HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌

HCU


హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ అగ్ర‌హారంగా మారింద‌ని మ‌రోమారు రుజువైంది. త‌నిఖీ పేరుతో అర్థ‌రాత్రి యూనిర్సిటీ హాస్ట‌ళ్ల‌పై దాడులు జ‌రిపిన అధికారులు 10 మంది విద్యార్థుల‌ను అక‌డ‌మిక్స్‌, హాస్ట‌ల్స్ నుంచి బ‌హిష్కరించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో ఏడుగురు విద్యార్థుల‌పై ఆరునెల‌ల పాటు స‌స్పెన్ష‌న్ విధించిన అధికారులు మ‌రో ముగ్గురి (ప్ర‌త్యూష్ నిర్జ‌ర్‌, అహిత ఉన్ని వి, సాగ్నిక్ సాహ) పై రెండు సంవ‌త్స‌రాల పాటు స‌స్పెన్ష‌న్‌ను విధించారు. ఆరునెలలు పాటు సస్పెన్ష‌న్‌కు గురైన వారిలో తినాంజ‌లీ దామ్ ( జెండ‌ర్ సెన్సిటివిటీ ఎగ‌నెస్ట్ సెక్సువ‌ల్ హెరాస్మెంట్ స‌భ్యురాలు), కేస‌ర్బ‌న్ సంక‌రాయ్ చౌద‌రి, శివం గోస్వామి, సాహిత్ మంద‌ప‌ల్లి, వెంక‌టేశ్వ‌ర్లు ఎరుక‌ల‌, అర్పిత్ శంక‌ర్‌, యామ‌ర్తి సాయికుమార్ ఉన్నారు.

స‌రిగ్గా సంవ‌త్స‌రన్న‌ర క్రితం ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తోనే ఐదుగురు విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేసిన యూనివ‌ర్సిటీ.. రోహిత్ వేముల హ‌త్య‌కు కార‌ణ‌మైంది. ఏ బ్రాహ్మ‌ణీయ బావ‌జాల‌మైతే రోహిత్ వేముల‌ను హ‌త్య చేసిందో.. అదే భావ‌జాలం ఇప్పుడు ప‌ది మంది విద్యార్థుల మెడ‌పై క‌త్తిపెట్టింది.

యూనివ‌ర్సిటీలు బందీఖానాలుగా మారుతున్న వైనాన్ని గ‌త కొద్దికాలంగా మ‌నం చూస్తూనే ఉన్నాం. విశ్వ‌విద్యాల‌యాల్ పెత్త‌నం కోసం ప్ర‌య‌త్నిస్తున్న సంఘ్ ప‌రివార్ శ‌క్తులు విద్యార్థుల‌పై మోర‌ల్ మోలీసింగ్ నిర్వ‌హిస్తుంది. యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యాలు సైతం అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి తిర‌గ‌డాన్ని త‌ప్పుగా చిత్రీక‌రించి దాడులు జ‌రిపే సంఘ్ ప‌రివార్ సిద్ధాంతాన్ని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనిర్సిటీ ఒంట‌బ‌ట్టించుకుంది. అందుకే.... ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ అబ్బాయిల హాస్ట‌ల్‌కి అమ్మాయిలు వెళ్ల‌కూడ‌ద‌ని ఆంక్ష‌లు విధించింది. కానీ ఈ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అబ్బాయిల హాస్ట‌ల్స్‌కి అమ్మాయిలు వెళ్తున్నారంటూ కొంత‌కాలం హాస్ట‌ల్ గ‌దుల‌పై దాడులు నిర్వ‌హిస్తోంది వ‌ర్సిటీ సిబ్బంది.

ఇటీవ‌ల జే హాస్ట‌ల్‌పై అర్ద‌రాత్రి దాడులు జ‌రిపిన సిబ్బందికి, విద్యార్థుల‌కు మ‌ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీన్ని సాకుగా చూపి విద్యార్థులు త‌మ‌పై దాడి చేశారంటూ ఒక సెక్యురిటీ ప‌ర్స‌న్‌తో పాటు ఓ హాస్ట‌ల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స‌మాధానం చెప్పాలంటూ ప్రొక్టోరియ‌ల్ బోర్డు అక్టోబ‌ర్ 27న 10 మంది విద్యార్థుల‌కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు వ్రాత పూర్వ‌క వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో పాటు బోర్డు ముందు హాజ‌రై త‌మ వాద‌న‌ను వినిపించారు. కాగా బుధ‌వారం ఆ ప‌ది మంది విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేస్తూ నోటీస్ జారీ చేశారు అధికారులు.

అబ్బాయిలు, అమ్మాయిలు క‌లిసి తిర‌గ‌డం నేరంగా చూసే స్థితిలో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలు ఉండ‌డం విషాదం. యూనివ‌ర్సిటీలు కుల వివ‌క్ష‌కు, పురుషాధిప‌త్యానికి కేంద్రాలు మారుతున్నాయ‌న‌డానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధ‌రించాలో, ఎవ‌రితో స్నేహం చేయాలో, ఎవ‌రిని పెళ్లి చేసుకోవాలో, ఏటైంలో తిర‌గాలో అన్నితామే నిర్ణ‌యించిన‌ట్లే జ‌ర‌గాలి. లేదంటే... ఊరికి, వాడ‌కూ దూర‌మైన‌ట్లే... చ‌ద‌వుకూ దూర‌మ‌వుతార‌ని హెచ్చ‌రిస్తోంది హిందూ ఫాసిజం.

యూనిర్సిటీల‌ను అగ్ర‌హారాలుగా మార్చుకుంటున్న బ్రాహ్మ‌ణీయ బావ‌జాలానికి వ్య‌తిరేకంగా ఐక్య ఉద్య‌మం నిర్మించ‌డం ఇవాళ మ‌న ముందున్న క‌ర్త‌వ్యం. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌కు అండ‌గా నిలుద్దాం. విద్యార్థుల స‌స్పెన్ష‌న్‌ను వెన‌క్కి తీసుకునే పోరాడుదాం.

Keywords : UoH, HCU, rohit vemula, students suspend, hyderabad
(2024-03-25 00:05:44)



No. of visitors : 1024

Suggested Posts


రోహిత్ వేములా... . కాషాయ కూటమి పై మళ్ళీ నువ్వే గెలిచావు !

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ కాషాయ పరివారం చిత్తుగా ఓడింది. ABVP, NSUI, ʹఅలయన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ʹ ASJ కూటమి మధ్య జరిగిన హోరాహోరా పోరులో ASJ...

మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

ఈ సారి యూనివర్సిటీ పాలకవర్గం ఓ గిరిజనున్ని టార్గేట్ చేసింది. ఈ వివక్షకు వ్యతిరేకంగా టీవీవీ, ఏఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, సహా మొత్తం 15 విద్యార్థి సంఘాల మద్దతుతో గిరిజ‌న విద్యార్థుల ఫోరం (టీఎస్ఎఫ్‌) రిలే నిరాహార దీక్ష చేపట్టి నాలుగు రోజులయ్యింది. ....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


HCU