న్యాయమడిగిన మహిళలపై ʹయోగీʹ పోలీసుల దుర్మార్గమైన దాడి


న్యాయమడిగిన మహిళలపై ʹయోగీʹ పోలీసుల దుర్మార్గమైన దాడి

న్యాయమడిగిన

తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఆందోళన నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు పాశవికంగా దాడి చేశారు. మహిళలపై దాడి చేసిన మగ పోలీసులు అత్యంత దుర్మార్గంగా రక్తాలు కారేట్టు కొట్టారు.

తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, జీతాలు పెంచాలని ఉత్తరప్రదేశ్ లోని అంగన్ వాడీ కార్యకర్తలు అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను, మంత్రులను కలిసి విఙప్తులు చేశారు. అయినా యోగీ ఆదిత్యానాథ్ సర్కార్ పట్టించుకోకపోవడంతో 5 వేల మంది అంగన్ వాడీ కార్యకర్తలు రెండురోజులుగా లక్నోలో నిరసనకు దిగారు. సోమవారం నాడు లాఠీ చార్జ్ చేసి అంగన్ వాడి కార్యకర్తలను చెల్లా చెదుతు చేసినప్పటికీ, పోలీసుల దాడితో అనేక మంది గాయాలపై ఆస్పత్రి పాలైనప్పటికీ మంగళవారంనాడు మొక్కవోని పట్టుదలతో వేలాది మంది అంగన్ వాడీ కార్యకర్తలు మళ్ళీ తరలివచ్చారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంతో కనీసం వీరితో చర్చించడానికి కూడా నిరాకరించడమే కాక పోలీసులు మళ్ళీ దాడికి తెగబడ్డారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యానాథ్ ఇంటి వైపు చొచ్చుకపోవడానికి ప్రయత్నించారు. మరి కొందరు పోలీసులను తోసుకొని బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్ళి బీజేపీకీ వ్యతిరేకంగా, యోగీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఒక్క సారిగా దూసుకొచ్చిన వందలాది మంది మగ పోలీసులు స్త్రీలనే విచక్షణ కూడా మర్చిపోయి అంగన్ వాడీ కార్యకర్తలపై దాడి చేశారు. తరిమి తరిమి కొట్టారు. కిందపడ్డవాళ్ళను కాళ్ళతో తొక్కారు. కొందరు మహిళలను ఒంటరి చేసి పదుల సంఖ్యలో మగ పోలీసులు చుట్టుముట్టి జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ అతి దుర్మార్గంగా ప్రవర్తించారు. పోలీసుల దాడిలో అనేక మంది తీవ్ర గాయాలపాలై ఆస్పత్రి పాలయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ఓ అంగన్ వాడీ కార్యకర్త మాట్లాడుతూ...

ʹʹమేమేమీ ఎమ్మెల్యేలు, ఎంపీలాగా లక్షల జీతాలడగడం లేదు కనీసం మేము మా పిల్లలు ఆకలి కడుపులతో లేకుండా చూడమంటున్నాం. పెద్దఎత్తున‌ బలగాలను మోహరించి దుర్మార్గమైన దాడి చేసి ఈ రోజుకు మమ్మలను ఇక్కడి నుండి తొలగించవచ్చు కానీ మా పోరాటం ఆగబోదు. ʹʹ అని హెచ్చరించింది.

Keywords : uttarapradesh, yogi adityanth, police lathicharge
(2018-07-21 15:33:10)



No. of visitors : 377

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

గూండాలను అరెస్టు చేసినందుకు యోగీ సర్కార్ ఆమెను అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది

ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలకు ఝలక్‌ ఇచ్చిన‌ పోలీస్‌ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్ ను యోగీ సర్కార్ అడవుల్లోకి బదీలీ చేసింది.. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్‌ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్‌ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది....

నరహంతకుల రాజ్యంలో న్యాయానికి దిక్కేది ?

మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన....

Posters in Bareilly village ask Muslims to leave

Just days after the Bharatiya Janata Party (BJP) secured a massive victory in the Uttar Pradesh Assembly elections, posters have appeared in a village in Bareilly district asking Muslim residents to ʹleave immediately,ʹ reports the

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


న్యాయమడిగిన