మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ


మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

మళ్ళీ

రోహిత్ వేముల హత్య తరువాత రగిలిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ అగ్గి రాజుకుంది. ఈ సారి యూనివర్సిటీ పాలకవర్గం ఓ గిరిజనున్ని టార్గేట్ చేసింది. ఈ వివక్షకు వ్యతిరేకంగా టీవీవీ, ఏఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, సహా మొత్తం 15 విద్యార్థి సంఘాల మద్దతుతో గిరిజ‌న విద్యార్థుల ఫోరం (టీఎస్ఎఫ్‌) రిలే నిరాహార దీక్ష చేపట్టి నాలుగు రోజులయ్యింది. విద్యార్థుల ఆందోళనను విరమింపజేయడానికి యూనివర్సిటీ పాలక వర్గం అన్ని వైపుల నుండి వత్తిడులు తెచ్చి విఫలమయ్యింది. కానీ వారి సమస్యను మాత్రం పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. అసలేం జరిగిందంటే...

సెప్టెంబర్ 21న యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అలియెన్స్ ఫర్ సోషల్ జస్టిస్ (ఏఎస్‌జే)కు చెందిన అభ్యర్థులు అన్ని స్థానాలనూ గెల్చుకున్నారు. తెలంగాణ, వామపక్ష, దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఈ కూటమిగా ఏర్పడ్డాయి.
బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అయిన ఏబీవీపీ ఓడిపోయింది. అయితే ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన టీఎస్‌ఎఫ్ అభ్యర్థి లంబాడా అయిన‌ న‌రేశ్ లునావత్‌కు 75 శాతం కంటే త‌క్కువ అటెండెన్స్ ఉందన్న ఆరోప‌ణ‌తో ఎన్నికైనట్టు ప్ర‌క‌టించ‌కుండా నిలిపివేశారు. ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి నుంచి ఫిర్యాదు అందడంతో యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విద్యార్థుల నిరసనలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు ఇందుకోసం అక్టోబర్ 23న‌ ప్రొఫెసర్ ఆలోక్ పరాషర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీని వేశారు.
యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలంటే 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే నరేష్ కు 75 శాతం హాజరు ఉన్నట్టు నామినేషన్ల సమయంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెడ్ సంతకంతో ప్రమాణ పత్రం జారీ చేశారు.

నామినేషన్ల సమయంలో తగినంత హాజరు లేని కారణంగా దాదాపు 10 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. హాజరు 75 శాతం ఉన్న కారణంగా నరేశ్ నామినేషన్ అనుమతించారు. మరి ఏబీవీపీ పిర్యాదు చేయగానే 75 శాతంఉన్న నరేష్ హాజరు ఒక సారి 64 శాతం ఉన్నట్టు మరో సారి 71 శాతం ఉన్నట్టు ప్రకటించారు. ఏ దురుద్దేశం లేకుంటే అధికారులు ఇలా ఎందుకు చేశారని నరేష్ ప్రశ్న.
పది రోజుల్లో నిర్ణయం చెబుతామని అక్టోబర్ 23న చెప్పిన అధికారులు ఈ రోజుకు ఏ విషయం చెప్పకుండా సాగదీయడంలో లోగుట్టు ఏంటి ?
ఈ మొత్తం వ్యవహారంలో విద్యార్థుల వేళ్ళన్నీ వీసీ అప్పారావు వైపే చూపిస్తున్నాయి. ఏబీవీపీకి మద్దతుగా దళిత, బహుజనులకు, ఆదివాసులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న యూనివర్సిటీ పాలకవర్గంపై పోరాటం తప్ప మరో మార్గం లేదని విద్యార్థి సంఘాలు నిర్ణయించుకున్నాయి. నాలుగు రోజులుగా వెలివాడలో నిరహార దీక్ష చేస్తున్నారు.

Keywords : HCU, hyderabad central university, dharna, UoH
(2018-06-19 03:47:32)No. of visitors : 221

Suggested Posts


HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ అగ్ర‌హారంగా మారింద‌ని మ‌రోమారు రుజువైంది. త‌నిఖీ పేరుతో అర్థ‌రాత్రి యూనిర్సిటీ హాస్ట‌ళ్ల‌పై దాడులు జ‌రిపిన అధికారులు 10 మంది విద్యార్థుల‌ను అక‌డ‌మిక్స్‌, హాస్ట‌ల్స్ నుంచి బ‌హిష్కరించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో ఏడుగురు విద్యార్థుల‌పై ఆరునెల‌ల పాటు స‌స్పెన్ష‌న్ విధించిన అధికారులు మ‌రో ముగ్గురి....

రోహిత్ వేములా... . కాషాయ కూటమి పై మళ్ళీ నువ్వే గెలిచావు !

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ కాషాయ పరివారం చిత్తుగా ఓడింది. ABVP, NSUI, ʹఅలయన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ʹ ASJ కూటమి మధ్య జరిగిన హోరాహోరా పోరులో ASJ...

Search Engine

ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం
రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులపై దేశవ్యాప్త నిరసనలు
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన
భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు
Maharashtra Governmentʹs terror trail to protect HINDUDTVA TERRORISTS
నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!
తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?
more..


మళ్ళీ