ʹఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురʹ (ఐపీఎఫ్టీ) కార్యకర్తలను 4గురిని అరెస్టు చేశారు.

Keywords : journalist, murder, tripura, ipft, bjp, cpim, manik sarkar
(2024-04-25 06:23:54)



No. of visitors : 1082

Suggested Posts


గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలు

అక్కడ హింస రాజయమేలుతున్నది... వందలమంది కత్తులు, రాడ్లు పట్టుకొని మతోన్మాద నినాదాలతో గ్రామాల మీద దాడులు చేస్తున్నారు.... ఇండ్లు తగలబెటుతున్నారు. హత్యలు చేస్తున్నారు... విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారు....

మత హింస గురించి రాసినందుకు ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు - బెయిల్ మంజూరు చేసిన కోర్టు

త్రిపురలో ఈ మధ్య‌ జరిగిన ముస్లింలపై దాడులకు సంబంధించిన ఘటనలను రిపోర్ట్ చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఆదివారం నాడు అరెస్టుచేశారు. సమృద్ధి సకునియా, స్వరణ్ ఝా అనే ఇద్దరు జర్నలిస్టులను అస్సాం లోని కరీంగంజ్ జిల్లాలో అదుపులోకి తీసుకుని ఆపై త్రిపుర పోలీసులకు అప్పగించారు అస్సాం పోలీసులు.

త్రిపురలో ముస్లింలపై హింసను బహిర్గతం చేసినందుకు లాయర్లపై UAPA -ప్రజాసంఘాల ప్రకటన‌

నవంబర్ 3న, త్రిపుర పోలీసులు ఢిల్లీకి చెందిన నలుగురు న్యాయవాదులకు ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ నోటీసులు పంపారు.

Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి

త్రిపురలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా ఓ మసీదును ధ్వంసం చేశారు. ముస్లింల షాపులపై, ఇళ్ళపై దాడులు చేసి దోచుకున్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హంతకుల‌