పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !


పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

పోలీసుల

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు రోజూ వెంటపడి వేధించేవారు. ఇటీవల రోడ్డుపై వెళుతున్న ఆ బాలికను అడ్డగించిన ఎస్ఐ, కానిస్టేబుల్ తమ బైక్ పై బలవంతంగా ఎక్కించుకుని, ఓ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి బెదిరించి, కొట్టి అత్యాచారం చేశారు. తనను ఏమీ చేయవద్దని బాధితురాలు ప్రాధేయపడ్డా ఏ మాత్రం కరుణించలేదు. అంతేకాదు ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని బెదరించి, బాధితురాలిని ఓ ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయారు.

ఇంటికి తిరిగొచ్చిన బాధితురాలు జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు గోవింద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇద్దరు పోలీసులుపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుకు పోలీసులు స్పందించక పోగా, తిరిగి వారిని బెదిరించి ఇంటికి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న‌ సామాజిక కార్యకర్త లక్ష్మీ గౌతమ్ మీడియాకు సమాచారం అందించింది. అలాగే ఆమె ఉన్నతాధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్లారు. మీడియాలో ఈ దుర్మార్గం ప్రసారం కాగానే అధికారులు స్పందించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి మథుర ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో నిందితులపై కేసు నమోదుచేశారు. అంతేకాదు 24 గంటల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక అందజేయాలని హుకుం జారీచేశారు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఎస్ఐ, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Keywords : uttarapradesh, Minor, Police personnel, Govind Nagar, girl
(2020-04-02 00:22:16)



No. of visitors : 1421

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

Search Engine

లాక్ డౌన్ ముగిసిన తర్వాత మన వ్యూహం ఏంటి?: కేంద్రానికి 800 మంది శాస్త్రవేత్తల సూటి ప్రశ్న
నిజాలు మాట్లాడినందుకు సీనియర్ జర్నలిస్టుపై కేసు !
లాక్ డౌన్ కారణంగా దేశంలో పెరిగిన గృహ హింస‌
ఎంత కష్టం: విరిగిన కాలు...అయినా ఊరికి చేరాలంటే నడకే మార్గం
వరవరరావు, షోమా సేన్‌లకు బెయిల్ తిరస్కరణ
కరోనాతో చంపకండి...ఖైదీలను విడుదల చేయండి -విరసం
రోడ్డు మీదికొచ్చినవాళ్ళు దేశద్రోహులు...వాళ్ళను తుపాకులతో కాల్చండి...బీజేపీ ఎమ్మెల్యే
8నెలల గర్భవతి... ఆకలితో, దాహంతో...100 కిలోమీటర్ల నడక‌
పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
more..


పోలీసుల