ఆ త‌ల్లి నిరీక్ష‌ణ ఫ‌లించేదెప్పుడు? - క్రాంతి

ఆ

ఎదురు చూపులు. రోజులు... వారాలు.... నెల‌లు... గ‌డిచిపోయాయి. ఏడాదిగా, ఆమె క‌న్న బిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉంది. కంటి మీదికి కునుకు రాదు. మ‌ధ్య రాత్రి తలుపు చ‌ప్పుడు వినిపిస్తే... క‌న్న‌బిడ్డే అనుకుంటుంది. ఏడ్చి ఏడ్చి క‌న్నీళ్లు ఇంకిపోయినా... ఆమెలో కొడుకు వ‌స్తాడ‌న్న ఆశ‌మాత్రం చావ‌లేదు. అందుకే... అలుపెర‌గ‌ని పోరాటం సాగిస్తూనే ఉంది. ఆమే... ఫాతిమా న‌ఫీస్‌. ఏడాది క్రితం అదృశ్య‌మైన జేఎన్‌యూ విద్యార్థి న‌జీబ్ త‌ల్లి.

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీలో ఎమెస్సీ బ‌యోటెక్నాల‌జీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న న‌జీబ్ అహ్మ‌ద్ గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 15న అదృశ్య‌మ‌య్యాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన న‌జీబ్‌ భ‌విష్య‌త్తు మీద ఎన్నో ఆశ‌ల‌తో జేఎన్‌యూ వ‌ర‌కు వ‌చ్చాడు. అలా ఉత్త‌రప్ర‌దేశ్ నుంచి ఉన్న‌త విద్య‌కోసం ఢిల్లీకి వ‌చ్చిన న‌జీబ్ ఇప్పుడు ఎక్క‌డున్నాడో ఎవ‌రికీ తెలీదు.

గ‌త సంవ‌త్స‌రం జేఎన్‌యూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాత్రిపూట ప్రచారం నిర్వ‌హిస్తున్న ఏబీవీపీ స‌భ్యులు అక్టోబ‌ర్ 14 రాత్రి మ‌హి - మండ‌వి హాస్ట‌ల్‌లోని 106 గ‌దికి వ‌చ్చారు. ఉద్దేశ‌పూర్వకంగా న‌జీబ్‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ప్ర‌త్య‌క్ష సాక్ష్యుల క‌థ‌నం ప్ర‌కారం పాతిక‌మంది క‌లిసి... ఒక్క‌డిపై దాడి చేశారు. నిన్ను సూర్యోద‌యం చూడ‌కుండా చేస్తామంటూ హెచ్చ‌రించారు. మ‌ర్నాడు అక్టోబ‌ర్ 15 ఉద‌య‌మే న‌జీబ్, త‌న త‌ల్లికి ఫోన్‌కి చేసి క్యాంప‌స్‌లో గొడ‌వ జ‌రిగింద‌ని చెప్పాడు. ఆ మాట విన‌డంతోనే కంగారుగా ఢిల్లీకి వ‌చ్చిన త‌ల్లికి న‌జీబ్ క‌నిపించ‌లేదు. అవును... న‌జీబ్ అదృశ్య‌మ‌య్యాడు. ల్యాప్‌టాప్, మొబైల్‌, ప‌ర్సు, ఇత‌ర సామ‌గ్రి హాస్ట‌ల్ గ‌దిలోనే ఉన్నాయి. కానీ న‌జీబ్ జాడ‌లేదు. సీసీ కెమెరాలు, సెక్యురిటీ సిబ్బందీ, వ‌ర్సిటీ అధికారుల‌కు సైతం తెలీయ‌కుండా న‌జీబ్‌ మాయమ‌య్యాడు.

ముందు రోజు రాత్రి న‌జీబ్‌తో గొడ‌వ కు దిగిన‌ ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లే న‌జీబ్‌ని మాయం చేశార‌నేది స్ప‌ష్టం. బీజేపీ అధికారంలోకి రావ‌డంతో హిందూ మ‌తోన్మాద శ‌క్తుల ఆగ‌డాల‌కు అంతులేకుండా పోయింది. దేశంలో పెచ్చ‌రిల్లుతున్న దాడులే అందుకు నిద‌ర్శ‌నం. గో ర‌క్ష‌కుల పేరిట హ‌త్యారాజ‌కీయాలు న‌డుపుతున్న సంఘ్‌ప‌రివార్ తోక‌లే న‌జీబ్‌ని మాయం చేసింది కూడా. అయినా... నేరం నిరూపితం కాదు. ఒక్క న‌జీబ్ విష‌యంలోనే కాదు... అది రోహిత్ వేముల అయినా... అఖ్ల‌క్ అయినా... ద‌బోల్క‌ర్ అయినా... ప‌న్సారే అయినా... గౌరీ లంకేశ్ అయినా... హంత‌కులు లేకుండానే హ‌త్య‌లు జ‌రిపోతాయి. వీట‌న్నిటిని వెన‌కా... స్త్రీని ఒక బానిస‌గా... ద‌ళితుడిని ఒక అంట‌రానివాడిగా... ఆదివాసీని ఒక న‌క్స‌లైట్‌గా... ముస్లింను ఒక టెర్ర‌రిస్టుగా... చూసే బ్రాహ్మ‌ణీయ భావ‌జాలం ఉంది. ద‌ళిత‌, ఆదివాసీ, ముస్లిం మైనార్టీల‌పై జ‌రుగుతున్న దాడులు అందులో భాగ‌మే.

న‌జీబ్ అదృశ్య‌మైన నాటి నుంచే ఫాతిమా న‌ఫీస్ పోరాటం మొద‌లైంది. 2016 అక్టోబ‌ర్ 16 న ఢిల్లీ పోలీసులకు న‌జీబ్ త‌ల్లి ఫిర్యాదు చేసింది. త‌న బిడ్డ ఆచూకీ తేల్చాల‌ని కోరింది. కానీ పోలీసులు న‌జీబ్ ఏమ‌య్యాడో తెలుసుకునేందుకు ఏమాత్రం ప్ర‌య‌త్నం చేయ‌లేదు. చేసి ఉంటే... న‌జీబ్‌పై దాడి చేసిన ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌పై చ‌ర్య తీసుకునే వారు. వాస్త‌వాల‌ను బ‌య‌ల్ప‌రిచేవారు. కానీ అలాంటి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌కుండానే... న‌జీబ్ ఆచూకి తెలిపిన వారికి 50 వేల బ‌హుమ‌తి ఇస్తామంటూ ప్ర‌క‌టించారు ఢిల్లీ పోలీసులు . త‌రువాత‌ ఈ మొత్తాన్ని రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచారు కూడా. విద్యార్థుల పోరాటం తీవ్ర‌మ‌వ్వ‌డంతో అక్టోబ‌ర్ చివ‌ర్లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాల‌తో కేసును స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీంని అప్ప‌గించారు పోలీసులు. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో... న‌వంబ‌ర్‌లో కేసును క్రైం బ్రాంచ్‌కి బ‌దిలీ చేశారు. అయినా... కేసులో ఎలాంటి పురోగ‌తీ క‌నిపించ‌లేదు. దీంతో. న‌జీబ్ త‌ల్లి న‌ఫీస్ ఫాతిమా ఢిల్లీ హై కోర్టులో హెబీస్ కార్ప‌స్ ఫైల్ చేసింది. కోర్టు సీబీఐ ద‌ర్యాప్తుకు ఆదేశించింది. కేసుకు సీబీఐ స్వీక‌రించి ఐదు నెల‌లు గ‌డిచినా... నేటికీ న‌జీబ్ ఆచూకీ తెలియ‌లేదు. జేఎన్‌యూ యాజ‌మాన్యం మొద‌లు అన్ని అధికార యంత్రాంగాలు నిందితుల‌ను కాపాడేందుకే ప్ర‌య‌త్నిస్తున్నాయి త‌ప్ప.. కేసును చేధించేందుకు చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించ‌డంలేద‌ని స్ప‌ష్టం.

ఈ ఏడాది కాలంలో న‌జీబ్ కోసం ఆ త‌ల్లి ఎంత‌గా రోదించిందో? ఢిల్లీ నుంచి ఉత్త‌ర ప్ర‌దేశ్ దాకా.. పోరాటాన్ని ర‌గిలించింది. ఓవైపు అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న న‌జీబ్ తండ్రి, మ‌రోవైపు కుదేలైన కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి. అయినా... ఆ త‌ల్లి ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. అందుకే... అధికారుల అస‌మ‌ర్థ‌త‌ను స‌వాల్ చేస్తూ సీబీఐ కార్యాల‌యం ముట్ట‌డికి సిద్ధ‌మైంది. అక్టోబ‌ర్ 13న‌ సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు వేలాది పోలీసు బ‌ల‌గాల న‌డుమ ఆందోళ‌న చేప‌ట్టింది. రెండు రోజుల పాటు అక్క‌డే కూర్చొని త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసింది.

ʹనా కొడుకు గొప్ప‌వాడు కావాల‌నుకున్నాను. కానీ ఇలా... అవుతాడ‌నుకోలేదు...ʹ అంటూ ʹ విల‌పించిన‌ప్పుడు... ఆ క‌న్నీటి వెంటే ఆమెలో క‌సి కూడా ర‌గులుకుంది. అందుకే...ʹ మీలో చాలా మందికి నాకు లాగే పిల్ల‌లు ఉండి ఉంటారు. హృద‌య‌ముంటే.... మీ యూనిఫాంని వ‌దిలి మాతో పాటు పోరాటంలో పాల్గొనండిʹ. అంటూ పోలీసులకు పిలుపునిచ్చింది ఆమె. ప్ర‌ధాని మోడీ ఈ విష‌యంలో మౌనం వీడాల‌ని డిమాండ్ చేసింది.

ఈ పోరాటం ఒక్క న‌జీబ్ త‌ల్లిది మాత్ర‌మే కాదు... బిడ్డ‌ల్ని కోల్పోయిన వేలాది మంది క‌శ్మీరీ త‌ల్లుల‌ది. ఎంద‌రెంద‌రో మాయ‌మైన‌ బిడ్డ‌ల త‌ల్లుల‌ది. అవును... మ‌న భుజాల మీద చేతులేసి... న‌వ్వుతూ తుల్లుతూ క‌లిసి న‌డిచిన మ‌నుషులు ఏ అర్థ‌రాత్రో మాయ‌మౌతారు. ఏళ్లు గ‌డిచినా... ఆచూకీ తెలీదు. చ‌ట్టాలు.. న్యాయ‌స్థానాలు ప‌ట్టించుకోవు. క‌న్నీటి వ‌ర‌ద‌లు పారుతాయి త‌ప్ప‌... ఏ క‌బురూ అంద‌దు.

ప్ర‌శ్న‌ను ఉరితీయ‌డం.. ప్ర‌శ్నను శిలువ వేయ‌డం... ప్ర‌శ్న‌ను కాల్చేయ‌డం... ప్ర‌శ్న‌ను మాయం చేయ‌డం ప‌రిపాటుగా మారిన ప్ర‌జాస్వామ్యం క‌దా ఇది. ఇక్క‌డ రోహిత్ వేముల‌లు... న‌జీబ్‌లు... గౌరీ లంకేశ్‌లు మ‌న‌మ‌ధ్య నుంచి మాయ‌మ‌వుతూనే ఉంటారు. అఖ్ల‌క్‌లు... హిడ్మేలు... అంత‌మ‌వుతూనే ఉంటారు. వికేక్‌లు... శృతిలు ఎన్‌కౌంట‌ర్ అవుతారు. అయినా... ప్ర‌శ్న మిగిలే ఉంటుంది. రాజ్యాన్ని నిల‌దీస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫాతిమా న‌ఫీస్ గొంతులో వినిపిస్తున్న ప్ర‌శ్న అది. ఆ ప్ర‌శ్న‌ను అందుకోవ‌డం ఇవాళ మ‌న బాధ్య‌త‌. న‌జీబ్ కోసం... మాయ‌మైన మ‌నుషుల కోసం నిల‌బ‌డాల్సిన సంద‌ర్భం ఇది.

- క్రాంతి,జర్నలిస్టు

Keywords : Missing JNU student, Najeeb Ahmad, mother, police, ABVP, hindutva
(2024-04-19 13:21:18)



No. of visitors : 873

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆ