హిట్లర్ కూడా ఆశ్చర్యపోయే సంఘ్ పరివార్ దూకుడు


హిట్లర్ కూడా ఆశ్చర్యపోయే సంఘ్ పరివార్ దూకుడు

హిట్లర్

(వీక్షణం అక్టోబర్ సంచిక సంపాదకీయం)

హిందుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన హేతువాది, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరి లంకేశ్‌ ను హిందూ మతోన్మాద శక్తులు దారుణంగా హత్య చేయడం మన సమాజంలో ప్రగతిశీల శక్తులన్నీ తక్షణమే తీవ్రంగా ఆలోచించవలసిన, ప్రతిఘటనా పోరాటరూపాలు రూపొందించుకోవలసిన అవసరాన్ని బలంగా ముందుకు తెస్తున్నది. ఈ హంతక భావజాలానికీ, ఆచరణకూ పునాది అయిన సంఘ్‌ పరివార్‌ గురించీ, దాన్ని అడ్డుకోవడం గురించీ క్రియాశీల ఆచరణకు దిగవలసిన అవసరాన్ని ఈ హత్య ప్రగతిశీలశక్తుల ముందుకు తెస్తున్నది.

అరవై ఏడేళ్ల జీవితంలో అరవై సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా, ప్రచారకుడిగా, నాయకుడిగా గడిపిన నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిననాటి నుంచీ సంఘ్‌ పరివారానికి అంతకు ముందే ఉన్న కోరలతో పాటు కొత్త కొమ్ములు మొలిచాయి. దేశాధికారం తమకు దక్కిందని, దేశాన్ని తమ ఇష్టం వచ్చినట్టుగా మార్చే అవకాశంగా దీన్ని మలచుకోవాలని, ఏ రాజ్యాంగమూ చట్టమూ ప్రజాస్వామిక సూత్రాలూ సభ్యసమాజ మర్యాదలూ తమకు అడ్డం రాబోవని సంఘ్‌ పరివార్‌ భావిస్తున్నది. దేశవ్యాప్తంగా సంఘ్‌ పరివార్‌ శక్తులు వ్యవహరిస్తున్న తీరు, ప్రదర్శిస్తున్న్‌ దూకుడు హిట్లర్‌ నూ, గోబెల్స్‌ నూ, నాజీ దళాలనూ కూడ ఆశ్చర్య పరిచే రీతిలో ముందుకు సాగుతున్నాయి. తొమ్మిది దశాబ్దాలుగా సమాజంలో తాము నాటుతున్న విద్వేష బీజాలు వటవృక్షాలై తమకు రాజకీయ ఫలాలు ఇస్తున్నాయని, ఇప్పుడిక ఆ ఫలాలను అనుభవించడమూ, ఆ విద్వేష బీజాలను బహిరంగ ప్రజాజీవితంలోకి తీసుకురావడమూ నిరభ్యంతరంగా చేయవచ్చుననీ సంఘ్‌ పరివార్‌ అనుకుంటున్నది. బ్రిటిష్‌ వ్యతిరేక స్వాతంత్య్రోద్యమంలో, ప్రజా ఉద్యమాలలో చిన్నమెత్తు పాత్ర కూడ లేకపోయినా, గాంధీ హత్య ఆరోపణపై నిషేధానికి గురైనా, రాజకీయాలలో కనీస స్థానం కూడ ఎన్నడూ రాకపోయినా సంఘ పరివార్‌ లేలేత వయసు విద్యార్థులలో శాఖల ద్వారా, సరస్వతీ శిశు మందిరాల ద్వారా, విద్యార్థి, రైతు, కార్మిక రంగాలలో తన సొంత సంఘాల ద్వారా సమాజంలో ఊడలు పాకింది. అత్యధిక సంఖ్యాకులకు వ్యతిరేకమైన, విషపూరితమైన అసమానతా వివక్షా భావజాలాన్ని ఇంత విస్తృతంగా ప్రచారం చేయగలగడం, ఎవరిని అవమానించే భావజాలాన్ని ప్రచారం చేస్తున్నదో వారినే ఆ భావజాలం వైపు ఆకర్షించడం నిజంగానే సంఘ్‌ పరివార్‌ కుటిల శక్తికి నిదర్శనాలు. ఎమర్జెన్సీ లో ఇందిరాగాంధీ ఆగ్రహానికి గురైన అనేక శక్తులలో ఒకటిగా గౌరవాన్నీ, సాధికారతనూ సంపాదించుకుని ఎమర్జెన్సీ అనంతరం రాజకీయ రంగంలో ప్రధానపాత్ర వహించే స్థితికి చేరింది. విద్యా, ప్రచార రంగాలమీద కేంద్రీకరించి ఆలోచనలను ప్రభావితం చేసింది. రామజన్మభూమి, ఏకాత్మతా యాత్ర, రథయాత్రల పేరుతో ఒకవైపు ముస్లింల మీద ఊచకోతలనూ, మరొకవైపు తన రాజకీయ నియోజకవర్గం విస్తరణనూ సాధించగలిగింది. పాలకవర్గాల ముఠా తగాదాలనూ, ఐక్యసంఘటన, మిశ్రమ మంత్రివర్గాల రాజకీయాలనూ వాడుకుని మెట్టుమెట్టుగా కేంద్ర ప్రభుత్వ అధికారానికి ఎగబాకింది. ఒకసారి ఆ అధికారపీఠానికి చేరిన తర్వాత ఇక అడ్డూ ఆపూ లేని తన విద్వేష రాజకీయాల ఎజెండాను బహిరంగంగానే అమలు చేయడం ప్రారంభించింది. అధికార వత్తసుతో సంఘ్‌ పరివార్‌ గత తొమ్మిది దశాబ్దాలలో సాధించగలిగినంతనో, అంతకన్న ఎక్కువో గత మూడున్నర సంవత్సరాలలో సాధించగలిగిందన్నా ఆశ్చర్యం లేదు. ఈ మూడున్నర సంవత్సరాల ఘటనలు, పరిణామాలు చూస్తే, సంఘ్‌ పరివార్‌ తన విద్వేష ఎజెండాను సునాయాసంగా ముందుకు తీసుకు పోగలుగుతున్నదని, దాన్ని అడ్డుకునే శక్తులు మాత్రం కనీస ప్రతిఘటన కూడ వ్యక్తీకరించలేనంత బలహీనంగా, అనైక్యంగా ఉన్నాయని స్పష్టమవుతుంది.

సంఘ పరివార్‌ మౌలిక ఎజెండాకు సమ్మతి ఉత్పత్తి చేసే ఎన్నో పరోక్ష కార్యక్రమాలను ఈ మూడున్నర సంవత్సరాలలో ఉధృతంగా సాగించింది. గోమాంసం ఉన్నదనే తప్పుడు ఆరోపణతో అఖ్లాక్‌ నూ జునేద్‌ నూ హత్య చేసింది. గో చర్మం ఒలుస్తున్నారనే తప్పుడు ఆరోపణతో ఊనా లో దళితులను చిత్రహింసలకు గురిచేసింది. గోరక్షణ పేరుతో ఉత్తర భారతమంతా దళితులలో, ముస్లింలలో భయభీతావహాన్ని వ్యాపింపజేసింది. ముజఫర్‌ నగర్‌ హింసాకాండతో, ఘర్‌ వాపసీ నినాదాలతో, లవ్‌ జిహాద్‌ బెదిరింపులతో ముస్లింలను భయోత్పాతంలో ముంచింది. గోమాంసం తినడమైనా, చనిపోయిన గోవు చర్మం ఒలవడమైనా ప్రమాదకరమైన పనులని అనిపించేంతగా, అంటే నచ్చిన, తరతరాల అలవాటుగా ఉన్న ఆహారాన్ని తినడం, హిందూ మతమే నిర్దేశించిన కులధర్మాన్ని పాటించడం కూడ భయపడవలసిన పనులుగా మార్చింది. ఇది ఆహారానికీ, కులవృత్తికీ మాత్రమే సంబంధించిన విషయం కాదు. దేశంలోని రెండు పెద్ద సమూహాలు నిత్యం భయంతో, తమ చెప్పుచేతల్లో, తమకు ఎక్కడ కోపం తెప్పిస్తామో అనే సందేహంతో బతుకు ఈడ్వాలన్నదే సంఘ్‌ పరివార్‌ కోరిక. సంఘ్‌ పరివార్‌ పునాది మతం అని చెప్పుకుంటుంది గాని నిజానికి అది ఒక పాలకవర్గ, ఆధిపత్యవర్గ సైన్యం. అది దేశభక్తి అని, జాతీయత అని ప్రగల్భాలు పలుకుతుంది గాని పుట్టిననాటి నుంచి ఇవాళ్టి దాకా దాని చరిత్ర అంతా సామ్రాజ్యవాదుల అంటకాగిన చరిత్ర. అతి పెద్ద సమూహాలు గనుక, హిందూ చాతుర్వర్ణ వ్యవస్థకు బైటి శక్తులు గనుక సంఘ్‌ పరివార్‌ ప్రధాన లక్ష్యం దళితులూ ముస్లింలూ గాని, అసలు పీడకులందరి పట్లా, స్వతంత్ర అభిప్రాయాలున్నవారందరి పట్లా, క్రియాశీలంగా ఉండగలవారందరి పట్లా దానికి అనుమానం, ద్వేషం. అందుకే అది గోవింద్‌ పన్సారే, ఎం ఎం కల్బుర్గి, గౌరి లంకేశ్‌లను హత్య చేసింది. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై ఐఐటి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఢిల్లీ జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్సిటీ, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ వంటి అనేక విద్యాసంస్థలలో స్వతంత్ర, ప్రగతిశీల భావాల ప్రచారాన్ని అడ్డుకోవడానికి హింసనూ దౌర్జన్యాన్నీ ప్రయోగించింది.

ఇంత పకడ్బందీగా, దూకుడుగా సాగుతున్న సంఘ్‌ పరివార్‌ హింసాకాండకు వ్యతిరేకంగా సంఘటితం కావలసిన ప్రగతిశీల శక్తులు తమలో తమ విభేదాలతోనో, రానున్న ఫాసిస్టు ప్రమాదాన్ని పూర్తిగా గుర్తించ జాలకనో, శక్తిసామర్థ్యాలు సరిపోకనో ఇంకా తగినంత ప్రతిఘటన ఇవ్వడం లేదు. హిట్లర్‌ ఫాసిస్టు పోకడలను తొలిరోజుల్లోనే ఎదిరించి ఉంటే, జర్మనీలో బీభత్సకాండ, రెండో ప్రపంచయుద్ధం, కోట్లాదిమంది ప్రాణ త్యాగాలు అవసరం ఉండేవి కావనే చారిత్రక పాఠాన్ని గుర్తు తెచ్చుకోవలసిన చారిత్రక సందర్భం ఇది. హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదిరించడానికి, నిలువరించడానికి విశాల ఐక్య సంఘటనను సాధించడం, సంఘ్‌ పరివార్‌ను ప్రతిఘటించడంలో క్రియాశీలంగా పనిచేయడం ఇవాళ చరిత్ర ప్రగతిశీల శక్తుల మీద పెడుతున్న బాధ్యత.
- ఎన్.వేణుగోపాల్

Keywords : guri lankesh, hindutva, rss, bjp, venugopal
(2017-11-22 17:18:32)No. of visitors : 200

Suggested Posts


అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

మహాజనాద్భుత సాగరహారానికి ఐదేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.....

అదానీ కోపం..ఈపీడబ్ల్యూ సంపాదకుడి రాజీనామా - ఎన్.వేణు గోపాల్

అదానీ గ్రూపు కంపెనీలకు రు. 500 కోట్ల ప్రయోజనం కలిగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఇపిడబ్ల్యు వెబ్‌ సైట్‌ మీద అంతకు కొద్ది రోజుల ముందు...

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు
more..


హిట్లర్