దేశద్రోహుల గొప్పతనాన్ని పొగిడే దేశʹభక్తులʹ సినిమా - అరుణాంక్ లత‌


దేశద్రోహుల గొప్పతనాన్ని పొగిడే దేశʹభక్తులʹ సినిమా - అరుణాంక్ లత‌

దేశద్రోహుల


భగత్ సింగ్ ఎందుకు గొప్పవాడు అయ్యాడు? స్కూల్లో ఉపాధ్యాయుడి ప్రశ్న.
ʹక్షమాపణ అడగకుండా, దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంభం ఎక్కాడు కాబట్టి గొప్పవాడు అయ్యాడు సార్ʹ విద్యార్థి సమాధానం.
ఇట్లా సమాధానం చెప్పిన విద్యార్థికి సహజంగానే దేశం అంటే గొప్ప ప్రేమ ఉంటుంది. కానీ ఆ విద్యార్థి పెద్దయ్యాక ఆర్.ఎస్.ఎస్. (రాష్ట్రీయ స్వయం సేవక్) అనబడు ఒక సంస్థలో చేరతాడు. దేశభక్తి గురించి అది తనకు బోధించిందని, నా జీవితంలో ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలంటే అందులో ఆర్.ఎస్. ఎస్ ఉంటుందని చెప్తాడు.
క్షమాపణ చెప్పకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ గొప్పవాడు అని చిన్న వయసులోనే గుర్తించిన ఆ వ్యక్తి (సినిమాలో హీరో) బ్రిటన్ మహారాణికి నాలుగు క్షమాపణలు రాస్తూ ʹనన్ను దయతలచి విడుదల చేస్తే నా జీవిత కాలమంత బ్రిటన్ సింహాసనానికి విధేయుడనై ఉంటానుʹ అని ప్రకటించి, ʹస్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేస్తున్న వారిని బ్రిటిష్ పోలీసులకు పట్టించినʹ సావర్కర్ ని తన గురువుగా మోసుకుపోతున్న ఆర్.ఎస్.ఎస్ ఎట్లా ఆ హీరోకి ఆదర్శం అయింది? ʹమన శత్రువులు బ్రిటిష్ కాదు, క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులుʹ అని ప్రకటించిన గొల్వర్కార్ ʹబంచ్ ఆఫ్ తాట్స్ʹని అక్షరాల హిందూరాజ్య స్థాపనకోసం అమలు చేస్తున్న సంస్థ ఆర్.ఎస్.ఎస్. హీరో ఇంట్లో భగత్ సింగ్ చిత్రపటం ఉంటుంది. దాంతో పాటు పూజలు చేస్తారు. నాస్తికుడైన భగత్ సింగ్. సాయుధ విప్లవం ద్వారా ప్రజలకు అధికారం వస్తుందని చెప్పిన భగత్ సింగ్. ఆర్.ఎస్.ఎస్ మేనిఫెస్టో బంచ్ ఆఫ్ తాట్స్ ప్రకటించిన శత్రువుల్లో ఒకరైన కమ్యూనిస్టు భగత్ సింగ్ బొమ్మ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త ఇంట్లో ఎందుకు ఉంటుందో తెలియదు.
ʹప్రేమʹ ఈ పదానికి ఆర్.ఎస్.ఎస్ దీక్షనరిలో చోటు లేదు. కానీ ఇక్కడ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త అయిన హీరో మాత్రం అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ కులమే అని దర్శకుడు తల్లి పాత్రతో చూపిస్తాడు లెండి. లేకపోతే కుల సంకరం జరిగిపోదు. అమ్మాయిని ఏకాంత ప్రదేశానికి ఈ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త తీసుకుపోయి అక్కడ కౌగిలింతలు. ముద్దులు అబ్బో అన్ని పాశ్చ్యాత సంస్కృతి పనులు చేస్తుంటాడు. వాళ్ళని అడ్డుకొని, వెంటనే తాళి కట్టించడానికి, పెళ్లికి ముందు ఈ ముద్దులు, కౌగిల్లు ఏంట్రా ***** అని అనడానికి ఏ భజరంగ్ దళ్, యాంటీ రోమియో స్క్వాడ్ కార్యకర్త రాడు.
హీరోకి చిన్నప్పుడు ఒక స్నేహితుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు ʹపార్లమెంట్లో బాంబు వేయగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది సార్. అందుకే భగత్ సింగ్ గొప్పవాడుʹ అని చెప్పడం ఆ విద్యార్థి చేసిన నేరం. అతడు హింసాత్మక స్వభావాన్ని కలిగి ఉన్నాడని ఉపాధ్యాయుడి ఫిర్యాదు. బాంబు ఎందుకు వేయవలిసి వచ్చిందో ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ కరపత్రంలో ʹహిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోషియేషన్ʹ స్పష్టతనిచ్చింది. దర్శకునికి మాత్రం ఆ సమాధానం నేర స్వభావాన్ని కలిగి ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ సమాధానం చెప్పిన విద్యార్థి నేర స్వభావం కలిగిన వాడిగా చిన్నప్పుడే నిర్ణయించారు గనుక అతడే పెద్దయ్యాక విలన్ అవుతాడు.
ʹఆక్టోపస్ʹ అని డి.ఆర్.డి.ఓ కనిపెట్టిన మిసైల్ లాంఛర్ని చేజిక్కుకోవడం కోసం విలన్, కాపాడటం కోసం ఆర్.ఎస్.ఎస్. ఇచ్చిన స్పూర్తితో హీరోల మధ్య జరిగే సంఘర్షణే ఈ ʹజవాన్ʹ.
దర్శకుడుకి ఆర్.ఎస్.ఎస్. పట్ల ఉన్న అభిమానంతో ఈ సినిమా తీసిన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా పాపం సఫలం కాలేదు.
ఈ సినిమాని చూసాక ఇటలీ విప్లవకారుడు అంటోనియో గ్రాంసి చెప్పిన ఈ మాటలు గుర్తుకు వచ్చాయి. "The reason for succes of the cinema and itʹs absorption of former theatre audiences is purely economic. The cinema offers exactly the same sensation as the popular theatre, but under better conditions, with the same sensations contrivances of a false intellectualism, without promising too much and delivering too little"
తన పుట్టుక నుండి ఇండియా అంటే కేవలం హిందువులదే అనే వాదాన్ని ప్రచారం చేస్తున్న ఆర్.ఎస్.ఎస్. జాతీయవాదం అంటే హిందు జాతీయవాదమే అని ప్రచారం చేస్తున్న ఆర్.ఎస్.ఎస్. ఇప్పుడు తను స్థాపించాలనుకుంటున్న హిందూరాజ్యం కోసం ʹసమ్మతిని తయారు చేస్తూ ఉన్నదిʹ. మొన్నటి వరకు టి.వి.లు, పత్రికలు వాడుకున్న ఆర్.ఎస్.ఎస్ ఇప్పుడు సినిమా ప్రక్రియని తన ప్రచారానికి ఎంచుకున్నది!
Last but not the least: ఇటీవల వచ్చిన ʹఒక్కడు మిగిలాడుʹ ఆనే సినిమా దర్శకుడు సైతం ఆర్.ఎస్.ఎస్. ప్రభావంలో ఉన్నట్లున్నాడు. శ్రీలంక, బర్మా, ఆఫ్ఘసిస్తాన్ ఇవన్నీ ఇండియాలో భాగం అంటాడు. ఇదంతా ఒకనాటి అఖండ భారతం అంటాడు. చరిత్రకారులేవరు వీటన్నిటిని ఏక కాలంలో ఢిల్లీ సుల్తాను పాలించినట్లు చెప్పలేదు. మా తెలంగాణే ఇండియాలో భాగం కాదు. ఇక శ్రీలంక ఎడికెల్లి అయిందో. చరిత్ర పాఠాలు చెప్పిన టీచర్ల ఇజ్జత్ తీస్తాండ్లు ఈ దర్శకులు.
-అరుణాంక్ లత‌

Keywords : film, jawan, tollywood, rss,
(2023-09-26 04:07:24)



No. of visitors : 2715

Suggested Posts


దిల్ వాలేః ఒక వైపు నిరసనలు, మరో వైపు కలక్షన్లు

షారూఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు 21 కోట్ల రూపాయల కలక్షన్లు వసూలు చేసి బాజీరావు మస్తానీ ని మించి పోయింది. దేశంలో అసహనం ఉందన్న షారూఖ్ ఖాన్ మాటలకు....

కేసు కోసం 25 కోట్లు ఖర్చు పెట్టాం - సల్మాన్ తండ్రి చెప్పిన నిజాలు

హిట్ అండ్ రన్ కేసులోంచి నిర్దోషిగా బయటపడ్డాడు నిజమే కానీ అది అంత సులభంగా జరగలేదట, ఈ కేసుకోసం సల్మాన్ ఖాన్ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట. ఈ విషయం వేరెవరో చెబితే నమ్మలేమేమో కానీ .....

చిన్నారి పెళ్లికూతురు ఆత్మహత్య

టీవీ సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. హిందీలో బాలికావధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ తో ఆనందిగా ఫేమస్ అయిన....

పైరసీ సినిమాలు చూడటం తప్పుకాదు - హైకోర్టు

ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం శిక్షార్హం కాదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. పైరసీ ప్రింట్లను ఆన్ లైన్ లో వీక్షించిన వారు శిక్షార్హులని గత నెలలో ఐఎస్పీలు ప్రకటించిన నేపథ్యంలో....

సల్మాన్ నిర్దోషి సరే
మరి రవీంద్రపాటిల్ చావుకు కారణమెవరు ?

సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. పెద్దలు చాలా మంది ఆనందం ప్రకటిస్తున్నారు. న్యాయం గెలిచిందని తీర్పులిచ్చేస్తున్నారు. మరి ఈ కేసులో దోషులెవరు ? ప్రత్యక్ష సాక్షి మరణానికి కారణమెవరు ?అసలు ప్రత్యక్ష సాక్షి ఎవరు ? అతనేమయ్యాడు ? ......

ʹసల్మాన్ కారు మద్యం తాగిందిʹ

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువడినప్పటినుండి సోషల్ మీడియాలో విమర్షలు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిడెంట్ సమయంలో సల్మాన్....

Dear Mr. Bhansali, I am Stunned after Watching Glorification of Sati in Your Movie: Swara Bhaskarʹs Open Letter

At the outset Sir, congratulations on finally being able to release your magnum opus ʹPadmaavatʹ – minus the ʹiʹ, minus the gorgeous Deepika Padukoneʹs uncovered slender waist, minus 70 shots you apparently had to cut out.....

అమెరికాలో వివక్ష గురించి మాట్లాడేవారు భారత్ లో వివక్ష గురించి ఎందుకు మాట్లాడరు ?

అమెరికాలో తెల్ల జాతి పోలీసు నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను హత్య చేసిన తర్వాత ʹబ్లాక్ లైవ్స్ మేటర్ʹ అంటు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై భారతీయులు అనేక మంది తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

కంగనా అమ్మగారికి ఒక లేఖ

కులాన్ని తిరస్కరించటం అంటే ఏమిటో మీకు అర్థం కావాలంటే ముందు మీకున్న రాజపుత్రుల గర్వాన్ని వదులుకోవాలి. మీ అస్తిత్వం గురించి గర్వపడే మీలాంటి వాళ్లు, ఇతర కులాల పేర్లను కూడా అవమానిస్తారు. ʹపాకీ దాని లాగా కనబడటంʹగురించి సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి, సోనాక్షి సిన్హా, యువరాజ్ సింగ్ లాంటి ʹఆధునిక మానవులుʹ ఏమన్నారో మీకు గుర్తుందా? కొంతమంది పాకీల పేరుతోనే ఇక్కడ ఉని

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


దేశద్రోహుల