ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 16..."ప్రజాతంత్ర... గణపతి ఇంటర్వ్యూ..." - పీవీ కొండల్ రావు

ʹమునివేళ్ల

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం..

"ప్రజాతంత్ర... గణపతి ఇంటర్వ్యూ..."

చెల్లా చెదురవుతున్న సాంప్రదాయాలు, కట్టుబాట్లు, స్థానిక సంస్కృతులకు పునరుజ్జీవం పోయాలనే సంకల్పం తో నైజీరియా సాహితీ వేత్త ʹచినూ అచిబీ" Okonkwo" అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి "Things Fall Apart"అనే నవల ద్వారా తన అంతర్మధనాన్ని ఆవిష్కరిస్తాడు. అంతటి విస్తారమయిన ప్రయత్నం కాకున్నా గ్రామీణ జర్నలిస్టులు గమనం లోకి తీసుకోవాల్సిన విషయాలను గురించి "Things Brought Together" లా అభిప్రాయాలు అందించాలని నా ఆలోచన.
నేను జర్నలిస్టునే అయినా నాకు ఇన్ని అనుభవాలున్నాయా అని వాణొదినె నిన్న ఆశ్చర్య పోయింది. అవును. నాకూ అనుభవమున్నది.. గ్రామీణ జర్నలిస్ట్ గా భిన్నమైన పరిస్థితులలో పని చేసిన అనుభూతులున్నాయి. ఆ సందర్భంలో ఎదురైన కష్టాలూ ఉన్నాయి.అయితే , ఏ సందర్భంలోనూ నన్ను జర్నలిస్టుగా గుర్తించే అవకాశాలే లేవు. వందల బై లైన్లున్నా ఉపాధి దొరికే పరిస్థితి ఉండదు. వార్తలెన్ని రాసినా, అవి రాయగలిగే సామర్థ్యమున్నా ఉద్యోగం లభించే అవకాశముండదు.
ఆంధ్ర ప్రభ ఎన్నికల తెర పేజీ ని అద్భుతం గా నిర్వహించి, అందులో ʹఎలెక్షనోగ్రఫీ కాలమ్ʹ ను విలక్షణమైన శైలి తో ప్రెజెంట్ చేసిన దేవులపల్లి అమర్ తదనంతర కాలం లో యాజమాన్యపు హుములియేషన్ తో ఆ పత్రిక ను వదలాల్సి వచ్చింది. ఆ తరుణం లో ప్రత్యామ్నాయ పత్రికల్లో ఉద్యోగం కన్నా స్వతంత్రం గా ఓ పత్రిక ను నిర్వహించాలని అమర్ సోదరులు సంకల్పించారు. ఈ సందర్భం లో చాపెల్ రోడ్డు లోని జాయ్ ఎన్ జాయ్ ప్రింటింగ్ ప్రెస్ లో జరిగిన సన్నాహక సమావేశాలకు వరంగల్ నుంచి నారాయణ రెడ్డి తో బాటు నేను కూడా వెళ్ళే వాడిని. ఆ సమావేశాల అనంతరం "దేవులపల్లి పబ్లికేషన్స్" ఆధ్వర్యం లో ఎమెర్జెన్సీ కాలం లో పత్రికా స్వేచ్ఛ ను ప్రతిఫలింప జేసిన "ప్రజాతంత్ర" సంపూర్ణ స్వతంత్ర వార పత్రిక పునరాగమనం సాధ్యమయింది.
జీతాలు సమయానికి రాకున్నా అప్పటికి నేను ఆంధ్ర ప్రదేశ్ టైమ్స్ లో పని చేస్తుండడం వలన బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నాను. నా మిత్రుడు ఆదిరాజు నరసిం హా రావు ను విజయవాడ ప్రతినిధి గా పంపాం. వరంగల్ వార్త ల కోసం ఆరంభం లో కాకున్నా తర్వాత కాలం లో మిత్రుడు తడక రాజ్ నారాయణ్ ను నియమించారు. ఆ పత్రిక కు నేను ప్రత్యేక వార్తలు రాసే వాడిని.
అప్పుడే ఒక అరుదైన అవకాశం లభించింది. ఉద్యమ జిల్లాల్లో పని చేసిన, చేస్తున్న పాత్రికేయులెవరికీ లభించని అద్భుత అవకాశమది. అక్టోబర్ 1998. హైదరాబాద్ లోని శివం ప్రాంతం లో ఉన్న వసంతొదినె ఇంట్లో ఒక కుటుంబ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసిన సందర్భం. పెండ్యాల నుంచి బాపూ, అమ్మలతో సహా మేమంతా వెళ్లాం. మధ్యాహ్న భోజనాలయిన తరువాత బయటకు వెళ్లిన నాకు ఓ అసైన్ మెంట్ కోసం రెండు రోజులు వేరే ఊరికెళ్లాలని సూచన వచ్చింది. ఆంధ్ర జ్యోతి లో పని చేస్తున్న ఉమా మహేశ్వర్ రావు, ఇంకో యువకుడి తో కలిసి పంజాగుట్ట ఆంధ్ర జ్యోతి దగ్గర నాకు కలిసారు. వాళ్లిద్దరి మధ్య ఏదో సంభాషణ జరిగింది. ఆ సంభాషణ అనంతరం వాళ్ల వెంట నన్ను కూడా బయలుదేరమన్నారు. అక్కడ జరిగిన సంభాషణల సారాంశాన్ని బట్టి మేము ఒక ఇంటర్వ్యూ కు వెళ్తున్నట్లు అర్ధమయింది. హైదరాబాద్ లో ఒక కార్ లో మేం బయలుదేరాము. కార్ లో మా వెంట వస్తున్న పాత్రికేయుడు రెడిఫ్ ఆన్ ద నెట్ కు పని చేసే చిందు శ్రీధరన్ అని పరిచయమయ్యాడు.మేము బయలుదేరిన కార్ హనుమకొండ వైపే వెళ్తుండడంతో మా ఇంటర్వ్యూ వరంగల్ జిల్లాలోనో లేక కరీం నగర్ లోనో ఉండవచ్చనే అభిప్రాయం కలిగింది. మధ్యలో ఆలేర్ దగ్గర ఛాయ తాగాం. తర్వాత మా కార్ హనుమకొండ వరకు ఎక్కడా ఆగలేదు. అక్కడ చౌరాస్తా లోని రాజు టిఫిన్ బండి దగ్గర ఇడ్లీ తిని, కొన్ని బిస్కెట్లు, వాటర్ బాటిల్స్,అరటి పండ్లుతీసుకుని బయలుదేరాము. చౌరాస్తా లో ఉన్నప్పుడే డ్రైవర్ ములుగు రోడ్డు వైపు దారి చూపమని నాతో చెప్పాడు. ఆ దారి చూపిన నేను 45 కిలో మీటర్లు వెళితే ములుగు వస్తుందని చెప్పాను.వరంగల్ జిల్లా కు సంబంధించిన సంపూర్ణ అవగాహన ఉన్న ఆ డ్రైవర్ కావాలనే ములుగు ఎటు అని అడిగాడని తర్వాత నాకు తెలిసింది. ములుగు నుంచి చల్వాయి వరకు ఎక్కడా ఆగకుండా తీసుకెళ్లిన డ్రైవర్ గోవిందరావు పేట రాక మునుపే ఓ మట్టిరోడ్డు వైపు ఎడమ చేతి వైపు టర్న్ చేసాడు. కొంతదూరం వెళ్ళాక అక్కడ ఒక చిన్న వూరు కనిపించింది. ఆ వూరు చివరన ఉన్న ఒక చిన్న గుడిసె వద్ద మమ్మల్ని దింపిన డ్రైవర్ తన కార్ ను ఒక సేఫ్ ప్లేస్ లో ఆపి మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. మేం ఒక వృద్ధుడి ఇంట్లో ఆగాము. (చాలా ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడు పోలీసుల నిర్బంధం తో ఓ సారి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిసింది). వాళ్ళింట్లో కొంతసేపు బస చేసాము. ఈ లోగా మా కోసం అయిదుగురు సాయుధులైన ఆలీవ్ గ్రీన్ దుస్తుల్లో ఉన్న యువకులొచ్చారు. మమ్మల్ని తమ వెంట రమ్మని తీసుకెళ్ళారు. సుమారు రెండు గంటల పాటు దట్టమైన అడవిలో నడిచాం. శ్రీధరన్ కు తెలుగు రాదు కానీ అర్థమవుతుంది. ఉమా మహేశ్వర్ రావు అప్పటికే సీనియర్ జర్నలిస్ట్. ఆయన శ్రీధరన్ తో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉంటే మా ఇంటర్వ్యూ స్థలం వచ్చింది. మేము ముందుగా బస చేసిన స్థలం సోములగడ్డ అని మా వెంట వున్న దళ సభ్యుల సంభాషణల వల్ల అర్థమయింది. దళం ఉన్న చోటికి మేం చేరాము. అప్పుడు అక్కడ బాధ్యుడిగా ఉన్న బాబన్న మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయిందని ఇంటర్వ్యూ తెల్లవారగానే ఉంటాదని బాబన్న చెప్పాడు. దళ సభ్యులతో బాటు మేమూ నిద్ర లోకి జారుకున్నాం. తెల్లవారేందుకు ఇంకా ఒక గంట ఉండగానే యాభై ఏళ్ల పై బడ్డ ఒక దళ కమాండర్ గా ఉన్న నాయకుడు మమ్మల్ని నిద్ర లేపాడు. తన పేరు మాకు పరిచయం చేసుకోక మునుపే ఉమా మహేశ్వర్ రావు మాటలను బట్టి ఆయన గణపతి అని అర్థమయింది. తొందరగా కాలకృత్యాలు తీర్చుకుంటే కూర్చుందామని గణపతి మాతో అన్నారు.
ఇంటర్వ్యూ తెల్లవారి వార్త రాస్తున్న తరహాలోనే ...నేను ఇప్పుడు వివరించడం ,విషయాన్ని తెలుపకుండా ప్రొలాంగ్ చేస్తున్నట్లనిపించవచ్చు గానీ ,వార్తా రచన పాఠకులను మరింత చదివేలా చేయాలనేది నా అభిప్రాయం.గణపతి వెంట , ఇంకో వయసు మళ్లిన నాయకుడు కూడా ఇంటర్వ్యూ సందర్భం లో కనిపించారు. వీళ్ళిద్దరూ మాతో బాటు టిఫిన్లయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం కూర్చున్నారు. నాకు ఇంటర్వ్యూ సంబంధిత విషయం అంతంతమాత్రమే తెలియడం వల్ల గణపతి మాట్లాడిన అన్ని విషయాలూ రాసుకున్నాను. చిందు శ్రీధరన్ , ఉమా మహేశ్వర్ రావు ఇద్దరూ కూడా సబ్జెక్ట్ ప్రిపేరయి వచ్చారు. వాళ్ల ప్రశ్నలకు లభించిన సమాధానాలే నా ఇంటర్వ్యూ కు ఉపయుక్త అంశాలుగా మారాయి. మేం వెళ్లిన ఇంటర్వ్యూ లోనే అప్పటి పీపుల్స్ వార్ పార్టీ, బీహార్ కు చెందిన పార్టీ యూనిటీ ని తనలో విలీనం చేసుకున్నది. విప్లవ పార్టీల పునరేకీకరణ దిశగా ఇది మొదటి పరిణామం కావడం గమనించ దగ్గ విషయం. ఇంటర్వ్యూ సందర్భంగా మాతో పార్టీ యూనిటీ కార్యదర్శి గా కొనసాగిన నారాయణ్ సన్యాల్ అలియాస్ ప్రసాద్ కూడా మాట్లాడారు. ఇద్దరి మాటలను బట్టి, దేశ వ్యాప్తంగా విప్లవ కార్యకలాపాలకు అప్పుడు అనుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయని అర్థమయింది.
ఈ ఇంటర్వ్యూ నిజంగానే నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ గా భావించా. జర్నలిస్టుగా పరిణామం చెందిన దశలో నాకు "టైమ్స్ ఆఫ్ ఇండియా "లో పని చేయాలనే కోరిక ఉండేది. అలాగే సీనియర్లు ఎస్.రామకృష్ణ, హిందూ శ్రీనివాస్ రెడ్డి సార్ ల తరహా లో ʹగణపతిʹఇంటర్వ్యూ చేయాలని ఒక ఆకాంక్ష ఉండేది. ములుగు ప్రాంతం లో అప్పుడు గణపతిని ఇంటర్వ్యూ చేయగలగడం నా ఆశయం నెరవేరినట్టుగా అనిపించింది. అప్పుడు ఉత్తర తెలంగాణా జిల్లాల్లో పని చేసిన ప్రతీ చురుకైన జర్నలిస్టూ ఇలాంటి ఇంటర్వ్యూ ఒక్క సారయినా చేయాలని అనుకుంటుంటాడు.
- పీవీ కొండల్ రావు

Keywords : warangal, journalism, ganapathi, peopleswar, maoists
(2024-04-11 18:43:17)



No. of visitors : 1174

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹమునివేళ్ల