మావోయిస్టు లింకులంటూ ప్రచారాలు...ప్రజా సంఘాలపై దాడులు...ఖండించిన పౌరహక్కుల సంఘం


మావోయిస్టు లింకులంటూ ప్రచారాలు...ప్రజా సంఘాలపై దాడులు...ఖండించిన పౌరహక్కుల సంఘం

మావోయిస్టు

(పౌరహక్కుల సంఘం ప్రకటన పూర్తి పాఠం)
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం తన అప్రజాస్వామిక రూపాన్ని ,రాజ్యహింస ను తీవ్రంగా అమలు చేయడంలో భాగంగా మేధావులకు,ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టులకు సంబందం ఉందనే అసత్య ప్రచారం చేస్తూ వారిపై నిర్బంధాన్ని అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలోనే టీజేఏసీ చైర్మన్ కోదండరాం కు, కాంగ్రెసు పార్టీకి నక్సలైట్లతో సంబందాలున్నాయని ప్రకటన చేస్తున్నారు. నిర్బంధ రూపాలు ఒకవైపు ఇలా కొనసాగుతుండగానే నాలుగు రోజుల క్రితం నకిరేకల్ లో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని, వారు మావోయిస్టు ఉద్యమంలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారని అదుపులోకి తీసుకోవడం జరిగింది.వీరంతా తెలంగాణ ఉద్యమంలో ,తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థి,యువజన,రైతాంగ సంస్థలలో పనిచేస్తూ ఆ సంస్థ సంబంధాల లో ఉన్నవాళ్లు.వీరి అరెస్టు ను చూపెట్టి,ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిలదీస్తూ ,ఆందోళనలు చేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక కు చెందిన మహేష్, భరత్, తెలంగాణ యూత్ ఫెడరేషన్ కు చెందిన పాండు, విజయ్, తెలంగాణ రైతాంగ సమితికి చెందిన సాయన్న, ప్రవీణ్ లకు మావోయిస్టులతో సంబందాలున్నాయనే ఒక అబద్ధపు ప్రచారాన్ని కొనసాగిస్తూ వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేసుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

యిదంతాప్రశ్నించే గొంతులపై ప్రభుత్వ అణిచివేత తప్పా మరొకటి కాదు.ఆంధ్రప్రదేశ్ లో చైతన్య మహిళ సంఘం నాయకత్వాన్ని పోస్టర్లలో ముద్రించి అసత్యపు, అప్రజాస్వామికపు, అన్యాయమైన విధానాలతో ప్రచారం చేస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిని,మేధావులను సరాసరి ప్రభుత్వ ఉన్నత నాయకత్వమే ఉద్యమాలకు దూరంగా ఉండాలని బెదిరింపులకు పాల్పడుతున్నది.
విద్యార్థి,యువజన,రైతాంగ,మహిళ నాయకత్వం ప్రభుత్వ బెదిరింపులకు లొంగని నిజాయితితో కూడిన నాయకత్వం కాబట్టి వారిపై అక్రమ కేసులు దుష్ప్రచారానికి ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి.ఇటువంటి విధానాలను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.
తేదీ.16.10.2017 నాడు పేపర్లో ప్రకటించినట్లు వివిధ సంఘాల నాయకుల అరెస్టు కు పోలీసులు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకొని పోలీసులు,ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా,ప్రజాస్వామికంగా సంస్థలు ఉద్యమించే హక్కును అమలు చేసే భాధ్యతను నిర్వర్తించాలని పౌరహక్కుల సంఘం డిమాండు చేస్తున్నది.
దేశంలోనే వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు మావోయిస్టులతో సంబందం ఉండడం,విప్లవ సాహిత్యం ఉండడం,చదవడం నేరం కాదని ,కేవలం హింసాత్మక ఘటనల్లో పాల్గొనడమే నేరంగా ప్రకటిస్తున్నప్పటికి ప్రభుత్వాలు న్యాయస్థానాల తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి.
విద్యార్థి, యువజన,రైతాంగ నాయకులైన మహేష్,పాండు, విజయ్, సాయన్న, భరత్, ప్రవీణ్ ల అరెస్టు ప్రయత్నాన్ని విరమించుకోవాలని,వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే భాద్యత వహించవలసి ఉంటుందని పౌరహక్కుల సంఘం డిమాండు చేస్తున్నది.
ప్రొ. లక్ష్మణ్
రాష్ట్ర అధ్యక్షులు
పౌరహక్కుల సంఘం.
ఎన్. నారాయణ రావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పౌరహక్కుల సంఘం
తెలంగాణ

Keywords : clc, telangana, kcr, trs, jac, students, tvv
(2018-07-17 12:43:20)No. of visitors : 285

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


మావోయిస్టు