కంచె ఐల‌య్యకు మావోయిస్టు పార్టీ మ‌ద్ద‌తు

కంచె


ʹసామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లుʹ పేరుతో ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య రాసిన పుస్త‌కం వివాదాంశంగా మారిన విష‌యం తెలిసిందే. 2009లో సాగే ప్ర‌చుర‌ణ‌గా వ‌చ్చిన ʹపోస్ట్ - హిందూ ఇండియాʹ పుస్త‌కం 2011లో ʹహిందూ మతానంతర భారతదేశంʹ పేరుతో తెలుగులో ప్ర‌చురిత‌మైంది. తాజాగా ఆ పుస్తకం లోని ఒక్కో అధ్యాయాన్ని చిన్న‌చిన్న బుక్‌లెట్స్ గా ముద్రించింది భూమి అనే ప్ర‌చుర‌ణ సంస్థ‌. వాటిల్లో ఒక‌టే ʹసామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లుʹ. ఈ పుస్త‌కంలో త‌మను స్మ‌గ్ల‌ర్లుగా సంబోధించ‌డం ప‌ట్ల ఆర్య‌వైశ్యం సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. కంచె ఐల‌య్య త‌న పుస్త‌కాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని, లేన‌ట్ల‌యితే త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాయి. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కంచె ఐల‌య్య పుస్త‌కాన్ని అందుభాటులో లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ప‌లురువు ప్ర‌జాస్వామిక వాదులు, ర‌చ‌యిత‌లు కంచె ఐల‌య్య‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై మావోయిస్టు పార్టీ స్పందించింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ర్ట క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో కంచె ఐల‌య్య‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఐల‌య్య‌పై జ‌రుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించారు. ఐల‌య్య‌పై జ‌రుగుతున్న దాడిని సంఘ్‌ప‌రివార్‌, రాజ్యం క‌లిసి చేస్తున్న దాడిగా అభివ‌ర్ణించారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం పాఠ‌కుల కోసం...

కంచె ఐలయ్య భావప్రకటనా స్వేచ్ఛ‌ను అడ్డుకునే హక్కుఎవరికీ లేదు.
సంఘ్‌ప‌రివార్‌, రాజ్యం క‌లిసి చేస్తున్న‌హ‌త్యా రాజ‌కీయాల్నిఖండించండి
కంచెఐలయ్యకు అండగా నిలబడండి.

దేశంలో సంఘ్ పరివార్ నేతృత్వంలో హిందూ రాజ్య స్థాపన లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు విధానాలను అమలుచేస్తోంది. సామ్రాజ్యవాదులకు, దళారీ పెట్టుబడిదారులకు, భూస్వాములకు సేవ చేస్తూ వాళ్ల ప్రయోజనాల కోసం అట్టడుగు సమూహాలపై దాడులకు పాల్పడుతోంది. ప్రగతిశీల ఆలోచనలు, ప్రజాస్వామిక అభిప్రాయాలను కాలరాసేందుకు హత్యారాజకీయాలు నెరుపుతోంది. తాజాగా గౌరీలంకేశ్ హత్య, కంచె ఐలయ్యపై దాడి అందులో భాగమే.

గోసంరక్షణ పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నసంఘ్ పరివార్ శక్తులు అంద విశ్వాసాలను, అశాస్త్రీయ భావాలను వ్యతిరేకించే హేతువాదులను హత్యచేస్తోంది. దబోల్కర్, వన్సారీ, కల్బుర్గి, ఇప్పుడు గౌరీ లంకేశ్‌ల‌ హత్యలే అందుకు నిదర్శనం. ప్రజాస్వామిక ఉద్యమాలకు బ‌లమైన మద్దతుదారుగా ఉండడంతో పాటు, బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా తన గశాన్ని వినిపించినందుకే గౌరీలంకేశ్ ని హత్యచేశాయి సంఘ్ పరివార్ శక్తులు. ఈ హత్య ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల శక్తులు, హేతువాదులకు, దళిత, మైనార్టీ బుద్ధిజీవులకు మరోసారి హెచ్చరిక లాంటిది.

వైశ్యులను కించపరిచాడనే పేరిట ఇప్పడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిని కూడా అందులో భాగంగానే అర్థం చేసుకోవాలి. కులం గురించి మాట్లాడడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడడం వెనక సంఘ్ పరివార్, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల కుట్రదాగి ఉంది. నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీ, కేసీఆర్‌లు తమ వ‌ర్గాన్ని ప్రశ్నించడాన్ని, విమర్శించడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే... కంచె ఐలయ్య భావ‌ప్రకటనా స్వేచ్చను అడ్డుకుంటూ. చంపుతామని, నాలుక కోస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి ఐలయ్య పుస్తకాలు అందుభాటులో లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నాడు. ఇది ప్ర‌జాస్వామిక అభిప్రాయాల్ని కాల‌రాయ‌డ‌మే. అభిప్రాయాల్ని, అక్ష‌రాల్ని నిషేదించాల‌నుకునే నియంతృత్వ వైఖరి అత్యంత ప్రమాదకరం.

ఐలయ్య రాసిన విషయాల పట్ల అభ్యంతరముంటే వాటిని గురించి చర్చించవచ్చు. కౌంటర్ వాదన వినిపించవచ్చు. కానీ బెందిరింపులకు పాల్పడడం అప్రజాస్వామికం. ఈ వైఖరిని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఐలయ్యకు అన్ని రకాలుగా మద్దతునిస్తుంది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు సైతం ఐలయ్యకు అండగా నిలవాలని పిలపనిస్తున్నాం. ఆయనతో రాజకీయ బేదాభిప్రాయాలున్నప్పటికీ అతడి భావ‌ప్రకటనా స్వేచ్చను గౌరవించాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని పిలుపు నిస్తున్నాం.

విప్లవాభినందనలతో...

(జ‌గ‌న్‌)
అధికార ప్రతినిధి

Keywords : kanche ilaiah, maoists, vyshya,
(2024-04-18 20:08:22)



No. of visitors : 1687

Suggested Posts


ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టుల మృతి - తప్పించుకున్న హరిభూషణ్, దామోదర్

ఛత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం....

మా స‌భ్యుల‌ను పోలీసులు కిడ్నాప్ చేశారు: టీవీవీ అధ్య‌క్షుడు మ‌హేష్‌

వ‌రంగ‌ల్ పోలీసులు త‌మ స‌భ్యుల‌ను కిడ్నాప్ చేశారంటూ తెలంగాణ విద్యార్థి వేదిక ఆరోపించింది. టీవీవీ కాక‌తీయ‌ యూనివ‌ర్సిటీ నాయ‌కులు చిరంజీవి, రాజుల‌ను గురువారం సాయంత్రం ముగులు పోలీసులు కిడ్నాప్ చేశార‌ని ఆ సంస్థ అధ్య‌క్షుడు మ‌హేష్‌ పేర్కొన్నారు......

భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి

భీమాకోరేగావ్ అల్ల‌ర్లు, ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర పేరుతో రాజ్యం ప్ర‌జాస్వామిక గొంతుల‌ను అణ‌చివేసే కుట్ర చేస్తుంద‌న్నారు. ద‌ళితులు, ఆదివాసీలు, ముస్లింల ప‌క్షాన నిల‌బ‌డిన విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేసేందుకు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల్ని ప్ర‌చారం చేస్తున్న ఉద్య‌మ‌కారుల‌పై అక్ర‌మ కేసులు మోపుతోంద‌న్నారు.

పోలీసును మింగిన వాట్సాప్...!

అతనో పోలీస్ ఆఫీసర్. వాట్సాప్ గ్రూపులో ఓ మెంబర్ కూడా. అదే అతని జీవితానికి ముగింపు పలికేలా చేసింది. ఓ చిన్న పొరపాటు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పింది. కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏపీ షాజి...ఆత్మహత్య సంచలనానికి కారణమైంది.....

కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌

72 ఏండ్లలో పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం పేరిట జ‌రిగిన ఎన్నిక‌లు, అధికారం నెరిపిన పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేద‌న్నారు సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్‌. ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పార్ల‌మెంట‌రీ రాజ‌కీయ పార్టీల విధానాల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల ప్ర‌జాస్వామ్యం

Journalists – Arrested, tortured, jailed in South Bastar

Picked up in July and September end, two Hindi language journalists from the Darbha block in southern Bastar have been under arrest, charged with supporting....

తెలంగాణ ఉద్యమ స్పూర్తితో... గూర్ఖాలాండ్ కు మద్దతుగా ఓయూ లో ర్యాలీ

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన విద్యార్థులుగా, గూర్ఖాలాండ్ ఉద్య‌మానికి ఓయూ జేఏసీ సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తోంది. బెంగాల్ ప్ర‌భుత్వం గూర్ఖాలాండ్ ఉద్య‌మం పై అమ‌లు చేస్తున్న అణ‌చివేత విధానాల‌ను ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోంది. వెంట‌నే గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కంచె