చైనా ఒక నూతన సోషల్ సామ్రాజ్యవాద శక్తి - మావోయిస్టు పార్టీ


చైనా ఒక నూతన సోషల్ సామ్రాజ్యవాద శక్తి - మావోయిస్టు పార్టీ

చైనా

(ఈ వ్యాసం
ʹచైనా ఒక నూతన సోషల్.. సామ్రాజ్యవాది శక్తి ! అది ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్య వాద వ్యవస్థలో అంతర్భాగంʹ
అనే పేరుతో సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర‌కమిటీ ప్రచురించిన డాక్యుమెంట్ లో కొంత భాగం. పూర్తి డాక్యుమెంటరీ కోసం ఈ కింది లింక్ లో చూడండి http://www.bannedthought.net/India/CPI-Maoist-Docs/Misc/ChinaSocialImperialism-CPI(Maoist)-2017-Tel-View-Final.pdf)

2వ ఇంటర్నేషనల్ కు చెందిన రెనగేడ్లను ఖండిస్తూ లెనిన్ "మాటల్లో సోషలిజం, చేతల్లో అవకాశవాదం వృద్ధి సామ్రాజ్యవాదంగా మారుతుంది" అని అన్నారు. సోవియట్ రివిజనిస్టు రెనగేడ్ ముఠా కూడా రివిజనిజం నుంచి వృద్ధి చెంది సోషల్-సామ్రాజ్యవాదంగా మారింది. ఒక సోషలిస్టు రాజ్యపు రాజకీయ అధికారాన్ని రివిజనిస్టు ముఠా హస్తగతం చేసుకుంటే, అది సోవియట్ యూనియన్ లాగా సోషల్-సామ్రాజ్యవాదంగా మారుతుంది అని కామ్రేడ్ మావో చారిత్రక గుణపాఠంగా చెప్పారు.
చైనా రివిజనిస్టు రెనగేడ్ ముఠా కూడా రివిజనిజం నుంచి "చైనా తరహా సోషలిజం" పేరుతో పెట్టబడిదారీ విధానంలోకి మళ్లింది. రివిజనిస్టు డెంగ్ మాటల్లో చెప్పాలంటే, "ఆర్థిక సంబంధాలన్నీ పెట్టుబడిదారీగా మారిపోయి, రాజకీయ సంబంధాలు మాత్రం "సోషలిజంʹ పేరు తోటి, ప్రజల నియంతృత్వంʹ పేరు తోటీ ఏక-పార్టీ ఆధిపత్యం కింద ఉండాలి." ఈ ముసుగులోనే నేడు చైనా సోషల్-సామ్రాజ్యవాదంగా మారింది. సిపిసి, చైనా ప్రభుత్వం ఇప్పటికీ తమ దేశం "సోషలిస్టుగా ఉన్నదని మోసం చేయజూస్తున్నవి. వీళ్లు మాటల్లో నేడు చైనా వ్యవస్థ చైనా లక్షణాలతో సోషలిజంʹ అని నమ్మబలుకుతున్నారు. "కమ్యూనిస్టు పార్టీ అధీనంలో బూర్జువా ఆర్థిక సంస్కరణలు అనేవి చైనా తరహా సోషలిజం" అని మోసపుచ్చుతున్నారు. ఇంకా వీళ్లు దీన్ని సాగలాగుతూ "2050 నాటికి సోషలిస్టు ఆధునీకరణను సాధించాలి" అంటూ చైనా తరహా సోషలిజాన్ని పునరుద్దాటిస్తున్నారు. అలాగే "అన్ని రంగాల్లోనూ చైనా తరహా సోషలిజాన్ని నిర్మించాలనే ఆశయాన్ని 21వ శతాబ్దంలో కూడా ముందుకు తీసుకువెళ్లండి" అని సిపిసి నాయకత్వం ఇప్పటికీ మహాసభల్లో పిలుపు ఇస్తూ ఉన్నది. సోషలిస్టు వ్యవస్థ, "శ్రామికవర్గ నియంతృత్వంʹ, ʹకమ్యూనిస్టుపార్టీ నాయకత్వంʹ, ʹమార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం ఇలా నాలుగు విషయాలను తప్పడుగా వక్రీకరించి, ప్రజలను ఇప్పటికీ మోసపూరితంగా సిపిసి నాయకత్వం పక్కదారి పట్టిస్తూ ఉంది. చైనాలోనూ ఇతర దేశాలలోనూ రివిజనిస్టులు మాత్రమే వాస్తవ పరిస్థితులను వక్రీకరిస్తున్నారు. వెనుకబడిన దేశాల ప్రజలను సోషలిజం పేరుతో మోసగిసూ, తన సోషల్-సామ్రాజ్యవాద ప్రయోజనాలను చైనా నెరవేర్చుకుంటున్నది. చైనాలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను (ఎస్ఓఈలు) చూపించి పెట్టుబడిదారీ విధానాన్ని "సోషలిజంగా గందరగోళపెట్టడం రివిజనిస్టులకు మామూలే.
చైనా సోషల్-సామ్రాజ్యవాదం వెనుకబడిన దేశాలకు, ఇతర దేశాలకు యుద్ధ సామగ్రిని, పెట్టబడిని ఎగుమతి చేయడం ద్వారా, అసమాన వ్యాపారం ద్వారా, వాటి సహజ వనరులను దోచుకుంటోంది. వాటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, సైనిక శిబిరాలను సంపాదించుకునేందుకు అవకాశాల కోసం చూస్తున్నది. అమెరికా సామ్రాజ్యవాదంతో పోటీ పడుతున్నది. ఈ రకంగా చైనా సోషల్-సామ్రాజ్యవాదం సామ్రాజ్యవాదానికి సంబంధించిన వలయంలోనే తిరుగుతూ ఉన్నది. ఇలా ఇది చైనీయ లక్షణాలతో సామ్రాజ్యవాదాన్ని అమలు చేస్తున్నది. చైనా లక్షణాలతో సామ్రాజ్యవాదం" అంటే కేవలం సామ్రాజ్యవాదమే, దానిని ప్రమాదకరమైన సామ్రాజ్యవాదంగా చూడాలి.

Keywords : china, maoism, marxism, leninism,
(2018-09-25 00:55:23)No. of visitors : 328

Suggested Posts


చైనాలో భారీ ప్రేలుడు... ధ్వంసమైన 5800 కార్లు

చైనాలోని బీజింగ్ ప్రాంతం టియాంజిన్ లో ఓ భారీ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 5800 జాగోవర్ ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం అయినట్లు భారత మాతృ సంస్థ, టాటా మోటార్ కంపెనీ, బాంబే స్టాక్ ఎక్సేంజ్ సమాచారం....

ఆ వాహనాలు సడెన్ గా గాల్లోకి ఎందుకు లేచాయి ?

అది బిజీ రోడ్డు వాహనాలు స్పీడ్ గా వెళ్తున్నాయి. సడెన్ గా ఓ మూడు వాహనాలు గాల్లోకి లేచాయి. ఏమైందో ఎవ్వరికీ అర్దం కాలేదు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి....

declaration by the ʹStruggle Associationʹ, an underground Maoist organization in China

The truck driversʹ strike took place on June 8, two days prior to the planned date. As of now, this spontaneous strike wave has rapidly spread to Jiangxi, Shandong, Sichuan, Chongqing, Shanghai, Anhui, Hubei, Zhejiang, and other provinces, elevating the strike to a national level. Truck drivers from all over the country have blocked major road

Search Engine

అంటరాని ప్రేమ
వీవీ ఇంటిని చుట్టుముట్టిన ఏబీవీపీ.. అడ్డుకున్న స్థానికులు
ప్రజా కోర్టులో తేలిన నిజం.. బాక్సైట్ తవ్వకాలు, భూకబ్జాలే ఎమ్మెల్యే హత్యకు కారణం
అమృతకు క్షమాపణలతో..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
more..


చైనా